![Andhra Pradesh: Best School Awards for 7 Government Schools - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/10/cm-ys-jagan-final.jpg.webp?itok=D6TeVWuk)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మార్కులు సాధించిన 7 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఆగస్టు 15వ తేదీన బెస్ట్ స్కూళ్లుగా విద్యాశాఖ ఎంపిక చేసింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ స్కూళ్లకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా మెమొంటోలను అందజేయనున్నారు.
ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు జెడ్పీ హైస్కూలు, శ్రీకాకుళం జిల్లా కింతలి జెడ్పీ హైస్కూలు, విజయనగరం జిల్లా తాటిపూడి ఏపీ బాలికల రెసిడెన్సియల్ హైస్కూలు, విజయనగరం జిల్లా భద్రగిరి గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్సియల్ స్కూలు, విజయనగరం జిల్లా పెరుమాలి ఏపీ మోడల్ స్కూలు, ప్రకాశం జిల్లా రాయవరం బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూలు, కర్నూలు డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలామ్ మెమోరియల్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూలు, శ్రీకాకుళం జిల్లా వంగర కేజీబీ విద్యాలయం బెస్ట్ స్కూళ్లుగా ఎంపికయ్యాయి.
చదవండి: (మీటర్లతో మిగులుతున్న విద్యుత్)
Comments
Please login to add a commentAdd a comment