fidayeen
-
వాళ్లంతా భారత్‌లోనే శిక్షణ పొందారు!
కొలంబో : ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో ఆత్మాహుతి దాడికి పాల్పడే ముందు ఉగ్రవాదులు భారత్‌కు వచ్చారని ఆ దేశ ఆర్మీ చీఫ్ తెలిపారు. ఇందులో భాగంగా అక్కడే ఉగ్రదాడులపై శిక్షణ పొందారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 21న శ్రీలంకలో జరిగిన ఎనిమిది వరుస పేలుళ్లలో 250కి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన 500 మందికి పైగా క్షతగాత్రుల్లో కొంతమంది ఇప్పటికీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పేలుళ్ల గురించి శ్రీలంక ఆర్మీ చీఫ్ మహేష్ సేననాయకే మాట్లాడుతూ...‘ వాళ్లు(ఉగ్రవాదులు) భారత్‌లోని కశ్మీర్, బెంగళూరు, కేరళకు వెళ్లినట్లు మా వద్ద సమాచారం ఉంది. బహుషా ఆత్మాహుతి దాడుల్లో శిక్షణ పొందేందుకే వాళ్లు అక్కడికి వెళ్లి ఉండవచ్చు. పేలుళ్లకు దేశం బయటే వ్యూహ రచన జరిగినట్లు తెలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. కాగా శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించే ఐఎస్ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించడంలో జాప్యం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లు జరిగాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువన్ విజేవర్ధనే వెల్లడించిన సంగతి తెలిసిందే. పేలుళ్లపై ఇంటలెజిన్స్ హెచ్చరికలు పట్టించుకోని పోలీస్ ఛీఫ్‌పై వేటు వేయడంతో పాటుగా.. ముసుగులు ధరించడంపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. -
కశ్మీర్లో ఆత్మాహుతి దాడి : ఐబీ హెచ్చరికలు
శ్రీనగర్ : ఉగ్రవాద సంస్థ అన్సార్ గజ్వాత్ ఉల్- హింద్ చీఫ్ జకీర్ మూసా కశ్మీర్లో ఆత్మాహుతి దాడులు జరిపించేందుకు పథకం రచిస్తున్నాడని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పంజాబ్, జమ్ము కశ్మీర్ పోలీసులే లక్ష్యంగా దాడులకు తెగబడనున్నట్లు పేర్కొన్నాయి. తన అనుచరుడు రేహాన్‌తో కలిసి దాడులు నిర్వహించేందుకు కశ్మీర్ యువకులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు సమాచారం అందినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కల్లోలం సృష్టించేందుకు జకీర్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్న ఐబీ.. పోలీసు స్టేషన్లు, భద్రతా బలగాల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడికి పాల్పడే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇందుకోసం ఇప్పటికే కశ్మీర్లోకి కొంత మంది జీహాదీలు చొరబడినట్లు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పంజాబ్, కశ్మీర్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. -
అచ్చం సైనికుల్లాగే.. పొట్టి క్రాఫుతో!
భారత సైనిక శిబిరంపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు అచ్చం భారతీయ సైనికుల్లాగే కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. శుభ్రంగా గెడ్డం గీసుకోవడంతో పాటు, జుట్టును కూడా పొట్టిగా కత్తిరించుకున్నారు. వాళ్లంతా 20 ఏళ్ల దగ్గర వయసులోనే ఉన్నారని వాళ్ల మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన వైద్యులు తెలిపారు. ఎముకల మందం, బరువు ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు. దాడి జరిగిన ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాదుల మృతదేహాలను ఖననం చేశారు. వాళ్ల ప్రేవులు, గుండె భాగంలో మొత్తం 169 బుల్లెట్లు దిగాయి. వాళ్ల ఆయుధాల మీద కూడా బుల్లెట్ల వల్ల ఏర్పడిన రంధ్రాలు కనిపించాయి. ఉగ్రవాదుల వద్ద ప్రోటీన్లు బాగా ఎక్కువగా ఉండే 26 చాక్లెట్ రాపర్లు, ఆరు రెడ్ బుల్ క్యాన్లు, మూడు ఖాళీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కొన్ని మందులు కనిపించాయి. అన్నింటి మీద 'మేడిన్ పాకిస్థాన్' అనే ముద్రలు స్పష్టంగా ఉన్నాయి. యురి ప్రాంతంలో గొర్రెలు కాసుకునే ముగ్గురు వ్యక్తులను దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి. ఉగ్రవాదులు ఈ ప్రాంతానికి చేరుకోడానికి వాళ్లు సహకరించారన్న అనుమానంతో వారిని ప్రశ్నించారు. ఎల్ఓసీకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గల్వామా, రఫియాబాద్, ముజఫరాబాద్ ప్రాంతాల లొకేషన్లతో కూడిన జీపీఎస్ పరికరాన్ని కూడా దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. ముజఫరాబాద్ నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంది. జైషే మహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజహర్ తరచు ఇక్కడి ప్రజలకు ఆడియో క్లిప్‌ల ద్వారా సందేశాలు పంపుతుంటాడు. ఉగ్రవాదులకు సాయం చేసేలా వారిని రెచ్చగొడుతుంటాడు. జీపీఎస్‌లో ముందుగానే ఫీడ్ చేసిన వివరాలను బట్టి చూస్తే.. ఉగ్రవాదులు దాడికి ముందు పాకిస్థాన్‌లో ఉన్న విషయం కూడా స్పష్టమవుతోందని ఇంటెలిజెన్స్ బ్యూరో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.