
ప్రతీకాత్మక చిత్రం
శ్రీనగర్ : ఉగ్రవాద సంస్థ అన్సార్ గజ్వాత్ ఉల్- హింద్ చీఫ్ జకీర్ మూసా కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడులు జరిపించేందుకు పథకం రచిస్తున్నాడని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పంజాబ్, జమ్ము కశ్మీర్ పోలీసులే లక్ష్యంగా దాడులకు తెగబడనున్నట్లు పేర్కొన్నాయి. తన అనుచరుడు రేహాన్‌తో కలిసి దాడులు నిర్వహించేందుకు కశ్మీర్ యువకులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు సమాచారం అందినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కల్లోలం సృష్టించేందుకు జకీర్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్న ఐబీ.. పోలీసు స్టేషన్లు, భద్రతా బలగాల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడికి పాల్పడే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇందుకోసం ఇప్పటికే కశ్మీర్‌లోకి కొంత మంది జీహాదీలు చొరబడినట్లు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పంజాబ్, కశ్మీర్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి.
Comments
Please login to add a commentAdd a comment