
హరిద్వార్: జనాభాను తగ్గించే చర్యల్లో భాగంగా ఒకే తల్లిదండ్రులకు పుట్టే మూడవ, లేదా ఆ తర్వాతి సంతానానికి, ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వ సేవలు, పథకాలు, ఓటు హక్కును నిలిపివేయడం వంటివి చేయాలని యోగాగురు బాబా రాందేవ్ ఆదివారం అన్నారు. మతాలకు అతీతంగా, దేశంలోని ప్రజలందరికీ ఈ నిబంధనను వర్తింపజేయాలని ఆయన పేర్కొన్నారు.
హరిద్వార్‌లో రాందేవ్ విలేకరులతో మాట్లాడుతూ ‘జనాభా విస్ఫోటన సమస్యను ఎదుర్కొనేందుకు ఇండియా సిద్ధంగా లేదు. 150 కోట్ల మంది కంటే ఎక్కువ జనాభాను దేశం భరించలేదు. ఎవరైనా మూడో బిడ్డను లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కంటే, ఆ జంటకు అలాగే మూడో లేదా ఆ తర్వాతి సంతానానికి ప్రభుత్వ సేవలను నిలిపివేయాలి. వివిధ పథకాలకు వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయకూడదు. ఓటు హక్కును ఇవ్వకుండా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా చేయాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment