IB
-
ఏపీలో ‘ఐబీ’ అమలుపై ప్రశంస
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు చేయడాన్ని అంతర్జాతీయ వేదికపై విద్యావేత్తలు ప్రశంసించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న మూడు రోజుల ‘గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరమ్’ సదస్సు శుక్రవారం ముగిసింది. చివరిరోజు అసమానతలు లేని సమాజం కోసం సమగ్ర సమీకృత విద్యా బోధన ప్రతి ఒక్కరికీ అందించాలన్న అంశంపై చర్చ జరిగినట్టు యూఎన్వో స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి దాదాపు 38 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు అంతర్జాతీయ వేదికపై చెప్పామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మారిన పరిస్థితులు, విద్యార్థి–ఉపాధ్యాయుల మధ్య బలపడిన సత్సంబంధాలపై ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కెపాసిటీ బిల్డింగ్, అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు సహకరిస్తామని యునెస్కో ఇన్‌క్లూజన్ ఇన్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్ హెడ్ తమరా మార్టి కసాడో హామీ ఇచ్చినట్టు షకిన్ పేర్కొన్నారు. ఆ్రస్టేలియన్ ఎడ్యుకేషనల్ అవార్డు గ్రహీత డోనా రైట్ ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలను ప్రశంసించారన్నారు. ప్రాథమిక విద్యపై ఎన్నో పరిశోధనలు చేసిన రైట్... ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం గొప్పదని అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని ఐబీ సంస్థ ఈక్విటీ అండ్ ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ విభాగం సీనియర్ మేనేజర్ డాక్టర్ కళా పరశురామ్ “పాఠశాలల్లో స్థిరమైన సమ్మిళిత పద్ధతులు’పై పాన్ ఆసియా కమిటీ చర్చలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు సంబంధించిన అవసరాలు, విశ్లేషణలో భాగంగా తాము ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించామని, ప్రభుత్వం గొప్ప చారిత్రక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. -
మనబడి ‘ఐబీ’కి అనుకూలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన, బహు భాషలు మాట్లాడే విద్యార్థులు, చదువులో తమ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తొట్రుపాటు లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉపాధ్యాయులను ప్రశ్నించే తీరు.. ఎదుటివారితో మర్యాదగా మాట్లాడేతత్వం, పిల్లల్లో సహకార గుణం, క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు –టీచర్ల మధ్యనున్న అన్యోన్యత తదితర అంశాలు అంతర్జాతీయ విద్యావేత్తలను ఆశ్చర్యపరిచాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025 జూన్ మొదలు ఐబీ సిలబస్‌ను ఒకటో తరగతి నుంచి ప్రభుత్వం అమలుచేయనున్న నేపథ్యంలో.. ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) ప్రతినిధులు ఫిబ్రవరి 26 నుంచి ఈనెల ఏడో తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా.. ఇప్పటికే రాష్ట్రంలో అమలుచేస్తున్న ఏపీ విద్యా సంస్కరణలు, విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం వారిని ఆశ్చర్యపరిచాయి. తాము పరిశీలించిన పాఠశాలల్లో చక్కటి వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పాఠశాల పరిశుభ్రతపై కేంద్రీకృత పరిశీలన, పాఠశాలల పనితీరు.. సమీక్షలో రోజువారి యాప్స్ వినియోగం, కేంద్రీకృత మానిటరింగ్ సిస్టం, టోఫెల్ శిక్షణ, కంటెంట్ అనుసంధానం, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, గ్రంథాలయాల వినియోగం, మెరుగైన అసెస్మెంట్, యూనిఫారం, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, పోషకాలతో కూడిన నాణ్యమైన మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల నిర్వహణపై ఆ ప్రతినిధులు ప్రభుత్వాన్ని, విద్యాశాఖను అభినందించారు. విద్యార్థుల్లో నేర్చుకునే తత్వంపై అభినందన.. ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ అమలుచేసే స్కూళ్లల్లో విద్యార్థుల వ్యక్తిగత ప్రొఫైల్‌కు అధిక ప్రాధాన్యతనిస్తారు. బహు భాషలు, విద్యేతర అంశాలపై దృష్టిపెడతారు. వివిధ రకాల భాషలు మాట్లాడే పిల్లలు ఒకేచోట కలిసి ఉన్నప్పుడు ఒకరికొకరు సహకరించుకునే గుణం తప్పనిసరిగా ఉండేలా చూస్తారు. ఇలాంటి వాతావరణాన్ని ఏపీ ప్రభుత్వ స్కూళ్లల్లో గుర్తించినట్లు వారు తెలిపారు. తెలుగు, ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియాతో పాటు సవర, కొండ, కోయ, సుగాలి, ఆదివాసి, కువి వంటి గిరిజన భాషలు మాట్లాడే పిల్లలు కలిసి ఉన్నప్పుడు వారివారి భాషలను గౌరవించుకోవడం, ఇతర భాషలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపడాన్ని ఐబీ ప్రతినిధులు గమనించి అభినందించారు. తరగతి గదులలో బహుభాషావాదం, ఉపాధ్యాయ–విద్యార్థి సంబంధం, విద్యార్థుల మధ్య ఆత్మవిశ్వాసం, పాఠశాల విద్యా వ్యవస్థపై సమాచారాన్ని పంచుకోవడంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతరులు ఆసక్తి చూపిన తీరు ఐబీ విద్యా విధానానికి దగ్గరగా ఉన్నట్లు ఆ ప్రతినిధులు తెలిపారు. ఇక ఐబీ అమలు విషయంలో ఏపీ పాఠశాల విద్యాశాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలున్నాయని, ఉపాధ్యాయులకూ తగిన అర్హతలు ఉన్నాయన్నారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచ పోకడలను అర్థంచేసుకునేందుకు, అవకాశాలను అందుకునేందుకు ఐబీ పాఠ్యాంశాలను సులభంగా అనుసరించగలరన్న నమ్మకాన్ని వారు వ్యక్తంచేశారు. మరోవైపు.. ఐబీ బృందం పర్యటనకు సంబంధించిన పూర్తి నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి అందజేయనుంది. నివేదిక ఆధారంగా ఉపాధ్యాయులకు, విద్యాశాఖ సిబ్బంది శిక్షణనివ్వాలని అధికారులు నిర్ణయించారు. -
విశ్వవిజేతల కార్ఖానా!
తెలుగు ప్రసార మాధ్యమాలు పెద్దగా పట్టించుకోని ఈ వారపు ఘటనల్లో ఎన్నదగ్గవి రెండు: పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ను ప్రారంభించేందుకు సన్నాహంగా ఒక బృందం పాఠశాలల పరిశీలనకు బయల్దేరింది. రెండవది – ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్‌తో ఒక ఒప్పందం చేసుకున్నది. మొదటిది పాఠశాల విద్యకు సంబంధించినదైతే, రెండోది ఉన్నత విద్యకు సంబంధించిన అంశం. చంద్రబాబు యాచిస్తున్న పొత్తు కౌగిలిని బీజేపీ ప్రసాదిస్తుందా లేదా, జనసైనికులు ఆశిస్తున్న సీట్ల ప్యాకేజీని టీడీపీ అంగీకరిస్తుందా లేదా వగైరా పొలిటికల్ మిర్చి ముందు పై రెండు వార్తలను మీడియా చప్పిడి వార్తలు గానే పరిగణించి ఉండవచ్చు. యెల్లో మీడియా అయితే ఉద్దేశ పూర్వకంగానే విస్మరించింది. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ యెల్లో మీడియాలో ఉక్కపోత ఎక్కువైంది. కడుపు ఉబ్బరం పెరిగింది. ఒత్తిడి పెరిగింది. ఫలి తంగా దాని వార్తా ప్రాథమ్యాలు మరింత అదుపు తప్పాయి. ‘రాజధాని ఫైల్స్’ పేరుతో ఓ సినిమాను విడుదల చేశారు. ‘ఫైల్స్ కాదు పైల్స్’ (మొలలు) అన్నారెవరో! పెత్తందారీ పైల్స్ అనే పేరు పెడితే బాగుండేదన్నారు. యెల్లో మీడియా ఉన్న పరిస్థితికి ఈ సినిమా బాగా కనెక్టయింది. అందుకే యెల్లో మీడియాలో ప్రముఖ వార్తగా మారింది. యెల్లో మీడియాకు తోడయిన ఇంకో కామ్రేడరీ వార్త ‘విధ్వంసం’ పేరుతో పుస్తకావిష్కరణ. ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ’ అంటారు గదా! అట్లాగే పెత్తందారీ బాధ యెల్లో మీడియా ద్వారా సకల జనులకు బాధ. ఈ రెంటికీ మధ్యనున్న కామ్రేడరీ అనుబంధమే ఆ పుస్తక సారాంశం. కనుక అది కూడా వారికి పెద్ద వార్తే. స్కూళ్లలో ఐబీ సిలబస్ పెడితే మాత్రం ఏమిటి విశేషం? ఎడెక్స్ ద్వారా కళాశాలల్లో అంతర్జాతీయ సిలబస్‌ను ప్రవేశ పెడితే ఏం ప్రయోజనముంటుంది? ఇటువంటి సందేహాలు కలగడం సహజం. వాటిని గురించి చర్చించడానికి ముందు ప్రస్తుత ప్రపంచ పరిణామ దశ గురించిన ప్రాథమిక అవగాహన మనకు ఉండాలి. టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ప్రపంచం ఏకైక గ్లోబల్ మార్కెట్‌గా అవతరిస్తున్నది. ఈ మార్కెట్‌ను ఒకే ఒక వ్యవహారిక భాష నియంత్రించనున్నది. గ్లోబల్ విలేజి గురించి తరచూ మాట్లాడుతుంటారు. మన పూర్వీకులు ఎప్పటి నుంచో ‘వసుధైక కుటుంబం’ అనే భావనను వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ ఏక కుటుంబంలో ఏకైక సంధాన భాష అవసరం కూడా ఏర్పడింది. ఎలిజర్ బెన్ యెహుదా అనే భాషా శాస్త్రవేత్త ఉండేవారు. ఆయన రష్యాలో పుట్టి పెరిగిన యూదు జాతీయుడు. ప్రపంచ మంతా ఒకే భాష మాట్లాడే రోజు వస్తుందనే అభిప్రాయాన్ని వందేళ్లకు పూర్వమే ఆయన ప్రకటించారు. అయితే అది హిబ్రూ భాష కావాలనేది ఆయన కోరిక. అలాగే సంస్కృతానికి గ్లోబల్ భాషయ్యే లక్షణాలున్నాయనే భాషావేత్తలు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఇప్పటికే ప్రపంచ భాషగా ఇంగ్లిషు చాలాదూరం వెళ్లిపోయింది. ప్రపంచీకరణ, సాంకేతిక పురోగతి, వలసల కార ణంగా ఏర్పడుతున్న సాంస్కృతిక మార్పులన్నీ ఆంగ్లీకరణను వేగవంతం చేస్తున్నాయి. ఉన్నతమైన జీవనాన్ని ఆకాంక్షించే ప్రతి బాలికా బాలుడు, ప్రతి యువతీ యువకుడు గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా దూసు కొనిపోవలసిన అవసరం ఉన్నది. అలా దూసుకుపోవాలంటే మొదటి అవసరం – ఇంగ్లిషు భాషలో ప్రావీణ్యం. రెండో అవసరం – వేగంగా మారుతున్న టెక్నాలజీల మీద పట్టు సాధించడం. మూడోది – గ్లోబల్ మార్కెట్ అవసరాలకు పనికివచ్చే సబ్జెక్టులను అభ్యసించడం. ఈ అవసరాలను మన పిల్లలు ఎలా సమకూర్చుకోగలరు? ఎవరో పెట్టిపుట్టినవారు, కలవారి పిల్లలు మాత్రమే నెరవేర్చుకోగలిగిన కలలుగా ఇవి కనిపిస్తున్నాయి. భారతదేశమంతా కలిపి కేవలం 210 అత్యున్నతస్థాయి ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే ఇప్పుడు ఐబీ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. సంపన్నులు మాత్రమే ఆ స్కూళ్ల ఫీజులను భరించగలరు. మనకు అలవాటైన ‘భట్టీయం’ పద్ధతికి భిన్నంగా ఐబీ విద్యాబోధన ఉంటుంది. మన సంప్రదాయ పద్ధతిలో ఇరవై ఎక్కాలు గడగడ చదివేవారు కూడా సాధారణ లెక్కలు చేయలేక పోవడం మనకు తెలిసిందే. భట్టీయం పద్ధతిలో వివేచన, విశ్లేషణ, ఆలోచనలకు అవకాశం తక్కువ. విమర్శనాత్మకంగా ఆలోచించడం, భిన్నంగా ఆలోచించడం, సమస్యను పరిష్కరించడం వంటి నైపుణ్యాలను ఐబీ పాఠశాలల్లో అలవాటు చేస్తారు. వీటితోపాటు వివిధ రంగాల్లో రాణించేలా ప్రపంచమంతటా ఉపాధి, ఉన్నత విద్యావకాశాలు పొందే విధంగా తర్ఫీదు ఉంటుంది. దేశంలో కేవలం 210 బడుల్లో మాత్రమే ఉన్న ఇటువంటి ఖరీదైన ఐబీ విద్యాబోధనను రాష్ట్రంలోని 40 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ సంవత్సరం ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వచ్చే సంవత్సరం (2025–26) నుంచి ఒకటో క్లాసులో ఐబీ సిలబస్ ప్రవేశపెడతారు. ఏటా ఒక్కో క్లాసు పెంచుకుంటూ వెళ్తారు. 2037 నాటికి ప్లస్ టూ వరకు ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యార్థులంతా ఐబీ సిలబస్‌లోనే ఉంటారు. ప్రపంచ గమనానికి అనుగుణంగా మన ఉన్నత విద్యా కోర్సులు మారలేదన్నది ఒక వాస్తవం. ప్రభుత్వాధినేతలకు ఉండవలసిన దార్శనికత (విజన్) లేకపోవడం ఒక కారణం. అసలు సంకల్పమే లేకపోవడం మరో కారణం. చంద్రబాబు వంటి పెత్తందారీ నాయకులు అసలు విద్యారంగంలో ప్రభుత్వ జోక్యమే అనవసరమనీ, దాన్ని పూర్తిగా ప్రైవేట్ రంగానికే వదిలి వేయాలనీ బహిరంగంగానే ప్రబోధించారు. అందుకు తగ్గట్టు గానే ప్రభుత్వ విద్యారంగం కుప్పకూలిపోయేవిధంగా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణల ఫలితంగా నాణ్యమైన ప్రపంచశ్రేణి విద్య పేద విద్యార్థులందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్, పెత్తందారీ శక్తులు అందువల్లనే జగన్మోహన్రెడ్డిని అధికారంలోంచి దింపేయడానికి భయంకరమైన కుట్రను రచించాయి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న మన విద్యా ర్థులు ప్రపంచ మార్కెట్లో పోటీపడటానికి అనువుగా వారి పాఠ్యాంశాలు, బోధనా ప్రక్రియలు లేవన్నది నిర్వివాదాంశం. వరల్డ్ క్లాస్ స్థాయికి మన కళాశాలలను తీర్చిదిద్దడానికి చాలా సమయం పట్టవచ్చు. అప్పటివరకు ఏటా బయటకొస్తున్న మన పట్టభద్రులంతా అన్యాయానికి గురికావలసిందేనా? అలా జరగ కూడదన్న లక్ష్యమే ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందానికి కారణమైంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, కొలంబియా. కేంబ్రిడ్జి, ఎమ్ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక గ్లోబల్ వర్సిటీలు అందించే కోర్సులను ఎడెక్స్ ద్వారా మన డిగ్రీ, పీజీ, ఇంజనీ రింగ్ విద్యార్థులకు అందుబాటులోకి తేవడం ఈ ఒప్పందంలోని ప్రధానాంశం. విద్యార్థులకు ఈ కోర్సులు ఉచితంగా అందు బాటులోకి వస్తాయి. కరిక్యులమ్‌లో భాగమవుతాయి. ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చ్యువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రిస్క్ మేనేజిమెంట్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, స్టాక్ ఎక్స్ఛేంజ్, వెల్త్ మేనేజిమెంట్ వంటి ఆధునిక కోర్సుల్లో మన దగ్గర ప్రామాణికత లేదు. ఎడెక్స్ ద్వారా ఇందులో వరల్డ్ క్లాస్ కోర్సులను మన విద్యార్థులకు అందుబాటులోకి తెస్తు న్నారు. ఈ వర్టికల్స్‌కు సంబంధించిన పరీక్షను ఎంపిక చేసు కున్న గ్లోబల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో నిర్వహిస్తారు. విద్యార్థికి ఆ కోర్సులకు సంబంధించిన క్రెడిట్స్ లభిస్తాయి. గ్లోబల్ మార్కెట్లో ఉపాధి పొందడానికి, ఉన్నతమైన విదేశీ విద్యను అభ్యసించడానికి ఈ క్రెడిట్స్ ఉపకరిస్తాయి. ఈ ప్రయత్నాలు ఇంకో పది పదిహేనేళ్లు నిర్విఘ్నంగా కొన సాగితే మన విద్యార్థులు ప్రపంచ వేదికపై జైత్రయాత్ర చేస్తారు. అత్యున్నత స్థానాలకు ఎగబాకుతారు. వారితోపాటు వారి కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం, దేశం అభివృద్ధి ఫలాలను అందుకుంటాయి. పేదవాడు అభివృద్ధి చెందడం పెత్తందారీ శక్తులకు నచ్చదు. వారి అభివృద్ధిని ఓర్వలేరు. ఇంతటి విప్లవా త్మకమైన ప్రగతిశీలతకు విత్తనాలు చల్లుతున్న శుభఘడియలకు వారి దృష్టిలో ప్రాధాన్యం లేదు. అందుకే అవి వార్తలు కావు. పైపెచ్చు మసిపూయాలి. బురద చల్లాలి. విధ్వంసం జరుగుతున్నదని ఓండ్రపెట్టాలి. అభివృద్ధి ఎక్కడు న్నదని మొరగాలి. మూలశంక వ్యాధి వికారాన్ని సినిమాల్లో ప్రద ర్శించాలి. ఇప్పుడదే జరుగుతున్నది. పేదలకు విజ్ఞాన ఫలాలు అందకూడదు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉండకూడదనే పెత్తందారుల కుట్ర కేవలం వారి స్వార్థం మాత్రమే కాదు. ఇదొక దేశద్రోహ నేరం. దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు. క్రీస్తుశకం రెండో శతాబ్దం నుంచి ఆరేడు శతాబ్దాల మధ్యకాలంలో భారతీయ మేధావులు చేసిన ఆవిష్కరణలు సామాన్యమైనవి కావు. శూన్యాంకాన్ని (జీరో) ప్రసాదించి ప్రపంచ గణితశాస్త్రాన్ని మలుపుతిప్పిన ప్రతిభాశాలి, గ్రహగతు లను, భూభ్రమణాన్ని నిర్ధారించిన మేధావి ఆర్యభట్ట, గణిత ఖగోళ శాస్త్రజ్ఞులైన భాస్కర – బ్రహ్మగుప్త – వరాహమిహిర, వైద్యశాస్త్ర పితామహుడు చరకుడు, సర్జరీ పితామహుడు సుశ్రుతుడు, ఆటమిక్ థియరీని ప్రతిపాదించిన కణాదుడు, తత్వవేత్త – రసవాద శాస్త్రవేత్త ఆచార్య నాగార్జునుడు, ప్రామా ణిక అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు, యోగశాస్త్ర సృష్టికర్త పతంజలి వగైరాలంతా ఆ కాలంలో జీవించినవారే. కానీ ఆనాటి విజ్ఞాన మంతా సంస్కృత భాషకే పరిమితం కావడం, ఆ భాషను నేర్చుకునే అర్హత పిడికెడు మందికే పరిమితం కావడం జాతికి జరిగిన తీరని ద్రోహం. విశాల ప్రజానీకానికి విద్య అందుబాటులో ఉండి ఉంటే, సంస్కృతం నిషిద్ధం కాకపోయి ఉంటే ఈ మేధావుల ఆవిష్క రణలు మరింత ఊర్ధ్వగతి పొందేవి. వందలాదిమంది శాస్త్ర వేత్తలు ఉద్భవించేవారు. పారిశ్రామిక విప్లవం బ్రిటన్ కంటే రెండు మూడు శతాబ్దాల ముందే భారత్‌లో ప్రభవించేది. మన నెమలి సింహాసనం, మన కోహినూర్ వజ్రం మన దగ్గరే ఉండేవని చెప్పడం చాలా చిన్న విషయం. ఇంకా ఏమేమి జరిగి ఉండేవనేది ఒక అధ్యయనాంశం. ఇప్పుడు కూడా ప్రపంచ భాష ఇంగ్లిష్ నేర్చుకోవద్దనీ, నాణ్యమైన విద్యను అభ్యసించ కూడదనీ పేదవర్గాలను మన పెత్తందార్లు శాసిస్తున్నారు. ఇదే దేశద్రోహం. ఈ దేశద్రోహానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పేద వర్గాల ప్రజలు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో యుద్ధానికి సిద్ధ మవుతున్నారు. పెత్తందారీ – కార్పొరేట్ శక్తులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సకల రాజకీయ పక్షాలను ఏకం చేసి మోహ రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ‘కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగ...’ అన్నట్టు అతివాద మితవాద పార్టీలన్నీ ఎవరి దారిలో వారు ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. పెత్తందార్ల సేవలో తరిస్తున్నారు. చివరికి త్యాగాల చరిత గల పతాకాలనూ అపవిత్రం చేస్తున్నారు. పేదవర్గాలు ఈ పరిణామాలను గమనించాయి. సమరోత్సాహంతో నినదిస్తున్నాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
AP: ‘ఐబీ’ సిలబస్ శిక్షణ ఇదిగో
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి గత నెల 31వతేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఐబీ సంస్థతో ఏపీ ఎస్సీఈఆర్టీ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 రోజుల వ్యవధిలో ఐబీ ప్రతినిధులు ఏపీలో విద్యా విధానం, సంస్కరణల అమలు, ఉపాధ్యాయ శిక్షణ తదితర అంశాలను పరిశీలించారు. ఒప్పందం జరిగిన వెంటనే విజయవాడలోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఐబీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సంస్థ ప్రతినిధులు కార్యకలాపాలు ప్రారంభించారు. ఈనెల 26వతేదీ నుంచి 9 రోజుల పాటు ఐబీ అధికారుల బృందం జిల్లాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా, మండల, మున్సిపల్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర మేనేజ్మెంట్ పాఠశాలను బృందం పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, ఉపాధ్యాయుల సామర్థ్యాలను అంచనా వేయనున్నారు. – సాక్షి, అమరావతి తొలుత విజయవాడలో టీచర్లకు శిక్షణ ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ బోధనపై మార్చి నుంచి విజయవాడలో మాస్టర్ ట్రైనర్స్‌గా తొలుత కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు. మెక్సికోకు చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ఇటీవల ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను స్వయంగా పరిశీలించారు. సదుపాయాలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ల పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు వారితో సంభాషించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ను సైతం రుచి చూశారు. పాఠశాలల్లో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఐబీకి చెందిన మరో ప్రతినిధి ఆశిష్ రెండు రోజులు విద్యాశాఖ అధికారులతో సమావేశమై పాఠశాలల్లో ఐటీ, ఆన్లైన్ సేవలను తెలుసుకున్నారు. ఏపీ విద్యా విధానాలు ఐబీకి దాదాపు దగ్గరగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి.. ఐబీ అమలుపై 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయులతోపాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డు సిబ్బంది వీరిలో ఉంటారు. వీరికి దశలవారీగా ‘ఐబీ’పై అవగాహన, నైపుణ్యం, సామర్థ్యాల పెంపుపై శిక్షణ ఇచ్చి ఐబీ సర్టిఫికెట్లు అందచేస్తారు. దీంతో వీరంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్‌వర్క్‌లో భాగమవుతారు. అనంతరం 2025 జూన్‌లో ప్రారంభమయ్యే 2025–26 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతితో ఐబీ విద్యాబోధన ప్రారంభం అవుతుంది. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ వెళతారు. విద్యార్థులు 2035 నాటికి పదో తరగతి, 2037లో ప్లస్ 2లో ఐబీ సిలబస్‌లో పరీక్షలు రాస్తారు. విద్యార్థులకు ఐబీ, ఏపీ ఎస్సీఈఆర్టీ కలిసి అందించే జాయింట్ సర్టిఫికేషన్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. రూ.73 వేల కోట్లతో సంస్కరణలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేద పిల్లలు అధికంగా చదువుకునే పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రాథమిక స్థాయి నుంచి ప్రణాళికలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసింది. 2019 జూన్ నుంచి 2024 జనవరి వరకు విద్యా రంగ సంస్కరణల కోసం ఏకంగా రూ.73,293.68 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు ఐబీ బోధనను సైతం ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులోకి తెస్తోంది. అత్యధిక ఐబీ స్కూళ్లు ఏపీలోనే.. ప్రాథమిక విద్యా బోధనలో ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను ఫిన్‌ల్యాండ్ అమలు చేస్తోంది. పాలనలో పారదర్శకత, మానవ వనరుల వినియోగం, ప్రణాళికలో ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తోంది. ప్రస్తుతం ఐబీ బోర్డు డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఓలి పెక్కా హీనోనెన్ ఫిన్‌ల్యాండ్ జాతీయ విద్యాశాఖకు డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. ఆయనే స్వయంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విధానాలను పర్యవేక్షిస్తుండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల వరకు ఐబీ స్కూళ్లు ఉండగా 2025 జూన్‌లో ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలువనుంది. ఏపీలో దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ (ప్రాథమిక, ప్రాథమికోన్నత) స్కూళ్లు 39 వేల వరకు ఉన్నాయి. ఈ స్కూళ్లలో 2025 జూన్‌లో ఒకటో తరగతితో ఐబీ బోధన ప్రారంభం కానుంది. అంతర్జాతీయంగా పేరున్న ఐబీ బోర్డుకు ప్రపంచంలోనే అతి పెద్ద నెట్వర్క్ మన రాష్ట్రంలోనే ఉండడం విశేషం. -
ఏపీ విద్య రంగంలో చారిత్రాత్మక మార్పులు
-
ఏపీలో భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్యే లక్ష్యంగా..: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఐబీ’ విద్య అమలుకు శ్రీకారం చుట్టింది జగనన్న ప్రభుత్వం. ఈ క్రమంలో.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో SCERT, IB మధ్య ఒప్పందం కుదిరింది. తద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠశాలల్లో శ్రీమంతుల పిల్లలు చదువుకునే ‘ఇంటర్నేషనల్ బాకలారియెట్’ (ఐబీ) సిలబస్ పేద పిల్లలకు చేరువ కానుంది. ఐబీ సిలబస్ అమలుపై బుధవారం సాయంత్రం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు సీఎం జగన్ సమక్షంలో ఏపీ విద్యాశాఖతో ఒప్పందం చేసుకున్నారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్) డాక్టర్ అంటోన్ బిగిన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి జెనీవా నుంచి వర్చువల్‌గా ఐబీ డైరెక్టర్ జనరల్ ఒల్లి పెక్కా హీనోనెన్ పాల్గొన్నారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. ‘‘ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం నాకు గొప్ప సంతృప్తి నిస్తోంది. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కాకు, ఆన్లైన్ ద్వారా హాజరైన వారితో పాటు ఇక్కడకు వచ్చిన ఐబీ ప్రతినిధులకు ధన్యవాదాలు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనది నేను భావిస్తున్నా. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం ఇది గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమం. నాణ్యమైన విద్యను భవిష్యత్తు తరాలకు అందించడం అన్నది చాలా ముఖ్యం. భవిష్యత్తు తరాలు.. మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, భవిష్యత్ ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలవాలన్నా భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరం. .. ఇప్పుడున్న విద్యావిధానాలను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్య ప్రపంచంతో పోల్చిచూస్తే సాంకేతికత, పాఠ్యప్రణాళిక తదితర అంశాల్లో అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. సమస్యా పూరణ సామర్ధ్యం, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మోడల్లో ఎడ్యుకేషన్ నాలెడ్జ్‌ని వినియోగం వంటివి చాలా కీలకం. ఐబీ ద్వారా ఇది సాధ్యమని విశ్వసిస్తున్నాం. ఐబీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఐబీతో భాగస్వామ్యం ద్వారా ఒక ప్రయాణం ప్రారంభమైంది. ముందు టీచర్లకు, సిబ్బందికి కెపాసిటీని పెంచేలా శిక్షణ కార్యక్రమాలు రానున్న విద్యాసంవత్సరంలో అమలవుతాయి. సంపన్నులకు మాత్రమే అందే ఐబీ విద్య అన్న పరిస్థితి ఇప్పుడు మారుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలవుతుంది. పదేళ్లలో 2035నాటికి పదోతరగతి, 2037 నాటికి పన్నెండు తరగతిలో ఐబీ బోధన మొదలవుతుంది. పేదలకు, అణగారిన వర్గాలకూ ఐబీ బోధన అందుతుంది. ఎస్ఈఆర్టీలో ఐబీ భాగస్వామ్యం కావడం వల్ల విద్యా బోధన, అభ్యాసాలు పరిణామం చెందుతాయి. ఇది కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. 2024 – 25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. టీచర్లతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బందికి ‘ఐబీ’పై అవగాహన, సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు. దీంతో వారంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్‌వర్క్‌లో భాగమవుతారు. 2025 జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్‌ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్(పాఠశాల మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ బి శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ(మిడ్ డే మీల్స్) డైరెక్టర్ ఎస్.ఎస్. శోభికా, ఐబీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతే.. సీఎం జగన్ లక్ష్యం: మంత్రి చెల్లుబోయిన
-
ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం జగన్
తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రెండో సారి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం ఖాయమని ప్రకటించారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ప్రజలను ధైర్యంగా అడుగుతున్నానని సీఎం జగన్ చెప్పారు. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తామన్న సీఎం జగన్.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామని, మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు ఇది నిదర్శనమని చెప్పిన సీఎం జగన్... కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని, విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినట్టే.. తమ కుటుంబాన్ని కూడా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ చెప్పినదాంట్లో ముఖ్యాంశాలు పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు అయితే విద్య అలాంటి అంశాలపై దృష్టి పెట్టకపోతే పేదరికాన్ని నిర్మూలించలేం నేను ఏ హామీ ఇచ్చాను, ఏం చేశాను అన్నది చూడాలి మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.4 శాతం అమలు చేశాను అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేశాం కచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు కాని ఈ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ చేయగలిగింది చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది నాకు లేనే లేదు చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది.? సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా? వాటిని చూసి కన్విన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికి పెద్దగా లేదు పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే ఉంటుంది ప్రతి పార్టీ కూడా సర్వేలు చేస్తుంది వాటి ఫలితాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు కాని కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం జాతీయ రాజకీయాలు విషయంలో మా విధానం స్పష్టం: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నాం: కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతూ ఉంటుంది అది ఆ పార్టీ సంప్రదాయంగా గమనిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించాలనుకుంది అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు వారు పాఠాలు నేర్వలేదు కాంగ్రెస్ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు ఇండియాటుడే తరపున రాజ్‌దీప్ ప్రశ్నలు, ముఖ్యమంత్రి జగన్ సమాధానాలు సవివరంగా.. రాజ్‌దీప్ : తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో విద్యపై సదస్సు నిర్వహించడం సంతోషకరం, చదువుతో వచ్చే మార్పు ఏంటన్నది కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఆ మార్పే చోటు చేసుకోబోతుంది. ఏపీలోని అత్యంత సామాన్య విద్యార్థులు అమెరికాలోని వాషింగ్టన్ డీసీని పర్యటించడం గొప్ప విషయం సీఎం జగన్ : ఇండియా టుడే జర్నలిస్టులు తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాలలు చూడడం గొప్ప విషయం పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది నా బలమైన నమ్మకం నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు కావాలి పేదలు చదివేది ఒకటయితే, ధనిక పిల్లలు చదివేది మరొకటి పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది, ధనిక పిల్లలు ఇంగ్లీషులో చదివేవారు రాజ్‌దీప్ : మూడో తరగతి నుంచే గ్లోబల్ ఎగ్జామ్ టోఫెల్ లాంటిపై అవగాహన కల్పించేలా చేసిన మార్పులపై విమర్శలొచ్చాయి. తెలుగు మీడియంలోనే బోధించాలని విమర్శలు చేశారు కదా.? సీఎం జగన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధించేలా చేయరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? నన్ను, ప్రభుత్వ విధానాలను విమర్శించే ముందు మీ విధానాలను ప్రశ్నించుకోండి రాజ్‌దీప్ : అకస్మాత్తుగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు పాఠశాల మానేసే ప్రమాదం లేదా? సీఎం జగన్ : ఇలా జరక్కుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్ పెట్టాం. మా బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్ అంశాలను చేర్చాం. పాఠశాలలు అన్నింటిలోనూ సౌకర్యాలు మెరుగుపరిచాం. ఒక విధంగా చెప్పాలంటే సమగ్ర ప్రణాళికతో వీటిని అమల్లోకి తెచ్చాం. నాడు-నేడు తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాం. 62వేల తరగతి గదులుంటే .. 40 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ టీవీలు ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరుకల్లా మిగతా చోట కూడా పూర్తవుతాయి. టీచర్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా ప్రణాళికకు ఒక సమగ్ర రూపం తీసుకొచ్చాం. 8వ తరగతి విద్యార్థులందరికీ ఒక ఆధునికమైన టాబ్ నేర్చుకునేందుకు అందించాం. రాజ్‌దీప్ : 8వ తరగతి విద్యార్థికి టాబ్ ఇచ్చారా? కోవిడ్ సమయంలో తగిన సాధన సంపత్తి (టీవీలు, మొబైళ్లు, టెక్నాలజీ) లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు? ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు కదా.? వచ్చే మూడేళ్లలో పదో తరగతి విద్యార్థులందరికీ టాబ్లు ఉంటాయని నమ్మకంగా చెప్పగలరా? సీఎం జగన్ : 8వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టాబ్‌లున్నాయి. డిసెంబర్ 21న టాబ్లు ఇచ్చాం. నా పుట్టిన రోజు నాడు నేనే తరగతి గదికి వెళ్లి పిల్లలను కలిసి వాళ్లకు టాబ్ అందజేస్తాం. రాజ్‌దీప్ : ప్రభుత్వాల్లో పనులు అంత వేగంగా జరగవని చెబుతారు, మీరు మీ యంత్రాంగాన్ని తగిన విధంగా ప్రోత్సహిస్తున్నారా? IB సిలబస్ కూడా ప్రవేశపెట్టారా? అది కేవలం కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉంది కదా.? అయితే ఇదంతా తొందరపడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. తల్లితండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత మంచి అవకాశం ఎలా వచ్చిందని.? సీఎం జగన్ : ఐబీ సిలబస్ మన రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో చేతులు కలిపింది. IB అన్నది ప్రస్తుతం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. జూన్ 2025 తర్వాత మొదటి తరగతిలో IB సిలబస్ ప్రవేశపెడతాం. అక్కడి నుంచి దశలవారీగా ఏడో తరగతి వరకు ప్రవేశపెడతాం. ఐదేళ్ల తర్వాత మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్ సర్టిఫెకెట్ కోసం పోటీ పడతారు. ఈ ప్రయత్నం ఎందుకంటే.. విద్యలో నాణ్యత అనేది చాలా ముఖ్యం. అదే లేకుంటే మా రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేరు కదా.. ఈ పోటీలో కేవలం ధనికులు మాత్రమే గెలిచే పరిస్థితి ఉండకూడదు, అణగారిన వర్గాల వారికి కూడా అవకాశం దక్కాలి రాజ్‌దీప్ : అది గొప్ప దార్శనికతే. గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన విద్యార్థి పోటీ పడాలన్న ఆలోచన మంచిదే. కానీ విద్యార్థులకు మంచి బోధన అందించేందుకు నాణ్యమైన ఉపాధ్యాయులు ఉన్నారనుకుంటున్నారా? సీఎం జగన్ : ఒక మంచి ఆలోచనకు మావంతు ప్రయత్నం జోడిస్తున్నాం. IB, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి. IBతో చర్చలు జరిపి మాతో కలిసి పని చేసేలా వారిని ఒప్పించాం. ఇందుకు వారిని అభినందిస్తున్నాను. ఫలితంగా IB తన అధికారిక కార్యాలయాన్ని SCERTతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది. ఇది విప్లవాత్మకమైన మార్పుకు నాంది. 2035 నాటికి IBలో చదువుకున్న విద్యార్థులు పదో తరగతిలో ప్రవేశిస్తారు. ఈ లక్ష్యంతోనే మేం పని చేస్తున్నాం. రాజ్‌దీప్ : ఈ పన్నెండేళ్ల ప్రాజెక్టులో IB తో కలిసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నది మీ ఆలోచనా? దీనికి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి, తగినన్ని మీ దగ్గర నిధులున్నాయా? సీఎం జగన్ : ముందు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ.. చిన్న నుంచి పెద్ద తరగతుల వారికి IB బోధన ఇస్తున్నాం ఆ తర్వాత 11, 12 తరగతుల వరకు IB సిలబస్ బోధన అందుతుంది ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అన్న విషయం IBకి కూడా తెలుసు. వాళ్లు కూడా ప్రభుత్వంలో భాగమైనందున.. మిగిలిన వారి వద్ద తీసుకునే స్థాయిలో రాయల్టీలాంటివి ఉండకపోవచ్చు. అట్టడుగు స్థాయి విద్యార్థులకు కూడా అంతర్జాతీయ స్థాయి విద్యను అందించవచ్చన్నది ప్రపంచానికి తెలిపేందుకు ఏపీ ప్రభుత్వం, IB కలిసి చేస్తున్న ప్రయత్నం ఇది. ఇక నిధుల విషయానికొస్తే.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.14వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇప్పటివరకు రూ.8200 కోట్లను ఖర్చు పెట్టాం. నాడు-నేడు తొలిదశలో భాగంగా మొత్తం 44వేల పాఠశాలల్లో 15వేల పాఠశాలలు పూర్తయ్యాయి. రెండో దశలో భాగంగా 16వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. మార్చి నాటికి రెండో దశ పూర్తవుతుంది. వచ్చే ఏడాది మిగిలిన పాఠశాలల్లో పనులు చేపడుతాం. రాజ్‌దీప్ : 2018లో ఏపీలో పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల శాతం 84.48, ఆ ఏడాది జాతీయ సగటు 99.21. ఈ పరిస్థితుల్లో డ్రాపవుట్లను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు? జగనన్న అమ్మ ఒడిలా నేరుగా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తారా? ఆ డబ్బును పిల్లల చదువుకు ఖర్చు పెట్టేలా చూస్తారా? సీఎం జగన్ : మేం పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అట్టడుగున ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మధ్యాహ్నా భోజన పథకాలు, అమ్మ ఒడి లాంటి వాటి సాయంతో డ్రాప్ అవుట్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. మా రాష్ట్రంలో అమలవుతోన్న మధ్యాహ్న భోజన పథకం చాలా వినూత్నమైంది. గోరు ముద్ద పేరుతో ఇస్తోన్న ఈ పథకంలో ఒక్కో రోజు ఒక్కో మెనూతో పౌష్టికాహరం అందిస్తున్నాం. అవసరమయితే రాష్ట్రంలోని ఏ పాఠశాలకైనా మీరు వెళ్లి పరిశీలించుకోవచ్చు. రాజ్‌దీప్ : ఈ పథకాల అమలును ఎలా పర్యవేక్షిస్తున్నారు? గతంలో ప్రభుత్వాలు పాఠశాలలపై పెద్దగా దృష్టి పెట్టలేదు కదా.? నాకిపుడు అర్థమైంది మీరు ఢిల్లీలో ఎందుకు తక్కువ సమయం గడుపుతారన్నది అయితే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గతంలోనూ ఒక సమస్య ఉండేది, ఈ రాష్ట్ర యువతకు నిరుద్యోగం సమస్య ఎక్కువ. ఒక దశలో 35% దాకా ఉండేది. ఈ నేపథ్యంలో వీరికి నైపుణ్యాలు అందించడం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం ఒక సవాలేనా? సీఎం జగన్ : ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా చూస్తోంది. నేనే స్వయంగా పాఠశాలలను పర్యవేక్షిస్తున్నాను. కలెక్టర్లతో నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నాను. మేం పాఠశాల విద్య మీద మాత్రమే కాదు ఉన్నత విద్యపైనా దృష్టి పెట్టాం. ఉద్యోగాలకు అవసరమైనట్టుగా బోధనాంశాల్లో మార్పులు చేశాం. మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో భాగంగా ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాం. అన్ని డిగ్రీలను నాలుగేళ్లు చేస్తున్నాం, ఆన్లైన్ కోర్సులు ఇస్తున్నాం. ఇందులో భాగంగానే త్వరలో ఎడెక్స్తోనూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. పిల్లలు ఆన్లైన్లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం బీకాం నేర్చుకునేవారికి అసెట్ మేనేజ్ మెంట్ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం: ------------- విద్యారంగంలో ఏపీ కొత్త ఒరవడి 5.12pm, జనవరి 24, 2024 విద్యా రంగంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై ఇంట్రో ఏపీలో విద్యారంగంలో సమూల మార్పులు, విద్యా రంగంలో ఆంధ్ర మోడల్, కొత్త ఒరవడి సృష్టించిన సీఎం జగన్ ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు సీఎం జగన్ 5.11pm, జనవరి 24, 2024 ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చర్చ తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ 5.10pm, జనవరి 24, 2024 మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సీఎం జగన్ తిరుపతిలోని ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ Updates: ►ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం జగన్ ►ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానం, మన బడి నాడు - నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, టోఫెల్ శిక్షణ మొదలైన అంశాలపై చర్చ ►దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానంపై ఇండియా టుడే సమ్మిట్ ప్రతినిధులు ప్రశంస ►రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►మరి కొద్దిసేపట్లో తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు హాజరుకానున్న సీఎం జగన్ ►తిరుపతి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడే జరిగే ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు పర్యటన వివరాలను సీఎంవో తెలియజేసింది. బుధవారం సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి సీఎం జగన్ తిరుపతికి( Tirupati ) బయలుదేరతారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తాజ్ హోటల్‌కు వెళ్తారు. అక్కడ జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి ప్రయాణం అవుతారు. సీఎం రాక నేపథ్యంలో.. తిరుపతిలో అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. -
ఐబీ సిలబస్ అమలుపై అధ్యయనం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం మొదలైంది. ఇప్పటికే గుంటూరు, విజయవాడల్లోని ఐబీ స్కూళ్లలో సిలబస్ అమలును పాఠశాల విద్యా శాఖ పరిశీలించింది. అయితే, ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ రెండేళ్లుగా అమలవుతోంది. ఈ క్రమంలో శనివారం పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ నేతృత్వంలోని బృందం అక్కడి పాఠశాలలను పరిశీలించింది. ఐబీ సిలబస్ బోధిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాలు, విద్యార్థులకు బోధిస్తున్న విధానంపై అధ్యయనం చేసింది. ఏపీలో ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు ఉపాధ్యాయుల శిక్షణ, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ ఆవశ్యకతను అర్థం చేసుకునేందుకు, విధివిధానాలను తెలుసుకునేందుకు ఢిల్లీ వెస్ట్ వినోద్నగర్లోని సర్వోదయ కన్య విద్యాలయ (ఎస్కేవీ)ను వీరు సందర్శించారు. ఒకటి, మూడు, ఐదో తరగతి విద్యార్థులతో మమేకమై వివిధ అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, ఐబీ సిలబస్ అమలుపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ప్రభుత్వం ఇటీవల స్టీరింగ్ కమిటీని నియమించిన నేపథ్యంలో ఆ కమిటీ ఢిల్లీ స్కూళ్లను పరిశీలించింది. -
సర్కారు బడిలో అంతర్జాతీయ విద్య
సాక్షి, అమరావతి: ‘మన పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలి. ప్రపంచానికి దిక్సూచిగా మారాలి. అందుకోసం వారికి మీ జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చి డిజిటల్ బోధన ప్రవేశపెట్టాం. సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నాం. మన పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బక్‌లారియెట్ (ఐబీ) బోధన కూడా ప్రవేశపెడతాం’’ జగనన్న ఆణిముత్యాలు రాష్ట్ర స్థాయి సత్కార వేడుకలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాట ఇది. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఐబీ సంస్థతో బుధవారం ఒప్పందం చేసుకుని ఆచరణలోకి తెచ్చారు. ఇప్పటికే సర్కారు బడిలో సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్ బోధనను అందుబాటులోకి తె చ్చిన ప్రభుత్వం ఇప్పుడు ‘ఐబీ’ చదువులను సైతం పేద పిల్లలకు చేరువ చేస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 210 వరల్డ్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఐబీ సిలబస్ అమల్లో ఉంది. ఈ స్కూళ్లలో సంపన్నులు మాత్రమే తమ పిల్లలను చదివించగలరు. అలాంటి చదువులను రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలోకి తెచ్చి పేద పిల్లలకు అందించాలన్న సంకల్పంతో జగన్ సర్కారు ముందడుగు వేసింది. ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ ప్లస్2 వరకు విద్యనందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రపంచం మె చ్చిన విద్యా విధానం సాధారణంగా ప్రైవేటు స్కూళ్లలో మార్కులు.. ర్యాంకులు.. ఒకరితో మరొకరికి పోటీతో పిల్లలపై విపరీతమైన ఒత్తిడి పెంచుతారు. దీనికి భిన్నంగా మానసిక ఒత్తిడి లేకుండా పిల్లలు సొంతంగా ఎదగడంతో పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బోధనను ఐబీ అందిస్తుంది. ఐబీ ఒక నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్. పిల్లలపై పరీక్షల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన కొంత మంది ఉపాధ్యాయులు పరిశోధన చేసి 1968లో స్విట్జర్లాండ్‌లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ బోర్డు. ఇందులో 3 నుంచి 19 ఏళ్ల వయసు విద్యార్థులకు నాణ్యమైన శిక్షణనిస్తారు. ఈ సిలబస్ చదువుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానం, క్రిటికల్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్, సెల్ఫ్ లెరి్నంగ్ వంటి నైపుణ్యాలు అలవడతాయి. ఓపెన్–మైండెడ్, ఓపెన్ లెర్నింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను ఆకళింపు చేసుకుని, సానుకూల మార్పునకు ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారు. ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 159 దేశాల్లో ఈ విద్యా విధానం అమలులో ఉంది. ఈ బోర్డులో చదువుకున్న పిల్లలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రవేశాలు, అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలు, ఇతర కోర్సులు అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్న నేటి యుగంలో ‘ఐబీ సిలబస్’లో పిల్లల నైపుణ్యాలను అంచనా వేసే అంతర్గత పరీక్షలేగాని అధికారిక పరీక్షలు ఉండవు. నాలుగు దశల్లో ప్రోగ్రాములు ఐబీ ప్రోగ్రాములు నాలుగు దశల్లో ఉంటాయి. 3 నుంచి 12 సంవత్సరాల వయసు విద్యార్థులకు ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్ (పీవైపీ) అందిస్తారు. ఇందులో పిల్లలకు నేర్చుకునే ఆసక్తి పెంచడం, కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్, సొంతంగా ఆలోచించడం వంటివి నేర్పిస్తారు. ఈ ప్రోగ్రాంలో పరీక్షలు గానీ, గ్రేడింగ్ కానీ ఉండవు. పదేళ్ల ఈ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత చివరలో సైన్స్ ఎగ్జిబిషన్ వంటిది నిర్వహించి పిల్లలను భాగస్వామ్యం చేస్తారు. ♦ కాగా, 11 నుంచి 16 సంవత్సరాల విద్యార్థులకు మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్ (ఎంవైపీ) ఉంటుంది. ఇందులో విద్యార్థులకు ఆర్ట్స్, లాంగ్వేజ్, లాంగ్వేజ్ అక్విజిషన్, మ్యాథ్స్, డిజైన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇండివిడ్యువల్స్ అండ్ సొసైటీస్, సైన్సెస్ అనే 8 గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపు నుంచి విద్యార్థులు కనీసం ఒక సబ్జెక్ట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో పిల్లలు నైపుణ్యాలను ఎంత నేర్చుకుంటున్నారు అనే దానిని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఈ కోర్సు ప్రస్తుతం మన పదో తరగతికి సమానం. ♦ ఇక 16 నుంచి 19 ఏళ్ల వయసున్న విద్యార్థులకు డిప్లొమా ప్రోగ్రామ్ (డీపీ) ఉంటుంది. మూడేళ్ల పాటు ఉండే ఈ ప్రోగ్రామ్‌లో లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, లాంగ్వేజ్ అక్విజిషన్, సైన్స్, ఆర్ట్స్, మ్యాథ్స్, ఇండివిడ్యువల్స్ అండ్ సొసైటీస్ అనే 6 గ్రూపులు ఉంటాయి. డిప్లొమా ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత చివర్లో సరి్టఫికెట్ ప్రదానం చేస్తారు. మన ప్లస్ 2 విద్యకు సమానమైన ఈ డిప్లొమా సర్టిఫికెట్ ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా చెల్లుతుంది. ♦ ఇదే వయసున్న (16–19 సం.) విద్యార్థుల కోసం కెరీర్ రిలేటెడ్ ప్రోగ్రామ్ (సీపీ) డిజైన్ చేశారు. ఇది విశ్వవిద్యాలయాలు, ఉపాధి, తదుపరి ట్రైనింగ్ కోసం విద్యార్థులను సిద్ధం చేసే రెండేళ్ల ప్రోగ్రామ్. విద్యార్థులు ఎంచుకున్న కెరీర్లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను, జ్ఞానాన్ని పెంపొందిస్తారు. విశ్వ మానవుడిగా ఎదుగుదల ఐబీ విద్య విద్యార్థులకు విమర్శనాత్మకంగా ఆలోచించడం, ప్రశి్నంచడం అలవాటు చేస్తుంది. ఇది సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించే సామర్థాన్ని ఇస్తుంది. రాయడం, మాట్లాడటం, ప్రెజెంటేషన్ సహా వివిధ మార్గాల్లో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసే నైపుణ్యాలు బోధిస్తారు. వారి చదువు, కెరీర్‌ను మరింత విజయవంతం చేసేందుకు దోహదం చేస్తుంది. ఐబీ విద్యార్థులు విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల గురించి నేర్చుకుంటారు. ఇది వారికి మరింత సహనాన్ని, ఇతరులను అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని అందిస్తుంది. విద్యార్థులు బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరులుగా తయారు చేస్తారు. ప్రపంచంలో ఏమూల ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా అక్కడ సానుకూల మార్పును తీసుకురావడానికి ఈ విద్య సహాయపడుతుంది. అంతర్జాతీయంగా అత్యున్నత కెరీర్‌ను సొంతం చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో 210 ఐబీ స్కూళ్లు వాస్తవానికి ఇంటర్నేషనల్ బాకలారియెట్ చదువులు చాలా ఖర్చుతో కూడుకున్నది. మన దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముస్సోరి, కొడైకెనాల్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు పరిధిలో 210 ఐబీ వరల్డ్ స్కూల్స్ ఉన్నా యి. వాటిల్లో ఏడాదికి రూ. 6 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. చాలా స్కూళ్లలో ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్ (3–12సం.) మాత్రమే అందిస్తుండగా, కొన్ని కొన్ని మిడిల్ ఇయర్ ప్రోగ్రామ్ (11–16 సం.) వరకు, అతి తక్కువ స్కూళ్లు మాత్రం డిప్లొమా ప్రోగ్రామ్ (డీపీ) వరకు బోధిస్తున్నాయి. -
ఐబీ సిలబస్ సవాల్‌తో కూడుకున్నది: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: జగనన్న సర్కార్‌లో.. ఏపీ ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగు పడింది. ప్రభుత్వ బడి పిల్లలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు.. అందుబాటులోకి ఐబీ సిలబస్ రానుంది. ఈ మేరకు సచివాలయంలోని తన కార్యాలయంలో ఐబీ సంస్థతో ఎంవోయూ memorandum of understanding (MOU) జరిగిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. ‘‘విద్యలో నాణ్యతను పెంచడం ప్రధాన లక్ష్యం. మా పిల్లలను ప్రపంచంలో అత్యుత్తమంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకోసమే మీ సహకారాన్ని కోరుతున్నాం. ఇక్కడ విద్యార్థులు సంపాదించే సర్టిఫికెట్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా ఉండాలన్నది మా ఉద్దేశం. ఐబీ సిలబస్ అనేది సవాల్‌తో కూడుకున్నది. అందులోనూ ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టడం అనేది ఇంకా పెద్ద సవాల్. కానీ సంకల్పం ఉంటే సాధ్యంకానిది లేదు. పాఠశాల విద్యను బలోపేతంచేయడానికి అనేక చర్యలు తీసుకున్నాం. అవన్నీ మీ దృష్టికి వచ్చే ఉంటాయి. ఏపీలో పాఠశాల విద్యను అత్యంత నాణ్యంగా తీర్చిదిద్దాం. స్కూళ్లను బాగుచేయడం దగ్గరనుంచి డిజిటలైజేషన్ వరకూ అనేక చర్యలు తీసుకున్నాం. బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ తీసుకు వచ్చాం. పిల్లాడిని స్కూలుకు పంపే తల్లికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. టోఫెల్ పరీక్షల్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రతిరోజూ ఒక పీరియడ్ టోఫెల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నాం. అన్ని స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో బోధిస్తున్నాం. దీంట్లో భాగంగానే ఐబీని తీసుకు వచ్చాం. ఇది ఒక రోజుతో సాధ్యం అయ్యేది కాదు. ఒకటో క్లాసుతో మొదలు పెడితే దీని ఫలితాలు పదేళ్ల తర్వాత కనిపిస్తాయి. ఇలా చూసుకుంటే పూర్తిస్థాయిలో రావడానికి పదేళ్లు పడుతుంది. దిగువస్థాయిలో ఉన్న పేదల వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే మా ఉద్దేశం. దేవుడి దయ వల్ల ఈ లక్ష్యం సిద్ధిస్తుంది. ఐబీ భాగస్వామ్యానికి కృతజ్ఞతలు అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టే నిర్ణయానికి ఇవాళే ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాతే ఐబీ సంస్థతో ఎంవోయూ కార్యక్రమం జరిగింది. సింగపూర్, వాషింగ్టన్ డీసీ, జెనీవా, యూకేల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఐబీ డైరెక్టర్ జనరల్ Olli-Pekka Heinonen, ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ Matt Costello పాల్గొని మాట్లాడారు. ఐబీ అంటే ఇంటర్నేషల్ బ్యాకలోరియెట్ అని అర్థం. ఈ విద్యా విధానంలో చదువుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానం, క్రిటికల్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్, సెల్ఫ్ లెర్నింగ్ లాంటి నైపుణ్యాలు అలవడతాయి. ఓపెన్-మైండెడ్, ఓపెన్ లెర్నింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో సానుకూల మార్పునకు ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారు. ఉన్నతా విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. -
కశ్మీర్లో ఆత్మాహుతి దాడి : ఐబీ హెచ్చరికలు
శ్రీనగర్ : ఉగ్రవాద సంస్థ అన్సార్ గజ్వాత్ ఉల్- హింద్ చీఫ్ జకీర్ మూసా కశ్మీర్లో ఆత్మాహుతి దాడులు జరిపించేందుకు పథకం రచిస్తున్నాడని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పంజాబ్, జమ్ము కశ్మీర్ పోలీసులే లక్ష్యంగా దాడులకు తెగబడనున్నట్లు పేర్కొన్నాయి. తన అనుచరుడు రేహాన్‌తో కలిసి దాడులు నిర్వహించేందుకు కశ్మీర్ యువకులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు సమాచారం అందినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కల్లోలం సృష్టించేందుకు జకీర్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్న ఐబీ.. పోలీసు స్టేషన్లు, భద్రతా బలగాల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడికి పాల్పడే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇందుకోసం ఇప్పటికే కశ్మీర్లోకి కొంత మంది జీహాదీలు చొరబడినట్లు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పంజాబ్, కశ్మీర్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. -
ఫింగర్ ప్రింట్ స్కాం విచారణ.. షాకింగ్ నిజాలు..
సాక్షి, హైదరాబాద్ : ఫింగర్ ప్రింట్ స్కాం నిందితుడు సంతోష్ విచారణ మొదటి రోజు ముగిసింది. నిందితుడు సంతోష్‌ను ఐబీ, రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్‌లు గురువారం విచారించాయి. టార్గెట్ పూర్తి చెయ్యడానికే ఫేక్ వేలిముద్రల తయారీ చేపట్టినట్లు అతను అంగీకరించాడు. విచారణలో వెల్లడైన అంశాలు.. ఈ వ్యవహారం గత 8నెలలుగా సాగుతుందని అతను చెప్పాడు. దాదాపుగా 1400లకు పైగా డాక్యుమెంట్ల డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిసింది. అంతేకాక 3వేలకుపైగా వేలిముద్రలు సేకరించి, 3వేల నుంచి 4వేల సిమ్ కార్డ్స్ యాక్టివేట్ చేసినట్లు సమాచారం. ల్యాండ్ డాక్యుమెంట్ల నుంచి వేలి ముద్రలు సేకరించినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ఇండియన్ మార్ట్ అనే సంస్థ నుంచి ఫింగర్ ప్రింట్ తయారీ యంత్రాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. సిమ్‌కార్డులను, ఫేక్ ఫింగర్ ప్రింట్లను దగ్ధం చేసినట్లు నిందితుడు తెలిపాడు. వెస్ట్ జోన్ పోలీసులతో పాటు, ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్‌లు సంతోష్‌ను విచారించారు. -
పుత్రోత్సాహం
పుత్రోత్సాహం కొడుకు పుట్టినప్పుడు కాదు ఏదైనా సాధించినప్పుడు కలుగుతుంది అని సుమతీ శతకం చెబుతుంది. అరవింద్ సామి కూడా ఇప్పుడు ‘పుత్రోత్సాహాన్ని’ ఆస్వాదిస్తున్నారు. ఆయన కుమారుడు రుద్ర ఐబీ ప్రోగ్రామ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటూ – ‘‘ఐబీ ప్రోగ్రామ్ నుంచి మా అబ్బాయి గ్రాడ్యుయేట్ అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ మైల్స్టోన్ రీచ్ అయిన అందరికీ కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. ‘నీ లైఫ్‌ను హ్యాపీగా, ప్రేమతో, ప్రశాంతంగా, నిజాయితీగా, సమగ్రతతో లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రపంచానికి ఉపయోగపడేలా ఉండు. పెద్ద పెద్ద కలల్ని కను. గుర్తుపెట్టుకో.. పతీదీ పాజిబులే’’ అని రుద్రకు నాలుగు మంచి మాటలు చెప్పారు అరవింద్ సామి. ఐబీ (ఇంటర్నేషనల్ బ్యాకులోరియట్) డిగ్రీ చాలా ప్రెస్టీజియస్ గ్లోబల్ డిగ్రీ. ఐబీ ఫాలో అయ్యే స్కూల్స్ అందరూ గ్లోబల్ సిలబస్ ఫాలో అవుతుంటారు. కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా టైమ్ మేనేజ్మెంట్, రియల్ వరల్డ్ స్కిల్స్ ఇలా ప్రతీదాంట్లో స్టూడెంట్స్‌ను ట్రైన్ చేస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా బతకగలిగే పర్ఫెక్ట్ సిటిజన్‌గా తీర్చిదిద్దుతారు. ఇలాంటి ప్రెస్టీజియస్ డిగ్రీను కొడుకు సంపాదించాడు అంటే పుత్రోత్సాహమే కదా.6 -
పాక్ ఉన్మాదం ; సరిహద్దు గ్రామాల్లో అప్రమత్తత
పూంఛ్ : యుద్ధోన్మాదంతో పేట్రేగుతోన్న పాకిస్తాన్.. భారత పల్లెలే లక్ష్యంగా దాడులు జరుపుతున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరి గడిచిన మూడురోజుల్లో పలుమార్లు కాల్పులకు పాల్పడింది. దీంతో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ), సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భయానకవాతావరణం నెలకొంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కీలకమైన ఐదు జిల్లాల్లో బార్డర్‌కు దగ్గరగా ఉన్న పాఠశాలలను శనివారం నుంచి మూయించారు. ‘జమ్ము, సాంబా, కథువా, రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో సరిహద్దును ఆనుకుని ఉన్న స్కూళ్లన్నింటినీ మూసేశాం. వచ్చే మూడురోజుల వరకు వాటిని తెరవకూడదని సిబ్బందిని ఆదేశించాం. పరిస్థితిని బట్టి మరోమారు ఆదేశాలు జారీచేస్తాం’ అని అధికారులు మీడియాకు చెప్పారు. మూడురోజుల్లో 9 మంది మృతి : భారత పల్లెలే లక్ష్యంగా పాక్ బలగాలు జరుపుతోన్న కాల్పుల్లో ఇప్పటివరకు తొమ్మిదిమంది చనిపోయారు. వారిలో ఐదుగురు సాధారణ పౌరులుకాగా, ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు, ఇద్దరు ఆర్మీ సిబ్బంది ఉన్నారు. ఇటీవల భారత సైన్యం మినీ సర్జికల్ స్ట్రైక్ చేసి పాక్ బలగాల్ని మట్టుపెట్టిన తర్వాత సరిహద్దులో మళ్లీ యుద్ధవాతావరణం నెలకొంది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలపై ఇరుదేశాలూ ఆయా రాయబారులకు నిరసనలు తెలిపాయి. -
పదో తరగతితో కేంద్ర ప్రభుత్వోద్యోగం
-
పదో తరగతితో కేంద్ర ప్రభుత్వోద్యోగం
కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ).. సెక్యూరిటీ అసిస్టెంట్ల (మోటర్ ట్రాన్స్పోర్ట్) నియామకానికి ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా పదో తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అందుకోవచ్చు. నోటిఫికేషన్ వివరాలు.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 209 పోస్టులు ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు 209 (ఓపెన్ కేటగిరీ-106, ఓబీసీ-45, ఎస్సీ-30, ఎస్టీ-28). దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల వారీగా పోస్టుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్‌లో 4 (ఓపెన్-2, ఓబీసీ-1, ఎస్సీ-1), విజయవాడలో 4 (ఓపెన్-2, ఓబీసీ-1, ఎస్సీ-1) పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా ఢిల్లీలో 45 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను జనరల్ సెంట్రల్ సర్వీస్‌లోని గ్రూప్-సీ (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) కేటగిరీగా పేర్కొన్నారు. వేతనం: రూ.5,200-20,200 ప్లస్ గ్రేడ్ పే రూ.2000 (పీబీ-1). వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఇతర అలవెన్సులు. విద్యార్హత-పరిజ్ఞానం: పదో తరగతి/తత్సమానం. మోటర్ మెకానిజం తెలిసుండాలి. వాహనంలో తలెత్తే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించగలగాలి. అనుభవం: లైట్ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ లెసైన్స్ తీసుకున్న తేదీ నుంచి కనీసం ఏడాది పాటు కారు నడిపిన అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు; ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. గమనిక: వయసు, విద్యార్హతలు, డ్రైవింగ్ లెసైన్స్, అనుభవం తదితరాలకు కటాఫ్ తేదీగా 2016 ఆగస్టు 6ను పరిగణనలోకి తీసుకుంటారు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా విధులను నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: 100 మార్కులకు నిర్వహించే స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో 50 మార్కులను డ్రైవింగ్ టెస్ట్‌కు, 50 మార్కులను మోటర్ మెకానిజం టెస్ట్‌కు కేటాయించారు. డ్రైవింగ్ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థులు ఇన్స్ట్రక్టర్ సూచనల మేరకు వాహనం నడపాలి. మోటర్ మెకానిజం టెస్ట్‌లో భాగంగా వాహనం నిర్వహణ, అందులో తలెత్తే తేలికపాటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైనవారికి క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ (ప్రవర్తన, పూర్వాపరాల తనిఖీ), వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 6, 2016 పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.50 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఇచ్చారు. చివరి తేదీ (ఆగస్టు 6)న అప్లై చేసేవాళ్లు 8, 9 తేదీల్లో కూడా ఎగ్జామ్ ఫీజు చెల్లించొచ్చు. వెబ్సైట్: దరఖాస్తు చేసుకునేందుకు, వివరాలకు http://mha.nic.in/vacanciesను చూడొచ్చు. .................................... నేవీలో 262 పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) నియామకానికి భారత నావికా దళం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి విద్యార్హతతోనే ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించుకునేందుకు బాటలు వేసే ఈ కొలువులు ఉద్యోగార్థులకు సువర్ణావకాశం లాంటివి. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు 262. ఇందులో ఎంటీఎస్ (మినిస్టీరియల్)-246, ఎంటీఎస్ (నాన్ ఇండస్ట్రియల్)-16. కేటగిరీల వారీగా చూస్తే.. 1. ఎంటీఎస్ (మినిస్టీరియల్) మొత్తం పోస్టుల్లో ఎక్స్సర్వీస్మెన్లకు 25, అంధులకు 5, బధిరులకు 7, క్రీడాకారులకు 12 పోస్టులను రిజర్వ్ చేశారు. 2. ఎంటీఎస్ (నాన్-ఇండస్ట్రియల్) మొత్తం పోస్టుల్లో ఎక్స్సర్వీస్మెన్లకు 2, క్రీడాకారులకు 1 పోస్టును రిజర్వ్ చేశారు. వేతనం: రూ.5,200-20,200 ప్లస్ గ్రేడ్ పే రూ.1800 విద్యార్హత: మినిస్టీరియల్ పోస్టులకు పదో తరగతి/తత్సమాన విద్యార్హత, నాన్ ఇండస్ట్రియల్ పోస్టులకు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్లలో నైపుణ్యం ఉండాలి. వయసు: మినిస్టీరియల్ పోస్టులకు 18-27 ఏళ్లు. నాన్ ఇండస్ట్రియల్ పోస్టులకు 18-25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీలు, ప్రభుత్వోద్యోగులు, డిపార్ట్మెంట్ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విధులు: మినిస్టీరియల్ సిబ్బంది కింది విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. అవి.. 1. సంబంధిత సెక్షన్లు/యూనిట్లలో రికార్డుల నిర్వహణ 2. సెక్షన్లు/యూనిట్లలో పరిశుభ్రత 3. కార్యాలయ భవనాల్లో ఫైల్స్, ఇతర పత్రాల బట్వాడా 4. డాక్యుమెంట్లను జిరాక్స్ తీయడం, ఫ్యాక్స్ చేయడం 5. సెక్షన్లు/యూనిట్లలో ఇతర నాన్ క్లరికల్ పనులు 6. ఉత్తరాల బట్వాడా 7. పహారా, రక్షణ 8. ప్రారంభ, ముగింపు విధులు (ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డ్యూటీస్) 9. రూమ్‌లు, వాష్ రూమ్‌ల క్లీనింగ్ 10. కార్యాలయ సామగ్రి దుమ్ము దులపడం 11. సంబంధిత పోస్టుకు తగిన పనులు 12. పైఅధికారులు చెప్పే ఇతర పనులు నాన్ ఇండస్ట్రియల్ సిబ్బంది కూడా సంబంధిత పోస్టులకు తగిన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపిక విధానం: దరఖాస్తులు భారీగా వస్తే అందరికీ రాత పరీక్ష నిర్వహించడం కష్టంతో కూడిన పని. అందువల్ల పదో తరగతి మార్కుల ఆధారంగా సముచిత సంఖ్యలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష విధానం: అన్నీ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలే ఇస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. సబ్జెక్టుల వారీగా ప్రశ్నల సంఖ్యను పరిశీలిస్తే.. పరీక్ష తేదీ: రాత పరీక్షను 2016 సెప్టెంబర్ 25న (లేదా) అక్టోబర్ 1న నిర్వహించే అవకాశం ఉంది. ఖచ్చితమైన తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వివరాలను అడ్మిట్ కార్డ్పైన, నేవీ వెబ్సైట్లో కొద్ది రోజుల తర్వాత పొందుపరుస్తారు. తుది ఎంపిక: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయినవారికి సర్టిఫికెట్ల తనిఖీ, వైద్య పరీక్షలు నిర్వహించి, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును పూర్తి చేసి, సెల్ఫ్ అటెస్ట్ చేసిన ధృవీకరణ పత్రాల జిరాక్స్‌లను జత చేసి రిజిస్టర్ పోస్ట్‌లో/స్పీడ్ పోస్ట్‌లో పంపాలి. దరఖాస్తు ఉన్న ఎన్వలప్ కవర్‌పై ‘అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మినిస్టీరియల్/ నాన్ ఇండస్ట్రియల్) ‘‘...........’’, కేటగిరీ (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ యూఆర్/ఈఎస్ఎం/ పీడబ్ల్యూడీ) ‘‘......’’ రాయాలి. చిరునామా: ది ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, ((ఫర్ స్టాఫ్ ఆఫీసర్(సివిలియన్ రిక్రూట్మెంట్ సెల్)), హెడ్ క్వార్టర్స్ సదరన్ నావల్ కమాండ్, కొచ్చి, 682004. దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 5 వెబ్సైట్: దరఖాస్తులు, వివరాలకు www.indiannavy.nic.in/content/civilian చూడొచ్చు. ........................... హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో 171 అప్రెంటీస్ పోస్టులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ తన పరిధిలోని వివిధ ప్లాంట్లలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 171 కాగా ఇందులో 101 పోస్టులు రాజస్థాన్‌లోని ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌కు, 42 పోస్టులు జార్ఖండ్‌లోని ఘట్సిలా ప్రాంతంలో గల ఇండియన్ కాపర్ కాంప్లెక్స్‌కు, 28 పోస్టులు గుజరాత్ కాపర్ ప్రాజెక్టుకు సంబంధించినవి. ప్లాంట్లు, ట్రేడ్లు, కేటగిరీల వారీగా వేకెన్సీలు.. 1. ఖేత్రి కాపర్ కాంప్లెక్స్ ఇందులో బ్లాస్టర్(మైన్స్) ట్రేడ్ శిక్షణ కాల వ్యవధి రెండేళ్లు, మేట్(మైన్స్) ట్రేడ్‌కు మూడేళ్లు, మిగిలిన అన్నిటికి ఏడాది. 2. ఘట్సిలాలోని ఇండియన్ కాపర్ కాంప్లెక్స్ ఈ ట్రేడ్లు అన్నిటికీ శిక్షణ కాల వ్యవధి ఏడాది 3. గుజరాత్ కాపర్ ప్లాంట్ ఇందులో ప్లంబర్ ట్రేడ్ శిక్షణ కాల వ్యవధి రెండేళ్లు. మిగిలినవాటికి ఏడాది. విద్యార్హతలు 1.ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు మెట్రిక్/సెకండరీ/టెన్త్ (10+2 సిస్టమ్) పాస్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత. 2014కు ముందు ఐటీఐ పాసైనవారు ఈ మధ్య కాలంలో ఏ సంస్థలోనూ అప్రెంటీస్ చేయలేదని/ఎక్కడా ఉద్యోగంలో చేరలేదని ప్రమాణపత్రాన్ని దాఖలు చేయాలి. బ్లాస్టర్ (మైన్స్), మేట్ (మైన్స్) ట్రేడ్లకు ఐటీఐ, ప్రమాణపత్రాలు అవసరంలేదు. 2.ఘట్సిలా కాంప్లెక్స్‌లోని పోస్టులకు హైస్కూల్/తత్సమాన విద్యార్హతతోపాటు 60 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ (ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం). 3.గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టుల్లో వెల్డర్, వైర్‌మ్యాన్ ట్రేడ్లకు 8వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్లకు సైన్స్, మ్యాథమెటిక్స్‌లతో టెన్త్ (10+2 సిస్టమ్) పాస్ లేదా తత్సమానం. దీంతోపాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత. ప్లంబర్ ట్రేడ్‌కు టెన్త్ పాస్/ఫెయిల్తోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. వయసు 1.ఖేత్రి కాంప్లెక్స్‌లోని పోస్టుల విషయంలో వయో పరిమితి, విద్యార్హతలకు 2016 జూలై 20వ తేదీని కటాఫ్ డేట్‌గా పరిగణిస్తారు. 2.ఘట్సిలా కాంప్లెక్స్‌లో పోస్టులకు కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 42 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. అర్హతల పరిశీలనకు 2016 ఆగస్టు 31ని కటాఫ్ డేట్‌గా పరిగణిస్తారు. 3.గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు 2016 జూలై 1 నాటికి 18-25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. స్టైపెండ్ 1.ఘట్సిలా కాంప్లెక్స్‌లోని పోస్టులకు మొదటి ఏడాది రూ.4004; రెండో ఏడాది రూ.4576; మూడు, నాలుగో ఏడాది రూ.5148 ఉపకారవేతనం ఇస్తారు. ఖేత్రి కాంప్లెక్స్, గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు నిబంధనల మేరకు స్టైపెండ్ ఇస్తారు. ఎంపిక విధానం 1.ఖేత్రి కాంప్లెక్స్‌లోని పోస్టులకు రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తే అందరినీ రాత పరీక్షకు ఎంపిక చేయరు. సాధారణ/సాంకేతిక విద్యలో పొందిన మార్కుల ఆధారంగా కొందరినే రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఎంపికైన అభ్యర్థుల ఫిజికల్ ఫిట్నెస్ను పరిశీలిస్తారు. 2.ఘట్సిలా కాపర్ కాంప్లెక్స్, గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు కూడా రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీలు 1.ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 11 2.ఘట్సిలా కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 25 3.గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు రాత పరీక్ష తేదీని పేర్కొనలేదు. దరఖాస్తు విధానం 1.ఆయా ప్లాంట్లలోని పోస్టులకు నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులకు సెల్ఫ్ అటెస్ట్ చేసిన అర్హతల ధృవీకరణ పత్రాల జిరాక్స్‌లను జత చేసి ఆయా సంస్థల అడ్రస్‌కు స్పీడ్ పోస్ట్/రిజిస్టర్ పోస్ట్‌లో పంపాలి. దరఖాస్తులకు చివరి తేదీలు 1. ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు: ఆగస్టు 16. 2. ఘట్సిలా కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు: సెప్టెంబర్ 10. 3. గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు: ఆగస్టు 13. వెబ్సైట్: www.hindustancopper.com ......................... జిప్మర్లో 82 నర్సు పోస్టులు జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 92. వాటిలో సింహ భాగం (82 పోస్టులు) స్టాఫ్ నర్సులు కాగా మరో మూడు రకాల జాబ్‌లు (10 పోస్టులు) ఉన్నాయి. వాటిని కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. వేతనం: అన్ని పోస్టులకూ రూ.9300-34,800 ప్లస్ గ్రేడ్ పే రూ.4,200. స్టాఫ్ నర్సు పోస్టులకు మాత్రం గ్రేడ్ పే రూ.400 అదనం. అంటే మొత్తం గ్రేడ్ పే రూ.4,600. విద్యార్హత: 1.స్టాఫ్ నర్సుకు జీఎన్ఎంలో డిగ్రీ/డిప్లొమా/తత్సమాన అర్హతతోపాటు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సు అండ్ మిడ్ వైఫ్‌గా రిజిస్టరై ఉండాలి. 2.ఎక్స్‌రే టెక్నీషియన్(ఆర్డీ)కి ఇంటర్/సైన్స్ సబ్జెక్టులతో తత్సమాన విద్యార్హత. దీంతోపాటు బీఎస్సీ(మెడికల్ రేడియేషన్ టెక్నాలజీ). రేడియో డయాగ్నోసిస్(ఆర్డీ) /రేడియోథెరపీలో రెండేళ్ల అనుభవం (లేదా) రేడియోలజీలో రెండేళ్ల డిప్లొమా/ తత్సమానంతోపాటు ఆర్డీ/రేడియోథెరపీలో మూడేళ్ల అనుభవం. 3.ఎక్స్‌రే టెక్నీషియన్(ఆర్టీ)కి ఇంటర్/సైన్స్ సబ్జెక్టులతో తత్సమాన విద్యార్హత. దీంతోపాటు బీఎస్సీ(ఆర్టీ: రేడియోథెరపీ)/బీఎస్సీ ఇన్ మెడికల్ టెక్నాలజీ(ఆర్టీ)/ బీఎస్సీ(మెడికల్ రేడియేషన్ టెక్నాలజీ)తోపాటు ఆర్టీలో రెండేళ్ల అనుభవం (లేదా) రేడియోథెరపీ టెక్నాలజీలో రెండేళ్ల పీజీ డిప్లొమా/డిప్లొమాతోపాటు ఆర్టీలో మూడేళ్ల అనుభవం. 4.ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్‌కు ఇంటర్‌తోపాటు బీపీఈడీ, రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: అన్ని పోస్టులకూ 2016 ఆగస్టు 16 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల వారికి నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష రుసుం: ఓసీ, ఓబీసీలు రూ.500; ఎస్సీ/ఎస్టీలు రూ.250 చెల్లించాలి. పీడబ్ల్యూడీలకు మినహాయింపు ఉంది. ఫీజును ‘ది డెరైక్టర్, జిప్మర్’ పేరిట పుదుచ్చేరి (ఎస్బీఐ జిప్మర్ బ్రాంచ్)లో చెల్లుబాటు అయ్యేలా డీడీ తీయాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకునేవారు వేర్వేరు దరఖాస్తులు, డీడీలు పంపాలి. దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనా దరఖాస్తును పూర్తి చేసి, విద్యార్హత ధృవీకరణ పత్రాల జిరాక్స్‌లను జత చేసి, ‘ది డెరైక్టర్, జిప్మర్, పుదుచ్చెరి, 605006’ అడ్రస్‌కు పంపాలి. దరఖాస్తును పంపే కవర్‌పై ‘అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్....... (కోడ్ నంబర్.......)’ అని రాయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 2016 ఆగస్టు 16. వెబ్సైట్: దరఖాస్తులకు, వివరాలకు http://jipmer.edu.in/category/jobs/ను చూడొచ్చు. -
’యోగా డే వేడుకలపై దాడులు జరగొచ్చు’
-
'యోగా డే వేడుకలపై దాడులు జరగొచ్చు'
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని నగరంలో ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) హై అలర్ట్ జారీ చేసింది. యోగా డే దినం ఉత్సవాల వేదిక రాజ్‌పథ్ ఆవరణలో దాడులు జరిగే అవకాశం ఉందని... అప్రమత్తంగా ఉండాలని ఐబీ హెచ్చరించింది. ఆకాశంలో ఎగిరే బెలూన్లు, గాలిపటాలు లాంటి.. వాటి ద్వారా ఈ దాడులు జరగడానికి ఆస్కారం ఉందని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో బెలూన్లు, గాలిపటాలు ఎగరవేయడాన్ని ఢిల్లీ పోలీసులు నిషేధించారు. అలాగే ఆకాశం నుంచి ఫోటోలు తీయడాన్ని కూడా నిషేధించారు. మరోవైపు దేశ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలకు భారీ సన్నాహకాలు జరిగాయి. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. 30 కంపెనీల రక్షక దళాలు రక్షణను పర్యవేక్షిస్తున్నాయి. అయిదు వేలమంది సాయుధ రక్షక్ష భటులతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా రాజపథ్ చుట్టూ మోహరించారు. అంతర్జాతీయ యోగా దినంగా జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ శ్వాస నియంత్రణ, ఇతర యోగాసనాలను ప్రదర్శించనున్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ, ప్రయివేటు అధికారులు , ఎన్సీసీ తదితరులతో కూడిన సుమారు 35 వేలమంది ఈ మెగా ఈవెంట్లో పాల్గొననున్నారు. -
ఢిల్లీపై డ్రోన్ దాడులు ?
-
ఢిల్లీపై డ్రోన్ దాడులు ?
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు కొరకరాని కొయ్యగా మారిన ఉగ్రవాద సంస్థలు లష్కరే ఈ తోయిబా, జైషే భారత్‌లో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రచిస్తోందని సమాచారం ఉన్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీపై అది డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించాలని చూస్తోందని, అప్రమత్తంగా ఉండాలని మంగళవారం హెచ్చరించింది. గుర్తు తెలియని వ్యక్తులపై మరింత నిఘాను పెంచాలని, వారిని అదుపులోకి తీసుకొని విచారించాలని కూడా సూచించింది. కొందరు అనుమానితులు డ్రోన్ దాడులు జరిపేందుకు సహకరించే ప్రమాదం ఉందని చెప్పింది. దీంతోపాటు, భారత గగన తలంలోకి పైలెట్ రహిత విమానాలను ఏమాత్రం అనుమతించకూడదని హెచ్చరించింది. -
లాటరీ పేరిట రూ. 4,193 కోట్ల మోసం
న్యూడిల్లీ: అమాయక ప్రజల అత్యాశను ఆసరా చేసుకొని లాటరీల పేరిట కోట్ల రూపాయలు దండుకొంటున్న భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 4,193 కోట్ల రూపాయలు దేశ సరిహద్దులు దాటి పాకిస్థాన్‌కు వెళ్లిపోయాయని, దీని వెనుక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్వర్క్ హస్తం ఉందని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఇటీవల కేంద్ర హోం శాఖకు సమర్పించిన ఓ నివేదికలో వెల్లడించింది. అయితే అధికారికంగా భారత ప్రభుత్వంగానీ, ఐబీగానీ ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. లాటరీల కుంభకోణాలకు సంబంధించి 4,193 కోట్ల రూపాయల సొమ్ము ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లోని భారతీయ స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, భారతీయ యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా మొత్తం 1,162 బ్యాంక్‌ల బ్రాంచిల ద్వారా విత్ డ్రా చేసి పాకిస్థాన్ తరలించారు. దావూద్ ఇబ్రహీంకు చెందిన హవాల నెట్వర్క్ సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ గుండా ఈ సొమ్మును పాకిస్థాన్ చేర్చింది. కరాచీ నుంచి హవాలా లావాదేవీలు నిర్వహించే దావూద్‌కు బారత్‌లో కూడా బలమైన నెట్వర్క్ ఉన్న విషయం తెల్సిందే. ఆర్థిక ఇంటెలీజెన్స్ వర్గాల ద్వారా అనుమానిత బ్యాంక్ ఖాతాలను గుర్తించి, వాటి నుంచి నగదు విత్‌డ్రాలను తక్షణమే ఆపేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖను ఐబీ కోరింది. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్‌ను కూడా ఐబీ అప్రమత్తం చేసింది. పాకిస్థాన్ నుంచి 1175 ఫోన్ నెంబర్ల ద్వారా లాటరీల పేరిట మోసం చేసినట్టు తాము గుర్తించామని, ఆ ఫోన్లకు 305 నెంబర్ల ద్వారా భారత ఏజెంట్లు అక్రమదారులకు సహకరించినట్టు గుర్తించామని ఐబీ వర్గాలు తెలిపాయి. ఆ ఫోన్ నెంబర్ వివరాల ద్వారా కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళుతున్నట్టు హోం శాఖకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నాయి. ‘మీ ఫోన్ నెంబర్‌కు బంపర్ బహుమతి తగిలింది. వాటిని పంపించేందుకు ప్రాసెసింగ్ ఫీజు కింద ఇంత మొత్తాన్ని ఫలానా బ్యాంకులోని ఫలానా ఖాతాలో జమచేయండి’ అంటూ భారతీయ ఏజెంట్లు అమాయక ప్రజలను బుట్టలో వేస్తారు. ఆఫర్‌చేసే లాటరీ బంపర్ బహుమతి మొత్తాన్నిబట్టి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు గుంజుతారు. బ్యాంకు ఖాతా నెంబర్ల ద్వారానే లావాదేవీలు జరుగుతున్నందున మోసం జరిగే అవకాశం ఉండదని ప్రజలు భ్రమపడతారు. అప్పటికీ అనుమానపడే వారిని ఏజెంట్లు కొంత డబ్బును కూడా పంపించి నిజంగా లాటరీ తగిలినట్టు నమ్మిస్తారు. వారు ప్రాసెసింగ్ ఫీజు కింద అడిగిన మొత్తాన్ని జమ చేసిన మరుక్షణంలోనే విత్ డ్రా చేస్తారు. ఈ విషయంలో భారతీయ ఏజెంట్లకు కూడా బ్యాంకు సిబ్బంది సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. -
గుజరాత్‌లోకి 13 మంది ఉగ్రవాదుల చొరబాటు!
వల్సాద్: గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలోకి 13 మంది ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా సంస్థ(ఐబీ) తెలిపింది. దీంతో జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా జిల్లాలోకి వచ్చారని తమకు ఐబీ చెప్పడంతో నిఘా, భద్రతలను పటిష్టం చేశామని ఎస్పీ నిపుణా తోర్వానే శనివారం తెలిపారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, తీరప్రాంతాల్లో భద్రత పెంచామని, హోటళ్లలో తనిఖీ చేశామని చెప్పారు. పంద్రాగస్టు నేపథ్యంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఢిల్లీలో భారీ దాడులకు పాల్పడే అవకాశముందని ఐబీ హెచ్చరించిన నేపథ్యంలో ఉగ్ర ముష్కరుల చొరబాటు వెలుగు చూసింది.