Third child
-
ఎలాన్ మస్క్ కు 11వ బిడ్డ
న్యూయార్క్: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్స్ హెడ్ శివోన్ జిలిస్ ద్వారా ఆయనకు కొన్ని రోజుల క్రితం మూడో బిడ్డ జన్మించినట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ వెల్లడించింది. దీంతో మస్క్ పిల్లల సంఖ్య ఇప్పటిదాకా 11కు చేరుకున్నట్లు తెలియజేసింది. మస్క్ కు మొదటి భార్య, రచయిత్రి జస్టిన్ మస్క్ ద్వారా ఐదుగురు బిడ్డలు కలిగారు. సంగీత కళాకారిణి గ్రిమ్స్ ద్వారా ముగ్గురు పిల్లులు, శివోన్ జిలిస్ ద్వారా మరో ముగ్గురు పిల్లలు జని్మంచారు. ఎలాన్ మస్క్, శివోన్ జిలిస్‌కు 2021లో కవలలు పుట్టారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జననాల రేటు పడిపోతుండడంతో జనాభా తగ్గిపోతోందని మస్క్ 2021లో ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే జనాభాను పెంచాలని, వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. పిల్లలను కనకపోతే నాగరికత అంతమైపోతుందని చెప్పారు. అత్యధికంగా తెలివితేటలు, మేధాశక్తి ఉన్న వ్యక్తులు పిల్లలను ఎక్కువగా కనాలన్నది మస్క్ అభిప్రాయం. ఆయనకు తన సంస్థల్లో పనిచేసే మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. -
మా ఇంటికి సంతోషం వచ్చింది
తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ఇంట్లో సంతోషం నెలకొంది. ఆయన మూడోసారి తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు సెల్వరాఘవన్, గీతాంజలి. వీరికి ఒక పాప, బాబు (లీలావతి, ఓంకార్) ఉన్నారు. తాజాగా ఓ బాబుకి జన్మనిచ్చారు గీతాంజలి. ఈ బాబుకి రిషికేశ్ సెల్వరాఘవన్ అని పేరు పెట్టారు. ‘‘మేం ఐదుగురం అయ్యాం. రిషికేశ్ గురువారం ఉదయమే ఈ ప్రపంచంలోకి వచ్చాడు. సంతోషం తెచ్చాడు. మా కుటుంబానికి ప్రేమతో శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడు’’ అని పేర్కొన్నారు ఈ దంపతులు. 2010లో సెల్వరాఘవన్, గీతాంజలి వివాహం చేసుకున్నారు. ‘‘7/జీ బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికి ఒక్కడు’ వంటి సినిమాలను రూపొందించారు సెల్వరాఘవన్. -
మూడో బిడ్డ పుడితే పథకాలు వద్దు
హరిద్వార్: జనాభాను తగ్గించే చర్యల్లో భాగంగా ఒకే తల్లిదండ్రులకు పుట్టే మూడవ, లేదా ఆ తర్వాతి సంతానానికి, ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వ సేవలు, పథకాలు, ఓటు హక్కును నిలిపివేయడం వంటివి చేయాలని యోగాగురు బాబా రాందేవ్ ఆదివారం అన్నారు. మతాలకు అతీతంగా, దేశంలోని ప్రజలందరికీ ఈ నిబంధనను వర్తింపజేయాలని ఆయన పేర్కొన్నారు. హరిద్వార్‌లో రాందేవ్ విలేకరులతో మాట్లాడుతూ ‘జనాభా విస్ఫోటన సమస్యను ఎదుర్కొనేందుకు ఇండియా సిద్ధంగా లేదు. 150 కోట్ల మంది కంటే ఎక్కువ జనాభాను దేశం భరించలేదు. ఎవరైనా మూడో బిడ్డను లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కంటే, ఆ జంటకు అలాగే మూడో లేదా ఆ తర్వాతి సంతానానికి ప్రభుత్వ సేవలను నిలిపివేయాలి. వివిధ పథకాలకు వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయకూడదు. ఓటు హక్కును ఇవ్వకుండా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా చేయాలి’ అని అన్నారు. -
మూడో బేబీకి తల్లి కాబోతున్నా:రంభ
90స్లో టాప్ హీరోస్ అందరితో యాక్ట్ చేసిన రంభని అంత సులువుగా మరచిపోలేం. తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు హిందీ, భోజ్‌పురి చిత్రాల్లో కూడా రంభ మంచి పేరు తెచ్చుకున్నారు. కెనడా బిజినెస్‌మ్యాన్ ఇంద్రన్ పద్మనాథన్‌ని వివాహం చేసుకున్నాక సినిమాలకు కొంచెం దూరంగా ఉంటున్నారామె. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు లాన్య, శాషా ఉన్నారు. మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు రంభ. ఈ విషయం గురించి రంభ చెబుతూ –‘‘ఈ హ్యాపీ మూమెంట్లో నన్ను అభిమానించే వారందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మూడో బేబీకి తల్లి కాబోతున్నాను. ఈ ఆనందాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియట్లేదు’’ అన్నారు. -
‘మరోసారి తల్లినవుతా’, డాక్టర్ల వార్నింగ్
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి కిమ్ కార్దాషియాన్‌కు మరోసారి తల్లవ్వాలని ఉందంట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన కొత్త ప్రొమో ‘కీపింగ్ అప్ విత్ కార్దాషియాన్స్’ సందర్భంగా చెప్పారు. అయితే, ఈ సమయంలో తల్లికావడం ఆమెకు శ్రేయస్కరం కాదని, ప్రమాదం పొంచి ఉందని, అందుకే ఆ ఆలోచన మానుకోవాలని వైద్యులు తీవ్రంగా హెచ్చరించారు. ఆమె తల్లి క్రిస్ జెన్నర్ కూడా ఆమెను అలా ప్రమాదానికి వదిలేయలేనంటూ హెచ్చరించింది. 36 ఏళ్ల కిమ్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు. కాగా తనకు మూడో బిడ్డ కూడా కావాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పింది. ‘నా పిల్లలకు సోదరసోదరీమణులుంటే నాకు చాలా ఇష్టం. కానీ, వైద్యులు మాత్రం తనకది సురక్షితం కాదని అంటున్నారు. కానీ, నేను మాత్రం మరో బేబి కోసం ప్రయత్నించాలని అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. -
మూడో కాన్పులోనూ అమ్మాయి పుట్టిందని..
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య బంజారాహిల్స్: మూడో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టిందని మనస్తాపానికి లోనైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బేగంపేట పాటిగడ్డకు చెందిన రాజు(39) శ్రీలత దంపతులు నందినగర్‌లో నివాసం ఉంటున్నారు. రాజుల ఖైరతాబాద్ మింట్‌కంపౌండ్‌లోని ప్రభుత్వ ప్రింటింగ్‌ప్రెస్‌లో పని చేసేవాడు. వీరికి ప్రణవి(6), ధనవి(3) కుమార్తెలు ఉన్నారు. నెల క్రితం శ్రీలత మూడో కాన్పులో కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టినట్లు తెలుసుకున్న రాజు భార్యాపిల్లలను అక్కడే వదిలేసి వెళ్లిపోగా, శ్రీలత పసిపాపతో పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మానసికవేదనకు లోనైన అతను తాగుడుకు బానిసై ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటివద్దే ఉన్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు కిటికీలోనుంచి చూడగా రాజు మృతదేహం కనిపించడంతో బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సరొగసీ ద్వారా బిడ్డను కంటా: హీరోయిన్
ఇప్పటికే ఇద్దరు బిడ్డలున్న హీరోయిన్ కిమ్ కర్దాషియాన్.. ఈసారి సరొగసీ పద్ధతిలో మూడో బిడ్డను కనాలని భావిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. ఇప్పుడు తాను సరొగసీ విధానాన్ని అవలంబించాలని కచ్చితంగా నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది. 'కీపింగ్ అప్ విత్ ద కర్దాషియాన్స్' అనే కొత్త ఎపిసోడ్ ప్రోమో విడుదల సందర్భంగా ఆమె ఈ విషయాన్ని చెప్పింది. అయితే.. కిమ్ నిర్ణయం విని ఆమె తల్లి క్రిస్ జెన్నర్ షాకయ్యారు. కిమ్ కర్దాషియాన్ (36)కు ఇప్పటికే భర్త కేన్ వెస్ట్‌తో కలిసి నార్త్ వెస్ట్ అనే కూతురు, సెయింట్ వెస్ట్ అనే కొడుకు ఉన్నారు. ఇప్పుడు మూడో బిడ్డను కనడానికి గర్భం దాల్చే ఓపిక లేదో ఏమోగానీ.. సరొగసీ విధానం అయితే మంచిదని ఆమె అనుకుంటోంది. -
బిడ్డకు జన్మనిచ్చి.. కన్ను మూసిన తల్లి
జనగామ: బతుకుదెరువు కోసం వచ్చిన ఓ మహిళ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చి తనువు చాలించిన విషాద ఘటన వరంగల్ జిల్లా జనగామలో గురువారం చోటు చేసుకుంది. పిండంలో గడ్డకట్టిన రక్తంతో ప్రాణాపాయస్థితికి చేరుకున్న మహిళ బిడ్డను చూసుకోకుండానే కన్నుమూసింది. నర్మెట మండల కేంద్రానికి చెందిన శెనావతుల ముత్యం తన భార్య రజిత (32), కుటుంబ సభ్యులతో కలసి 15 ఏళ్ల క్రితం జనగామకు వచ్చారు. సిద్దిపేట రహదారి పక్కన గుడారం వేసుకుని ప్లాస్టిక్ వస్తువులను అమ్ముకుంటూ బతుకుతున్నారు. రజితకు ఇద్దరు కూతుళ్లు కాగా, కొడుకు కోసం ఎదురు చూసింది. మూడో కాన్పులో బుధవారం రాత్రి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పిం డంలో రక్తం గడ్డకట్టి ఉందని, తల్లి ప్రాణానికి ముప్పు అని చెప్పారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున కూతురుకు జన్మనిచ్చిన రజిత.. ఆ చిన్నారిని చూడకుండానే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు, ఆమె కూతుళ్లు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సొంత ఇల్లు లేకపోవడంతో రజిత మృతదేహాన్ని రహదారి పక్కనే ఉంచారు. ప్రభుత్వం ఈ నిరుపేద కుటుంబానికి సాయం అం దించాలని, తల్లిలేని ముగ్గురు కూతుళ్ల భవిష్యత్తుకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.