
సాక్షి, సిరిసిల్ల : గత ప్రభుత్వాలు రైతుల వెన్నెముక విరిచేశాయని వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్లా జిల్లాలో పర్యటించిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణలో రైతులు ఆత్మగౌరవంతో జీవించాలనే గొప్ప లక్ష్యంతో రైతు బంధు పథకం ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టారని అన్నారు. రాష్ట్రంలో 58 లక్షల మంది రైతుల దగ్గర కోటి 42 లక్షల భూమి ఉన్నట్లు తేలిందన్నారు. రాష్ట్రంలో రైతే రాజ్యం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.
ఇక రాష్ట్రంలో అవ్వ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్న చందంగా ప్రతిపక్షాల పని ఉందని ఎద్దేవా చేశారు. కల్యాణ లక్ష్మి, కేసీఆరకిట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బంధు పథకాలు ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టారని, కాంగ్రెస్ నేతల్లా పార్టీలు చూసుకొని అమలు చేయట్లేదంటూ దుయ్యబట్టారు. పార్టీలకు అతీతంగా సీఎం పథకాలు ప్రవేశపెట్టారని, తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. నేడు తెలంగాణలో పండుగ వాతావరణం కొనసాగుతోందన్నారు. రైతులు సకాలంలో పంటలు పండించే విధంగా రైతు సమన్వయ సమితులు పనిచేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment