మా ఇంటికి సంతోషం వచ్చింది | Selvaraghavan and Gitanjali blessed with third child | Sakshi
Sakshi News home page

మా ఇంటికి సంతోషం వచ్చింది

Published Fri, Jan 8 2021 3:54 AM | Last Updated on Fri, Jan 8 2021 4:05 AM

Selvaraghavan and Gitanjali blessed with third child - Sakshi

భార్యా పిల్లలతో సెల్వరాఘవన్‌

తమిళ దర్శకుడు సెల్వరాఘవన్‌ ఇంట్లో సంతోషం నెలకొంది. ఆయన మూడోసారి తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు సెల్వరాఘవన్, గీతాంజలి. వీరికి ఒక పాప, బాబు (లీలావతి, ఓంకార్‌) ఉన్నారు. తాజాగా ఓ బాబుకి జన్మనిచ్చారు గీతాంజలి. ఈ బాబుకి రిషికేశ్‌ సెల్వరాఘవన్‌ అని పేరు పెట్టారు. ‘‘మేం ఐదుగురం అయ్యాం. రిషికేశ్‌ గురువారం ఉదయమే ఈ ప్రపంచంలోకి వచ్చాడు. సంతోషం తెచ్చాడు. మా కుటుంబానికి ప్రేమతో శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడు’’ అని పేర్కొన్నారు ఈ దంపతులు. 2010లో సెల్వరాఘవన్, గీతాంజలి వివాహం చేసుకున్నారు. ‘‘7/జీ బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికి ఒక్కడు’ వంటి సినిమాలను రూపొందించారు సెల్వరాఘవన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement