Govt Schemes
-
Thota Jyothi Rani: పేదరికం దేశాన్ని వదలని రుగ్మత
నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన, రూరల్ హౌసింగ్ కోసం ఇందిరా ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్స్ రోజ్‌గార్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన... ప్రభుత్వం ఇన్ని పథకాలను అమలు చేస్తోంది. ఇవన్నీ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం రూపొందించినవే. దశాబ్దాలుగా పథకాలు అమలవుతున్నప్పటికీ దేశంలో పేదరికం అలాగే ఉంది. పేదరికం మాత్రమే కాదు ఆకలి తీవ్రమవుతోంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలోని 127 దేశాల జాబితాలో మనదేశానిది 105వ స్థానం. ఏడు పదులు దాటిన స్వతంత్ర భారతంలో ప్రభుత్వాలు అనుసరించిన పాలన పద్ధతులతో పేదరికం తగ్గలేదు సరి కదా ఆకలి పెరుగుతోందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తెలియచేస్తోందని చెప్పారు కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి. ఇంటర్నేషనల్ పావర్టీ ఇరాడికేషన్ డే సందర్భంగా పేదరికం మనదేశంలో మహిళల మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తోందో పరిశీలిద్దాం. ఫోను... లూనా... ప్రమాణాలు కాదు!మనదేశం అభివృద్ధి చెందలేదా అంటే ఏ మాత్రం సందేహం లేకుండా అభివృద్ధి చెందిందనే చెప్పాలి. కరెంట్ వాడకం, గ్యాస్ వినియోగం పెరిగాయి. ఉల్లిపాయలు, కూరగాయలమ్మే వాళ్లు కూడా టూ వీలర్, మినీ ట్రక్కుల మీద వచ్చి అమ్ముకుంటున్నారు. జనాభాలో ఎక్కువ మంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు. వీటిని చూసి పేదరికం తగ్గిపోయిందనే అభిప్రాయానికి రావడం ముమ్మాటికీ తప్పే. అవి లేకపోతే ఆ మేరకు పనులు చేసుకోవడం కూడా సాధ్యం కాని రోజులు వచ్చేశాయి. కాబట్టి ఇప్పుడు వీటిని సంపన్నతకు ప్రతిరూపాలుగా చూడరాదు. నిత్యావసర సౌకర్యాలనే చెప్పాలి. ఈ ఖర్చులిలా ఉంటే కడుపు నింపుకోవడానికి మంచి ఆహారం కోసం తగినంత డబ్బు ఖర్చుచేయలేని స్థితిలో ఉంది అల్పాదాయవర్గం. సమాజం పేదరికాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తుంది. నిజానికది సామాజిక కోణంలో చూడాల్సిన అంశం. భారం మహిళల మీదనే!అల్పాదాయ కుటుంబంలోని మహిళ పేదరికానికి తన జీవితకాలమంతటినీ మూల్యంగా చెల్లించుకుంటుంది. పేదరికం భారం ప్రధానంగా మహిళ మీదనే పడుతుంది. పొయ్యి మీదకు, పొయ్యి కిందకు సమకూర్చుకోవడంలో నలిగిపోయేది ఆడవాళ్లే. ఒకప్పుడు అడవికి పోయి కట్టెలు తెచ్చుకునే వాళ్లు. గ్రామీణ మహిళకు కూడా ఇప్పుడా అవకాశం లేదు. తప్పని సరిగా గ్యాస్ సిలిండర్, కిరోసిన్, బొగ్గులు ఏదో ఒకటి కొనాల్సిందే. ఇంట్లో అందరికీ సరిపోయేటట్లు వండాలి. ఉన్న డబ్బులో అందరికీ పెట్టగలిగిన వాటినే వండుతుంది. ఆ వండిన పదార్థాలను ఇంట్లో అందరికీ పెట్టిన తర్వాత మిగిలింది తాను తినాలి. ఆ తినగలగడం కూడా అందరూ తినగా మిగిలితేనే. అందరికీ పెట్టి పస్తులుండే మహిళలు ఇంకా దేశంలో ఉన్నారు. బీహార్‌లో అత్యంత పేదరికంలో మగ్గుతున్న ముసాహర్ సామాజిక వర్గంలో మహిళలు రొట్టెలు చేసి తాము సగం రొట్టెతో ఆకలి తీర్చుకుంటారు. వాళ్లు ఒక రొట్టె అంతటినీ తినగలగడం అంటే ఆ రోజు వాళ్లకు పండగతో సమానం. ఇంటి నాలుగ్గోడల మధ్య ఏం వండారో, ఏం తిన్నారో బయటకు తెలియదు. కానీ జాతీయ సర్వేలు ఈ విషయాలను బయటపెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రానిక్ ఎనర్జీ డెఫిషియెన్సీతో బాధ పడుతున్న మహిళలు నూటికి ఎనభై మంది ఉన్నారు. పట్టణాల్లో ఆ సంఖ్య యాభై ఏడుగా ఉంది. పేదరికం విలయతాండవం చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే రుజువులు ఇంకే కావాలి. అభివృద్ధి గమనం సరైన దిశలో సాగకపోవడమే ఇందుకు కారణం. అభివృద్ధి క్రమం తప్పడం వల్లనే పేదరిక నిర్మూలన అసాధ్యమవుతోంది. ఆలోచన అరవై ఏళ్ల కిందటే వచ్చింది!మనదేశంలో పాలకులకు పేదరికం గురించిన ఆలోచన 1960 దశకంలోనే వచ్చింది. నేషనల్ సాంపుల్ సర్వే 1960–61 ఆధారంగా వి.ఎమ్. దండేకర్, ఎన్. రాత్ల నివేదిక దేశంలో పేదరికం తీవ్రతను తెలియచేసింది. ఉద్యోగ కల్పన ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో ప్రణాళికలు రూపొందాయి. కానీ అవి అమలులో అనుకున్న ఫలితాలనివ్వలేదు, పూర్తిగా వక్రీకరణ చెందాయి. దాంతో ప్రభుత్వాలు తాత్కాలిక ఉపశమన చర్యల వైపు చూశాయి. ఆ చర్యల్లో భాగమే పైన చెప్పుకున్న పథకాలు. ఇన్ని దశాబ్దాలుగా ఈ పథకాలు అమలులో ఉన్నప్పటికీ సమాజంలో వాటి అవసరం ఇంకా ఉందని హంగర్ ఇండెక్స్ చెబుతోంది. ప్రణాళిక బద్ధమైన ఉద్యోగ కల్పన ఇప్పటికీ జరగలేదు, ఇంకా తాత్కాలిక ఉపశమనాలతోనే నెట్టుకు వస్తున్నాం. ఇదిలా ఉంటే పంచవర్ష ప్రణాళికలను కూడా నిలిపివేసింది ప్రభుత్వం. పేదరిక నిర్మూలన సాధనలో ఉపాధి హామీ అనేది చిరుదీపం వంటిదే. అదే సంపూర్ణ పరిష్కారం కాదు. సమ్మిళిత అభివృద్ధి జరగకపోవడంతో సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయి. సంపన్నులు మరీ సంపన్నులవుతున్నారు. పేదవాళ్లు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు. పేదరికం ప్రభావం మహిళలు, పిల్లల మీద తీవ్రంగా చూపిస్తుంది. విద్య, వైద్యం కార్పొరేటీకరణ చెందడంతో ఒక్క అనారోగ్యం వస్తే కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆవిరైపోతుంది. వైద్యాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారు. – ప్రొ‘‘ తోట జ్యోతిరాణి, రిటైర్డ్ ఫ్రొఫెసర్, ఎకనమిక్స్, కాకతీయ యూనివర్సిటీ– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
జగనన్న ప్రభుత్వంలో వాహన మిత్ర, విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకాలతో మా కుటుంబం లబ్ధి పొందింది..!
-
President Droupadi Murmu: వారసత్వ ప్రతీక రామమందిరం
న్యూఢిల్లీ: భారత్ తన పురాతన నాగరికత వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసుకున్న అద్భుత ఘడియగా ‘రామ మందిర నిర్మాణ ఘట్టం’ నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యాఖ్యానించారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశిస్తూ రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. ‘‘ అయోధ్యలో రామమందిర దివ్యధామం ప్రజల విశ్వాసాలను మాత్రమే కాదు న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకున్న అచంచల విశ్వాసానికీ నిలువెత్తు నిదర్శనం’’ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరునూ ఆమె ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య రగులుతున్న ఘర్షణలు, మానవీయ సంక్షోభాలు, యుద్ధాలపై ఆందోళన వ్యక్తంచేశారు. ఘర్షణలకు మూలాలను వెతక్కుండా భయాలు, విద్వేషంతో ఆయా దేశాల ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని ఆమె మాటల్లోనే.. జీ20 ఆతిథ్యం ఎన్నో నేరి్పంది ‘‘న్యాయ ప్రక్రియ, సుప్రీంకోర్టు సముచిత తీర్పుల తర్వాతే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బాటలు పడ్డాయి. ఈ ఆలయం నిర్మాణం ద్వారా భారత్ తన నాగరికత వారసత్వ పరంపరను కొనసాగిస్తున్నట్లు మరోమారు ప్రపంచానికి చాటింది. ప్రజల విశ్వాసం మాత్రమే కాదు వారు న్యాయవ్యవస్థ మీద వారికున్న నమ్మకానికి నిదర్శనం ఈ ఆలయం. ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించి భారత్ తన పౌరుల భాగస్వామ్యంలో ఎంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలనైనా నిర్వహించగలదని రుజువు చేసింది. వ్యూహాత్మక, దౌత్య అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించి చూపింది. ప్రజలు తమ సొంత భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోగలరో ప్రపంచ దేశాలకు నేరి్పంది. గ్లోబల్ సౌత్‌కు భారత్ గొంతుకగా నిలిచింది. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టితో ధృఢ విశ్వాసంతో భారత్ అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులేస్తోంది’’ అని అన్నారు. అభివృద్ధి భారత్ బాధ్యత పౌరులదే ‘‘ స్వతంత్రభారతావని 75 వసంతాలు పూర్తిచేసుకుని శత స్వాతంత్రోత్సవాల దిశగా అడుగులేస్తోంది. రాబోయే పాతికేళ్ల అమృత్‌కాలంలో సర్వతోముఖాభివృద్ధి సాధించి అభివృద్ధి చెందిన భారత్‌గా దేశాన్ని నిలపాల్సిన బాధ్యత పౌరులదే. ఇప్పుడు మహాత్ముని మాటలు గుర్తొస్తున్నాయి. దేశంలో ప్రజలు ప్రాథమిక హక్కులు గురించి మాత్రమే మాట్లాడితే సరిపోదు. ప్రాథమిక విధులు సైతం ఖచి్చతంగా నిర్వర్తిస్తూ బాధ్యతగా మెలిగినప్పుడే భారత్ అభివృద్ది చెందుతుందని గాం«దీజీ ఉపదేశించారు’’ అని ముర్ము గుర్తుచేశారు. -
ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం జగన్
తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రెండో సారి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం ఖాయమని ప్రకటించారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ప్రజలను ధైర్యంగా అడుగుతున్నానని సీఎం జగన్ చెప్పారు. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తామన్న సీఎం జగన్.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామని, మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు ఇది నిదర్శనమని చెప్పిన సీఎం జగన్... కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని, విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినట్టే.. తమ కుటుంబాన్ని కూడా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ చెప్పినదాంట్లో ముఖ్యాంశాలు పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు అయితే విద్య అలాంటి అంశాలపై దృష్టి పెట్టకపోతే పేదరికాన్ని నిర్మూలించలేం నేను ఏ హామీ ఇచ్చాను, ఏం చేశాను అన్నది చూడాలి మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.4 శాతం అమలు చేశాను అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేశాం కచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు కాని ఈ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ చేయగలిగింది చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది నాకు లేనే లేదు చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది.? సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా? వాటిని చూసి కన్విన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికి పెద్దగా లేదు పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే ఉంటుంది ప్రతి పార్టీ కూడా సర్వేలు చేస్తుంది వాటి ఫలితాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు కాని కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం జాతీయ రాజకీయాలు విషయంలో మా విధానం స్పష్టం: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నాం: కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతూ ఉంటుంది అది ఆ పార్టీ సంప్రదాయంగా గమనిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించాలనుకుంది అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు వారు పాఠాలు నేర్వలేదు కాంగ్రెస్ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు ఇండియాటుడే తరపున రాజ్‌దీప్ ప్రశ్నలు, ముఖ్యమంత్రి జగన్ సమాధానాలు సవివరంగా.. రాజ్‌దీప్ : తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో విద్యపై సదస్సు నిర్వహించడం సంతోషకరం, చదువుతో వచ్చే మార్పు ఏంటన్నది కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఆ మార్పే చోటు చేసుకోబోతుంది. ఏపీలోని అత్యంత సామాన్య విద్యార్థులు అమెరికాలోని వాషింగ్టన్ డీసీని పర్యటించడం గొప్ప విషయం సీఎం జగన్ : ఇండియా టుడే జర్నలిస్టులు తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాలలు చూడడం గొప్ప విషయం పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది నా బలమైన నమ్మకం నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు కావాలి పేదలు చదివేది ఒకటయితే, ధనిక పిల్లలు చదివేది మరొకటి పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది, ధనిక పిల్లలు ఇంగ్లీషులో చదివేవారు రాజ్‌దీప్ : మూడో తరగతి నుంచే గ్లోబల్ ఎగ్జామ్ టోఫెల్ లాంటిపై అవగాహన కల్పించేలా చేసిన మార్పులపై విమర్శలొచ్చాయి. తెలుగు మీడియంలోనే బోధించాలని విమర్శలు చేశారు కదా.? సీఎం జగన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధించేలా చేయరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? నన్ను, ప్రభుత్వ విధానాలను విమర్శించే ముందు మీ విధానాలను ప్రశ్నించుకోండి రాజ్‌దీప్ : అకస్మాత్తుగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు పాఠశాల మానేసే ప్రమాదం లేదా? సీఎం జగన్ : ఇలా జరక్కుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్ పెట్టాం. మా బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్ అంశాలను చేర్చాం. పాఠశాలలు అన్నింటిలోనూ సౌకర్యాలు మెరుగుపరిచాం. ఒక విధంగా చెప్పాలంటే సమగ్ర ప్రణాళికతో వీటిని అమల్లోకి తెచ్చాం. నాడు-నేడు తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాం. 62వేల తరగతి గదులుంటే .. 40 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ టీవీలు ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరుకల్లా మిగతా చోట కూడా పూర్తవుతాయి. టీచర్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా ప్రణాళికకు ఒక సమగ్ర రూపం తీసుకొచ్చాం. 8వ తరగతి విద్యార్థులందరికీ ఒక ఆధునికమైన టాబ్ నేర్చుకునేందుకు అందించాం. రాజ్‌దీప్ : 8వ తరగతి విద్యార్థికి టాబ్ ఇచ్చారా? కోవిడ్ సమయంలో తగిన సాధన సంపత్తి (టీవీలు, మొబైళ్లు, టెక్నాలజీ) లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు? ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు కదా.? వచ్చే మూడేళ్లలో పదో తరగతి విద్యార్థులందరికీ టాబ్లు ఉంటాయని నమ్మకంగా చెప్పగలరా? సీఎం జగన్ : 8వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టాబ్‌లున్నాయి. డిసెంబర్ 21న టాబ్లు ఇచ్చాం. నా పుట్టిన రోజు నాడు నేనే తరగతి గదికి వెళ్లి పిల్లలను కలిసి వాళ్లకు టాబ్ అందజేస్తాం. రాజ్‌దీప్ : ప్రభుత్వాల్లో పనులు అంత వేగంగా జరగవని చెబుతారు, మీరు మీ యంత్రాంగాన్ని తగిన విధంగా ప్రోత్సహిస్తున్నారా? IB సిలబస్ కూడా ప్రవేశపెట్టారా? అది కేవలం కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉంది కదా.? అయితే ఇదంతా తొందరపడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. తల్లితండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత మంచి అవకాశం ఎలా వచ్చిందని.? సీఎం జగన్ : ఐబీ సిలబస్ మన రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో చేతులు కలిపింది. IB అన్నది ప్రస్తుతం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. జూన్ 2025 తర్వాత మొదటి తరగతిలో IB సిలబస్ ప్రవేశపెడతాం. అక్కడి నుంచి దశలవారీగా ఏడో తరగతి వరకు ప్రవేశపెడతాం. ఐదేళ్ల తర్వాత మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్ సర్టిఫెకెట్ కోసం పోటీ పడతారు. ఈ ప్రయత్నం ఎందుకంటే.. విద్యలో నాణ్యత అనేది చాలా ముఖ్యం. అదే లేకుంటే మా రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేరు కదా.. ఈ పోటీలో కేవలం ధనికులు మాత్రమే గెలిచే పరిస్థితి ఉండకూడదు, అణగారిన వర్గాల వారికి కూడా అవకాశం దక్కాలి రాజ్‌దీప్ : అది గొప్ప దార్శనికతే. గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన విద్యార్థి పోటీ పడాలన్న ఆలోచన మంచిదే. కానీ విద్యార్థులకు మంచి బోధన అందించేందుకు నాణ్యమైన ఉపాధ్యాయులు ఉన్నారనుకుంటున్నారా? సీఎం జగన్ : ఒక మంచి ఆలోచనకు మావంతు ప్రయత్నం జోడిస్తున్నాం. IB, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి. IBతో చర్చలు జరిపి మాతో కలిసి పని చేసేలా వారిని ఒప్పించాం. ఇందుకు వారిని అభినందిస్తున్నాను. ఫలితంగా IB తన అధికారిక కార్యాలయాన్ని SCERTతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది. ఇది విప్లవాత్మకమైన మార్పుకు నాంది. 2035 నాటికి IBలో చదువుకున్న విద్యార్థులు పదో తరగతిలో ప్రవేశిస్తారు. ఈ లక్ష్యంతోనే మేం పని చేస్తున్నాం. రాజ్‌దీప్ : ఈ పన్నెండేళ్ల ప్రాజెక్టులో IB తో కలిసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నది మీ ఆలోచనా? దీనికి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి, తగినన్ని మీ దగ్గర నిధులున్నాయా? సీఎం జగన్ : ముందు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ.. చిన్న నుంచి పెద్ద తరగతుల వారికి IB బోధన ఇస్తున్నాం ఆ తర్వాత 11, 12 తరగతుల వరకు IB సిలబస్ బోధన అందుతుంది ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అన్న విషయం IBకి కూడా తెలుసు. వాళ్లు కూడా ప్రభుత్వంలో భాగమైనందున.. మిగిలిన వారి వద్ద తీసుకునే స్థాయిలో రాయల్టీలాంటివి ఉండకపోవచ్చు. అట్టడుగు స్థాయి విద్యార్థులకు కూడా అంతర్జాతీయ స్థాయి విద్యను అందించవచ్చన్నది ప్రపంచానికి తెలిపేందుకు ఏపీ ప్రభుత్వం, IB కలిసి చేస్తున్న ప్రయత్నం ఇది. ఇక నిధుల విషయానికొస్తే.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.14వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇప్పటివరకు రూ.8200 కోట్లను ఖర్చు పెట్టాం. నాడు-నేడు తొలిదశలో భాగంగా మొత్తం 44వేల పాఠశాలల్లో 15వేల పాఠశాలలు పూర్తయ్యాయి. రెండో దశలో భాగంగా 16వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. మార్చి నాటికి రెండో దశ పూర్తవుతుంది. వచ్చే ఏడాది మిగిలిన పాఠశాలల్లో పనులు చేపడుతాం. రాజ్‌దీప్ : 2018లో ఏపీలో పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల శాతం 84.48, ఆ ఏడాది జాతీయ సగటు 99.21. ఈ పరిస్థితుల్లో డ్రాపవుట్లను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు? జగనన్న అమ్మ ఒడిలా నేరుగా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తారా? ఆ డబ్బును పిల్లల చదువుకు ఖర్చు పెట్టేలా చూస్తారా? సీఎం జగన్ : మేం పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అట్టడుగున ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మధ్యాహ్నా భోజన పథకాలు, అమ్మ ఒడి లాంటి వాటి సాయంతో డ్రాప్ అవుట్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. మా రాష్ట్రంలో అమలవుతోన్న మధ్యాహ్న భోజన పథకం చాలా వినూత్నమైంది. గోరు ముద్ద పేరుతో ఇస్తోన్న ఈ పథకంలో ఒక్కో రోజు ఒక్కో మెనూతో పౌష్టికాహరం అందిస్తున్నాం. అవసరమయితే రాష్ట్రంలోని ఏ పాఠశాలకైనా మీరు వెళ్లి పరిశీలించుకోవచ్చు. రాజ్‌దీప్ : ఈ పథకాల అమలును ఎలా పర్యవేక్షిస్తున్నారు? గతంలో ప్రభుత్వాలు పాఠశాలలపై పెద్దగా దృష్టి పెట్టలేదు కదా.? నాకిపుడు అర్థమైంది మీరు ఢిల్లీలో ఎందుకు తక్కువ సమయం గడుపుతారన్నది అయితే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గతంలోనూ ఒక సమస్య ఉండేది, ఈ రాష్ట్ర యువతకు నిరుద్యోగం సమస్య ఎక్కువ. ఒక దశలో 35% దాకా ఉండేది. ఈ నేపథ్యంలో వీరికి నైపుణ్యాలు అందించడం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం ఒక సవాలేనా? సీఎం జగన్ : ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా చూస్తోంది. నేనే స్వయంగా పాఠశాలలను పర్యవేక్షిస్తున్నాను. కలెక్టర్లతో నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నాను. మేం పాఠశాల విద్య మీద మాత్రమే కాదు ఉన్నత విద్యపైనా దృష్టి పెట్టాం. ఉద్యోగాలకు అవసరమైనట్టుగా బోధనాంశాల్లో మార్పులు చేశాం. మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో భాగంగా ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాం. అన్ని డిగ్రీలను నాలుగేళ్లు చేస్తున్నాం, ఆన్లైన్ కోర్సులు ఇస్తున్నాం. ఇందులో భాగంగానే త్వరలో ఎడెక్స్తోనూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. పిల్లలు ఆన్లైన్లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం బీకాం నేర్చుకునేవారికి అసెట్ మేనేజ్ మెంట్ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం: ------------- విద్యారంగంలో ఏపీ కొత్త ఒరవడి 5.12pm, జనవరి 24, 2024 విద్యా రంగంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై ఇంట్రో ఏపీలో విద్యారంగంలో సమూల మార్పులు, విద్యా రంగంలో ఆంధ్ర మోడల్, కొత్త ఒరవడి సృష్టించిన సీఎం జగన్ ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు సీఎం జగన్ 5.11pm, జనవరి 24, 2024 ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చర్చ తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ 5.10pm, జనవరి 24, 2024 మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సీఎం జగన్ తిరుపతిలోని ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ Updates: ►ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం జగన్ ►ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానం, మన బడి నాడు - నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, టోఫెల్ శిక్షణ మొదలైన అంశాలపై చర్చ ►దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానంపై ఇండియా టుడే సమ్మిట్ ప్రతినిధులు ప్రశంస ►రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►మరి కొద్దిసేపట్లో తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు హాజరుకానున్న సీఎం జగన్ ►తిరుపతి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడే జరిగే ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు పర్యటన వివరాలను సీఎంవో తెలియజేసింది. బుధవారం సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి సీఎం జగన్ తిరుపతికి( Tirupati ) బయలుదేరతారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తాజ్ హోటల్‌కు వెళ్తారు. అక్కడ జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి ప్రయాణం అవుతారు. సీఎం రాక నేపథ్యంలో.. తిరుపతిలో అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. -
ప్రైవేటు బ్యాంకులకూ ఆ బాధ్యత ఉంది
న్యూఢిల్లీ: దేశంలో పౌరులందరినీ ఆర్థిక రంగంలో భాగస్వాములు చేయాలన్న (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) కేంద్రం సంకల్పంలో ప్రైవేటు రంగ బ్యాంకులూ క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక పథకాలకు దూరంగా ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయని సూచిస్తూ, నగదు సంక్షేమ పథకాల ప్రాచుర్యానికి అవి కూడా జత కలవాలన్నారు. తాజాగా జరిగిన 20వ గ్లోబల్ ఇన్‌క్లూజివ్ ఫైనాన్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, బ్యాంకులు– ఆర్థిక సంస్థలను మూడు రంగాల్లో– కేవైసీ నిబంధనల అమలు, బ్యాంక్ ఖాతాలకు నామినీలు, సైబర్ భద్రతను బలోపేతం చేయడంపై అత్యధిక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లోని 92 శాతం మంది పెద్దలకు కనీసం ఒక బ్యాంకు ఖాతా ఉందని, ప్రతి సంవత్సరం 3 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరవడం జరుగుతోందని ఆయన వివరించారు. అందరికీ బ్యాంకింగ్ ఖాతాల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో సమయం లేదన్న ఆయన ప్రభుత్వ పథకాల విజయవంతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర హర్షణీయమన్నారు. -
Rajasthan Assembly polls: రాజస్థాన్ ఎవరిదో!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగింపునకు వస్తోంది. మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పోలింగ్ ఇప్పటికే ముగియగా కీలకమైన రాజస్థాన్ లో ప్రచార పర్వానికి గురువారం సాయంత్రంతో తెర పడింది. శనివారం పోలింగ్ జరగనుంది. అధికార కాంగ్రెస్, బీజేపీ రెండూ గెలుపుపై ధీమాగా ఉన్నా యి. ఏడు హామీలకు తోడు ప్రజాకర్షక పథకాలు కచ్చితంగా గట్టెక్కిస్తాయని ముఖ్య మంత్రి అశోక్ గెహ్లోత్ నమ్ముతున్నారు. దారుణంగా క్షీణించిన శాంతిభద్రతలు కచ్చితంగా సర్కారు పుట్టి ముంచుతాయని, మోదీ మేనియాకు హిందూత్వ కార్డు తోడై ఘనవిజయం సాధించి పెడుతుందని బీజేపీ అంటోంది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ ముగిశాక డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరిగి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌లో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే... 2008పరిశీలకులతో పాటు అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ అధికార బీజేపీ అనూహ్యంగా ఓటమి చవిచూసింది! కాంగ్రెస్ మరోసారి విజయబావుటా ఎగరేసింది. గెహ్లోత్ మళ్లీ సీఎం అయ్యారు. ప్రజల ఆదరణ బీజేపీకే ఉన్నట్టు దాదాపుగా అన్ని సర్వేల్లోనూ తేలినా ఆ పార్టీ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె సింధియా అనుసరించిన లోప భూయిష్టమైన ఎన్నికల వ్యూహమే ఇందుకు ప్రధాన కారణమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఆమె అహంకారపూరిత ప్రవర్తన, సీనియర్లకు ప్రా ధాన్యం ఇవ్వకపోవడం, అభ్యర్థుల ఎంపికలో ఒంటెత్తు పోకడలు పార్టీని ముంచాయంటూ విమర్శలు వెల్లు వెత్తాయి. మొత్తం 200 స్థానా లకుగాను కాంగ్రెస్ 96 చోట్ల నెగ్గగా బీజేపీ 78 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్‌కు 36.8 శాతం ఓట్లు పోలవగా బీజేపీకి 34.3 శాతం పడ్డాయి. ఇతరులకు 21 శాతం ఓట్లు పోలవడం బీజేపీ విజయావ కాశాలను గట్టిగా దెబ్బకొట్టింది. ఎందుకంటే 2003 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఓట్లు కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగాయి. బీజేపీ ఏకంగా 5 శాతానికిపైగా ఓట్లను నష్టపోయింది! ఇక బీఎస్పీ 7.6 శాతం ఓట్లతో 6 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2013 ఆనవాయితీని కొనసాగిస్తూ బీజేపీ ఘనవిజయం సాధించింది. వసుంధరా రాజె మళ్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో బీజేపీ 163 సీట్లలో నెగ్గింది. కాంగ్రెస్ కేవలం 21 స్థానాలకు పరిమితమై ఘోర పరాభవం మూటగట్టుకుంది. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రధాన పార్టీకి లభించిన అత్యల్ప స్థానాలు ఇవే! 1998 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 33 సీట్లొచ్చాయి. బీజేపీ 45.2 శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్‌కు 33.1 శాతం దక్కాయి. గుజ్జర్ నేత కిరోరీసింగ్ బైన్స్లా దన్ను కాంగ్రెస్‌కు పెద్దగా కలిసిరాలేదు. ఎప్పుడూ ఆదరించే మేవార్ ప్రాంతం ఈసారి బీజేపీకే జై కొట్టడంతో ఆ పార్టీ తేరుకోలేకపోయింది. 34 ఎస్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటి కూడా నెగ్గలేకపోవడం విశేషం. 25 ఎస్టీ సీట్లలో నాలుగే గెలిచింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రధానంగా తెరపైకి వచ్చిన నరేంద్ర మోదీ మేనియానే బీజేపీ ఘన విజయానికి కారణమని సీఎం అశోక్ గెహ్లోత్ అంగీకరించడం విశేషం! బీఎస్పీ సగం అసెంబ్లీ సీట్లు కోల్పోయి మూడింటికే పరిమితమైంది. 2018 ప్రభుత్వాలను పడగొట్టే ధోరణి మరోసారి కాంగ్రెస్‌కు గెలుపు కట్టబెట్టింది. పీసీసీ చీఫ్‌గా యువ నేత సచిన్ పైలట్ అంతా తానై ఎన్నికల బాధ్యతలను చూసుకున్నారు. పార్టీ విజయంలో ఒకరకంగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ నెగ్గితే ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం పార్టీకి బాగా లాభించింది. 100 సీట్లతో పార్టీ ఘనవిజయం సాధించింది. 2013లో 59 ఎస్సీ, ఎస్టీ స్థానాలు నెగ్గిన బీజేపీ ఈసారి కేవలం 21 స్థానాలకు పరిమితమైంది. ఆళ్వార్, దౌసా, సవాయ్ మధోపూర్, టోంక్, ధోల్పూర్, కరౌలీ జిల్లాల్లోనైతే ఒక్క ఎస్సీ, ఎస్టీ స్థానం కూడా నెగ్గలేకపోయింది. ఫలితాల అనంతరం పైలట్ సీఎం అవుతారని అంతా భావించారు. కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా పాత కాపు మరోసారి గెహ్లోత్‌కే చాన్స్ ఇచ్చింది. రెండేళ్ల అనంతరం అవకాశమిస్తామంటూ పైలట్‌ను అనునయించి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. మాట నిలుపుకోకపోవడంతో 2020లో ఆయన తిరుగుబాటు చేసినా రాహుల్‌గాంధీ జోక్యంతో రాజీ పడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మా రేషన్ కార్డు ఎప్పుడు వస్తది సారు..?!
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే తెల్లరేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తరువాత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను ఇవ్వలేదు. 2016లో మాత్రం ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. ఆ సందర్భంలో చాలా మంది కొత్తగా కార్డులు, పేర్ల మార్పిడి, పిల్లల పేరు ఎక్కించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అలాంటి సమస్యలు అన్ని పరిష్కారం కాకపోను చాలా మందికి కొత్తగా రేషన్ కార్డులు అందని పరిస్థితి నెలకొంది. ఆతరువాత ప్రభుత్వం రేషన్ కార్టులకు సంబంధించి ఆన్లైన్ సైట్‌ను బందు పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలంటే అధికారులు రేషన్ కార్డులు తప్పనిసరిగా ఉండాలని చెబుతుండడంతో చాలామంది పేదలు పథకాలకు దూరమవుతున్నారు. రేషన్ కార్డుల్లేక.. వేలాది దరఖాస్తుల తిరస్కరణ.. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తోంది. ఇందుకోసం ఇటీవల జిల్లా వ్యాప్తంగా పేదల నుంచి దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 78,890 మంది దరఖాస్తు వచ్చాయి. అందులో నియోజకవర్గానికి 3 వేల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలో 18 వేల మందికి మొదటి విడతగా లబ్ధి పొందనున్నారు. అయితే ఈ పథకానికి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో కేవలం 11 వేల మందిని మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించారు. ఇందులో తెల్ల రేషన్ కార్డులు లేక చాలా మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇదిలా ఉంటే బీసీ కులవృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఈ పథకానికి మొత్తం41,863 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కూడా రేషన్ కార్డులేని వారి వేలాది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వీటితోపాటు మైనార్టీ బంధు పథకంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా తాము ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్ కార్డులతోపాటు పేర్ల మార్పులు, కొత్తగా పిల్లల పేర్లు ఎక్కించి కొత్త కార్డులు పంపిణీ చేయాలని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు కోరుతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే.. ప్రస్తుతం ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన గృహలక్ష్మి, బీసీలకు ఆర్థిక సాయం, మైనార్టీ బంధు, దళిత బంధు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతిఒక్క దరఖాస్తుదారు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. లేదంటే దరఖాస్తు చేసుకున్నా కూడా ఆన్లైన్లో తీసుకోని పరిస్థితి. అయినా కొందరు ఆన్లైన్లో కాకుండా కొన్ని పథకాలకు నేరుగా తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తుల ఆధారంగా అక్కడ ఆన్లైన్ చేశారు. కానీ, రేషన్ కార్డులేక పోవడంతో చాలా మంది దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. రేషన్ కార్డు అందించాలి తెల్ల రేషన్ కార్డు లేకపోవడంతో మేము గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోలేక పోయాము. గతంలో డబుల్ బెడ్రూం ఇల్లు కూడా రాలేదు. 2016లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఉంటేనే పథకాలకు అర్హులని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా రేషన్ కార్డు ఇచ్చి ఆదుకోవాలి. – అంబటి సంధ్య, పెద్దదేవులపల్లి తెల్ల రేషన్‌కార్డు లేక దరఖాస్తు చేసుకోలేదు నాకు రేషన్ కార్డు లేదు. చాలా కాలం క్రితం దరఖాస్తు చేసుకున్నాను. అయినా కార్డు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తుంది. కానీ, రేషన్ కార్డులేక నేను దరఖాస్తు చేసుకోలేక పోయాను. ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డు తప్పనిసరి చేసి పేదలకు అవి పంపిణీ చేయకపోవడంతో పథకాల ఫలాలు అందరికీ అందడం లేదు. – శ్రీకాంత్, హనుమాన్ పేట, మిర్యాలగూడ -
పథకాలు అందకుంటే వెతికి పట్టుకుని అందిస్తాం: మంత్రి కేటీఆర్
సిరిసిల్ల: రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇంకా ఎవరైనా రాని వారు ఉంటే.. వెతికి పట్టుకొని అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే 24 గంటల కరెంట్, ఇంటింటికీ తాగునీరు, పొలాలకు సాగునీరు, అర్హులకు ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మీ.. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు. దేశంలోనే బీడీ కార్మికులను పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే ఎక్కడ కూడా రైతులకు జీవిత బీమా చేయించలేదని, ఒక్క తెలంగాణలోనే 40 లక్షల మంది రైతులకు ఏటా రూ.1,450 కోట్లు ప్రీమియం చెల్లించి బీమా చేయిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో లక్ష రైతుకుటుంబాలకు రూ.5వేల కోట్ల బీమా సాయం అందిందని వివరించారు. 31 వేల మంది గిరిజన ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో 3,416 గిరిజన తండాలను, గూడేలను గ్రామపంచాయతీలుగా చేశామని సర్పంచులను నుంచి వార్డు సభ్యుల వరకు 31వేల మంది గిరిజనులు పాలనలో భాగస్వాములయ్యారని కేటీఆర్ వెల్లడించారు. గిరిజన బిడ్డలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని, పోడు భూములకు త్వరలోనే పట్టాలు ఇస్తామని తెలిపారు. గ్రామాల్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ.. పల్లెల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టాలని సర్పంచులను మంత్రి కోరారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు సారూ.. స్పందించిన కేటీఆర్.. కలెక్టర్‌కు ఆదేశాలు జిల్లాలోని బాకూర్‌పల్లితండాలో ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూ.. మంత్రి కేటీఆర్ మీకు మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవా? అని మహిళలను ప్రశ్నించారు. వస్తలేవంటూ.. మహిళలు చెప్పడంతో కేటీఆర్ స్పందించారు. ‘ఎందుకు రావడం లేదు.. పైపులైన్ వేశాం, ట్యాంకు కట్టాం.. కారణం ఏంటి..? సాయంత్రంలోగా మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి నాకు నివేదిక ఇవ్వాలని’కలెక్టర్‌ను ఆదేశించారు. స్థానిక సర్పంచ్ స్పందించి.. ‘ఇక్కడ బోర్లు ఉన్నాయి.. బోరు నీళ్లే వాడుకుంటున్నారు.. మిషన్ భగీరథ నీళ్లు తాగడం లేదని’అన్నారు. ‘ప్రభుత్వం వేసినా మీరు తాగకుంటే ఎలా.. బోరు నీరు తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ ఇష్టమని’కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల్లో గిరిజన భవన్‌ను కట్టుకుందామన్నారు. చదవండి: ఉన్నమాట అంటే ఉలిక్కిపడుతున్నారు.. ఏపీ మంత్రులపై హరీశ్‌రావు -
మధ్య తరగతికి చేరువ కండి
మధ్య తరగతికి మరింత చేరువ కావాలని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వారికి లబ్ధి చేకూర్చిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత వివరంగా తెలియజేయాలన్నారు. ఆదివారం ఇక్కడ మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. బుధవారం సమర్పించబోయే కేంద్ర బడ్జెట్ గురించి చర్చ జరిగింది. ప్రభుత్వ పథకాలు పేద, అణగారిన వర్గాలకు ఎనలేని లబ్ధి చేకూర్చడంతో పాటు మధ్యతరగతి ప్రజల జీవితాన్ని ఎంతో సుఖమయం చేశాయని మోదీ అన్నారు. ఈ విషయాలన్నింటినీ వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిందిగా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ బ్రిటిష్ వలస పాలనకు సంబంధించిన చిహ్నాలన్నింటినీ ఒక్కొక్కటిగా తప్పిస్తూ ముందుకు సాగుతున్నట్టు ప్రధాని చెప్పారు. భేటీలో మూడు అంశాలపై మంత్రులకు ప్రజెంటేషన్లు ఇచ్చారు. మోదీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనలో సామాజిక, ఆర్థిక రంగాలకు సంబంధించిన పనితీరుపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ గౌబా సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆరోగ్య, విద్యా రంగాల్లో సాధించిన ప్రగతిని కూడా వివరించారు. చిన్న, మధ్య తరహా నగరాల్లోనూ ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌ల స్థాపన తదితరాలను ఉటంకించారు. విద్యా వ్యవస్థలో అన్ని స్థాయిల్లోనూ విద్యార్థుల చేరిక, కొనసాగింపు శాతం బాగా పెరిగాయని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మానవ వనరులతో పాటు అన్నిరకాల వసతులనూ మెరుగు పరిచామన్నారు. ఇక కేంద్రం ప్రారంభించిన పలు ప్రాజెక్టుల వివరాలపై పరిశ్రమలు, అంతర్గత వర్తక శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ మంత్రులకు మరో ప్రజెంటేషన్ ఇచ్చారు. మోదీ ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మాధ్యమాలను మరింత మెరుగ్గా ఎలా వాడుకోవచ్చో సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తన ప్రజెంటేషన్‌లో వివరించారు. -
పొలిటికల్ కామెంట్: తమ పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియంలో చదవాలా..?
-
కులాలు,మతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ దే : అంజాద్ బాషా
-
ఇద్దరు సంతానం ఉంటేనే పథకాల లబ్ధి
గువాహటి: రాష్ట్రంలో జనాభా పెరుగుదలకు కళ్లెం వేయడమే లక్ష్యంగా హిమంత బిశ్వ శర్మ సారథ్యంలోని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇద్దరు సంతానం ఉన్న కుటుంబాలకే రాష్ట్రంలో అమలయ్యే పలు పథకాల నుంచి లబ్ధిపొందే అవకాశం కల్పిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత శనివారం స్పష్టంచేశారు. ప్రస్తుతం అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కొన్ని పథకాలకు మాత్రమే ‘ఇద్దరు సంతానం’ నియమాన్ని అమలుచేస్తామని, ఆ తర్వాత క్రమక్రమంగా అన్ని ప్రభుత్వ పథకాలకూ ఈ నియమాన్ని తప్పనిసరి చేస్తామని ఆయన ప్రకటించారు. అస్సాంలో కేంద్ర పథకాలకు ప్రస్తుతం ఈ నియమం వర్తించదు. పాఠశాల, కళాశాలల్లో ఉచిత ప్రవేశం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలకు ఈ నియమాన్ని విధించబోమని ఆయన వివరణ ఇచ్చారు. -
ముగ్గురి గ్యాంగ్ రూ.3 కోట్ల మోసం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధి పొందేలా చేస్తానని అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూములు ఇప్పిస్తాం.. ప్రభుత్వ స్థలాలు వచ్చేలా చేస్తామని ప్రజలు, నిరుద్యోగులను మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టయ్యింది. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల పీఏనంటూ సుధాకర్ మోసాలకు పాల్పడుతున్నాడు. అతడికి నాగరాజు, భీమయ్య సహకరిస్తున్నారు. ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి అమాయకులను మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి దర్యాప్తు చేశారు. ఫార్చూనర్ కారు సఫారీ డ్రెస్ లు వేసుకుని డమ్మీ గన్ ద్వారా వారు దందా నడిపిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకోవడంతో దాదాపు నిరుద్యోగులు, ప్రజల నుంచి రూ.2.2 కోట్లు వసూలు చేశారని తెలిసింది. ఈ ముగ్గురిని ఎస్సార్ నగర్లో అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ గ్యాంగ్ లీడర్‌గా ఉంటుండగా నాగరాజు, భీమయ్య అతడికి సహకరించేవారు. ఈ విధంగా వారు 82 మందిని మోసం చేశారని పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ స్థలాలు, ఉద్యోగాలు, తక్కువ డబ్బులకు బంగారం వంటి నేరాలకు పాల్పడ్డారని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. మొత్తం రూ.3 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. నిందితుల నుంచి రూ.కోటి 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, కోటి రూపాయల ఇంటి పేపర్లు, ఫార్చూనర్ కారు, డమ్మీ గన్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అయితే సీఎం ఓఎస్డీగా, సెక్రటేరియట్ ఎంట్రీకి ఐడీ కార్డులు పొంది వారు ఈ దందా కొనసాగించినట్లు చెప్పారు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ పిలుపునిచ్చారు. చదవండి: ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య చదవండి: విద్యార్థిని చితక్కొట్టిన వాచ్మెన్ -
వైఎస్సార్ నవశకానికి ‘స్పందన’తో నాంది
సాక్షి, అమరావతి : ప్రజల సమస్యలు సత్వరమే తీర్చాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ప్రారంభించిన ‘స్పందన’ కార్యక్రమానికి వెల్లువెత్తిన వినతుల నేపథ్యంలో ‘వైఎస్సార్ నవశకం’ ఆవిర్భవించింది. రాష్ట వ్యాప్తంగా స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అత్యధికంగా రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల కోసం ఎక్కువగా వినతులు వస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అర్హత కలిగి ఉండి కూడా పింఛన్, ఇల్లు, రేషన్ కార్డు లేని వారు ఎంత మంది ఉన్నారో సర్వే చేయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే వైఎస్సార్ నవశకం పేరుతో రాష్ట్రమంతటా ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రతి సమస్యకూ నిర్మాణాత్మక పరిష్కారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఏడాది జూన్ 24న కలెక్టర్లు, ఎస్పీలతో తొలి కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు ‘స్పందన’ కార్యక్రమాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే వినతులకు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రతి సోమవారం కొనసాగుతోంది. సోమవారం వచ్చిన వినతుల్లో చాలా వరకు శనివారంలోగా తప్పనిసరిగా పరిష్కరించాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం పని చేస్తోంది. ఈ కార్యక్రమంపై క్రమం తప్పకుండా ముఖ్యమంత్రి కూడా ప్రతి మంగళవారం సమీక్షిస్తూ అధికార యంత్రాంగంలో సీరియస్‌నెస్ తీసుకొచ్చారు. యథాలాపంగా కాకుండా ప్రతి సమస్యకూ నిర్మాణాత్మక పరిష్కారం దిశగా స్పందన కార్యక్రమాన్ని నడిపిస్తూ వస్తున్నారు. తక్షణ స్పందన కోసం కలెక్టర్లకు నిధులనూ కేటాయించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ద్వారా క్షేత్ర స్థాయి అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం పెంచాలని ఆదేశించారు. ప్రజలు రోజుల తరబడి సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండరాదని, ఏ సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో వినతులు ఇచ్చే ప్రజలకు రశీదు ఇప్పించారు. ఆ సమస్య పరిష్కారం కాగానే తెలియజేసే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఏదైనా వినతి పరిష్కారానికి నోచుకోకపోతే అందుకు గల సహేతుక కారణాలతో వివరణ ఇవ్వాలని, పెండింగ్‌లో ఉంటే.. దాని పరిష్కారానికి నిర్ణీత సమయం చెప్పాలనే జవాబు దారీ తనాన్ని అధికార యంత్రాంగానికి అలవాటుగా మారుస్తున్నారు. ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, సర్టిఫికెట్లు, కమ్యూనిటీ సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు, వ్యక్తిగత సమస్యలు తదితర అంశాలపై స్పందనలో ఇప్పటి దాకా లక్షల కొద్దీ వినతులు వచ్చాయి. వీటి పరిష్కారంలో నాణ్యత పెంచడానికి సీఎం ఆదేశాల మేరకు అధికారులకు పెద్ద ఎత్తున వర్క్‌షాపులు నిర్వహించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. చిరునవ్వుతో స్వాగతించాలి స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి వచ్చే వారిని చిరునవ్వుతో స్వాగతించాలని, ఇచ్చిన ప్రతి అర్జీని సీరియస్‌గా తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మనసా, వాచా, కర్మణా పనిచేసినప్పుడే బాధితులకు న్యాయం చేయగలుగుతామని ప్రతి సమీక్షలో ఆయన అధికారులకు స్పష్టం చేస్తున్నారు. మనకేదైనా సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం కోరుకుంటామో అలాంటి పరిష్కారమే మన దగ్గరకొచ్చేవారికి లభించేలా చర్యలుండాలని సూచిస్తూ వస్తున్నారు. దీంతో అధికారులు కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు. -
మూడో బిడ్డ పుడితే పథకాలు వద్దు
హరిద్వార్: జనాభాను తగ్గించే చర్యల్లో భాగంగా ఒకే తల్లిదండ్రులకు పుట్టే మూడవ, లేదా ఆ తర్వాతి సంతానానికి, ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వ సేవలు, పథకాలు, ఓటు హక్కును నిలిపివేయడం వంటివి చేయాలని యోగాగురు బాబా రాందేవ్ ఆదివారం అన్నారు. మతాలకు అతీతంగా, దేశంలోని ప్రజలందరికీ ఈ నిబంధనను వర్తింపజేయాలని ఆయన పేర్కొన్నారు. హరిద్వార్‌లో రాందేవ్ విలేకరులతో మాట్లాడుతూ ‘జనాభా విస్ఫోటన సమస్యను ఎదుర్కొనేందుకు ఇండియా సిద్ధంగా లేదు. 150 కోట్ల మంది కంటే ఎక్కువ జనాభాను దేశం భరించలేదు. ఎవరైనా మూడో బిడ్డను లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కంటే, ఆ జంటకు అలాగే మూడో లేదా ఆ తర్వాతి సంతానానికి ప్రభుత్వ సేవలను నిలిపివేయాలి. వివిధ పథకాలకు వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయకూడదు. ఓటు హక్కును ఇవ్వకుండా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా చేయాలి’ అని అన్నారు. -
సర్వే సాగేనా..?
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే కొనసాగడంపై అస్పష్టత నెలకొంది. పంట కాలనీల ఏర్పాటుతోపాటు వాటి ఆధారంగా భవిష్యత్‌లో రైతులకు వివిధ పథకాలను రూపొందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం, కనీస మద్దతు ధర కల్పించడం, ఆన్లైన్లో చెల్లింపులు, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, సబ్సిడీ చెల్లింపులు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల అమలుకు రైతు సమగ్ర సమాచారాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. ఇందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమగ్ర సమాచార సర్వేను చేయించాలని భావించింది. ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖకు అదేశాలు జారీ చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది ఎన్నికల విధులకుహాజరుకావడంతో సర్వేకు ఆటంకం ఏర్పడింది. సర్వేను ఎట్టి పరిస్థితుల్లోనూ మే 15లోగా పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని అన్ని జిల్లా కలెక్టర్లుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. సర్వే మే 15 నాటికి పూర్తి చేయడం వ్యవసాయశాఖ అధికారులకు కత్తిమీది సాముగా మారింది. క్షేత్ర స్థాయిలో అన్ని గ్రామాల్లో పర్యటించి రైతుల ద్వారా నేరుగా సమాచారాన్ని సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మాట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఏఈఓల కొరత రైతులనుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించాల్సిన వ్యవసాయ విస్తరణాధికారులు జిల్లాలో పూర్తిస్థాయిలో లేరు. మొత్తం 140 మంది వ్యవసాయ విస్తరణాధికారులకు గాను 112 మంది మాత్రమే ఉన్నారు. రోజువారీ విధులే వారికి తలకు మించిన భారమయ్యాయి. దీనికితోడు ఇన్నిరోజులు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల విధుల్లో బీజీబీజీగా ఉన్నారు. మరోవైపు పీఎం కీసాన్, రైతుబంధు, రైతు బీమా కోసం అవసరమైన సమాచారాన్ని సేకరించే పనితోనే సరిపోతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధులు ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్న వ్యవసాయ విస్తరణాధికారులకు మూలిగే నక్కపై తాటిపండు పడిన విధంగా మరో పనిభారం పడింది. జిల్లావ్యాప్తంగా సుమారు 250 వరకు ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తేమశాతం కొలవడానికి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించారు. ఒక్కో ఏఈఓ రెండు నుంచి మూడు గ్రామాలు తిరిగి కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలుకు సహకరించాల్సి ఉంటుంది. మే 15 నాటికి రైతు సమగ్ర సర్వేను కచ్చితంంగా పూర్తి చేసి నివేదికను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం అదేశించిన నేపథ్యంలో జిల్లా అధికారులు సోమవారం జిల్లాకేంద్రంలో సమావేశం నిర్వహించి వెంటనే సర్వే పూర్తి చేయాలని వ్యవసాయ విస్తరణాధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వి«ధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే ఎలా సాధ్యమవుతుందో అధికారులకే తెలియాలి. 39 అంశాలతో కూడిన సమాచారాన్ని సేకరించాలి రైతు సమగ్ర సమాచార సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 39 అంశాలతో కూడిన ప్రొఫార్మాను రూపొందించింది. రైతు భూమి విస్తరణ, విద్యార్హతలు, నీటి పారుదల సౌకర్యం, సూక్ష్మనీటి పారుదల విస్తీర్ణం, నేల రకం సర్వే నంబర్ల వారీగా వివరాలు, రైతు పొలంలో లోతు స్వభావం, ఖరీఫ్‌లో వేసిన పంట వివరాలు, యాసంగిలో వేసిన పంటలు, ఎండాకాలంలో వేసిన పంటలు, తోటల విస్తీర్ణం, రాబోయే ఖరీఫ్‌లో వేసే పంటలు, పంటరుణం, పంటల బీమా వివరాలు, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, ఏయే పంటలను వేయడానికి రైతులు ఇష్టపడుతున్నారు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఫోన్ సౌకర్యం, సేంద్రియ వ్యవసాయం గురించి రైతుకు తెలుసా లేదా, కిసాన్ పోర్టల్ నుంచి రైతులకు సలహాలు అందుతున్నాయా లేదా అనే అం«శాలను సేకరించి నమోదు చేయాల్సి ఉంటుంది. ఏఈఓలకు అగ్ని పరీక్షే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జిల్లాలో 43 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే కాలు బయటపెట్టలేని పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యం లో ఎండా కాలంలో గ్రామాల్లో పర్యటించి రైతులనుంచి సమగ్ర సమాచారాన్ని మే 15 లోగా సేకరించడం వ్యవసాయ విస్తరణాధికారులకు అగ్ని పరీక్షగా మారింది. పట్టణాల్లో నివాసం ఉంటున్న వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాలకు వెళ్లే సరికే పది గంటలు దాటుతుంది. ఒక్కో రైతునుంచి 39 అంశాలతో కూడిన ఫార్మాట్‌ను పూర్తి చేయాలంటే కనీసం గంట సమయం పడుతుంది. రోజూ ఎండలను దృష్టిలో పెట్టుకుని ఉదయం సాయంత్రం సమాచారాన్ని సేకరించినా రోజుకు 20 మంది రైతులనుంచి కూడా సమాచారాన్ని సేకరించలేని పరిస్థితి. 4.07లక్షల మందినుంచి సమాచారం సేకరించాలి వ్యవసాయ శాఖ వద్ద నమోదైన సంఖ్య ప్రకారం 4లక్షల 7వేల మంది ఉన్నారు. వారందరినుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించాలంటే వ్యవసాయ విస్తరణాధికారులకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మళ్లీ ఎన్నికల విధులు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో తిరిగి వ్యవసాయ విస్తరణాధికారులకు ఎన్నికల విధులు పడే అవకాశం ఉంది. దీంతో సమగ్ర సమాచార సేకరణ సర్వేకు ఆటంకం ఏర్పడనుంది. ఇప్పటినుంచి సర్వే ప్రారంభించినా సుమారు ఆరు నెలల సమయం పడుతున్న సమయంలో తిరిగి ఎన్నికల విధులు రా వడంతో సర్వే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ సిబ్బంది అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా మే 15 నాటికి సర్వే పూర్తి కావడం సాధ్యమయ్యే పనేనా అని పలువురు వ్యవసాయ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించడం, ఎన్నికల విధులకు హాజరుకావడం, తిరిగి సర్వే చేయడం ఏకకాలంలో మూడు పనులు ఎలా చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఏఈఓలు కొట్టుమిట్టాడుతున్నారు. కష్టమైనా సర్వే చేయక తప్పదు : జి.శ్రీధర్‌రెడ్డి, జేడీఏ వ్యవసాయ విస్తరణాధికారులు ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేయడంలో బీజీగా ఉన్నారు. దీనికితోడు ఎన్నికల విధులకు వెళ్లాల్సి వస్తుంది. కష్టమైనా సర్వే చేయక తప్పదు. కొన్ని ప్రాంతాల్లో సర్వేను ఏఈఓలు ప్రారంభించారు. సాధ్యమైనంత వరకు పూర్తి చేయడానికి సమష్టిగా కృషి చేస్తాం. -
సబ్సిడీ కోత.. డీలర్లు డీలా
సాక్షి, ఇల్లెందు అర్బన్: పట్టణం, మండలంలోని రేషన్ దుకాణాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యం సంచుల్లో నాలుగైదు కిలోల కోత ఉంటోంది. దీంతో డీలర్లు నష్టపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే చౌకధర బియ్యం ప్రతీ సంచిలో 50 కేజీలు ఉండాల్సి ఉండగా రేషన్ దుకాణానికి వచ్చే సరికి 43 నుంచి 47కిలోలు మాత్రమే ఉంటోంది. ప్రతీ సంచిలో ఐదారు కిలోల దాక కోత ఉంటుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లెందు పట్టణ, మండల పరిధిలో 38 రేషన్‌దుకాణాలు ఉన్నాయి. 60వేలకు పైగా ఆహరభద్రత కార్డులు ఉన్నాయి. దాదాపు 4012 క్వింటాళ్ల బియ్యం ఇల్లెందుకు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పాస్ యంత్రాలతో అర్హులైన లబ్దిదారులకు ఎక్కడి నుంచైనా బియ్యం పొందే వెసులుబాటు ఏర్పడింది. ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అనంతరం మిగిలిన స్టాక్ అంతా రాష్ట్ర ఉన్నతాధికారులకు సైతం తెలియజేసేలా ఆన్లైన్లో నమోదవుతోంది. దీంతో అక్రమాలు జరిగే ప్రసక్తే ఉండదు. ఇంత వరకు బాగానే ఉన్నా డీలర్లు బియ్యం కోసం కట్టిన డీడీకి తగినన్ని బియ్యం సరఫరా కావడంలేదు. దీంతో ప్రతి నెల డీలర్లు సొంత ఖర్చుతో 10 నుంచి 15 క్వింటాళ్ల బియ్యాన్ని తీసుకొని ప్రజలకు పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిబంధనలు బేఖాతరు జిల్లా నుంచి పట్టణంలోని జీసీసీ గోదాముకు వచ్చిన బియ్యాన్ని నిల్వ అనంతరం ఆయా గ్రామాల్లోని రేషన్ దుకాణాలకు తూకం వేసి పంపాల్సి ఉంది. కానీ సరాసరి లారీలో నుంచి తిరిగి లారీలోకి తరలించడం, ప్రతీ సంచిలో రంధ్రాల నుంచి బియ్యం పడిపోవడం జరుగుతోంది. దీంతో పాటు గోదాంలకు సరఫరా అయ్యే సమయంలో బియ్యం తూకం వేయకపోవడంతో అవకతవకలకు తావిచ్చినట్టైంది. ఫలితంగా తక్కువ పడిన బియిన్ని భర్తీ చేస్తూ... డీలర్లు నష్టపోతున్నారు. నాలుగైదు కేజీల బియ్యం తక్కువగా వస్తోంది.. రేషన్ దుకాణానికి వచ్చే బియ్యం సంచుల్లో కోత ఉంటోంది. ప్రతీ సంచిలో నాలుగైదు కేజీల బియ్యం తక్కువగా వస్తున్నాయి. అలా చేయకపోవడంతో తూకం తక్కువగా ఉండి డీలర్లు నష్టపోవాల్సి వస్తోంది -స్వరూప, డీలర్ అధికారులు పట్టించుకోవడంలేదు.. గత కొంత కాలం నుంచి మాకు సరఫరా అయ్యే బియ్యం సంచుల్లో తూకం తేడాలు ఉంటున్నాయి. సంచుల్లో తక్కువగా బియ్యం వస్తోందని అనేక మార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదు. సంచుల్లో తక్కువగా బియ్యం రావడంతో మేమే స్వయంగా ప్రతి నెలా రెండు, మూడు క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేసి ప్రజలకు పంపిణీ చేయాల్సి వస్తోంది. -కటకం పద్మావతి, డీలర్ -
‘ఆ అయిదు పథకాల పేర్లు మారాయి’
రాయ్‌పూర్ : ప్రభుత్వాలు మారగానే కీలక విధానాల సంగతి ఎలా ఉన్నా ప్రముఖ పథకాలు, ప్రాజెక్టుల పేర్లు మారుతుంటాయి. ఇదే ఒరవడిలో చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసి భూపేశ్ బఘేల్ సారథ్యంలో నూతనంగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, దివంగత జన సంఘ్ నేత పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పేరుతో ఉన్న 5 పధకాల పేర్లు మార్చింది. పురపాలక, అభివృద్ధి శాఖలకు చెందిన ఈ పధకాలకు మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ల పేర్లు పెట్టారు. ఆయా పధకాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం సోమవారం రాత్రి నోటికేషన్ జారీ చేసిందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యా స్వావలంభన యోజన పథకాన్ని రాజీవ్ గాంధీ స్వావలంభన యోజనగా, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ సర్వసమాజ్ మంగళ భవన్‌ను ఇక నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సర్వసమాజ్ మంగళభవన్‌గా వ్యవహరిస్తారు. కాగా పండిట్ దీన్‌దయాళ్ శుద్ధి నీటిని ఇకమీదట ఇందిరా ప్రియదర్శిని శుద్ధ పేజల్‌గా పిలుస్తారు. కాగా అభివృద్ధి పధకాల పేర్ల మార్పు నిర్ణయాన్ని చత్తీస్‌గఢ్ మాజీ సీఎం, బీజేపీ నేత రమణ్ సింగ్ ఖండించారు. చత్తీస్‌గఢ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పేర్ల మార్పు తతంగానికి నిరసనగా తాము ఆందోళనల బాట పడతామని చత్తీస్‌గఢ్ మాజీ సీయం, బీజేపీ నేత రమణ్ సింగ్ వాపోయారు. ప్రభుత్వ తీరుపై తాము చత్తీస్‌గఢ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని రమణ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మెంటాలిటీకి చత్తీస్‌గఢ్ సర్కార్ తీరు నిదర్శమని ఆయన చెప్పకొచ్చారు. -
ఇక యుద్ధం.. ఆన్లైన్!
ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం దగ్గర్నుంచి, ప్రత్యర్థులను ఎండగట్టే వరకు రాజకీయాల్లో ఇప్పుడు అందరిదీ ఒకే దారి. అదే సోషల్ మీడియా దారి. సామాజిక మాధ్యమాలు లేకుండా రాజకీయాల్లో అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. ఇక, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. గత ఐదేళ్లలో ఎన్నికల్లో పార్టీల జయాపజయాలను ప్రభావితం చేసేంతటి శక్తిమంతమైన సాధనంగా మారింది. 2014 లోక్‌సభ ఎన్నికలప్పటికి సోషల్ మీడియా అంతగా ప్రాచుర్యంలో లేదు. అయితే, నరేంద్ర మోదీని ప్రధాని పీఠానికి చేరువ చేయడంలో సోషల్ మీడియానే కీలకమన్న అభిప్రాయమైతే బలంగా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రచారం ద్వారా యువ ఓటర్లను ఆకర్షించడంలో మోదీ సక్సెస్ అయ్యారు. ఇది గ్రహించిన రాహుల్‌గాంధీ 2015లో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఆన్లైన్ ప్రచారంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికలనాటికి 15.5 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తూ ఉంటే, ఇప్పుడు వారి సంఖ్య ఏకంగా 45 కోట్లకు చేరుకుంది. ఈసారి ఎన్నికల్లో దాదాపుగా 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఓటర్లలో సగం మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారన్న మాట. గత ఎన్నికల సమయానికి ఫేస్బుక్, ట్విట్టర్ మాత్రమే ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్ కూడా వచ్చింది. ఈ మూడు మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్‌లు సన్నద్ధమవుతున్నాయి. మోదీతో పోటీ అంత తేలిక కాదు మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వెనుక సోషల్ మీడియా పాత్ర చాలా ఉంది. రైతు, నిరుద్యోగ సమస్యల వంటి వాటిని బాగా ప్రస్తావించడానికి ట్విట్టర్‌ను వేదికగా చేసుకున్న రాహుల్ టెక్కీ మ్యాన్‌గా మారారు. కానీ, సోషల్ వార్‌లో మోదీతో పోటీ అంత సులువేం కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఫాలోయింగ్ కలిగిన నేతల్లో ఒకరైన మోదీని ఫేస్బుక్లో 4.3 కోట్ల మంది, ట్విట్టర్లో 4.5 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. రాహుల్‌ను ట్విట్టర్లో 81 లక్షల మంది, ఫేస్బుక్లో 22 లక్షల మంది మాత్రమే ఫాలో అవుతున్నారు. అయితే ట్వీట్లు, రీట్వీట్లు, ట్వీట్లకి ఇచ్చే రిప్లయ్‌ల విషయంలో మోదీతో రాహుల్ పోటీపడుతున్నారు. బీజేపీ ఇప్పటికే జిల్లా, మండల స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ సోషల్ మీడియా వార్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌కు రాష్ట్రస్థాయిలో మాత్రమే సైబర్ సైన్యం ఉంది. వాట్సాప్ వినియోగం ఎక్కువయ్యాక ఎక్కువగా వ్యాప్తి అవుతున్న తప్పుడు వార్తలను ఎదుర్కోవడమే పార్టీలకు అతి పెద్ద సవాల్. ఉన్నవీలేనివీ కల్పించి పోస్టులు షేర్ చేయడం, ప్రసంగాలను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి ప్రచారం చేయడం వంటివి ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉంటూ కౌంటర్ ఇవ్వగలగాలి. ఈ విషయంలో కాంగ్రెస్‌కంటే బీజేపీ ముందుంది. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో కాంగ్రెస్ కూడా సోషల్ మీడియాపై పట్టు సాధించడానికి సమాయత్తమవుతోంది. మొత్తం ఓటర్లు అంచనా : 90,00,00,000 స్మార్ట్‌ఫోన్ వాడేవారు : 45,00,00,000 ఫేస్బుక్ యూజర్స్ :30,00,00,000 వాట్సాప్ యూజర్స్ : 20,00,00,000 ట్విట్టర్ యూజర్స్ : 3,04,00,000 -
సంక్షేమం సమర్థతకు సమ ప్రాధాన్యం
‘తొలి ప్రాధాన్యత.. మలి ప్రాధాన్యత అంటూ లేదు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రాధాన్యాలే. కాకపోతే ఫ్లాగ్షిప్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా’ అని కలెక్టర్ లోకేశ్‌కుమార్ స్పష్టం చేశారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. సర్కారు భూములను కబ్జా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. రంగారెడ్డి విశిష్టత కలిగిన పెద్ద జిల్లా అని, ఇతర జిల్లాలతో దీనిని పోల్చలేమని, ఇక్కడ సగం సమస్యలు రెవెన్యూ అంశాలకు సంబంధించినవే ఉంటాయన్నారు. దీంతో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్‌కుమార్ బుధవారం ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. –సాక్షి, రంగారెడ్డి: జిల్లా ప్రతినిధి ఇక్కడ ప్రధాన సమస్య రెవెన్యూ వివాదాలు. నగరీకరణతో ప్రభుత్వ భూములను కాపాడటం కత్తిమీద సాములాంటిది. మొన్నటి వరకు పనిచేసిన ఖమ్మం జిల్లాలో వంద కేసుల్లో కేవలం పదింటిపైనే న్యాయపరమైన చిక్కులుండేవి. 90శాతం జిల్లా స్థాయిలోనే పరిష్కారం అయ్యేవి. ఇదే రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే వంద శాతం కోర్టుకెక్కుతున్నాయి. విలువైన భూములు కబ్జా కాకుండా రెవెన్యూ యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరముంది. అక్రమార్కులు న్యాయస్థానం మెట్లెక్కకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తే సగం కేసులకు కళ్లెం వేయవచ్చు. ప్రజల దరికి సంక్షేమ ఫలాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయడం కలెక్టర్‌గా నా బాధ్యత. విధులను సక్రమంగా నిర్వర్తిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా (ఫ్లాగ్షిప్) భావించే కార్యక్రమాలకు పెద్దపీట వేస్తాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కంటి వెలుగు, రైతు బంధు, రైతు బీమా తదితర కార్యక్రమాలు నిర్ణీత గడువులోగా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటా. ఉత్తీర్ణతా శాతం పెంపుపై ప్రత్యేక డ్రైవ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందే.. ప్రతి ఉద్యోగికీ అంకితభావం, జవాబుదారీతనం ముఖ్యం. వృత్తిలో రాణించాలంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిందే. బాగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం.. వెనుకబడ్డవారిని మెరుగు పరుచుకోవాలని సూచిస్తాం. అయినా, పనితీరు సంతృప్తికరంగా లేకపోతే చర్యలకు వెనుకాడం. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఉద్యోగుల పనితీరును స్వయంగా తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తాం. పమాణాలను మెరుగుపరిచేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తా. ఈ నెలాఖరు నుంచే పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంచే అంశంపై ఉపాధ్యాయులకు లక్ష్యాలను నిర్దేశిస్తా. నిరంతరం సమీక్షిస్తా. కేవలం చదువేగాకుండా.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్కూలు దుస్తులు, పుస్తకాల పంపిణీలో అవకతవకలు చోటుచేసుకుండా చర్యలు తీసుకుంటా. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేసుకునేలా ప్రోత్సహిస్తూ కార్పొరేట్ తరహాలో మౌలిక సదుపాయాలు కల్పిస్తా. ప్రసూతి కేంద్రాలను పెంచడమేగాకుండా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చొరవ చూపుతా. -
‘స్వచ్ఛ’ మార్పు వచ్చేనా..?
ఆదిలాబాద్‌అర్బన్: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలతో ముందడుగు వేస్తున్నాయి. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా గ్రామానికో ‘స్వచ్ఛ గ్రహీ’ని నియమించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సదరు అభ్యర్థి ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే స్వచ్ఛగ్రహీ ఉద్యోగానికి ఎంపిక చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది. ఎంపికైన వారికి ఐదు రోజులపాటు శిక్షణ ఇచ్చి, సంబంధిత కిట్‌ను అందజేస్తారు. కాగా, జిల్లాలో ఇటీవల కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలతోపాటు అన్ని పంచాయతీల్లో ఆగస్టు 15 నుంచి స్వచ్ఛతకు పెట్టపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో స్వచ్ఛగ్రహీల నియమకాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా, ప్రభుత్వం త్వరలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ పోస్టులకు ఎక్కువగా గ్రామీణ అభ్యర్థులు పోటీ పడుతారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డి ఉంటేనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగానికి ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో 2017లో నిర్వహించిన సర్వే ప్రకారం 1,08,758 నివాస గృహాలు ఉన్నాయి. ఇందులో 39,092 నివాస గృహాలు వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉన్నట్లు తేలింది. మిగతా 69,666 నివాస గృహాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని తేల్చారు. దీని ప్రకారం జిల్లాలో 69,666 వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేశారు. ఇందుకు రూ.40.78 కోట్లు అవసరమని అంచనా వేశారు. అంటే ఒక్కటి కూడా మిగలకుండా జిల్లాలోని అన్ని నివాస గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇది జరిగి ఏడాదిన్నర గడుస్తున్నా.. మంజూరైన మరుగుదొడ్లలో సగం కూడా పూర్తి కాలేదు. కేవలం 20,473 మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. ఇంకా 47,318 నివాస గృహాల్లో మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉన్నా.. ప్రభుత్వం నుంచి స్వచ్ఛతకు సరిపడా నిధులు రాక నిర్మాణాలు వెనుకబడిపోయాయి. ‘బహిరంగ మలవిసర్జన రహిత’(ఓడీఎఫ్) జిల్లాగా తీర్చి దిద్దేందుకు రూ.40.78 కోట్లు అవసరం ఉందని అంచనా వేయగా, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూ.16.20 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మిగతా రూ.24.58 కోట్లు విడుదల చేయక పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, 243 పాత గ్రామ పంచాయతీల పరిధిలోని 589 గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత(ఓడీఎఫ్) గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. గ్రామాలను ఓడీఎఫ్‌గా చేసిన ఎంపీడీవోలు, సర్పంచ్‌లు, ఇతర అధికారులకు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున అవార్డులు, నగదు బహుమతులు అందజేస్తూ వస్తున్నా.. మార్పు కన్పించడం లేదు. జిల్లాలోని 9 గ్రామ పంచాయతీల పరిధిలో గల 18 గ్రామాలు మాత్రమే ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించారు. మిగతా 234 గ్రామ పంచాయతీల పరిధిలోని 448 గ్రామాలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాల్సి ఉంది. కాగా, 78 పంచాయతీల పరిధిలోని 123 ఓడీఎఫ్ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ప్రొగ్రెస్‌లో ఉన్నాయి. గ్రామానికో ‘స్వచ్ఛగ్రహీ’ పంచాయతీల్లో ప్రత్యేక పాలన మొదలైనప్పటికీ నుంచి ప్రభుత్వం పరిశుభ్రతపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచేందుకు మూడు నెలల కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఇటీవల అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇందుకు గ్రామానికో స్వచ్ఛగ్రహీని నియమించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించడంతో ప్రాధాన్యతను సంతరించకుంది. గ్రామాలకు ఎంపికైన స్వచ్ఛగ్రహీలకు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ఓడీఎఫ్ గ్రామంగా ప్రకటించిన తర్వాత గ్రామస్తులు మలవిసర్జనకు ఆరుబయటకు వెళ్తున్నదీ.. లేనిదీ.. ఇంటింటికి వెళ్లి పరిశీలించినందుకు ఒక్కో ఇంటికి రూ.25 చొప్పున స్వచ్ఛగ్రహీలకు అందజేస్తారు. ఈ లెక్కన మరుగుదొడ్డికి మరమ్మతులు చేసుకునేలా చైతన్యపరిస్తే, మరుగుదొడ్డి విస్తరణ పనులు చేయించగలిగితే ఒక్కోదానికి రూ.25 చొప్పున, గోబర్‌గ్యాస్ వంటి ప్లాంట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తే రూ.200 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేయనుంది. ఇవే కాకుండా పాఠశాలలు, అంగన్వాడీలు, పీహెచ్‌సీల్లో పరిశుభ్రంగా ఉండేలా చూడడం, ఓడీఎఫ్ రోజు అమలు చేయడం, అంకితభావంతో పని చేసే వారికి సత్కరాలు, అవార్డులు ఇవ్వడంతోపాటు స్వచ్ఛగ్రహీల ఉద్యోగాలు శాశ్వతం కాదనే విషయంపై అవగాహన కల్పించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించడం ఇక్కడ గమనించదగ్గ విషయం. -
అవ్వ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు
సాక్షి, సిరిసిల్ల : గత ప్రభుత్వాలు రైతుల వెన్నెముక విరిచేశాయని వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్లా జిల్లాలో పర్యటించిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణలో రైతులు ఆత్మగౌరవంతో జీవించాలనే గొప్ప లక్ష్యంతో రైతు బంధు పథకం ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టారని అన్నారు. రాష్ట్రంలో 58 లక్షల మంది రైతుల దగ్గర కోటి 42 లక్షల భూమి ఉన్నట్లు తేలిందన్నారు. రాష్ట్రంలో రైతే రాజ్యం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో అవ్వ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్న చందంగా ప్రతిపక్షాల పని ఉందని ఎద్దేవా చేశారు. కల్యాణ లక్ష్మి, కేసీఆరకిట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బంధు పథకాలు ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టారని, కాంగ్రెస్ నేతల్లా పార్టీలు చూసుకొని అమలు చేయట్లేదంటూ దుయ్యబట్టారు. పార్టీలకు అతీతంగా సీఎం పథకాలు ప్రవేశపెట్టారని, తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. నేడు తెలంగాణలో పండుగ వాతావరణం కొనసాగుతోందన్నారు. రైతులు సకాలంలో పంటలు పండించే విధంగా రైతు సమన్వయ సమితులు పనిచేయాలని సూచించారు. -
జనం మనోగతం తెలుసుకునేందుకు సీఎం సర్వే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలేమనుకుంటున్నారు.. వాటితో ఎంతమంది లబ్ధి పొందారు.. ఇవన్నీ ఎన్నికల్లో ఓట్లు తెచ్చిపెడతాయా.. వీటన్నింటిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరా తీస్తున్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ, గొర్రెలు, చేపల పంపిణీ పథకాల అమలు ఎలా ఉందో తెలుసుకునేందుకు సర్వే చేయిస్తున్నారు. పంట రుణాల మాఫీతో ప్రయోజనం పొందిన రైతులు ఏమనుకుంటున్నారు? వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌పై ఫీడ్ బ్యాక్ ఏంటీ? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై జనం మనోగతం ఎలా ఉందన్న అంశాలపై రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిపేందుకు సన్నాహాలు చేశారు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలతోపాటు ప్రైవేటు ఏజెన్సీలకు ఈ బాధ్యతలు అప్పగించారు. కొన్ని ఏజెన్సీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఏ పథకం ఎలా ఉంది? వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే పథకాల్లో అవినీతి చోటుచేసుకుంటోందన్న ఫిర్యాదులు వస్తున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఆసరా ఫించన్ల పంపిణీ పథకానికి తొలి మూడేళ్లు విశేషమైన ఆదరణ ఉన్నట్లుగా గుర్తించింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులతోపాటు బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు నెలనెలా జీతాల తరహాలోనే పింఛన్లు పంపిణీ చేసిన తీరు మంచిపేరు తెచ్చిపెట్టింది. దాదాపు 36 లక్షల మందికి లబ్ధి చేకూర్చే పథకం కావటంతో ప్రభుత్వం దీన్ని పక్కాగా అమల్లో పెట్టింది. కానీ గతేడాదిగా పథకం అమలు తీరు అస్తవ్యస్తంగా మారింది. మొదటి వారంలో అందే పింఛన్లు ఒక్కో నెలలో చివరి వారం వరకు చేతికందటం లేదు. దీంతో లబ్ధిదారుల్లో కొంత అసంతృప్తి నెలకొంటోందని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్), కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లోనూ అవినీతి పెరిగిందనే వాదనలు అధికార పార్టీలో వినిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ పథకం అమలు కూడా పక్కదారి పట్టింది. కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించేందుకు నిరాకరిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. మరికొన్ని ఆస్పత్రులు ముందుగానే సొమ్ము కట్టించుకుని, సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు తెచ్చుకొమ్మంటూ రోగి బంధువులపై ఒత్తిడి తెస్తున్నారు. ‘పెట్టుబడి’లో అవినీతికి చోటే ఉండొద్దు సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న కోణంలోనూ సర్వే చేయిస్తున్నారు. గతేడాది ప్రభుత్వం పెద్దఎత్తున గొర్రెల పంపిణీని చేపట్టింది. వివిధ ప్రాంతాల్లో భారీగా గొర్రెల రీసైక్లింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. నిరుడు చేపల పెంపకం పథకాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ రెండు పథకాలతో నిజంగానే లబ్ధి చేకూరిందా? లబ్ధిదారులేమనుకుంటున్నారు? అని సర్వేలో అడిగి తెలుసుకోనున్నారు. ఏయే పథకాల్లో ఎంత మేరకు అవినీతి జరిగిందన్న కోణంలోనూ సర్వేను డిజైన్ చేశారు. దేశంలో తొలిసారిగా వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే పథకాన్ని వచ్చే ఖరీఫ్ నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సాయంపైనా రైతుల అభిప్రాయాలు తెలుసుకోవాలని సీఎం పురమాయించినట్లు తెలిసింది. అవినీతికి తావు లేకుండా ఈ డబ్బు రైతుల ఖాతాల్లో చేర్చేందుకు వీలైనన్ని అభిప్రాయాలు సేకరించాలని సూచించినట్లు సమాచారం. -
వలస జీవులకు వరం.. కేరళ ప్రవాసీ విధానం
అరబ్ గల్ఫ్ దేశాలలో కేరళ రాష్ట్రవాసులు (మళయాళీలు) లేని సంస్థ దాదాపు ఉండదని చెప్పవచ్చు. వంద శాతం అక్షరాస్యత, ఎంత దూరమైనా వలసవెళ్లి జీవించే తత్వంతో వారికి గల్ఫ్‌లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. కేరళ మైగ్రేషన్ సర్వే ప్రకారం 22 లక్షల మంది మలయాళీలు విదేశాలలో ఉన్నారు. వీరిలో 90 శాతం గల్ఫ్ దేశాలలోనే నివసిస్తున్నారు. అంతర్గత, అంతర్జాతీయ ప్రవాసుల సమస్యలను ఆకళింపు చేసుకున్న కేరళ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే వినూత్నమైన ప్రవాసీ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. 1996 డిసెంబర్ 6న కేరళ రాష్ట్ర ప్రభుత్వం డిపార్టుమెంట్ ఆఫ్ నాన్ రెసిడెంట్స్ కేరలైట్స్ అఫైర్స్ (నోర్కా) అనే సంస్థను స్థాపించింది. ‘నోర్కా’ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ‘నోర్కా రూట్స్’ అనే ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేశారు. భారత దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఉన్న, విదేశాలలో ఉన్న కేరళ ప్రవాసుల సమస్యల పరిష్కారానికి, వారితో స్థిరమైన భాగస్వామ్యానికి ‘నోర్కా’ ఏర్పాటు చేశారు. ప్రవాసుల సంక్షేమం కోసం ఇలాంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం భారతదేశంలోనే ప్రథమం. 351 మంది సభ్యులతో ‘లోక కేరళ సభ’ నూతనంగా ఏర్పాటు చేసిన ‘లోక కేరళ సభ’ (ప్రపంచ కేరళ వేదిక) తొలి సమావేశాలు ఈనెల 12, 13న కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగాయి. ముఖ్యమంత్రి పి.విజయన్ ఈ సమావేశాలను ప్రారంభించారు. ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రవాస భారతీయులు, ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్నవారు, శాస్త్రవేత్తలు, మేధావులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేరళీయులను మాతృభూమి కేరళతో సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ, ఆర్థికంగా అనుసంధానపరిచే యోచనతో 351 మందితో కూడిన ‘లోక కేరళ సభ’ (ఎల్‌కేఎస్)ను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. ప్రవాసీ కేరళీయులు కష్టాలను, ఆకాంక్షలను తెలుపుకోవడానికి, వారి నైపుణ్యాన్ని, అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధికి వాడుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. ప్రవాసీ గుర్తింపు కార్డు, ఇన్సూరెన్స్ ప్రవాసీ కేరళీయులకు ‘ప్రవాసీ గుర్తింపు కార్డు’ ఇచ్చే పథకం ఆగస్టు 2008లో ప్రవేశపెట్టారు. విదేశాల్లో కనీసం ఆరు నెలలు నివాసం ఉండి, 18 ఏళ్ల వయస్సు పైబడిన వారికి మూడేళ్లు చెల్లుబాటు అయ్యేట్లుగా కార్డులు జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300. ది న్యూ ఇండియా అస్సూరెన్స్ కంపెనీ రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పిస్తుంది. కనీసం ఐదేళ్లపాటు నెలనెలా పొదుపు చేసుకుని.. 60 ఏళ్ళు నిండినవారు పెన్షన్‌కు అర్హులు. సభ్యుడు చనిపోయిన తర్వాత జీవిత భాగస్వామికి కుటుంబ పెన్షన్ వస్తుంది. అనారోగ్యం లేదా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందుతుంది. తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు, ఆడపిల్లల పెళ్లికి, మహిళా సభ్యుల ప్రసూతికి ఆర్థికసాయం అందిస్తారు. అదేవిధంగా నివాస గృహాల నిర్మాణానికి, కొనుగోలుకు, ఖాళీ స్థలాల కొనుగోలుకు రుణ సౌకర్యం కల్పిస్తారు. పిల్లల చదువుకు (ఉన్నత విద్యతో సహా), శాశ్వత అంగవైకల్యం వలన విధులు నిర్వర్తించలేని వారిని ఆదుకుంటారు. 60 ఏళ్ళు నిండిన తర్వాత అంతర్జాతీయ ప్రవాసులు నెలకు రూ.ఒక వెయ్యి నుంచి రెండు వేలు, అంతర్గత ప్రవాసులు రూ.500 నుంచి రూ.ఒక వెయ్యి వరకు పెన్షన్ ఇస్తారు. సభ్యుడు మరణిస్తే వారసులకు అందులో సగం చెల్లిస్తారు. వివిధ పథకాల అమలులో ఆదర్శం నోర్కా లక్ష్యాల్లో కొన్ని.. ప్రవాసీ కేరళీయుల సంక్షేమం, విదేశాల్లో ఉన్నవారితో, రాష్ట్రంలో ఉన్నవారితో సాంస్కృతిక మార్పిడి, సాంఘిక భద్ర తకు యంత్రాగం ఏర్పాటు. అవసర మున్నవారిని ఆదుకోవడానికి సహాయ నిధి ఏర్పాటు, వార్షిక సదస్సులు ఏర్పాటు చేయడం, వాపస్ వచ్చినవారికి పునరావాస, పునరేకీకరణ కార్యక్రమాలు, ఉద్యోగ ప్రణాళిక, నైపుణ్య శిక్షణ, అభివృద్ధి, విశిష్ట నైపుణ్యం కలిగినవారితో మానవ వనరుల సమూహాన్ని ఏర్పాటు చేయడం, ఉద్యోగార్థుల, ఎన్నారైల డేటా బ్యాంకు (సమాచార నిధి) ఏర్పాటు, రాష్ట్రానికి పెట్టుబడులను సేకరించడం, అక్రమ రిక్రూటింగ్ ఏజెన్సీలను నియంత్రించడం. నోర్కా రూట్స్ సేవలు ఇలా.. విదేశాల్లో 46 ప్రవాసీ మలయాళీ సంఘాలు, ఇతర రాష్ట్రాలలో కూడా కొన్ని సంఘాలు నోర్కా గుర్తింపు పొందాయి. రెండేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. ఒక రోజు ప్రి డిపార్చర్ ఓరియెంటేషన్ ట్రైనింగ్ (పీడీఓటీ) ఇస్తారు. దీంట్లో ప్రయాణ ముందస్తు పరిస్థితులు విదేశాలలో ఉండే విధానాలపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తు న్నారు. విదేశాల నుంచి వాపస్ వచ్చినవారు స్వస్థలాలలో స్థిరపడటానికి నోర్కా రూట్స్ సంస్థ పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నది. రూ.20 లక్షల విలువైన ప్రాజెక్టులకు 15 శాతం పెట్టుబడి రాయితీ, వడ్డీలో 3 శాతం రాయితీ కల్పిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికులకు తగిన అవగాహన, శిక్షణ కల్పిస్తు న్నారు. ప్రవాసీలు వారి మాతృభూమి అభివృద్ధిలో పాలుపంచు కోవడానికి మై విలేజ్ – మై డ్రీమ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. కేరళ ప్రవాసీ వెల్ఫేర్ బోర్డు కేరళ ప్రభుత్వం ‘ది నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వెల్ఫేర్ యాక్ట్ 2008’ను తెచ్చింది. ఈ చట్టం పరిధిలో ‘నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటైంది. దీనిని కేరళ ప్రవాసీ వెల్ఫేర్ బోర్డు, ప్రవాసీ వెల్ఫేర్ ఫండ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. విదేశాలలో కనీసం రెండేళ్లపాటు పనిచేసి వాపస్ వచ్చినవారు ఇందులో సభ్యత్వం తీసుకోవచ్చు. పెన్షన్, కుటుంబ పెన్షన్, వైద్య సహాయం, ఎక్స్‌గ్రేషియా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఈ చట్టంలో పొందుపర్చారు. వెల్ఫేర్ ఫండ్‌లో 2.25 లక్షల మంది పైగా సభ్యులున్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం 15 మంది సభ్యుల తో కేరళ ప్రవాసీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ బోర్డులో ఐదుగు రు ఎన్నారైలు (కువైట్, సౌదీ, యూఏఈ, ఒమన్, ఖతార్ దేశాల నుంచి ఒక్కొక్కరు), ఇద్దరు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు, కార్మిక, ఆర్థిక, న్యాయ శాఖల అధికారులు, రిక్రూటింగ్ లైసెన్సులు కలిగిన ఓవర్సీస్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ – ఒడెపెక్, నోర్కా రూట్స్ అనే రెండు ప్రభుత్వరంగ సంస్థల అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ చిత్ర దర్శకుడు, కైరళి టీవీలో ప్రవాసలోకం అనే కార్యక్రమ వ్యాఖ్యాత పి.టి.కుంజు మహ్మద్ ను చైర్మన్‌గా నియమించారు. కేరళ ప్రవాసీ సంక్షేమ బోర్డులో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపువారు చేరడానికి అర్హులు. సభ్యులు విదేశాల్లో ఉన్నప్పుడు నెలకు రూ.300, ఇండియాకు వాపస్ వచ్చిన తర్వాత నెలకు రూ.100 పొదుపు చేయాలి. ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు నెలకు రూ.100 పొదుపు చేయాలి. విదేశాలలో ప్రస్తుతం పనిచేస్తున్నవారు, విదేశాల నుంచి వాపస్ వచ్చినవారు, ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్నవారు, ఇతర రాష్ట్రాల నుంచి కేరళకు వాపస్ వచ్చినవారు అనే నాలుగు రకాల సభ్యత్వాలు ఉన్నాయి. ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకుల ద్వారా రూ.200 చెల్లించి సభ్యులుగా చేరవచ్చు. స్వాంతన ప్రవాసీ కేరళీయులు విదేశాల నుంచి వాపస్ వచ్చి కష్టాల్లో ఉంటే వారిని ఆదుకోవడానికి ‘స్వాంతన’ ఆర్థిక సహాయ పథకం ప్రవేశపెట్టారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న, దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) కుటుంబాలను ఈ పథకం ద్వారా ఆదుకుంటారు. రిటర్నీలు (వాపస్ వచ్చినవారు), వారి కుటుంబ సభ్యులకు నాలుగు రకాలుగా సహాయం చేస్తారు. రిటర్నీలు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వైద్య చికిత్స ఖర్చులు అందిస్తారు. కుటుంబ సభ్యులు మరణించినప్పుడు సహాయం చేస్తారు. కనీసం రెండు సంవత్సరాలు విదేశాల్లో గానీ, రాష్ట్రం బయటగానీ నివసించినవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వారు పనిచేసిన కాలం కానీ, 10 సంవత్సరాలు కానీ ఏది తక్కువైతే అది వర్తిస్తుంది. వార్షి క ఆదాయం ఒక లక్ష రూపాయల లోపు ఉండాలి. సహాయం కోసం దరఖాస్తు చేసేనాటికి ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ పథకం వర్తించదు. ఎక్స్‌గ్రేషియా లక్ష రూపాయ లు. క్లిష్టమైన పరిస్థితులలో వైద్య సహాయం రూ.50 వేలు (కాన్సర్, గుండె, మూత్ర పిండా లు, పక్షవాతం, ప్రమాదాలలో తీవ్రమైన అంగ వైకల్యం). ఇతర రకాల చికిత్సకు రూ.20 వేలు, పెళ్లి ఖర్చులకు 15 వేలు, కృత్రిమ అవయవాలకు రూ.10 వేలు అందిస్తారు. కారుణ్యం మృతదేహాలను కేరళకు చేర్చడానికి ‘కారుణ్యం’ పేరిట ఒక నిధిని ఏర్పాటు చేశారు. శవాల తరలింపునకు విదేశాల నుంచి రూ.50 వేలు, ఇతర రాష్ట్రాల నుంచి రూ.15 వేలు సహాయం చేస్తారు. చట్టబద్ధమైన ప్రవాసులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కంపెనీ నుంచి, ఇండియన్ ఎంబసీ నుంచి ఎలాంటి సహాయం అందని పరిస్థితులలో మాత్రమే ఈ పథ కం వర్తిస్తుంది. సర్టిఫికెట్ అటెస్టేషన్ ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం చైర్మన్ ఫండ్‌కు జమచేస్తారు. స్వాంతన లాంటి ఎలాంటి పథకాలలో లబ్ధిచేకూరని వారు చైర్మన్ ఫండ్ ద్వారా సహాయం పొందవచ్చు. ఈ పథకాలే కాకుండా ఎస్పీ స్థాయి అధికారి పర్య వేక్షణ లో కేరళ పోలీస్ ఎన్నారై సెల్ పనిచేస్తుంది. ప్రవాసీ కేరళీయులు తమ ఫిర్యాదుల ను కేరళ పోలీస్ ఎన్నారై సెల్ spnri.pol@kerala.gov.inకు పంపవచ్చు. (మంద భీంరెడ్డి, అధ్యక్షులు, ప్రవాసీ మిత్ర email: mbreddy.hyd@gmail.com) సౌదీలో హెల్ప్‌లైన్ సౌదీ అరేబియాలో నివసించే ప్రవాస భారతీ యులకు సహాయం, సలహాల కోసం రియాద్‌లోని ఇండియన్ ఎంబసీ టోల్ ఫ్రీ నెంబర్ 800–247–1234 కు కాల్ చేయవచ్చు. భారత్‌లో ఉన్నవారు 00966–11–4884697 కు కాల్ చేయాలి. కాన్సులార్ టూర్లో భాగంగా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది ఈ నెల 23, 26 తేదీలలో జుబెల్ పట్టణంలోని విఎస్ఎఫ్ సెంటర్లో ఎన్నారైలను కలుసుకుంటారు. ఎన్నారైలు పాప్‌పోర్ట్, దౌత్య సంబంధ సేవలు గురించి, వేతనాలు తదితర సమస్యల గురించి అధికారులకు దరఖాస్తులు సమర్పించవచ్చు. లేబర్ క్యాంపుల్లో అవగాహన యూఏఈ దేశంలోని అబుదాబి, దుబాయి, షార్జా తదితర ప్రాంతాల లోని లేబర్ క్యాంపులలో ‘భారతీ య కార్మికుల వనరుల కేంద్రం’ (ఇండియన్ వర్కర్స్ రీసోర్స్ సెంటర్ – ఐడబ్ల్యూఆర్సీ) వారు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. టెలిఫోన్ కాల్స్ కుంభకోణంలో చిక్కుకోకుండా సిమ్ కార్డులను జాగ్రత్తపర్చు కోవాలని, స్థానిక చట్టాలను పాటించాలని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు కార్మి కులకు సూచిస్తున్నారు. మానసిక ఒత్తిడి, ఆర్థిక క్రమశిక్షణ గురించి కూడా వివరిస్తున్నారు. కార్మి కుల పలురకాల ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఫేస్బుక్ లైవ్‌లో చూపిస్తున్నారు. సలహాల కోసం 800 4632 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్చేయ వచ్చు. మరిన్ని వివరాలకు http://iwrcuae.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. -
పథకాలు అధికార పార్టీవారికే: రఘువీరారెడ్డి
అనంతపురం అర్బన్: రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కరాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్‌ను శనివారం కలిసి జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలను జన్మభూమి కార్యక్రమం ప్రారంభించేలోగా పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మడకశిర, కళ్యాణదుర్గం, పెనుకొండ నియోజకవర్గాల పరిధిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నామన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, పంట నష్ట పరిహారం, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ బిల్లులు రాక వేలాదిమంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. సీఎంఓ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, మీ కోసం, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలు లక్షల్లో తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారన్నారు. అయితే అవేవీ పరిష్కారం కావడం లేదని రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అమలులోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ పథకాలకు పేదరికం అర్హతగా చూడడం లేదని, అధికార పార్టీకి చెందిన వారికే అందుతున్నాయని ఆరోపించారు. ఇతర పార్టీల వారికి ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారని, ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదన్నారు. జన్మభూమి ప్రారంభమయ్యేలోగా సమస్యలు పరిష్కరించకుంటే ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పోరాటాలు సాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు కోట సత్యనారాయణ, నగర అధ్యక్షుడు దాదాగాంధీ ఉన్నారు. -
ఈ విషయంలో ప్రధాని మోదీ దిట్ట!
సాక్షి, న్యూఢిల్లీ : పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టడంలో పెద్ద దిట్ట మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ విషయంలో ఆయనకు ఆయనే సాటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలోని భారతీయులందరికి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఆయన సోమవారం నాడు సౌభాగ్య స్కీమ్ లేదా ‘ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ప్రతి మారుమూల ప్రాంతంలో ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని కూడా ఆయన తన ప్రసంగంలో పక్కాగా చెప్పారు. ప్రభుత్వం ప్రతి పేద వాడి ఇంటికెళ్లి విద్యుత్ కనెక్షన్ ఇస్తుందని, అందుకయ్యే ఖర్చును పేదవాడు భరించే పరిస్థితుల్లో లేడు కనుక దాదాపు 16,000 కోట్ల రూపాయల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన చెప్పారు. వాస్తవానికి చెప్పాలంటే ఈ పథకంలో కొత్తదనమేమీ లేదు. ఇదే లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వమే 2015, జూలై నెలలో ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన’ పథకాన్ని ప్రారంభించింది. పేద ప్రజలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని, అలా ఇచ్చే రాష్ట్రాలకు అందుకయ్యే ఖర్చును సబ్సిడీల రూపంలో చెల్లిస్తామని ఈ పథకం కింద మోదీ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి అప్పటికే దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద ప్రజల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ‘రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ యోజన’ పథకం కింద సబ్సిడీలను చెల్లిస్తోంది. ఈ రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ పథకాన్ని 2005లో అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నాటి పథకమే నీటి పథకం కాదా? ఈ లెక్కన 2005 సంవత్సరం నాటి పథకాన్ని మోదీ ప్రభుత్వం 2015 సంవత్సరంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజనగా పేరు మార్చగా, అదే మోదీ ప్రభుత్వం అదే పథకాన్ని ఇప్పుడు సౌభాగ్య స్కీమ్ కింద పేరు మార్చింది. పేరు మార్చినందుకు పథకంలో కొద్ది మార్పులైన ఉండాలనుకున్నారేమో దారిద్య్ర రేఖకు ఎగువనున్న వారు 500 రూపాయలు చెల్లిస్తే విద్యుత్ కనెక్షన్ ఇస్తామని, దాన్ని కూడా పది వాయిదాల్లో చెల్లించవచ్చని చెప్పారు. మొబైల్ ప్రీ పెయిడ్ చార్జిల్లాగా వీరికి ప్రీపెయిడ్ మీటర్లను మంజూరు చేస్తామని లింకు పెట్టారు. ఈ లింక్‌లో ఉన్న కిటుకేమిటో మాత్రం ప్రధాని నరేంద్ర మోదీగానీ, ఆయన చెప్పినట్లుగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌గానీ వివరించలేదు. మొత్తం పదివాయిదాలు, అంటే 500 రూపాయలను చెల్లించాక ప్రీ పెయిడ్ మీటర్లను మంజూరు చేస్తారా, ఒక్క వాయిదా, అంటే అందులో 50 రూపాయలను చెల్లించగానే కనెక్షన్ ఇస్తారా? ప్రీ పెయిడ్ కనీస చార్జీలు ఎంత ఉంటాయి? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ప్రాథమిక ఒక కిలోబాట్ విద్యుత్ కనెక్షన్‌కు రైల్వే లైన్ల ఖర్చును కలుపుకొని 810 రూపాయలు అవుతుండగా, ఇతర రాష్ట్రాల్లో ప్రాథమిక కనెక్షన్‌కు 1460 రూపాయలు ఖర్చు అవుతున్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో 500 రూపాయలకే మోదీ ప్రభుత్వం ఎలా విద్యుత్ కనెక్షన్‌ను మంజూరు చేయగలదు? ఇప్పటికే విద్యుత్ లైన్లు ఉండి దారిద్య్ర రేఖకు ఎగువన నివసిస్తున్న ప్రజలు విద్యుత్ కనెక్షన్ తీసుకోవడం లేదని ప్రభుత్వం భావిస్తుందా? అన్న సందేహం ఇక్కడ కలుగుతుంది. వాస్తవానికి దేశంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు లేకపోవడం వల్లనే ప్రజలు విద్యుత్ కనెక్షన్లు తీసుకోలేక పోతున్నారు. సరాసరి ఇంటికి ఓ వెయ్యి రూపాయలు లేక వారు విద్యుత్ కనెక్షన్‌కు వెరవడం లేదు. విద్యుత్ లైన్లు మంజూరు కాకనే అన్న విషయాన్ని కాకిని అడిగినా చెబుతుంది. విద్యుత్ లైన్ల కోసం వచ్చిన విజ్ఞప్తులు కుప్పలు తెప్పలుగా పడిఉన్న విషయం ప్రతి డివిజన్ స్థాయి విద్యుత్ కార్యాలయానికి వెళ్లి చూస్తే ఎవరికైనా తెలుస్తోంది. 4.53 కోట్ల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు లేవు ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో దాదాపు రెండు లక్షల గ్రామాలకు పూర్తిగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే దాదాపు 6,10,000 గ్రామీణులకు విద్యుత్ కనెక్షన్లు లేవు. ఇళ్లపరంగా చెప్పాలంటే 4.53 కోట్ల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు లేవు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లైనా ఇప్పటికీ నాలుగున్నర కోట్ల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేదా? అంటూ మోదీ సైతం ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసం పేదలకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం అందించేందుకు 16,320 కోట్ల రూపాయలు అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిందని, అందులో కేంద్ర ప్రభుత్వం 12,320 కోట్ల రూపాయలను తన వాటా కింద కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల కోసం ఇందులో 10.587 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కూడా చెప్పారు. 2011 జనాభా లెక్కల్లో ఈ వివరాలు లేవుగదా! గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కనెక్షన్లేని పేద వాళ్లను ఎలా గుర్తిస్తారన్న ప్రశ్నకు 2011 సంవత్సరం నాటి జనాభా డేటా ప్రకారం గుర్తిస్తామని కేంద్రం మీడియాకు వివరణ కూడా ఇచ్చింది. 2011 నాటి జనాభా డేటాలో విద్యుత్ కనెక్షన్లు ఉన్న ఇళ్లు, లేని ఇళ్లు అనే వివరాలు లేవన్న సంగతి ప్రభుత్వానికి తెలియదా! సరే ఇళ్లిళ్లు తిరిగి తెల్ల రేషన్ కార్డు ఆధారంగానో, ఆదాయ వివరాల ఆధారంగానో ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇస్తారని అనుకుందాం! 2018 సంవత్సరం డిసెంబర్ నెల నాటికి గ్రామీణ ప్రాంతాల పూర్తి విద్యుద్ధీకరణ కోసం దీన్‌దయాళ్ గ్రామ్ జ్యోతి యోజన కింద కేంద్రం 43,033 కోట్ల రూపాయలను 2015 సంవత్సరంలో కేటాయించినప్పుడే మొత్తం అయ్యే ఖర్చులో 30 శాతం నిధులకు ఇవి సమానమని విద్యుత్ శాఖకు చెందిన ఆర్థిక నిపుణలే అంచనా వేశారు. మరి ఇప్పుడు పేరు మార్చిన పథకం కింద విడుదల చేస్తున్న నిధులు ఎన్ని ఇళ్ల కనెక్షన్లకు సరిపోతాయి!? -
బలోపేతం దిశగా..
► టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు లక్ష్యం 81వేలు ► రెండేళ్లలో సార్వత్రిక, వచ్చే ఏడాదిలో పంచాయతీ ఎన్నికలు ► పార్టీని పటిష్టం చేసేందుకు ఎమ్మెల్యేల దృష్టి ► 21లోగా పూర్తి స్థాయి కమిటీల నియామకం ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఈ మూడేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం పార్టీ పటిష్టతపై అధిష్టానం దృష్టి సారించింది. పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత నిర్మాణం చేపట్టడంతో పాటు గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీలు వేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. జిల్లాలో రాష్ట్ర అటవీ, బీసీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎంపీ గోడం నగేశ్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని దాదాపు పూర్తి చేశారు. ఇక సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే గడువు ఉండడం, వచ్చే ఏడాది పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే పనిలో పడ్డారు. జిల్లాలో 81వేల సభ్యత్వ లక్ష్యం.. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడమే ప్రస్తుత కర్తవ్యంగా నేతలు ముందుకు సాగుతున్నారు. ఇందుకు తగ్గట్లుగానే లక్ష్యాలను పెట్టుకున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు కలిపి 81వేల సభ్యత్వాన్ని చేయాలని లక్ష్యంగా పెట్టిన అధిష్టానం బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించిం ది. ఇటీవలే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరుపై చే యించిన సర్వేలో జిల్లాకు చెందిన మంత్రి రామన్నకు 39.90శాతం, బోథ్ ఎమ్మెల్యే బాపురావుకు 36.10 శాతంతో తక్కువ ప్రజాదారణ పొందారు. ఈ నేపథ్యంలో గతం కంటే ఎక్కువ సభ్యత్వం నమోదు చేసి మళ్లీ కేసీఆర్ దృష్టిలో పడేందుకు వీరు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన లక్ష్యం దాదాపు పూర్తి కాగా.. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ సభ్యత్వం చేయిస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 35వేల లక్ష్యం కాగా.. ఇందులో సాధారణ సభ్యత్వం 28వేలు, క్రియాశీలక సభ్యత్వం 7వేలుగా నిర్ణయించారు. ఇక బోథ్ నియోజకవర్గంలో 30వేల సభ్యత్వం లక్ష్యం కాగా.. ఇందులో సాధారణ సభ్యత్వం 25,500, క్రియాశీలక సభ్యత్వం 4,500 నిర్ణయించారు. నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో 13వేలు సాధారణం, 3వేలు క్రియాశీలక సభ్యత్వం చేయించి లక్ష్యం చేరుకున్నారు. కమిటీల ఏర్పాటు.. రెండేళ్ల క్రితం పార్టీ సభ్యత్వం చేయించినా ఆ తర్వాత నూతన కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించలేదు. పాత కమిటీలనే కొనసాగిస్తూ వస్తుండడంతో కార్యకర్తలో నైరాశ్యం నెలకొంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వ కార్యక్రమాలకే సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తూ.. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలపై దృష్టి సారించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే గ్రామస్థాయిలో కమిటీలు వేస్తుండగా, 15, 16 తేదీల్లోపు మండల కమిటీలు, 21తేదీలోపు నియోజకవర్గ కమిటీలు పూర్తి చేయనున్నారు. పార్టీ పటిష్టత నేపథ్యంలో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2లక్షల ప్రమాద బీమా కల్పించడం కార్యకర్తలకు ధీమాగా మారింది. సభ్యత్వ నమోదులో ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉండేందుకు బీమా కల్పిస్తున్నామంటున్నారు. -
గొంతెండుతోంది..!
► మూలకు చేరిన బోర్లు ► గిరిజన గ్రామాల్లో పరిస్థితి దారుణం ► పనిచేయని తాగునీటి పథకాలు ► పెద్ద పథకాలకు నిధులు మంజూరుకావు ► చిన్న ప్రతిపాదనలకు కదలిక లేదు.. ►తాగునీటికి అల్లాడుతున్న జనం పనిచేయని పథకాలు 150 జిల్లాలో ఉన్న బోర్లు16,859 నిర్మాణంలో ఉన్న భారీ రక్షిత పథకాలు 6 సింగిల్ విలేజ్ స్కీంలు 1262 సమగ్ర మంచినీటి పథకాలు 29 మరమ్మతుల్లో ఉన్న బోర్లు 2,500 విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో అధిక సంఖ్యలో తాగునీటి పథకాలు, బోర్లు ఉన్నా ప్రయోజనం శూన్యమే. ప్రజలకు తాగునీటి వెతలు తీరడం లేదు. ప్రతి 250 మందికి ఒక తాగునీటి చేతిపంపు ఉండాలి. దీనికి రెండున్నర రెట్లు బోర్లు జిల్లాలో ఉన్నాయి. అందులో మరమ్మతులకు గురయినవే ఎక్కువ. క్రాష్ ప్రోగ్రాం అంటూ అధికారులు చేస్తున్న హడావుడి బోర్లు వరకు వెళ్లడం లేదు. పల్లెల్లోని చేతిపంపులు బాగు పడడం లేదు. మరమ్మతు పనులు అరకొరగానే సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పథకాలు ఉన్నా.. జిల్లాలో చాలా చోట్ల తాగునీటి పథకాలున్నా నీరు సరఫరా కావడం లేదు. బోర్లలో నీరు లేకపోవడం, ట్యాంకులకు నీరు చేరక పోవడం, పైప్లైన్ల లీకేజీలు ప్రజలకు శాపంగా మారాయి. నేటికీ జిల్లా ప్రజలుచెలమలు, నేలబావులపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలోని 928 పంచాయతీలకు తాగునీరు అందించేందుకు రూ.3,650 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అన్ని గ్రామాలకూ ఇంటింటికీ కుళాయి ప్రాతిపదికన పంపిన ప్రతిపాదనల్లో కనీసం కదలిక లేదు. రాష్ట్ర బడ్జెట్లో అసలు తాగునీటికి నిధులు మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. పెద్ద పథకాలు మంజూరు కావడం ఆలస్యమవుతుందని గ్రహించిన జిల్లా అధికారులు మరో 110 కోట్లతో కొద్దిపాటి మరమ్మతులతో పనిచేయగలిగే పథకాలకు ప్రతిపాదనలు పంపించారు. వీటికి కూడా ప్రభుత్వం నిధులు విదల్చడం లేదు. దీంతో జిల్లాలోని సుమారు 150 తాగునీటి పథకాలు మూలకు చేరాయి. కొత్త పథకాల్లో నాణ్యత డొల్ల ! జిల్లాలో ఆరు పథకాలు గత ఆరేళ్లుగా నిర్మాణంలోనే ఉన్నాయి. ఇటీవలే దత్తిరాజేరు, ఎస్. కోట పథకాలు పూర్తి చేశారు. పూర్తి చేసిన పథకాల్లో సామర్థ్యం కన్నా తక్కువ సైజ్ ఉన్న పైపులు వేయడంతో తాగునీరు అంద డం లేదు. దీంతో ఈ పథకం పరి«ధిలోని గ్రామాల్లో మంచి నీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జమదల, నర్సిపురం, పాచిపెంట, ఎస్.కోట రెండు ఫేజుల పథకాలు నేటికీ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. దత్తిరాజేరు, ఎస్.కోట–1 నిర్మాణాలు పూర్తయ్యాయని కాంట్రాక్టర్లు, అధికారులు చెబుతున్నా చివరి గ్రామాలకు తాగునీరు సరఫరా కావడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఎస్డీపీ గ్రాంట్లతో కొత్త స్కీంలు పెడుతున్నామని ప్రకటించినా పనులు మాత్రం జరుగ డం లేదు. ఇటీవల రూ.38 కోట్లతో 481 పనులు ప్రారంభిస్తే అందులో 155 మాత్రమే పూర్తి చేశారు. మిగతావి నత్తనడకన సాగుతున్నాయి. గొట్లాంలోని రక్షిత నీటి పథకం నుంచి 25 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉండగా నేటికీ పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదు. ఏజెన్సీల్లోని ప్రజలు వాగులు, చెలమల్లోని నీటితోనే దాహం తీర్చుకుంటున్నారు. సాలూరు మండలం గంజా యి భద్ర గ్రామంలో 200 మంది నివసిస్తున్నా వారికి మంచినీటి బోరు లేదు. దీంతో గ్రామ శివారులో వచ్చే చిన్న గెడ్డ నీటికి అడ్డంగా ఓ చిన్న తుప్పు పట్టిన గొట్టాన్ని ఏర్పాటు చేశారు. దీనినుంచి వచ్చిన కలుషిత నీటితో గొంతు తడుపుకుంటున్నారు. కురుపాం. గుమ్మలక్ష్మీపు రం వంటి గ్రామాల్లో ఊట గుంతలు, నీటి చెలమల నుం చి వచ్చే నీరే ప్రాణాధారం. గొంతు తడుపుకునేందుకు జీవాధారవిుదేనని వారు ఆవేదన చెందుతున్నారు. ఏజెన్సీలో తీవ్రమైన తాగునీటి సమస్య.. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రమైంది. సుమారు 8 మండలాల్లో తాగునీటికి జనం అల్లాడుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్మమ్మవలస, మక్కువ, గరుగుబిల్లి, కొమరాడ తదితర మండలాల్లో మంచినీటి ఎద్దడి నెలకొంది. కొద్దిపాటి నీరు ఊరే గుంతలు, ఊట బావులు, చెలమలపై ఆధారపడుతున్నారు. 20 నుంచి వంద కుటుం బాలుండే గిరిజన గూడల్లో ఒక్కో బోరు ఉండడం, కొన్నిచోట్ల బోరు కూడా లేకపోవడంతో కష్టాలు తప్పడంలేదు. రాత్రంతా ఊరే నీరు సేకరణకు తెల్లవారు జాము నే పరుగులు తీస్తున్నారు. కలుషిత నీటినే తాగుతూ అనా రోగ్యం పాలవుతున్నారు. కురుపాం మండలం ఒప్పంగి లో ప్రజలు వేకువ జామునే వెళ్లి ఊటబావి నుంచి తాగునీరు తెచ్చుకునేందుకు ప్రయాసలు పడుతున్నారు. ఇదే మండలం గొందిలోవలో ఒక్క బోరు మాత్రమే ఉంది. ఇందులో చుక్క నీరు రావడం లేదు. వేసవికి ముందుగానే ఎండిపోతోంది. గ్రామం ఆవల ఉన్న చెలమలను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ కూడా పడిగాపులు కాస్తేనే తాగునీరు లభ్యమవుతోంది. సాలూరు మండలం గంజాయి భద్రలో తాగునీటి పథకం మంజూరు చేయాలని కోరినా పట్టించుకునేవారే కరువయ్యారు. చర్యలు తీసుకుంటున్నాం.. జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. సంచార వాహనాల్లో సిబ్బందిని పంపించి తాగునీటి వనరులను బాగుచేయిస్తున్నాం. అవసరమైన పరికరాలను ఎంపీడీఓల ఆధ్వర్యంలో అందజేస్తున్నాం. భారీ రక్షిత పథకానికి ప్రతిపాదనలు చేశాం. అవి వార్షిక ప్రాతిపదికన నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. చిన్నపాటి మరమ్మతులు, సింగిల్ విలేజ్ స్కీంలపై దృష్టి సారించాం. కొత్తగా 110 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశాం. –ఎన్వీ రమణమూర్తి, పర్యవేక్షక ఇంజినీరు, ఆర్డబ్ల్యూఎస్, విజయనగరం -
రాష్ట్రం అప్పు రూ. 1.2 లక్షల కోట్లు
-
రాష్ట్రం అప్పు రూ. 1.2 లక్షల కోట్లు
► ఖజానాపై రెట్టింపైన అప్పుల భారం ► కార్పొరేషన్ల పేరిట లెక్కకు మిక్కిలి రుణాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అప్పుల భారం రెండింతలైంది. రాష్ట్రం ఏర్పడే నాటికి వారసత్వంగా వచ్చిన రూ.60 వేల కోట్ల అప్పు మూడేళ్లలోపే దాదాపు రెట్టింపైంది. తెలంగాణ ప్రభుత్వం తొలి ఏడాది రూ.10 వేల కోట్లు, రెండో ఏడాది రూ.16 వేల కోట్లు అప్పులు చేసింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే రూ.21 వేల కోట్లు అప్పు చేసింది. విద్యుదుత్పత్తి, పంపిణీని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం అమలు చేస్తున్న ఉదయ్ పథకంలో చేరడంతో తాజాగా మరో రూ.8,923 కోట్ల అప్పు డిస్కంల నుంచి రాష్ట్ర ఖజానాకు బదిలీ అయింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న అప్పుల మొత్తం రూ.1.16 లక్షల కోట్లకు చేరింది. ఏటా ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధిలోకి లోబడే రాష్ట్రం రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో రుణ సమీకరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది! అవి చేసేవాటిని కార్పొరేషన్ రుణాలుగా చెప్పినా, అవి చెల్లించలేని పక్షంలో ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుంది. అప్పులు తెచ్చే కార్పొరేషన్లు ఇంటింటికి తాగునీటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ వాటర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇదిప్పటికే ప్రైవేటు బ్యాంకుల నుంచి దాదాపు రూ.25 వేల కోట్ల రుణాలు సేకరించింది. మరో రూ.10 వేల కోట్లయినా అవసరమని అధికారులంటున్నారు. ప్రభుత్వం తొలిసారిగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులకు నిధులు సమీకరించేందుకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్, పాలమూరు రంగారెడ్డి, లిఫ్ట్ ఇరిగేషన్ అథారిటీని ఏర్పాటు చేసింది. కాళేశ్వరం కార్పొరేషన్‌కు 5 రోజుల కిందటే ఆంధ్రా బ్యాంకుతో పాటు మొత్తం పది బ్యాంకుల నుంచి రూ.7,400 కోట్లు రుణం తీసుకున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా హడ్కో ద్వారా రూ.3,340 కోట్ల రుణం తీసుకుంది. మరో రూ.12,600 కోట్ల అప్పు తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఇలా ఈ ఏడాది కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు దాదాపు రూ. 20 వేల కోట్లకు చేరువయ్యాయి. వాయిదాలకు రూ.7700 కోట్లు ఇప్పటిదాకా చేసిన అప్పులు, వాటిపై వడ్డీలకు ప్రభుత్వం ఏటా రుణ వాయిదాలు చెల్లిస్తోంది. అలా ఈ ఏడాది రూ.7,700 కోట్ల వాయిదాలను చెల్లించింది. అప్పుల కుప్ప పెరిగిపోవటంతో వచ్చే ఏడాది వడ్డీల భారం రూ.9500 కోట్లకు చేరుతుందని అంచనా. కార్పొరేషన్లలో ఆర్టీసీకి మినహా మిగతావాటికి చెప్పుకోదగ్గ ఆదాయం లేదు. ఆర్టీసీ కూడా ఇప్పటికీ అప్పుల్లోనే ఉంది. పౌర సరఫరాల సంస్థ కూడా ఇప్పటికే దాదాపు రూ.10 వేల కోట్లు అప్పుల్లో ఉంది. ఈ కార్పొరేషన్ల అప్పులకు ప్రభుత్వమే గ్యారంటీ ఉన్నందున మున్ముందు ఈ భారం కూడా సర్కారుపైనే పడవచ్చు. ఓవైపు ఇలా భారీగా అప్పులు చేస్తున్నా, పలు శాఖలకు బడ్జెట్ నిధులు కూడా విడుదల చేయడం లేదు. రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించడంతో మిగతా పథకాలు, శాఖలకు మొండిచేయి ఎదురైంది. ఆరోగ్యశ్రీకి రూ.400 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,000 కోట్లు, ఇన్‌ఫుట్ సబ్సిడీకి రూ.420 కోట్లతో పాటు వడ్డీ లేని రుణాలకు సైతం ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదు. 13వ ఆర్థిక సంఘం, గత రెండేళ్లుగా విడుదలైన 14వ ఆర్థిక సంఘం నిధులనూ ఇప్పటికీ స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు. నిజానికి 14వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసిన 14 రోజుల్లోనే పంచాయతీలు, మున్సిపాలిటీలకు పంపిణీ చేయాలనే నిబంధనలున్నాయి. ఈ ఏడాది రాష్ట్రానికి ఇప్పటివరకు దాదాపు రూ.1,000 కోట్లు కేంద్రం కేటాయించింది. వాటిలో ఇప్పటికీ సగం కూడా స్థానిక సంస్థలకు చేరలేదు! -
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై మంజూరు చేసిన చాప్ కట్టర్స్‌ను గురువారం ఆమె స్థానిక పశుసంవర్ధకశాఖ జిల్లా కార్యాలయంలో 23మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. తకుముందు కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఒక్కో టాప్ కట్టర్ పూర్తి విలువ రూ.23760 ఉండగా లబ్ధిదారులకు 50శాతం సబ్సిడీపై పాడి రైతులకు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి విజయరాజు తెలిపారు. అలాగే పెరటి కోళ్ల పెంపకం యూనిట్లను, దూడల రక్షణ కోసం దాణ ను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు నెలల వయస్సులో ఉన్న దూడలను ఈ స్కీం పరిధిలోకి తీసుకుంటామన్నారు. ఈ స్కీంలో ఒక్కో యూనిట్ విలువ రూ.6003 కాగా లబ్ధిదారుడు రూ.2628 చెల్లించాలని, మిగతా రూ.3375 ప్రభుత్వం వెచ్చించనుందని తెలిపారు. ఈ స్కీంలో లబ్ధిదారుడు చెల్లించిన రూ.628లను వెచ్చించి దూడకు, రైతుకు ఇన్సూరెన్స్ చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం పాడిరైతుల కోసం ప్రవేశపెట్టిన సునందిని పథకాన్ని జిల్లా రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి పవన్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రేషన్ స్టాక్‌పాయింట్‌ను పరిశీలించిన జేసీ వనపర్తి : స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఎంఎల్ఎస్ (మండల్ లెవల్ స్టాక్) పాయింట్‌ను గురువారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ నిరంజన్‌రావు సందర్శించారు. ఇక్కడి నుంచి రేషన్ షాపులకు సరఫరా చేస్తున్న సరుకుల వివరాలతో పాటు ప్రతి నెలా సరుకుల పంపిణీ తేదీల వివరాల రికార్డులను పరిశీలించారు. వనపర్తి జిల్లా ఏర్పాటు తర్వాత రేషన్ సరుకుల సరఫరా వివరాలను మేనేజింగ్ సివిల్ సప్లయి అధికారి అలివేలమంగను అడిగి తెలుసుకున్నారు. -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఐకేపీ ఉద్యోగులకు సూచించారు. ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకోవడంతో సోమవారం స్థానిక అంబేద్కర్ కళాభవన్‌లో ఐకేపీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ను సన్మానించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రెండ్లీ ప్రభుత్వం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐకేపీ ఉద్యోగుల పోరాటం మరువలేనిదన్నారు. ఐకేపీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలను సీఎం కేసీఆర్ పెంచినట్లు తెలిపారు. బంగారు తెలంగాణ సాధనలో ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం చేసిన సమ్మెలో ఐకేపీ ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. మహిళా సంఘాలను కదిలించిన పాత్ర ఐకేపీ ఉద్యోగులదన్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీ వెంకటయ్యగౌడ్, జెడ్‌ఎంఎస్ అధ్యక్షురాలు సలోమి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు సుదర్శన్, సక్రునాయక్, లక్ష్మయ్య, నాగమల్లిక, యాదగిరి, మహేష్, రాజప్ప, బాల్‌రాజు, ఈశ్వర్, అక్తర్, వెంకట్, సురేఖ పాల్గొన్నారు. -
నాడు అవినీతి... నేడు అభివృద్ధి
యూపీఏ.. ఎన్డీయే పాలనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహరాన్పూర్: యూపీఏ పరిపాలన కింద దేశంలో ఆవరించిన ఉన్న నిరాశానిస్పృహలను తమ ప్రభుత్వ రెండేళ్ల పాలన తొలగించిందని.. ఇప్పుడు దేశంలో ఆశ, అభివృద్ధి విస్తరించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. తన ప్రభుత్వం పేదలకు, రైతులకు అంకితమైన ప్రభుత్వమని.. ప్రజా ధనం దోపిడీని నిరోధించిందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీలో మోదీ నాలుగు సభల్లో పాల్గొననుండగా అందులో మొదటి సభ ఇది. రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యే లక్ష్యంతో.. తాను రైతుల కోసం ఆలోచించే యూపీ వాలానేనని పేర్కొన్నారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని గత ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందంటూ.. తమ ప్రభుత్వం అటువంటి ఆరోపణలేవీ లేకుండా నిజాయితీగా పనిచేస్తోందని చెప్పారు. దాదాపు గంటన్నర సేపు ప్రసంగించిన మోదీ.. అవినీతి అంశాలతో పాటు తన పేదల అనుకూల, రైతుల అనుకూల పథకాల నుంచి పదే పదే ఉటంకించారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఒక్క రూపాయైనా లూటీ జరిగిందా? ‘‘రెండేళ్ల కిందట దేశం మునిగిపోయిందని చాలా మంది అనుకున్నారు. భారత్ మునిగిపోయిందని, పరిస్థితులు మారబోవని వాళ్లు అనేవారు. అప్పుడు అంతా నిరాశాపూరిత వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఆశ, ఉత్సాహం నెలకొన్నాయి. రెండేళ్ల కిందట వార్తా పత్రికలు, టీవీ చానళ్లను చూడండి. అత్యున్నత స్థాయిలో అవినీతి అన్నది సాధారణంగా ఉండేది. నేను ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాను. గత ప్రభుత్వాలు దేశాన్ని ఎలా దోచుకున్నాయనేది చూసి నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. ప్రభుత్వాలు ఏర్పాటయ్యేది దోచుకోవటానికా? ఆ సంస్కృతికి ముగింపు పలకటానికి నేను ఇక్కడ ఉన్నా. మా ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయి అయినా దోచుకున్నట్లు చెప్పే వార్త ఏదైనా మీరు విన్నారా? లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ నేతగా నేను ఎన్నికైనపుడు.. నా ప్రభుత్వం పేదలకు అంకితమవుతమవుతందని నేను హామీ ఇచ్చాను. అప్పటి నుంచీ నేను తీసుకున్న ప్రతి నిర్ణయమూ ఆ దిశగానే తీసుకున్నాను. రెండేళ్ల నా కృషిని మీరు చూసినట్లయితే.. ప్రతి నిర్ణయమూ పేదలు పేదరికంపై పోరాడేలా వారిని సాధికారం చేసేందుకు తీసుకున్నవే. అన్ని సమస్యలకూ అభివృద్ధే పరిష్కారం. ఇతర మాటలన్నీ ఎన్నికల్లో గెలవటం కోసం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయటం కోస మే. నా రికార్డును చాలా మంది భూతద్దంలో పరిశీలిస్తున్నారు. దీనిని నేను ఆహ్వానిస్తున్నా. ప్రభుత్వం ప్రతి క్షణానికీ లెక్క చెప్పాల్సిందే.’’ ప్రధాన సేవకుడిగా లెక్క చెప్తున్నా... ‘‘ఒక ‘ప్రధాన సేవకుడి’గా నేను చేసిన పని గురించి ప్రజలకు లెక్క చెప్తున్నాను. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వనరుల పంపిణీ గతంలో 65:35 దామాషాలో ఉండేది. దానిని మా ప్రభుత్వం మార్చింది. ఇప్పుడు 65 శాతం రాష్ట్రాలకు వెళుతోంది. పంచాయతీలకు రెండు లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం. గత ప్రభుత్వ పాలన వరకూ విద్యుత్ లేకుండా ఉన్న 18,000 గ్రామాల్లో 7,000 గ్రామాలను మా ప్రభుత్వం కేవలం 300 రోజుల్లో విద్యుదీకరించింది. నేను అధికారంలోకి వచ్చేటప్పటికి చెరకు రైతుల బకాయిలు రూ. 14,000 వరకూ పెరిగాయి. నా ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా అవి ఇప్పుడు రూ. 700-880 కోట్లకు తగ్గాయి. రైతుల పట్ల చెరకు మిల్లుల యజమానులు గతంలో హీనంగా వ్యవహరించినట్లు వ్యవహరిస్తే సహించేది లేదు. 2022లో దేశం 75వ స్వాతంత్య్రదినోత్సవం జరుపుకునే సరికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మేం ఒట్టు పెట్టుకున్నాం. నా ప్రభుత్వం వికాస్ పర్వ్ నిర్వహిస్తోంది. నా మంత్రులందరూ దేశం మొత్తం తిరిగి తాము చేసిన పని గురించి వివరిస్తారు. నేను యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీని కాబట్టి నేను ‘యూపీ వాలా’ని. నాకు మీ ఆశీస్సులు కావాలి.’’ 125 కోట్ల మందీ నా కుటుంబం: మోదీ ఈ సభలో.. అన్ని వర్గాల వారితో సంఘీభావంపై కీలకమైన సందేశం ఇస్తూ.. ‘గత ప్రభు త్వ హయాంలో పథకాలకు మత, కులపరమైన పేర్లు పెట్టడం అలవాటుగా ఉండేది. కానీ నా ప్రభుత్వ పథకాలు నా కుటుంబమైన 125 కోట్ల మంది భారతీయులందరి కోసం ఉద్దేశించినవి. కులం, జాతి, మతం వంటివి మమ్మల్ని నడిపించవు’ అని అన్నారు. ఎంతో చేశాం.. చేయాల్సింది చాలా.. వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూలో మోదీ వాషింగ్టన్: తమ రెండేళ్ల పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని.. అయితే మున్ముందు చేయాల్సింది చాలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆహ్వానం మేరకు వచ్చే నెలలో ఆ దేశంలో మోదీ పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రపంచ వ్యవహారాల్లో భారతదేశం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని, అమెరికాతో సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు. భారతదేశంలో వేగవంతమైన అభివృద్ధి కోసం తాను బాటలు వేశానని.. ఆ మార్గంలో పయనించడానికి రాష్ట్రాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నానని, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలు సరిదిద్దానని మోదీ చెప్పుకొచ్చారు. కీలకమైన వస్తువులు, సేవలపై పన్ను (జీఎస్టీ) బిల్లు ఈ ఏడాది పార్లమెంటు ఆమోదం పొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను సవరించామని.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం సరికాదు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను విక్రయించడం సరికాదని మోదీ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న ఏ దేశంలోనైనా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ రంగం నుంచి అకస్మాత్తుగా బయటపడటం సాధ్యం కాదని, అలా వదిలించుకోకూడదని అన్నారు. మోదీ సర్కారు చేసిందేంటి? చర్చకు సిద్ధమన్న కాంగ్రెస్ న్యూఢిల్లీ: కేంద్రంలో సర్కారు ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ సంబరాలు జరుపుకోవటంపై కాంగ్రెస్‌తోపాటు విపక్షాలు మండిపడ్డాయి. ఈ రెండేళ్లలో ఎన్డీఏ సర్కారు సాధించిందేంటని ప్రశ్నించాయి. ఎన్నికల హమీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా.. గిమ్మిక్కులతో ప్రజలు మోసం చేశారని కాంగ్రెస్ విమర్శించింది. కేవలం పత్రికలు, చానెళ్ల ద్వారానే బీజేపీ ప్రభుత్వం నడుస్తోందని.. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేతలు డిమాండ్ చేశారు. అచ్ఛేదిన్ పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు ఆధ్వర్యంలోని ఈ రెండేళ్లు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం ఎదుర్కొన్న అత్యంత దురదృష్టకరమైన కాలమని పవర్‌పాయిట్ ప్రజెంటేషన్‌లో ఆరోపించారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రధాని కార్యాలయం అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీగా మారిందని ఆప్ విమర్శించింది. రెండేళ్ల పాలనపై ప్రచారానికి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. సరిహద్దు భద్రత, ద్రవ్యోల్బణం, పథకాలు ప్రజలకు చేరటం వంటి అంశాల్లో మోదీ సర్కారు దారుణంగా విఫలమైందని ఎన్డీఏ భాగస్వామి శివసేన ఆరోపించింది. వైద్యుల పదవీ విరమణ వయసు 65కు! * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైద్యులందరికీ వర్తిస్తుంది: మోదీ * ప్రతి నెలా గర్భిణీలకు ఉచిత వైద్యం చేయాలని పిలుపు సహరాన్పూర్: దేశంలో వైద్యుల కొరత కారణంగా ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహరాన్ఫూర్ సభలో ప్రకటించారు. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఈ వారంలో ఆమోదం తెలుపుతుందని వెల్లడించారు. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏ ప్రభుత్వం కింద పనిచేసే వైద్యులకైనా ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పారు. ‘‘దేశవ్యాప్తంగా మరింత ఎక్కువ మంది వైద్యుల అవసరం ఉంది. కానీ ఆ వ్యత్యాసాన్ని గత రెండేళ్ల నా ప్రభుత్వ కాలంలో పూరించటం సాధ్యం కాలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయసు కొన్ని రాష్ట్రాల్లో 60 సంవత్సరాలుగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో 62 సంవత్సరాలుగా ఉంది. తగినన్ని సంఖ్యలో వైద్య కళాశాలలు ఉన్నట్లయితే మనకు మరింత మంది వైద్యులు ఉండేవారు. కొరత కనిపించేది కాదు. రెండేళ్లలో వైద్యులను తయారు చేయటం కష్టం. కానీ పేద కుటుంబాలను వైద్యులు లేకుండా జీవించే పరిస్థితిలోకి నెట్టివేయజాలం. కాబట్టి.. మన వైద్యుల పదవీ విరమణ వయసును రాష్ట్రాల్లో అయినా, కేంద్ర ప్రభుత్వంలో అయినా 65 ఏళ్లకు పెంచేలా కేంద్ర మంత్రివర్గం ఈ వారంలో నిర్ణయం తీసుకుంటుందని నేను దేశ ప్రజలందరికీ ప్రకటిస్తున్నా’’ అని పేర్కొన్నారు. అలాగే.. క్షేత్రస్థాయిలోకి మరింత మంది వైద్యులు అందుబాటులో ఉండేలా చేసేందుకు మరిన్ని వైద్య కళాశాలలను స్థాపించేందుకు తన ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోందని చెప్పారు. అంతకుముందు.. ప్రతి నెలా తొమ్మిదో రోజున గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య సేవలు అందించాలని వైద్యులకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. అలా చేయటం.. పేదల్లో రోగాలను పరిష్కరించేందుకు తన ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడవుతుందన్నారు. -
సోషల్ మీడియా సూపర్‌స్టార్
ప్రసార - ప్రచార మాధ్యమాలు (చానళ్లు - పేపర్లు) రాజకీయ నాయకుల ప్రచారాలకు బాగానే ఉపయోగపడుతున్నా అలాంటి ప్రచారంతో పాటు ఆయా నాయకుల వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేందుకు సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా) అద్భుతమైన సాధనం. అందులోనూ ట్విట్టర్ వంటివి నాయకులను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్నికల ముందు గానీ, తర్వాత గానీ సోషల్ మీడియాను ఆయన ఉపయోగించుకున్నంతగా మరెవరూ ఉపయోగించుకోలేదనడం అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించబట్టే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు ప్రకటించాలన్నా ఆయన దాన్నే సాధనంగా చేసుకుంటున్నారు. తద్వారా వాటికి విస్తృతమైన ప్రచారం కల్పిస్తున్నారు. స్వీయ ప్రచారానికి, విధానపరమైన నిర్ణయాల ప్రచారానికి మాత్రమే కాదు... దేశాలతో దౌత్య సంబంధాలకు కూడా ఆయన ట్విట్టర్ ఇతర సోషల్ మీడియా సాధనాల సేవలను ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఆయన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా పాపులర్ అయ్యారు. ఈ ఏడాది కూడా టైమ్ మ్యాగజీన్ ‘30 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులు’ జాబితాలో మోదీకి స్థానం లభించింది. ట్విట్టర్లో ఆయనను 2.2 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్లో 3.4 కోట్ల మంది మోదీని లైక్ చేశారు. ఇంటర్నెట్, చానళ్ల విస్తృత వినియోగంతో మరుగున పడిపోతున్న ఆకాశవాణి (రేడియో)కు కూడా సోషల్‌మీడియాలో చోటు కల్పించిన ఘనత మోదీదే. రేడియోలో ‘మన్ కీ బాత్’ పేరుతో మోదీ ప్రసంగాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. కీలకమైన విధాననిర్ణయాలను ప్రకటించడానికి ‘మన్ కీ బాత్’ను ఉపయోగిస్తుండడంతో అందరూ దానిపై కేంద్రీకరించాల్సిన పరిస్థితి. సోషల్ మీడియాలో ఖాతాలను తానే స్వయం గా నిర్వహిస్తున్నారా అన్నట్లుగా ఉంటాయి మోది పోస్టింగ్‌లు, మెస్సేజ్‌లు. ‘ఈ ఫొటో నేనే తీశాను...’ ‘ఈ సంఘటన నన్నెంతగానో కదిలించింది..’ అంటూ ఆయన స్వయంగా చేస్తున్న ట్వీట్ల వల్లే నెటిజన్లు ఆయనకు బాగా చేరువవుతున్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే మోదీ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నంతగా బీజేపీ ఉపయోగించుకోలేకపోతోంది. ముఖ్యంగా ఆ పార్టీకున్న 282 మంది ఎంపీలలో మెజారిటీ భాగం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని కార్యాలయం ఇటీవలే ఈ గణాంకాలన్నీ తీసింది. వాటిని చూసి ఆశ్చర్యపోయిన మోదీ వెంటనే ఎంపీలందరికీ ఓ లేఖరాశారు. ఒక్కో ఎంపీ కనీసం లక్ష మంది ఫాలోవర్లు, లక్ష లైక్‌లు సంపాదించేలా ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో యాక్టివ్ కావాలని ఆయన ఆ లేఖలో కోరారు. తీరు మార్చిన నిర్ణయాలు *ఈ ఎన్డీయే కేబినెట్లో గత యూపీఏ ప్రభుత్వంలో కన్నా 35% తక్కువగా మంత్రివర్గ సభ్యులున్నారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన దిశగా మంత్రివర్గ కూర్పులో కీలక మార్పులు చేపట్టారు. తద్వారా ఆమేరకు ఖజానాపై భారం తగ్గించారు. *జనాభాలో 65% ఉన్న యువత శ్రమ శక్తిని ఉపయోగించుకోవడానికి.. నైపుణ్యాభివృద్ధి పెంపు కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. *పాక్‌తో సత్సంబంధాలను కోరుకుంటునే.. ఉగ్రవాదంపై పాక్ రెండు నాల్కల ధోరణిని ప్రతీ సందర్భంలో ఎత్తి చూపుతూనే ఉన్నారు. *ప్రణాళిక సంఘం ప్రస్తుత అవసరాలకు సరిపోదని భావించి, ‘నీతి ఆయోగ్’ను తెరపైకి తెచ్చారు. *యూపీఏ అవినీతి కుంభకోణాలతో విసుగెత్తిన ప్రజలకు.. అవినీతి రహిత పాలన అందిస్తామంటూ అధికారంలోకి వచ్చారు. రెండేళ్ల పాలనలో నీతిమంత పాలన అందించేందుకు కృషి చేశారు. మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రులు 1. సుష్మాస్వరాజ్ (విదేశాంగ శాఖ) 2. రాజ్‌నాథ్ సింగ్ (హోం శాఖ) 3. అరుణ్ జైట్లీ (ఆర్థిక శాఖ) 4. వెంకయ్యనాయుడు (పట్టణాభివృద్ధి శాఖ) 5. మనోహర్ పరీకర్ (రక్షణ శాఖ) 6. సురేశ్ ప్రభు (రైల్వే శాఖ) 7. నితిన్ గడ్కరీ (రోడ్డురవాణా, నౌకాయాన శాఖ) వ్యవసాయం గుడ్డిలో మెల్ల మన దేశం ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ వ్యవసాయ రంగం. స్థూల దేశీయోత్పత్తికి 14 శాతం అందిస్తున్న ప్రాధాన్య రంగం ఇది. దేశ జనాభాలో 55 శాతం మంది (సుమారు 60 కోట్ల మంది) వ్యవసాయం, అనుబంధ వ్యాపకాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అన్నదాతా సుఖీభవా అన్న భావన అనాదిగా ఉన్నప్పటికీ ఆరుగాలం చమటోర్చి పంటలు పండిస్తూ సమాజానికి అన్నం పెడుతున్న రైతుకు మాత్రం సేద్యం గిట్టుబాటు కావడం లేదు. పాలకుల నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం అంతకంతకూ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ పాలన గుడ్డిలో మెల్ల అని చెప్పాలి. వ్యవసాయ రంగ సంక్షోభం పరిష్కారానికి ఎం.ఎస్. స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు చేస్తామని రెండేళ్ల క్రితం బీజేపీ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. అయితే, అధికారం చేపట్టిన తర్వాత మోదీ ప్రభుత్వం ఈ వాగ్దానాన్ని తుంగలో తొక్కింది. అయితే, వ్యవసాయ సంక్షోభాన్ని ఉపశమింపజేసే దిశగా గత రెండేళ్లుగా ఆచితూచి అడుగులు వేస్తున్నది. స్వామినాథన్ సిఫారసు చేసిన విధంగా ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించడం కాదు గానీ.. 2022 నాటికి రైతులకు ఆదాయ భద్రత కల్పిస్తామని నమ్మబలుకుతోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వ్యవసాయ మార్కెట్లలో ఈ- వేలం సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నది. ఈ చర్య వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడానికి దోహదపడుతుందని మోదీ చెబుతున్నారు. అయితే, ఈ-వేలం సదుపాయాన్ని ఉపయోగించుకునేలా రైతులకు సాంకేతిక సహాయం అందించాల్సి ఉంది. అకాల వర్షాలు, కరువు కాటకాల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు ఎన్డీయే ప్రభుత్వం మెరుగైన పంటల బీమా పథకాన్ని (ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన) ప్రవేశపెట్టింది. తక్కువ ప్రీమియం, ఎక్కువ మంది రైతులకు బీమా సదుపాయం కల్పించడం, కోత అనంతర నష్టాలకూ బీమాను వర్తింపజేయడం, అన్నిటికీ మించి.. మండలాన్ని, గ్రామాన్ని కాకుండా రైతు పొలాన్ని యూనిట్‌గా పరిగణించి నష్టాన్ని అంచనావేసే వెసులుబాటు కల్పించారు. సాగు నీటి వనరుల అభివృద్ధికి ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన ద్వారా నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి.. బిందు, తుంపర సేద్యానికి మరింత ప్రోత్సాహాన్నిస్తున్నారు. నీమ్ కోటెడ్ యూరియాను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నది. వాతావరణం, వ్యవసాయ, మార్కెట్ సమాచారాన్ని అందించేందుకు కిసాన్ ఛానల్‌ను ప్రారంభించింది. -
జన్‌ధన్‌కు జై..
సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. దేశంలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందిస్తామంటూ ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదమిదీ! ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ నినాదాన్ని నిజం చేసేందుకు ఆయన అనేక ప్రతిష్టాత్మక పథకాలు ప్రవేశపెట్టారు. స్వచ్ఛభారత్, జన్‌ధన్ యోజన, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాలతో పాటు బాలికల కోసం భేటీ బచావ్, భేటీ పడావ్, మహిళల సాధికారత కోసం ముద్ర యోజన, ఎస్సీ/ఎస్టీ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్టాండప్ ఇండియా.. ఇలా దాదాపు 40 పథకాలు ప్రవేశపెట్టారు. అయితే ఇందులో స్వచ్ఛ భారత్, జన్‌ధన్ యోజన పథకాలే ప్రజాదరణ పొందాయి. ఇటీవల సీఎంఎస్ సర్వేలో కూడా ఇదే తేలింది. ఇబ్బడిముబ్బడిగా పథకాలు ప్రవేశపెడుతున్నా వాటిలో(40 పథకాల్లో) 25 పథకాల గురించి తెలిసినవారు కేవలం 3 శాతమే ఉన్నారు. 25 శాతం మందికి ఏడు పథకాలు మాత్రమే తెలుసు. మోదీ ఇప్పటిదాకా ప్రవేశపెట్టిన పథకాలు, వాటి తీరుతెన్నులను ఓసారి చూద్దాం..- సెంట్రల్‌డెస్క్ ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చిన పథకాల్లో ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) ఒకటి. దేశంలో ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండేలా చూడడం ఈ పథకం లక్ష్యం. జీరో బ్యాలెన్స్‌తో ఏ ప్రభుత్వ బ్యాంకులోనైనా ఖాతా తెరుచుకునే అవకాశం కల్పించే ఈ పథకాన్ని 2014 ఆగస్టు 28న మోదీ ప్రారంభించారు. పథకం ప్రారంభించిన ఐదు నెలల్లోనే దేశవ్యాప్తంగా ఏకంగా 15.59 కోట్ల ఖాతాలు తెరుచుకున్నాయి. ఇది గిన్నిస్ రికార్డు. ఇప్పటివరకు ఈ పథకం కింద 21.81 కోట్ల ఖాతాలున్నాయి. వాటిలో ఖాతాదారులు రూ.37,445 కోట్లు జమ చేసుకున్నారు. రూపాయి కార్డు ద్వారా 17 కోట్ల ఖాతాలిచ్చారు. ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 61 శాతం మందికి బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయి. వారిలో 52 శాతం మహిళలే ఉండడం విశేషం. స్వచ్ఛ భారత్ అభియాన్ పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ 2014 అక్టోబర్ 2న(గాంధీ జయంతి) రోజున ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇది. ఈ పథకాన్ని ఒక సామాజిక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది. దీంతో పారిశుధ్యంపై ప్రజల్లో గతంలో కంటే అవగాహన కాస్త పెరిగింది. 1986లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ కేంద్ర గ్రామీణ పారిశుధ్య పథకాన్ని ప్రారంభించారు. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం కూడా సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇవేవీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. స్వచ్ఛ భారత్ అభియాన్(ఎస్బీఏ) పథకం మాత్రం గణనీయమైన పురోగతి కనబరిచింది. బహిరంగ మలవిసర్జన నిర్మూలించడం, రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర చోట్ల చెత్తాచెదారం తొలగించడం, ప్రజాక్షేత్రాల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడం ఈ పథకం ఉద్దేశం. 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం మరుగుదొడ్లు(9 కోట్ల టాయిలెట్లు) నిర్మించడం పథకం లక్ష్యం. దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు. బహిరంగ మల విసర్జనను నిర్మూలించేందుకు యూపీఏ ప్రభుత్వ హయాం చివర్లో (2013-14లో) 49,76,294 టాయిలెట్లను నిర్మిస్తే.. మోదీ ప్రభుత్వం 2014-15లో 58,55,666 టాయిలెట్లను నిర్మించింది. మొత్తంమీద ఇప్పటిదాకా ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే కొత్తగా 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించింది. ఎస్బీఏ కింద 2.61 లక్షల ప్రభుత్వ బడుల్లో 4.17 లక్షల మరుగుదొడ్లు నిర్మించారు. ఇదీ ప్రగతి గ్రామీణ ప్రాంతాల్లో.. *నిర్మించిన మరుగుదొడ్ల్లు - 2.07 కోట్లు *బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలికినవి - 14 జిల్లాలు, 190 బ్లాకులు, 23 వేల గ్రామ పంచాయతీలు, 56 వేల గ్రామాలు. పట్టణ ప్రాంతాల్లో.. *నివాసాల్లో మరుగుదొడ్ల నిర్మాణం -15.10 లక్షలు *ఈ ఏడాది డిసెంబర్‌కల్లా బహిరంగ విసర్జన రహిత నగరాలు(లక్ష్యం)- 400 నగరాలు ఆధార్, డీబీటీతో అక్రమాలకు చెక్ ఆధార్‌కు చట్టబద్ధత... మోదీ సర్కారు తీసుకున్న మరో కీలక నిర్ణయం! దీనిద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకే అందడమే కాకుండా నగదు పక్కదారి పట్టడం చాలావరకు తగ్గిపోయింది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం, ఆధార్ చట్టబద్ధత ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్), ఎల్పీజీ, ఉపాధి హామీ పథకాల్లో అక్రమాలకు చెక్ పడింది. ఆధార్, డీబీటీ ద్వారా ఎల్పీజీలో 3.5 కోట్ల బోగస్ కనెక్షన్లను గుర్తించి తొలగించారు. దీంతో 2014-15లో రూ.14 వేల కోట్ల సొమ్ము ఆదా అయిందని ప్రభుత్వం చెబుతోంది. మేకిన్ ఇండియా పరిశ్రమలు భారత్‌లోనే తమ ఉత్పత్తులను తయారుచేసేలా ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 2014 సెప్టెంబర్ 25న ప్రధాని దీన్ని ప్రారంభించారు. మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిచోటా ‘మేకిన్ ఇండియా’లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ పరిశ్రమలు, పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఈ పథకం కింద ఆటోమొబైల్స్, కెమికల్స్, ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, పోర్టులు, రైల్వేలు, విమానయానం, పర్యాటకం, డిజైన్, మైనింగ్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ వంటి 25 ప్రధాన రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇదీ ప్రగతి.. *దేశంలో 2013-14లో -0.1 శాతంగా ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి 2014-15 నాటికి 2.8 శాతం మేర పెరిగింది. *ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) తగ్గిపోతున్నా భారత్‌లో మాత్రం పెరిగాయి. *భారత్‌లో పెరిగిన ఎఫ్‌డీఐల శాతం-48 *పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యుత్తమమైన దేశాల జాబితాలో భారత్ కిందటేడాది మొదటి స్థానంలో నిలిచింది. స్కిల్ ఇండియా ప్రపంచానికి భారత్ ‘మానవ వనరుల’ రాజధానిగా అవతరించాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. యువతలో నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, తద్వారా పేదరికాన్ని తరిమివేయడం ఈ పథకం ఉద్దేశం. 2022నాటికి దేశంలో 40 కోట్ల మందికి వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించాలన్నది పథకం లక్ష్యం. ఇదీ ప్రగతి.. *ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఇప్పటివరకు 19.55 లక్షల మంది యువతకు శిక్షణ అందించారు. *దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన ద్వారా 21 నగరాల్లో 1100 శిక్షణ కేంద్రాల ద్వారా 3.56 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చారు. వీరిలో 1.88 లక్షల మందికి ఉపాధి లభించింది. *దేశంలో కొత్తగా 1,141 ఐటీఐలను నెలకొల్పి 1.73 లక్షల సీట్లను అందుబాటులోకి తెచ్చారు. *స్కిల్ లోన్ పథకం పేరిట బ్యాంకుల ద్వారా రూ.5 వేల నుంచి రూ.1.5 లక్షల రుణం అందిస్తున్నారు. ‘బీమా’ రక్షణ జనాన్ని బీమా ఛత్రం కిందకు తీసుకువచ్చేందుకు మోదీ ప్రభుత్వం 2015 మే 9న ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని తెచ్చింది. సంవత్సరానికి కేవలం రూ.12 ప్రీమియంతో 18 నుంచి 70 ఏళ్లలోపు వారికి ఈ బీమా రక్షణ కల్పిస్తోంది. ప్రమాదవశాత్తూ మరణించినవారికి రూ.2 లక్షలు, ప్రమాదంలో అవయవాలు కోల్పోయినవారికి రూ.1 లక్ష అందిస్తారు. అలాగే సంవత్సరానికి రూ.330 ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత బీమా కల్పించే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. పెన్షన్ సదుపాయాన్ని కల్పిచేందుకు అటల్ పెన్షన్ యోజన స్కీంను కూడా తెచ్చారు. ఇదీ ప్రగతి.. * సురక్ష బీమా యోజన పథకంలో చేరిన వారి సంఖ్య 9.4 కోట్లు * జీవన్‌జ్యోతి పథకంలో చేరిన వారి సంఖ్య 3 కోట్లు * అటల్ పెన్షన్ యోజనలో చేరినవారు 20 లక్షలు -
మోదీ దూకుడు కొనసాగుతుందా..?
మోదీ నాయకత్వంలో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ పాలనకు నేటితో రెండు సంవత్సరాలు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలేమిటి? పొందిన వైఫల్యాలేమిటి? అనే చర్చ దేశమంతటా జరుగుతోంది. ఆర్థిక రంగంలో మాత్రం ఆ వడి లేదు. అడుగులు ఇంకా తడబడుతున్నాయ్. ‘అచ్చేదిన్’ కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ► పెరిగిన వృద్ధి నిలబడుతుందా? రెండేళ్లలో పలు సంస్కరణల్ని తెచ్చిన మోదీ ► స్థూల దేశీయోత్పత్తిలో భారతదేశ వేగం... చైనాను కూడా మించిపోయింది. ► కాకపోతే!! ఇదంతా వృద్ధిని లెక్కించేందుకు ప్రాతిపదికగా తీసుకుంటున్న ► సంవత్సరాన్ని మార్చటం వల్లే సాధ్యమైందనే విమర్శలొచ్చాయి. ► చైనా సహా ఎవ్వరితో పోటీ పడాలన్నా తయారీ రంగమే కీలకం కనక ► మోదీ ‘మేకిన్ ఇండియా’ నినాదాన్ని అందుకున్నారు. ► దీనికోసం ఏకంగా 400 బిలియన్ డాలర్లు... అంటే రూ.27.2 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలొచ్చాయి. ఇవి సాకారమైతే తయారీ రంగ వేగానికి హద్దులుండవనేది కాదనలేని వాస్తవం. (సాక్షి, బిజినెస్ విభాగం) ఇక బ్యాంకులన్నీ మొండి బకాయిల్ని క్లీన్ చేసుకోవాల్సిందేనంటూ వాటి ప్రక్షాళనకు రిజర్వు బ్యాంకు నడుం బిగించింది. మోదీ సర్కారు వాటికి తన మద్దతుగా కొంత నగదునిచ్చింది. కాకపోతే బ్యాంకులన్నీ తమ ఎన్పీఏలను బయటపెట్టడం మొదలెట్టాక వాటి లోతెంతో తెలిసింది. కొన్ని బ్యాంకులైతే ఏకంగా తమ వ్యాపారంలో 15-16 శాతాన్ని మొండి బకాయిలుగా చూపించాయి. ఇది ఒకరకంగా ఆయా బ్యాంకులు మునిగిపోయే పరిస్థితే!! ఇవి కొన్ని నిర్ణయాలు మాత్రమే. కాకపోతే అన్నింటా సానుకూలతలతో పాటు ప్రతికూలతలూ ఉన్నాయి. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర బాగా తగ్గటం మోదీ సర్కారుకు కలిసొచ్చింది. కీలక రంగాలకు నిధులు మిగిలాయి. దేశ వృద్ధిని లెక్కగట్టేందుకు అనుసరిస్తున్న ప్రామాణిక సంవత్సరాన్ని మార్చడం వల్ల కావొచ్చు.. మరో కారణం కావొచ్చు.. మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా చైనాను భారత్ అధిగమించింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7 శాతానికి పైగా నమోదవుతోంది. ఈ క్రమంలో పలు ప్రపంచవ్యాప్త పరిణామాలు కూడా మోదీకి బాగానే కలిసొచ్చాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనంతో దేశీయంగాను ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. కార్పొరేట్ కంపెనీల మార్జిన్లు పుంజుకున్నాయి. కరెంటు అకౌంటు, ద్రవ్య పరిస్థితులు మెరుగయ్యాయి. రైల్వే, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టడంతో... ఆయా రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వచ్చాయి. వీటి ఊతంతో 2014 మార్చి ఆఖరుతో పోలిస్తే విదేశీ మారక నిల్వలు ఏకంగా 47 బిలియన్ డాలర్ల మేర పెరిగి గతేడాది డిసెంబర్ నాటికి 350 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. ఇవి దాదాపు ఎనిమిది నెలల దిగుమతుల బిల్లులకు సరిపోతాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి నిర్దేశించిన దానికన్నా ఇవి దాదాపు మూడు రెట్లు అధికం. మేకిన్ ఇండియా.. స్టార్టప్ ఇండియా.. రెడ్ టేపిజాన్ని త గ్గించడంపై దృష్టి పెట్టడం ద్వారా.. సులభంగా వ్యాపారాలు చేయగలిగే దేశాల జాబితాలో మన ర్యాంకింగ్‌ను మోదీ మెరుగుపర్చే ప్రయత్నం చేశారు. దేశీ తయారీ రంగానికి ఊతమిచ్చేలా మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు. దీనికింద దాదాపు 400 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇవన్నీ కూడా సాకారమైతే.. గడిచిన 14 ఏళ్లుగా దేశంలోకి వచ్చిన పెట్టుబడులను మించుతాయి. అలాగే చిన్న సంస్థలకు తోడ్పాటునిచ్చేలా స్టార్టప్ ఇండియాను సైతం ప్రధాని ప్రవేశపెట్టారు. బ్యాంకింగ్‌కు మొండిబకాయిల భారం.. అందరినీ బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తెచ్చే దిశగా జనధన యోజన, పెన్షన్ ప్రయోజనాలు దక్కేలా అటల్ పెన్షన్ యోజన వంటివి మోదీ ఆవిష్కరించారు. జనధన యోజన కింద దాదాపు 22 కోట్ల పైగా ఖాతాలు తెరవగా.. వాటిల్లో సుమారు రూ.37 వేల కోట్ల పైచిలుకు బ్యాలెన్స్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. లాభాలు చూపించేందుకు ఏళ్ల తరబడి మొండి బకాయిల్ని దాస్తూ వస్తున్న బ్యాంకుల్ని ప్రక్షాళన చేసేందుకు ఆర్బీఐ నడుం బిగించింది. ఈ దెబ్బకు బ్యాంకులు ప్రకటించిన స్థూల మొండి బకాయీలు ఏకంగా రూ.4 లక్షల కోట్లు దాటిపోయాయి. ప్రభుత్వం బ్యాంకులకు ఆర్థికంగా కొంత మద్దతిస్తున్నా... కొన్నిటి పరిస్థితి మాత్రం దారుణంగా తయారయింది. వ్యాపారం సెంటిమెంటు డౌన్..! కొన్ని విజయాలున్నప్పటికీ... మోదీ ప్రభుత్వంపై పరిశ్రమ వర్గాల్లో కొంత అసంతృప్తి కూడా ఉంది. పరిస్థితుల్ని ఒక్కసారిగా మార్చేసేలా మోదీ చేతుల్లో మంత్రదండం లాంటిదేమీ లేదన్న సంగతి మెల్లగా వ్యాపారవర్గాలకు కూడా అవగతమవుతోంది. వివిధ కారణాల వల్ల జీఎస్టీ బిల్లు నిలిచిపోయింది. ఇక విదేశీ ఇన్వెస్టర్లకు తలనొప్పిగా మారిన రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్‌ని ఎత్తివేస్తామన్నా... గతంలో ఇచ్చిన నోటీసులు ఇప్పటికీ వాళ్లను వెంటాడుతున్నాయి. ఎగుమతులు బలహీనంగానే ఉన్నాయి. బ్యాంకుల మొండి బకాయీలు 14 ఏళ్ల గరిష్టానికి ఎగిశాయి. గడిచిన రెండేళ్లుగా చూస్తే వ్యాపారస్తుల సెంటిమెంటు క్రమంగా తగ్గింది. సేవలు, నిర్మాణం, వ్యవసాయం, ఇతరత్రా రంగాల పనితీరును సూచించే ఎంఎన్‌ఐ బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ సూచీ క్షీణతే దీనికి నిదర్శనం. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు.. అంటే 2014 మేలో సుమారు 80.3 పాయింట్లుగా ఉన్న ఈ సూచీ సెప్టెంబర్ నాటికి మరింత పెరిగింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇది 69.6కి తగ్గిపోయింది. ఇక ఆర్బీఐ 2016-17కి గాను రూపొందించిన పారిశ్రామిక అంచనాల సర్వేలో... పరిశ్రమ వర్గాల ఆశలు గడిచిన రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయాయి. ఉత్పత్తి సామర్ధ్య వినియోగం కూడా 2013-14 మూడో త్రైమాసికంలో 73 శాతం పైగా ఉంటే.. ఇటీవలి క్యూ3లో 72 శాతానికి తగ్గింది. తరచి చూస్తే పారిశ్రామికోత్పత్తి సింగిల్ డిజిట్ స్థాయిలోను, ఎగుమతులు రెండంకెల శాతం స్థాయిలోనూ క్షీణించగా, కంపెనీల ఆదాయాలు తగ్గుతున్న నేపథ్యంలో భారత జీడీపీ 7 శాతం పైగా ఎలా వృద్ధి చెందుతుందో తమకు బోధపడటం లేదంటూ డాయిష్ బ్యాంక్ ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానించారు కూడా. అచ్చే దిన్ మార్కెట్లకు రాలేదు! నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంపై భారీ అంచనాలతో 2014 మే నుంచి స్టాక్ మార్కెట్ దూసుకెళ్లటం మొదలైంది. కాకపోతే ఆ మెరుపులన్నీ మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యాయి. రెండేళ్లు గడిచినా పరిస్థితి మారలేదు. ఒక్క దివాలా బిల్లు మినహా కీలక బిల్లులేవీ చట్టాలుగా మారలేదు. అందరికీ ఏమో కానీ స్టాక్ మార్కెట్‌కు మాత్రం అచ్చే దిన్(మంచి రోజులు) రాలేదని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఇపుడు స్టాక్ మార్కెట్ కొంతైనా పుంజుకుందంటే అది అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కుదుటపడటం, ముడి చమురు ధరలు పుంజుకోవడం, సంస్థాగత రికవరీ... ఇత్యాది అంశాల వల్లనేనన్నది మార్కెట్ విశ్లేషకుల మాట. కమోడిటీ ధరలు క్షీణించడంతో ఈ రెండేళ్లలో లోహ షేర్లు దారుణంగా పడిపోయాయి. మొండి బకాయిల భారంతో బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. ఇక మోదీకి సన్నిహితులనదగ్గ వారిలో అదానీ, అంబానీలు ముఖ్యులు. చిత్రంగా మోదీ రెండో ఏడాది పాలనలో వీరి కంపెనీల షేర్లు కుదేలై మార్కెట్ క్యాపిటలైజేషన్ బాగా తగ్గింది. ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ క్యాప్ కూడా బాగానే క్షీణించింది. ఆ వివరాల సమాహారమే ఇది... మోదీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి చూస్తే, అంబానీ, అదానీ, జిందాల్,అనిల్ అగర్వాల్ వేదాంత... ఈ దిగ్గజ గ్రూప్‌ల మార్కెట్ క్యాపిటలైజేషన్ 51 శాతం వరకూ క్షీణించింది. కమోడిటీ ధరలు తగ్గడం, కీలక సంస్కరణలు లేకపోవడం, కంపెనీల పనితీరు అంతంత మాత్రంగానే ఉండడం దీనికి కారణాలని చెప్పొచ్చు. 2014, మే 26న రూ.1,17,388 కోట్లుగా ఉన్న గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపుగా సగం పడిపోయి రూ.60 వేల కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ క్యాప్ దాదాపు 25 శాతం పడిపోయింది. కమోడిటీ కంపెనీల విషయానికొస్తే, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ మార్కెట్ క్యాప్ 14 శాతం, జిందాల్ గ్రూప్ మార్కెట్ క్యాప్ 30 శాతం, అనిల్ అగర్వాల్ వేదాంత గ్రూప్ మార్కెట్ క్యాప్ 40 శాతం చొప్పున పడిపోయాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బాగా తగ్గినప్పటికీ, ఆ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు. ఈ రెండేళ్లలో లోహ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికం షేర్లు బాగా నష్టపోయాయి. అంబానీ సోదరుల షేర్లు కుదేలయ్యాయి. విదేశాంగం.. విజయవంతం! మోదీ విదేశీ విధానం.. దాని ఫలితాలు, పరిణామాలు రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అత్యంత ఆశావహ దృక్పథంతో మొదలైన భార త విదేశీ విధానం తనదైన విశిష్ట విజయాన్ని ఇటీవలే నమోదు చేసుకుంది. దశాబ్ద కాలంపైగా ఊరిస్తూ వచ్చిన భారత్-ఇరాన్ ద్వైపాక్షిక ఒప్పందం ఈ సోమవారమే సఫలీకృతమైంది. ఈ ఒప్పందంతో భారత్ ఇంధన అవసరాలకు అత్యంత సురక్షితమైన మార్గాన్ని కనుగొనడంతో పాటు పాకిస్తాన్, చైనా వ్యూహాత్మక సంబంధాలకు చెక్ పెట్టగలిగారు. ఇరాన్‌లోని చబహర్ నౌకాశ్రయ తొలి దశ అభివృద్ధికి సంబంధించి ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో దీర్ఘకాలంగా వాయిదాలో ఉన్న చమురులైన్ని సుసాధ్యం చేయడమే కాదు అటు తూర్పు యూరప్, ఇటు అఫ్ఘానిస్తాన్‌తో సంబంధాలను కొత్తపుంతలు తొక్కించారు. పాక్‌తో సంబంధం లేకుండా అఫ్ఘాన్, మధ్యాసియా దేశాలకు నేరుగా రవాణాపై భారత్ కంటున్న చిరకాల స్వప్నం ఈ ఒప్పందంతో సాకారమైంది. గత రెండేళ్లుగా అంతర్జాతీయ సంబంధాల విషయంలో మోదీ తీసుకువచ్చిన మార్పులను పరిశీలిద్దాం. సానుకూల అంశాలు పొరుగు వారిని ముందుగా పలకరించడం అనేది నరేంద్రమోదీ ప్రధానిగా తీసుకున్న ప్రారంభ చొరవల్లో ఒకటి. దీంట్లో భాగంగా భారత్ సాధించిన పెద్ద విజయం బంగ్లాదేశ్‌తో కుదుర్చుకున్న భూ సరిహద్దు ఒడంబడిక. ఇరు దేశాల మధ్య గత 40 ఏళ్లుగా వాయిదాలో ఉన్న ఈ వివాదం పరిష్కారమవడంతో భారత్-బంగ్లా సంబంధాలు కొత్త మలుపు తీసుకున్నాయి. అలాగే శ్రీలంకతో దశాబ్దాలుగా దెబ్బతింటూ వచ్చిన సంబంధాలు 2015 ప్రారంభంలో మెరుగుపడ్డాయి. మహీంద రాజపక్సే స్థానంలో మైత్రిపాల సిరిసేన శ్రీలంక అధ్యక్షుడైన వెంటనే 2015 మార్చిలో మోదీ ఆ దే శంలో పర్యటించారు. గత 30 ఏళ్లలో భారత ప్రధాని శ్రీలంకలో అడుగుపెట్టడం అదే తొలిసారి. ► మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, క్లీన్ గంగా, స్వచ్ఛ భారత్, స్కిల్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలకు విదేశాల్లో ప్రచారం కల్పించడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో క్రియాత్మకంగా వ్యవహరించారు. ► 2015లో అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం... ఒబామా, జపాన్ ప్రధాని షింజో అబే, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వంటి ప్రపంచ నేతలతో మోదీ కుదుర్చుకున్న వ్యక్తిగత సాన్నిహిత్యం భారత ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకుపోయాయి. జపాన్‌తో కుదిరిన పౌర అణు సహకార ఒప్పందం, 15 బిలియన్ డాలర్ల వ్యయంతో జపాన్ సహాయంతో దేశంలో నిర్మించనున్న హైస్పీడ్ రైల్వే లైన్ అనేవి ఆర్థికపరమైన సంబంధాన్ని కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాయి. భారత ప్రయోజనాలను ఇన్నాళ్లూ అడ్డుకుంటూ వచ్చిన ఆస్ట్రేలియాతో పౌర అణు ఒప్పందం కుదరటం కూడా విశేషమనే చెప్పాలి. ► ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ పేరిట ఆసియన్, తూర్పు ఆసియా దేశాలతో విస్తరించిన సంబంధాలు భారత్‌కు భారీ ప్రయోజనాలనే తెచ్చిపెట్టాయి. ఈ ఒక్క పరిణామంతో ప్రపంచ ఆర్థిక గమ్యం ఆసియావైపు అడుగేసింది. కౌలాలంపూర్, సింగపూర్ లలో మోదీ జరిపిన ఫలప్రదమైన పర్యటనలు ఈ విషయంలో విశేషంగా భారత్‌కు తోడ్పడ్డాయి. ► ఇక చైనా విషయానికి వస్తే భారత ప్రయోజనాలతో ముడిపడిన వ్యవహారాల్లో చైనా రాజకీయంగా, సైనికంగా, ఆర్థికంగా చొచ్చుకురావడం ఇప్పటికీ సవాలుగానే ఉంటోంది. భారత్ తన భూభాగమని చెప్పుకుంటున్న ప్రాంతంలో 64 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మాణమవుతున్న చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ చైనా-భారత్ సంబంధాలను మరింతగా పలచబారుస్తోంది. అయితే భారత ప్రాధమ్యాలను గురించి మోదీ చైనా నేతలతో నిష్కర్షగా చర్చించారు. అదే సమయంలో చైనా అధ్యక్షుడితో తనదైన సాన్నిహిత్యాన్ని నెలకొల్పుకోవడంలో మోదీ చొరవ ప్రదర్శించారు. ► ప్రవాస భారతీయుల సంస్థాగత పటిమను, నిర్మాణ కౌశలాలను ప్రపంచానికీ చాటిచెప్పిన తొలి ప్రధాని మోదీయే. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ప్రవాస భారతీయులు అత్యంత సంపన్నశ్రేణి గా గుర్తింపు పొందారు. ఆ దేశాల రాజకీయాలను కూడా వీరు ప్రభావితం చేస్తూ వస్తున్నారు. మోదీ పర్యటనలతో తొలిసారిగా ప్రవాస భారతీయుల ప్రభావం ప్రపంచం ముందు ప్రదర్శితమైంది. ఆ దేశాల్లో మోదీ పర్యటన, చేసిన ప్రసంగాలు సంచలనం సృష్టించాయి. ► యూపీఏ ప్రభుత్వం పదేళ్లపాటు పట్టించుకోని దేశాల్లోనూ మోదీ పర్యటించారు. యూపీఏనే కాదు.. భారత ప్రధానమంత్రులు గత 20 లేదా 30 సంవత్సరాలుగా పర్యటించని దేశాలనూ మోదీ చుట్టేశారు. ప్రధానిగా రెండేళ్ల పాలనలో మోదీ విదేశీ విధానం అత్యంత సానుకూల అంశాలను నమోదు చేసింది. ప్రతికూలతలు ఇన్ని విజయాల మధ్యనే మోదీ విదేశీ విధానం కొన్ని దేశాలకు సంబంధించి స్తంభనకు గురయిందనే చెప్పాలి, ముఖ్యంగా నేపాల్ విషయంలో మోదీ ప్రభుత్వం కూడా యూపీఏ విదేశీ విధానాన్ని దాటి అణుమాత్రం ముందుకు సాగలేకపోయింది. నేపాల్ నూతన రాజ్యాంగ ఆవిష్కరణ నేపథ్యంలో జరిగిన పరిణామాలు భారత్-నేపాల్ మధ్య సంబంధాలను దెబ్బతీశాయి. ► అదేవిధంగా పాకిస్తాన్ కు మోదీ అందించిన అరుదైన స్నేహహస్తాన్ని కూడా ఆ దేశం అందుకోలేకపోయింది. పాక్‌తో చర్చల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన భారత్ దౌత్యపరంగా పొందిన వైఫల్యంగానే దీన్ని భావించాలి. దౌత్యపరమైన విజయాలు ► ఒకే సంవత్సరం అంటే 2015లో మోదీ పర్యటించిన దేశాల సంఖ్య 28. ఏ భారత ప్రధానీ ఈ ఘనత సాధించలేదు. ► ఒకే ఏడాది 12 దేశాల అధినేతలకు స్వదేశంలో స్వాగతం పలకడం కూడా మోదీకే చెల్లింది. వారిలో - అమెరికా, జర్మనీ వంటి అతి శక్తివంతమైన దేశాధినేతలతో పాటు శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్, భూటాన్ వంటి పొరుగు దేశాల అధినేతలూ ఉన్నారు. ► జపాన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాలతో పౌర అణు సహకారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ► అమెరికా మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకున్నారు. ► ఆసియన్, తూర్పు ఆసియా దేశాలతో భారత్ సంబంధాల విస్తరణ ప్రపంచ ఆర్థిక రంగాన్నే ఆసియా వైపుకు మళ్లించింది. ► ఆఫ్రికా సదస్సుకు భారత్ వేదికై నిలిచింది. దాదాపు 41మంది ఆఫ్రికన్ నేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ► ప్రతి ఏటా జూన్ 21ని అంతర్జాతీయ యోగా డే గా ఐక్యరాజ్యసమితి గుర్తించడం మోదీ వ్యక్తిగత విజయాల్లో ఒకటి. ► అయిదు మధ్య ఆసియాదేశాలలో ప్రధాని వరుస పర్యటనలు భారత్ పట్ల ఆ దేశాల దృ క్పథంలో గణనీయ మార్పును తీసుకొచ్చాయి. ► ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వంపై భారత్ డిమాండ్‌కు అత్యధిక స్థాయిలో గుర్తింపు లభించింది. ► చిరకాల మిత్రదేశం రష్యాతో ప్రత్యేక వ్యూహాత్మక సంబంధాలకు మోదీ వ్యక్తిగతంగా కృషి చేశారు. ► భారత్‌కు ఇంధన వనరుల శాశ్వత సరఫరా విషయంలో ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు. కొంచెం తీపి.. కొంచెం చేదు ఎన్డీఏ రెండేళ్ల పాలనలో హామీల అమలు తీరు 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీలు సామాన్యుడితో పాటు మధ్య తరగతి వర్గాన్ని ఆకట్టుకున్నాయి. అన్ని రంగాల్లో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతానికి పట్టం కడతామంటూ ఓటర్లను ఆకట్టుకున్నారు. యువతకు కోట్లాది ఉద్యోగాలతో పాటు, పాలన లో సాంకేతికతకు పెద్దపీట వేసిప్రజల్ని భాగస్వాముల్ని చేస్తామని, అవినీతి అంతు చూస్తామంటూ హామీలు గుప్పించారు. పూర్తిగా మోదీ మార్కుతో సాగిన ఈ మేనిఫెస్టో ఎంత వరకు అమలైందో ఒకసారి పరిశీలిస్తే.. ధరల నియంత్రణ, ద్రవ్యోల్బణం కట్టడి ధరలకు ముకుతాడు వేసి ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొస్తామన్న హామీ మేనిఫెస్టోలో ప్రధానమైంది. నల్లబజారు, అక్రమ నిల్వల అంతు చూసేందుకు ప్రత్యేక కోర్టులు, ధరల స్థిరీకరణ నిధితో దేశమంతా ఒకే జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అమలు. వ్యవసాయ, మార్కెట్ సమాచారం క్షణాల్లో అందరికీ చేరేలా సాంకేతికతను వినియోగించుకోవడం. అమలు: హామీకి విరుద్ధంగా ఏడాది కాలంగా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పప్పుదినుసులు కిలో రూ.200కు చేరడంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి. అక్రమ నిల్వలకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు లేవు. పారిశ్రామికవేత్తలకు చేయూత యువతకు భారీగా ఉద్యోగాలతో పాటు జౌత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాకారం అందిస్తామంటూ యువ ఓటర్లను ఆకట్టుకున్నారు.ఉత్పత్తి రంగంలో కార్మికుల ప్రాధాన్యం పెరిగేలా చర్యలు. సంప్రదాయ రంగాలైన వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధి, గృహనిర్మాణంలో ఉద్యోగ అవకాశాల పెంపు. స్వయం ఉపాధికి చేయూత. అమలు: ‘మేకిన్ ఇండియా’లో ఉద్యోగాల కల్పనతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు చేయూత. ప్రోత్సాహకాలతో కొత్త పరిశ్రమల ఏర్పాటు ఆహ్వానం. ‘స్కిల్ ఇండియా’లో యువత నైపుణ్యాల్ని పెంచేందుకు చర్యలు. అసంఘటిత రంగ కార్మికులకు అటల్ పెన్షన్ యోజన. అవినీతి అంతం అవినీతిని పూర్తిగా నిర్మూలించేందుకు ఈ-గవర్నెన్స్ పాలన. అవినీతి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన, లక్ష్యాల మేరకు పనిచేసేలా దిశానిర్దేశం. అమలు: రెండేళ్ల మోదీ ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అవినీతి నిర్మూలన కోసం ఈ- పాలనకు అధిక ప్రాధాన్యం. అవినీతి కేసులపై విచారణ వేగవంతం. నల్లధనం వెనక్కితేవడం విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కితేవడం కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు. అమలు: నల్లధనంపై ఉమ్మడి టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినా... ఇప్పటి వరకూ చర్యలు నామమాత్రమే. నల్లధనం జాబితా ప్రకటనకు వెన కడుగు ఈ గవర్నెన్స్ ఈ -పాలన, సమాచార సాంకేతికతతో సాధికారత సాధించడం. దేశమంతా బ్రాండ్‌బ్యాండ్ సేవలు. సాంకేతికత సాయంతో గ్రామీణ, చిన్నస్థాయి పట్టణాల్లో ఈ-గవర్నెన్స్, ఐటీ ఆధారిత ఉద్యోగాల కల్పన. అమలు: 1, జులై 2015న ‘డిజిటల్ ఇండియా’కు శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పాలనపై అవగాహనకు చర్యలు. గ్రామీణ, పట్టణ అభివృద్ధి వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యం. గ్రామీణ స్థాయిలో మౌలిక వసతులైన రోడ్లు, రక్షిత మంచినీరు, విద్య, వైద్యం, పౌర సరఫరా, విద్యుత్ సదుపాయాలతో పాటు ఉద్యోగ కల్పన. పట్టణాభివృద్ధి కూడా ప్రాధాన్యం. వంద కొత్త నగరాల నిర్మాణానికి చర్యలు. రవాణా, గృణ నిర్మాణ రంగంపై ఎక్కువ దృష్టిపెట్టడం. అమలు: 2016 బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాలకు అధిక కేటాయింపులు. జన్‌ధన్‌యోజనలో 21.74 కోట్ల బ్యాంకు ఖాతాలు. 100 స్మార్ట్ సిటీల ప్రకటన. తొలి జాబితాలో 32 నగరాల ఎంపిక. స్మార్ట్ సిటీల కోసం బడ్జెట్లో రూ.7,060 కోట్లు కేటాయింపు. -
రాజకీయ విజేత
సోషల్ మీడియా సూపర్‌స్టార్.. ‘ట్వీటర్’ భాయ్.. ‘మన్‌కీ బాత్’ మోదీ నాయకత్వంలో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ పాలనకు నేటితో రెండు సంవత్సరాలు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలేమిటి? పొందిన వైఫల్యాలేమిటి? అనే చర్చ దేశమంతటా జరుగుతోంది. రాజకీయ రంగంలో మాత్రం నిస్సంశయంగా మోదీనే విజేత. తాను సంకల్పం చెప్పుకున్న విధంగా ‘కాంగ్రెస్ ముక్త భారత్’ దిశగా వడివడిగా అడుగులేస్తున్నారు. నానాటికీ కాంగ్రెస్ పార్టీ శల్యమైపోతోంది. ఆర్థిక రంగంలో మాత్రం ఆ వడి లేదు. అడుగులు ఇంకా తడబడుతున్నాయ్. ‘అచ్చేదిన్’ కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ► మోదీ రెండేళ్ల రాజకీయ విజయం ► ‘అచ్చే దిన్’ కోసం ఇంకా నిరీక్షణ ఏళ్ల తరబడి మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్న దేశ ప్రజలకు ‘అచ్చే దిన్’ తెస్తామని.. అవినీతి ఆరోపణలు, అసమర్థ పాలన విమర్శల్లో మునిగిపోయిన ‘కాంగ్రెస్’ నుంచి భారత్‌ను ముక్తం చేస్తామని.. రెండు ప్రధాన నినాదాలతో ఎన్నికల్లో పోరాడి అద్భుత విజయంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ సర్కారు గురువారంతో రెండేళ్లు పూర్తి చేసుకుంటోంది. మరి ఆ లక్ష్యాల్లో ఈ రెండేళ్లలో ఎంతవరకూ సాధించారంటే..? ప్రజలకు మంచి రోజులు ఇంకా మొదలు కాలేదు కానీ.. కాంగ్రెస్‌కు గడ్డు రోజులు మాత్రం పెరిగిపోతున్నాయి. మోదీ సర్కారు ఆర్థికాభివృద్ధి రంగంలో ఇంకా ముందడుగు వేసే క్రమంలోనే ఉన్నప్పటికీ.. ఆయన కేంద్ర బిందువుగా అధికార బీజేపీ రాజకీయ రంగంలో మాత్రం బలంగా దూసుకెళుతోంది. అదే సమయంలో సామాజిక రంగంలోనూ భావజాలాల ఘర్షణ విస్తరిస్తోంది. మత అసహనం, ఆధిపత్యవాదం, జాతీయవాదం వంటి అంశాలపై విశ్వవిద్యాలయాల్లో మేధోవర్గంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఆశించినంత అభివృద్ధి లేకపోవటం, కొత్త ఉద్యోగాలు కల్పించలేకపోవటం, ధరలు పెరుగుతుండటం, అసహనతత్వం విస్తరిస్తుండటం వంటి వాటి పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ.. మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత మాత్రం కనిపించటం లేదు. పైగా మోదీ మీద సానుకూల పవనాలు ఇంకా బలంగానే కొనసాగుతున్నాయని.. ఆ కారణంగానే రాష్ట్రాల్లో సైతం బీజేపీ విస్తరిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. పైగా స్వచ్ఛభారత్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి భారీ కార్యక్రమాలతో పాటు సామాన్య ప్రజలకు ఆరోగ్యబీమా, రైతులకు పంట బీమా వంటి సంక్షేమ పథకాలతో ప్రజల్లో సానుకూలత సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాభవం రోజురోజుకూ అంతరిస్తూ పోతోంటే.. బీజేపీ ప్రభావం అంతకంతకూ విస్తరిస్తోంది. నాటకీయ పరిణామాల మధ్య పట్టుపట్టి పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చి.. ఎన్నికల్లో కమలదళానికి అద్భుత విజయాన్ని సాధించిపెట్టిన నరేంద్రమోదీకి దీటైన మరో నేత.. ఆయనను ఢీ కొట్ట గల ప్రతి నాయకుడు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎవరూ కనిపించటం లేదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కానీ, ఆమె కుమారుడు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కానీ.. మోదీ హవా ముందు తేలిపోతున్నారు. కాంగ్రెస్ ప్రజాదరణ అంతరించి పోతోందా? 2013 జూన్‌లో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితుడైనప్పుడు మోదీ ఒక పిలుపునిచ్చారు. ‘‘ఈ దేశాన్ని కాంగ్రెస్ నుంచి మనం విముక్తం చేయాల్సిన అవసరముంది. కాంగ్రెస్ లేని భారత్‌ను నిర్మించటం మన లక్ష్యం కావాలి’’ అని నినదించారు. అప్పటికి పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవాలో కొట్టుకుపోయింది. లోక్‌సభలో అధికారికంగా ప్రతిపక్ష హోదా అయినా పొందలేకపోయింది. అప్పటికి కాంగ్రెస్ పార్టీ 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. వాటిలో 11 రాష్ట్రాల్లో తానే ప్రభుత్వ సారథిగా ఉండగా.. మరో రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల సారథ్యంలోని సంకీర్ణ సర్కారులో భాగస్వామిగా ఉంది. రెండేళ్ల తర్వాత తిరిగి చూస్తే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏడుకు తగ్గిపోయాయి. మరొక రాష్ట్రంలో కాంగ్రెస్ జూనియర్ భాగస్వామిగా సంకీర్ణ సర్కారు ఉంది. 2014 మే 26న మోదీ ప్రధానిగా ప్రమాణం చేసేటప్పటికి.. అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, అస్సాం, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, కేరళ, మిజోరం రాష్ట్రాల్లో కాంగ్రెస్ సర్కారు ఉంటే.. జార్ఖండ్, జమ్మూకశ్మీర్‌లలో కాంగ్రెస్‌తో కూడిన సంకీర్ణ ప్రభుత్వాలు ఉండేవి. ఇప్పుడు మోదీ సర్కారుకు రెండేళ్లు పూర్తయ్యేటప్పటికి.. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, మేఘాలయ, ఉత్తరాఖండ్, మిజోరం, పుదుచ్చేరిలకు కాంగ్రెస్ పరిమితమైంది. బిహార్ సర్కారులో జూనియర్ పార్టనర్‌గా ఉంది. అయితే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏడు రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ ‘హిందీ హార్ట్‌ల్యాండ్’ పరిగణించే మధ్యభారతదేశంలో లేకపోవటం గమనార్హం. అంతేకాదు.. అందులో కర్ణాటకను మినహాయిస్తే మిగతావన్నీ చిన్నా చితకా రాష్ట్రాలే. మరొకరకంగా చెప్తే.. కాంగ్రెస్‌ను ఆదరిస్తున్న భారత ప్రజల సంఖ్య వేగంగా భారీగా పడిపోతోంది. జనాభా ప్రాతిపదికన చూస్తే.. కేవలం సుమారు 7 శాతం మంది (అందులో కర్ణాటక జనాభా 5 శాతం) దేశ ప్రజలు మాత్రమే కాంగ్రెస్ పాలనలో ఉన్నారు. ఆ పార్టీ జూనియర్ భాగస్వామిగా ఉన్న బిహార్‌ను కూడా కలిపినా కాంగ్రెస్ పాలనలోని మొత్తం జనాభా దేశ జనాభాలో 15 శాతానికి మాత్రమే పెరుగుతుంది. ఇది ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా 16 శాతం కన్నా తక్కువ. దీనినిబట్టి.. భారతదేశం ‘కాంగ్రెస్ ముక్త భారత్’ దిశగా వేగంగా పయనిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి విషయంలో..: కేంద్ర ప్రభుత్వంలో ఎవరిపైనా అవినీతి ఆరోపణలు రాకుండా రెండేళ్లు సాగటం మోదీ సర్కారు సాధించిన ఒక విజయం. అయితే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలోని బీజేపీ ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలపై వచ్చిన అవినీతి ఆరోపణలు.. ఆ పార్టీ కూడా అందుకు అతీతం కాదన్న విషయాన్ని చెప్తున్నాయి. అలాగే.. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై రేగిన వివాదాలు.. అందులో మోదీ తన విద్యార్హతలపై వచ్చిన వివాదానికి వెంటనే ఫుల్స్టాప్ పెట్టకపోవటం ఆయన ప్రతిష్టకు కొంత చేటు చేసిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే.. ఎన్నికల హామీల్లో ప్రధానమైన నల్లధనం వెనక్కు తెస్తామన్న మాట ఇంకా నెరవేరలేదు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి, ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పరారైన బడా పెట్టుబడిదారులను వెనక్కు రప్పించటంలోనూ ఇంకా సఫలం కాలేదు. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో..: మోదీ అధికారంలోకి వచ్చాక కేంద్ర – రాష్ట్రాల మధ్య సంబంధాలను పునర్నిర్వచించటం మొదలైంది. రాష్ట్రాలకు ఆర్థికంగా మరింత సాధికారం చేసేందుకు ఆయన సర్కారు పలు కీలక చర్యలు చేపట్టింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను 42 శాతానికి పెంచటం అందులో ఒకటి. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల విషయంలో రాష్ట్రాల అభిప్రాయానికి మరింత విలువనివ్వాలన్న నిర్ణయం సహకార సమాఖ్యను బలోపేతం చేసేదే. కానీ.. బీజేపీ లేదా ఎన్డీఏ యేతర పక్షాల పాలనలోని రాష్ట్రాలతో కేంద్రం ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలూ ఉన్నాయి. ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో రాష్ట్రపతి పాలన విధించాలన్న నిర్ణయాలు.. ఢిల్లీ సర్కారుతో నిత్యం జగడాలు ఆ కోవలోనివే. ‘అచ్చే దిన్’ మున్ముందు వస్తాయా? ఈ రెండేళ్లలో మోదీ సర్కారు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టింది. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ భారీగా నిధులు వ్యయం చేస్తోంది. కానీ ఉపాధి అవకాశాలు ఏమంతగా మెరుగుపడలేదు. పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచినప్పటికీ పెట్టుబడుల రాక వేగం పుంజుకోలేదు. వీటికి తోడుగా భూసేకరణ సంస్కరణలు తెచ్చినప్పటికీ పరిశ్రమల స్థాపన మెరుగుపడలేదు. ఒకవైపు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ కొనసాగుతున్నా దేశంలో క్షేత్రస్థాయిలో పెద్దగా ఫలితాలు కనిపించటం లేదు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగానూ ఆర్థికాభివృద్ధి నెమ్మదించటమేనని చెప్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 7.10 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవటం ద్వారా.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతి అవకాశాలను తగ్గించటం, ఆ ప్రయోజనాలు నేరుగా ప్రజలకే అందేలా చూడటంతో పాటు.. మరింత ఎక్కువమంది ప్రజలను, లావాదేవీలను ప్రధాన ఆర్థిక స్రవంతికి అనుసంధానం చేశారు. అయినా వారి జీవితాల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచినా వర్షాభావం, నీటికొరత, కరవు కారణంగా దేశంలో నాలుగో వంతు మంది ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే.. మోదీ సర్కారు ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటుంది కాబట్టి.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చేపట్టిన చర్యలు మున్ముందు సత్ఫలితాలు ఇస్తాయని.. అప్పుడు ‘మంచి రోజులు’ వస్తాయని ప్రభుత్వ పెద్దలతో పాటు పలువురు నిపుణులూ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై..: భారత విదేశీ విధానానికి మోదీ కొత్త జీవం పోశారనే నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయటానికి.. తద్వారా దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించటానికి మోదీ గతంలో ఏ ప్రధానీ చేయని విధంగా అనేక దేశాల్లో పర్యటించారు. రెండేళ్లలో ఐదు ఖండాల్లోని 40 దేశాలను సందర్శించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటూ పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్ జన్మదినం రోజున సైతం అనూహ్యంగా అక్కడకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి వచ్చారు. అయితే.. పాక్‌తో సత్సంబంధాల సంగతేమో కానీ అంతర్జాతీయ వేదికపై మాత్రం భారత్ ప్రతిష్ట ఇనుమడించిందనే చెప్పవచ్చు. సామాజిక రంగంలో..: మోదీ రెండేళ్ల పరిపాలనలో ఏదైనా పెద్ద విమర్శ ఉందంటే అది సమాజంలో ‘అసహనం పెరుగుతోంద’న్న విమర్శే. ప్రధానంగా బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉండే సంఘ్ పరివార్ సంస్థలు, హిందుత్వ శక్తులు మత అసహనానికి పాల్పడుతున్న ఉదంతాలు ఈ రెండేళ్లలో ప్రముఖంగానే కనిపించాయి. దబోల్కర్, కలబుర్గి, పాన్సేరే వంటి హేతువాదులు హత్యకు గురవటం, బీఫ్ తినటంపై నిషేధం, ఘర్ వాపసి వంటి ఉదంతాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆయా ఘటనలపై మోదీ సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తూ పలువురు రచయితలు, మేధావులు, కళాకారులు ప్రభుత్వ అవార్డులను వెనక్కు ఇవ్వటం పెను కలకలం రేపింది. అలాగే.. హెచ్‌సీయూలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య.. జేఎన్‌యూలో విద్యార్థి నేత కన్హయ్యకుమార్‌ను దేశద్రోహం కేసులో అరెస్ట్ చేయటం వంటి ఘటనలు విద్యార్థి లోకంలోనూ మేధావి వర్గంలోనూ తీవ్ర అలజడిని రేపింది. ప్రాంతీయ పార్టీలపై గెలుపులేదు ఇక బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలు 10 రాష్ట్రాల్లో – ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, కేరళ, ఢిల్లీ, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం – అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల మొత్తం జనాభా 41 శాతానికి పైనే. అయితే.. బీజేపీ ఈ రెండేళ్లలో ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఒక్క ప్రాంతీయ పార్టీని కూడా ఓడించలేకపోవటం విశేషం. సర్వశక్తులూ ఒడ్డినా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ (ఆమ్ ఆద్మీ పార్టీ), బిహార్‌లో నితీశ్‌కుమార్ (జేడీయూ)లను గెలవలేకపోవటం మాత్రమే బీజేపీకి ఈ రెండేళ్లలో రాజకీయంగా తగిలిన ఎదురుదెబ్బలు. అంతేకాదు.. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీకి (తృణమూల్ కాంగ్రెస్) కానీ, తమిళనాడులో జయలలితకు (అన్నా డీఎంకే) కానీ బీజేపీ గట్టి సవాల్ ఇవ్వలేకపోయింది. ఇక కేరళలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోయినప్పటికీ.. అక్కడ బలంగా ఉన్న వామపక్షాలు బీజేపీని పుంజుకోనివ్వలేదు. దాంతో కేవలం ఒక్క సీటు సంపాదించి ఖాతా తెరిచిన సంతోషంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. . నలుదిశలా వికసిస్తున్న కమలం.. మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టేటప్పటికి 7 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు 13 రాష్ట్రాల్లో సొంతంగా లేదా సంకీర్ణంగా ప్రభుత్వాలను నడుపుతోంది. వాటిలో 9 రాష్ట్రాల్లో – మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, హరియాణా, గోవా – సొంతంగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది. మరో 4 రాష్ట్రాల్లో – ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జమ్మూకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్ – సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత ఐదు రాష్ట్రాల్లో – మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్, అస్సాం – బీజేపీ స్వయంగా గానీ, సంకీర్ణంగా గానీ గెలిచి అధికారంలోకి వచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ చీలిక బృందంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ 13 రాష్ట్రాలకు చెందిన జనాభా దేశ జనాభాలో 43 శాతానికి పైగా ఉన్నారు. అంటే.. జాతీయ స్థాయిలోనే కాదు.. రాష్ట్ర స్థాయిలోనూ కాంగ్రెస్ రోజు రోజుకూ క్షీణించిపోతుండగా బీజేపీకి ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అస్సాంలో గెలుపుతో ఈశాన్యంలో ఒక రాష్ట్రాన్ని తొలిసారి తమ ఖాతాలో వేసుకున్న కమలదళం.. ఇటు కేరళలోనూ ఒక అసెంబ్లీ సీటు గెలిచి ఖాతా తెరిచింది. దీంతో బీజేపీ ఇప్పుడు గుజరాత్ నుంచి గౌహతి వరకూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ విస్తరించినట్లు పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. -
చంద్రబాబుకు షాకిచ్చిన కాపు నేతలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కాపు పథకాలకు సీఎం చంద్రబాబునాయుడు పేరు పెట్టడంపై కాపు నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. విజయవాడలో ఆదివారం ఉదయం కాపు నేతలు చంద్రబాబుతో భేటీయ్యారు. ఈ భేటీలో కాపులకు ఇస్తున్న ఉపకార వేతనాలు, విదేశీ విద్య, రుణాల వంటి ప్రభుత్వ పథకాలతో పాటు కాపు సంక్షేమ భవనాలకు చంద్రబాబు పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కాపు భవనాలకు జిల్లాలో కాపు సామాజిక వర్గం కోసం పోరాడిన నాయకుల పేర్లు పెట్టాలని నేతలు సూచించారు. కాపు పథకాలకు చంద్రన్న పేరు పెట్టడం వల్ల రాష్ట్రంలో కాపులు టీడీపీకి దూరమౌతారని హెచ్చరించినట్లు సమాచారం. కాపు నేతల హెచ్చరికతో బాబు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆగమేఘాల మీద సీఎంవో అనుమతి లేకుండా ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టొద్దని సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సీఎంవో అనుమతి తీసుకున్నాకే ప్రభుత్వ పథకాలపై ముందుకెళ్లాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. -
ఎదురే నాకు లేదు.. నన్నెవరూ ఆపలేరు!
► జిల్లాలో పర్సంటేజీలు ఇస్తేనే పనులు ► ఆర్అండ్ బీలో తారాస్థాయికి చేరిన అవినీతి ► కనిగిరి, కొండపి, దర్శి ముఖ్య నేతల దందా ► ప్రతీ పనికి కాంట్రాక్టర్లు మామూళ్లు ఇవ్వాల్సిందే ► ఇవ్వకుంటే టెండర్లు ఓపెన్ చేసేది లేదని హెచ్చరిక ► సంబంధిత అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ► జిల్లా వ్యాప్తంగా నిలిచిన సుమారు రూ.100 కోట్ల పనులు ఒంగోలు: టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతీ పథకం ఆ పార్టీ నేతలకు వరంగా మారింది. పథకం ప్రారంభించిన నాటి నుంచే అందులో లొసుగులు వెతకడం తెలుగు తమ్ముళ్లకు పరిపాటిగా మారింది. ఎక్కడా ఏ అవకాశం ఉన్నా అందులో నాలుగు రాళ్లు వెనకేసుకోవడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. తామేం చేసినా అడిగేవారు లేరన్న ధీమా వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. చేప్పేవి శ్రీరంగనీతులు చేసేవి అవేవే అన్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం నిజారుుతీకి తాను నిలువెత్తు నిదర్శనం.. అంటూ ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెడుతున్నారు. ఇంకుడు గుంతలు మొదలు, నీరు-చెట్టు పథకం, జలసిరి పథకం, ఫారం పాండ్స్, ఫింఛన్ల పంపిణీ, రేషన్‌కార్డుల మంజూరు, నివేశన స్థలాల పంపిణీ అన్ని పథకాల్లోనూ టీడీపీ నేతలు అవినీతిలో కూరుకుపోయారు. అధికార పార్టీ నేతలకు 12 శాతం మామూళ్లు ఇస్తే తప్ప.. జిల్లాలో కాంట్రాక్టర్లు పని చేసే పరిస్థితి లేదు. ఫలితంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. తాము చెప్పిన పర్సంటేజీ చెల్లించిన తర్వాతే టెండర్లలో పాల్గొనాలని పచ్చచొక్కా ముఖ్య నేతలు కాంట్రాక్టర్లకు హుకుం జారీ చేస్తున్నారు. చేసేదిలేక చాలామంది కాంట్రాక్టర్లు టెండర్లు వేసేందుకే జంకుతున్నారు. నిబంధనల మేరకు 5 శాతానికి మించి అదనంగా టెండర్ వేసేందుకు లేదు. టెండర్ మొత్తానికి ఒకటి, రెండు శాతం అదనంగా వేసినా పనులు దక్కించుకోవచ్చు. 10 నుంచి 12 శాతం నిధులు చెల్లిస్తేనే టెండర్లు వేసుకోవాలని, పర్సంటేజీ ఇవ్వకుండా టెండర్లు వేస్తే పనులు చేయలేరంటూ తమ్ముళ్లు బెదిరిస్తున్నారు. ఒక్కో చోట ఒక్కో రేటు కొండపి, పర్చూరు ప్రాంతంలో 10 నుంచి 12 శాతం పర్సంటేజీ వసూలు చేస్తున్నారు. కనిగిరి ప్రాంతంలో 7 శాతం, ఒంగోలుకు చెందిన ఓ ముఖ్యనేత 10 శాతం చొప్పున పర్సంటేజీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కనిగిరి, కొండపి, దర్శి తదితర ప్రాంతాల్లో కొందరు అధికార పార్టీ నేతల బెదిరింపులు శ్రుతిమించడంతో టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా రోడ్లు, భవనాల శాఖలో ఈ పరిస్థితి తీవ్రస్థాయికి చేరింది. జిల్లాకు చెందిన శిద్దా రాఘవరావు ఆ శాఖ మంత్రి కావడంతో ఇక్కడ అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నారు. ఆ శాఖ పరిధిలో జిల్లావ్యాప్తంగా రూ.100 కోట్ల పనులకు ఈ ఏడాది మార్చి 30న టెండర్లు పిలిచారు. వాటిలో కనిగిరిలో రూ.40 కోట్లు, కొండపిలో రూ.30 కోట్లు, దర్శిలో రూ.15 కోట్లకు చొప్పున పనులున్నాయి. బిడ్డింగ్ చివరి తేదీ అదే ఏడాది ఏప్రిల్ 22. ఏప్రిల్ 24 నాటికి టెండర్లు ఓపెన్ చేయాల్సి ఉన్నా ఇంత వరకు రోడ్లు, భవనాల శాఖాధికారులు వాటిని ఓపెన్ చేయకపోవడం గమనార్హం. ఒకరిద్దరు కాంట్రాక్టర్లు స్థానిక అధికార పార్టీ ముఖ్యనేతలకు 7 శాతానికి మించి పర్సంటేజీ ఇవ్వలేమని చెప్పి టెండర్లలో పాల్గొన్నట్లు సమాచారం. తాము చెప్పిన పర్సంటేజీలు కాంట్రాక్టర్లు ఇవ్వకపోవడంతోనే టెండర్లను ఓపెన్ చేయకుండా అడ్డుకుంటున్నారు. అభివృద్ధిపై ప్రభావం అధికార పార్టీ ముఖ్యనేతలు పర్సంటేజీల గోలతో జిల్లాలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొందరు తమ పార్టీ నేతలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ నేత ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ప్రస్తుత నిబంధనల మేరకు 5 శాతానికి మించి అదనంగా కోడ్ చేయడానికి లేదని, 12 శాతం పర్సంటేజీ అధికార పార్టీ ముఖ్యనేతలకు చెల్లిస్తే తాము నష్టపోవాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. దీంతో జిల్లా పరిధిలో పనులకు టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు పెద్దగా మొగ్గుచూపడం లేదు. -
దేశవ్యాప్తంగా అంబేద్కర్‌కు ఘననివాళి
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ప్రధాని మోదీ ముంబైలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 'అంబేద్కర్ విశ్వ మానవుడు..ఆయన జీవితాంతం పేదలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికు ఎంతో పాటు పడ్డారు. ఆయన గొప్ప విద్యావేత్త.. ఆయన స్పూర్తి ఎంతో మందికి ఆదర్శం... జై భీమ్' అని తన ట్విట్టర్లో సందేశమిచ్చారు. అంబేద్కర్ జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని మహులో గురువారం ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 'గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్' పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. నేటి నుంచి ఈ నెల 24 వరకు జయంతి వేడుకలను కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, నాయకులు, అధికారులు అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ లు అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనానికి సీఎం కేసీఆర్ గురువారం భూమి పూజ చేశారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద కుల రహిత సమాజం కోసం రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ నిర్వహించారు. శాంతిచక్ర ఇంటర్నేషనల్, పలు స్వచ్ఛంద సేవాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రులు కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పలు రాజకీయ నాయకులు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. On his Jayanti, I bow to the venerable Dr. Babasaheb Ambedkar. Jai Bhim. pic.twitter.com/oQSkh98ZiU — Narendra Modi (@narendramodi) 14 April 2016 -
నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల అధికారులతో నీతి ఆయోగ్ సమావేశం హైదరాబాద్ లో బుధవారం ప్రారంభమైంది. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై రాష్ట్రాల అధికారులతో ఆయన చర్చించనున్నారు. ఈ సమావేశానికి పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్ష్యదీప్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
స్వగ్రామాలకు చేరుకున్న ప్రజలు
-
నేడు సమగ్ర కుటుంబ సర్వే
-
సర్వే స్వచ్ఛందం
-
సర్వే స్ధానికత కోసం కాదు
-
ప్రతి ఉద్యోగి సర్వేలో పాల్గొనాలి