ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో సీఎం జగన్‌ | India Today Education Summit 2024: CM Jagan Tirupati Tour Updates - Sakshi
Sakshi News home page

తిరుపతి: ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో సీఎం జగన్‌.. అప్‌డేట్స్‌

Published Wed, Jan 24 2024 6:56 AM | Last Updated on Wed, Jan 24 2024 7:55 PM

Tirupati India Today Education Summit 2024 CM Jagan Tour Updates - Sakshi

తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. రెండో సారి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం ఖాయమని ప్రకటించారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ప్రజలను ధైర్యంగా అడుగుతున్నానని సీఎం జగన్‌ చెప్పారు. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తామన్న సీఎం జగన్‌.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామని, మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు ఇది నిదర్శనమని చెప్పిన సీఎం జగన్‌... కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతుందని, విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినట్టే.. తమ కుటుంబాన్ని కూడా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం జగన్‌ చెప్పినదాంట్లో ముఖ్యాంశాలు

 • పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు
 • అయితే విద్య అలాంటి అంశాలపై దృష్టి పెట్టకపోతే పేదరికాన్ని నిర్మూలించలేం
 • నేను ఏ హామీ ఇచ్చాను, ఏం చేశాను అన్నది చూడాలి
 • మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.4 శాతం అమలు చేశాను
 • అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను
 • ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత
 • ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం
 • వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం
 • డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం
 • అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం
 • అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేశాం
 • కచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం
 • ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు,
 • వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు
 • ఇదే బడ్జెట్‌ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది
 • కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు
 • కాని ఈ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ చేయగలిగింది
 • చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది నాకు లేనే లేదు
 • చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది
 • ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్‌ విధించింది
 • అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది.?
 • సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా?
 • వాటిని చూసి కన్విన్స్‌ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి
 • రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ఉనికి పెద్దగా లేదు
 • పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే ఉంటుంది
 • ప్రతి పార్టీ కూడా సర్వేలు చేస్తుంది
 • వాటి ఫలితాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది
 • ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు
 • కాని కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది
 • అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం
 • చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం
 • జాతీయ రాజకీయాలు విషయంలో మా విధానం స్పష్టం:
 • రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం
 • ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నాం:
 • కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతూ ఉంటుంది
 • అది ఆ పార్టీ సంప్రదాయంగా గమనిస్తున్నాం
 • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు
 • విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పాలించాలనుకుంది
 • అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు
 • నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు
 • వారు పాఠాలు నేర్వలేదు
 • కాంగ్రెస్‌ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు
 • కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది
 • దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు

ఇండియాటుడే తరపున రాజ్‌దీప్‌ ప్రశ్నలు, ముఖ్యమంత్రి జగన్‌ సమాధానాలు సవివరంగా..

రాజ్‌దీప్‌ :

 • తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో విద్యపై సదస్సు నిర్వహించడం సంతోషకరం,
 • చదువుతో వచ్చే మార్పు ఏంటన్నది కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు,
 • ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఆ మార్పే చోటు చేసుకోబోతుంది.
 • ఏపీలోని అత్యంత సామాన్య విద్యార్థులు అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీని పర్యటించడం గొప్ప విషయం

సీఎం జగన్‌ :

 • ఇండియా టుడే జర్నలిస్టులు తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాలలు చూడడం గొప్ప విషయం
 • పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది నా బలమైన నమ్మకం
 • నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు కావాలి
 • పేదలు చదివేది ఒకటయితే, ధనిక పిల్లలు చదివేది మరొకటి
 • పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది, ధనిక పిల్లలు ఇంగ్లీషులో చదివేవారు

రాజ్‌దీప్‌ :

 • మూడో తరగతి నుంచే గ్లోబల్‌ ఎగ్జామ్‌ టోఫెల్‌ లాంటిపై అవగాహన కల్పించేలా చేసిన మార్పులపై విమర్శలొచ్చాయి.
 • తెలుగు మీడియంలోనే బోధించాలని విమర్శలు చేశారు కదా.?

సీఎం జగన్‌ :

 • ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధించేలా చేయరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు?
 • నన్ను, ప్రభుత్వ విధానాలను విమర్శించే ముందు మీ విధానాలను ప్రశ్నించుకోండి

రాజ్‌దీప్‌ :

 • అకస్మాత్తుగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు పాఠశాల మానేసే ప్రమాదం లేదా?

సీఎం జగన్‌ :

 • ఇలా జరక్కుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
 • పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్‌ పెట్టాం.
 • మా బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్‌ అంశాలను చేర్చాం.
 • పాఠశాలలు అన్నింటిలోనూ సౌకర్యాలు మెరుగుపరిచాం. 
 • ఒక విధంగా చెప్పాలంటే సమగ్ర ప్రణాళికతో వీటిని అమల్లోకి తెచ్చాం.
 • నాడు-నేడు తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాం.
 • 62వేల తరగతి గదులుంటే .. 40 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ టీవీలు ఏర్పాటు చేశాం.
 • ఈ నెలాఖరుకల్లా మిగతా చోట కూడా పూర్తవుతాయి.
 • టీచర్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా ప్రణాళికకు ఒక సమగ్ర రూపం తీసుకొచ్చాం.
 • 8వ తరగతి విద్యార్థులందరికీ ఒక ఆధునికమైన టాబ్‌ నేర్చుకునేందుకు అందించాం.

రాజ్‌దీప్‌ :

 • 8వ తరగతి విద్యార్థికి టాబ్‌ ఇచ్చారా?
 • కోవిడ్‌ సమయంలో తగిన సాధన సంపత్తి (టీవీలు, మొబైళ్లు, టెక్నాలజీ) లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు?
 • ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు కదా.?
 • వచ్చే మూడేళ్లలో పదో తరగతి విద్యార్థులందరికీ టాబ్‌లు ఉంటాయని నమ్మకంగా చెప్పగలరా?

సీఎం జగన్‌ :

 • 8వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టాబ్‌లున్నాయి.
 • డిసెంబర్‌ 21న టాబ్‌లు ఇచ్చాం.
 • నా పుట్టిన రోజు నాడు నేనే తరగతి గదికి వెళ్లి పిల్లలను కలిసి వాళ్లకు టాబ్‌ అందజేస్తాం.

రాజ్‌దీప్‌ :

 • ప్రభుత్వాల్లో పనులు అంత వేగంగా జరగవని చెబుతారు,
 • మీరు మీ యంత్రాంగాన్ని తగిన విధంగా ప్రోత్సహిస్తున్నారా?
 • IB సిలబస్‌ కూడా ప్రవేశపెట్టారా?
 • అది కేవలం కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉంది కదా.?
 • అయితే ఇదంతా తొందరపడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి..
 • తల్లితండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత మంచి అవకాశం ఎలా వచ్చిందని.?

సీఎం జగన్‌ :

 • ఐబీ సిలబస్‌ మన రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డుతో చేతులు కలిపింది.
 • IB అన్నది ప్రస్తుతం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నాం.
 • జూన్‌ 2025 తర్వాత మొదటి తరగతిలో IB సిలబస్‌ ప్రవేశపెడతాం.
 • అక్కడి నుంచి దశలవారీగా ఏడో తరగతి వరకు ప్రవేశపెడతాం.
 • ఐదేళ్ల తర్వాత మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్‌ సర్టిఫెకెట్‌ కోసం పోటీ పడతారు.
 • ఈ ప్రయత్నం ఎందుకంటే.. విద్యలో నాణ్యత అనేది చాలా ముఖ్యం.
 • అదే లేకుంటే మా రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేరు కదా..
 • ఈ పోటీలో కేవలం ధనికులు మాత్రమే గెలిచే పరిస్థితి ఉండకూడదు,
 • అణగారిన వర్గాల వారికి కూడా అవకాశం దక్కాలి

రాజ్‌దీప్‌ :

 • అది గొప్ప దార్శనికతే. గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన విద్యార్థి పోటీ పడాలన్న ఆలోచన మంచిదే.
 • కానీ విద్యార్థులకు మంచి బోధన అందించేందుకు నాణ్యమైన ఉపాధ్యాయులు ఉన్నారనుకుంటున్నారా?

సీఎం జగన్‌ :

 • ఒక మంచి ఆలోచనకు మావంతు ప్రయత్నం జోడిస్తున్నాం.
 • IB, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి.
 • IBతో చర్చలు జరిపి మాతో కలిసి పని చేసేలా వారిని ఒప్పించాం.
 • ఇందుకు వారిని అభినందిస్తున్నాను.
 • ఫలితంగా IB తన అధికారిక కార్యాలయాన్ని SCERTతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది.
 • ఇది విప్లవాత్మకమైన మార్పుకు నాంది.
 • 2035 నాటికి IBలో  చదువుకున్న విద్యార్థులు పదో తరగతిలో ప్రవేశిస్తారు.
 • ఈ లక్ష్యంతోనే మేం పని చేస్తున్నాం.

రాజ్‌దీప్‌ :

 • ఈ పన్నెండేళ్ల ప్రాజెక్టులో IB తో కలిసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నది మీ ఆలోచనా?
 • దీనికి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి, తగినన్ని మీ దగ్గర నిధులున్నాయా?

సీఎం జగన్‌ :

 • ముందు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం
 • ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ.. చిన్న నుంచి పెద్ద తరగతుల వారికి IB బోధన ఇస్తున్నాం
 • ఆ తర్వాత 11, 12 తరగతుల వరకు IB సిలబస్‌ బోధన అందుతుంది
 • ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అన్న విషయం IBకి కూడా తెలుసు.
 • వాళ్లు కూడా ప్రభుత్వంలో భాగమైనందున.. మిగిలిన వారి వద్ద తీసుకునే స్థాయిలో రాయల్టీలాంటివి ఉండకపోవచ్చు.
 • అట్టడుగు స్థాయి విద్యార్థులకు కూడా అంతర్జాతీయ స్థాయి విద్యను అందించవచ్చన్నది ప్రపంచానికి తెలిపేందుకు ఏపీ ప్రభుత్వం, IB కలిసి చేస్తున్న ప్రయత్నం ఇది.
 • ఇక నిధుల విషయానికొస్తే.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.14వేల కోట్ల నిధులు అవసరమవుతాయి.
 • ఇప్పటివరకు రూ.8200 కోట్లను ఖర్చు పెట్టాం.
 • నాడు-నేడు తొలిదశలో భాగంగా మొత్తం 44వేల పాఠశాలల్లో 15వేల పాఠశాలలు పూర్తయ్యాయి.
 • రెండో దశలో భాగంగా 16వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి.
 • మార్చి నాటికి రెండో దశ పూర్తవుతుంది.
 • వచ్చే ఏడాది మిగిలిన పాఠశాలల్లో పనులు చేపడుతాం.


రాజ్‌దీప్‌ :

 • 2018లో ఏపీలో పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల శాతం 84.48,
 • ఆ ఏడాది జాతీయ సగటు 99.21.
 • ఈ పరిస్థితుల్లో డ్రాపవుట్లను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు?
 • జగనన్న అమ్మ ఒడిలా నేరుగా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తారా?
 • ఆ డబ్బును పిల్లల చదువుకు ఖర్చు పెట్టేలా చూస్తారా?

సీఎం జగన్‌ :

 • మేం పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అట్టడుగున ఉంది.
 • మౌలిక సదుపాయాల అభివృద్ధి, మధ్యాహ్నా భోజన పథకాలు, అమ్మ ఒడి లాంటి వాటి సాయంతో డ్రాప్‌ అవుట్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం.
 • మా రాష్ట్రంలో అమలవుతోన్న మధ్యాహ్న భోజన పథకం చాలా వినూత్నమైంది.
 • గోరు ముద్ద పేరుతో ఇస్తోన్న ఈ పథకంలో ఒక్కో రోజు ఒక్కో మెనూతో పౌష్టికాహరం అందిస్తున్నాం.
 • అవసరమయితే రాష్ట్రంలోని ఏ పాఠశాలకైనా మీరు వెళ్లి పరిశీలించుకోవచ్చు.

రాజ్‌దీప్‌ :

 • ఈ పథకాల అమలును ఎలా పర్యవేక్షిస్తున్నారు?
 • గతంలో ప్రభుత్వాలు పాఠశాలలపై పెద్దగా దృష్టి పెట్టలేదు కదా.?
 • నాకిపుడు అర్థమైంది మీరు ఢిల్లీలో ఎందుకు తక్కువ సమయం గడుపుతారన్నది
 • అయితే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గతంలోనూ ఒక సమస్య ఉండేది, ఈ
 • రాష్ట్ర యువతకు నిరుద్యోగం సమస్య ఎక్కువ. ఒక దశలో 35% దాకా ఉండేది.
 • ఈ నేపథ్యంలో వీరికి నైపుణ్యాలు అందించడం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం ఒక సవాలేనా?


సీఎం జగన్‌ :

 • ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా చూస్తోంది.
 • నేనే స్వయంగా పాఠశాలలను పర్యవేక్షిస్తున్నాను.
 • కలెక్టర్లతో నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నాను.
 • మేం పాఠశాల విద్య మీద మాత్రమే కాదు ఉన్నత విద్యపైనా దృష్టి పెట్టాం.
 • ఉద్యోగాలకు అవసరమైనట్టుగా బోధనాంశాల్లో మార్పులు చేశాం.
 • మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో భాగంగా ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాం.
 • అన్ని డిగ్రీలను నాలుగేళ్లు చేస్తున్నాం, ఆన్‌లైన్‌ కోర్సులు ఇస్తున్నాం.
 • ఇందులో భాగంగానే త్వరలో ఎడెక్స్‌తోనూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం.
 • పిల్లలు ఆన్లైన్లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం
 • బీకాం నేర్చుకునేవారికి అసెట్‌ మేనేజ్‌ మెంట్‌ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం
 • ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం:

-------------

విద్యారంగంలో ఏపీ కొత్త ఒరవడి

5.12pm, జనవరి 24, 2024

 • విద్యా రంగంలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై ఇంట్రో
 • ఏపీలో విద్యారంగంలో సమూల మార్పులు, విద్యా రంగంలో ఆంధ్ర మోడల్‌, కొత్త ఒరవడి సృష్టించిన సీఎం జగన్‌

ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌కు సీఎం జగన్‌
5.11pm, జనవరి 24, 2024

 • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్‌దేశాయ్‌ చర్చ

తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌
5.10pm, జనవరి 24, 2024

 • మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సీఎం జగన్‌
 • తిరుపతిలోని ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్‌

Updates:

ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం జగన్‌
ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానం, మన బడి నాడు - నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, టోఫెల్  శిక్షణ మొదలైన అంశాలపై చర్చ
దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానంపై ఇండియా టుడే సమ్మిట్‌ ప్రతినిధులు ప్రశంస

రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌
మరి కొద్దిసేపట్లో తాజ్ హోటల్‌లో జరిగే ఇండియా టుడే ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌కు హాజరుకానున్న సీఎం జగన్

తిరుపతి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్
కాసేపట్లో‌ ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం

సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడే జరిగే ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు పర్యటన వివరాలను సీఎంవో తెలియజేసింది.  

బుధవారం సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి సీఎం జగన్ తిరుపతికి( Tirupati ) బయలుదేరతారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తాజ్ హోటల్‌కు వెళ్తారు. అక్కడ జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి ప్రయాణం అవుతారు. సీఎం రాక నేపథ్యంలో.. తిరుపతిలో అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement