infrastructrue development
-
దేశంలో మౌలిక సదుపాయాలకు చేసే ఖర్చు ఎంతంటే..
దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధానమంత్రి గతి శక్తి పథకం ఎంతో ఉపయోగపడిందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. 2029 నాటికి మౌలిక సదుపాయాల వృద్ధికి జీడీపీలో 6.5 శాతం ఇన్వెస్ట్ చేస్తారని అంచనావేస్తూ నివేదిక విడుదల చేసింది.నివేదికలోని వివరాల ప్రకారం..ప్రధానమంత్రి గతి శక్తి పథకంతో భారతదేశ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయి. హైవే, రైల్వే, ఓడరేవులు వంటి సదుపాయాలు మెరుగయ్యాయి. ‘మల్టీ మోడల్ కనెక్టివిటీ’తో భారత రవాణా వ్యవస్థ దూసుకుపోతుంది. దేశ జీడీపీలో మౌలిక సదుపాయాల కల్పనకు 2023-24లో 5.3 శాతం వెచ్చించారు. క్రమంగా ఇది పెరుగుతూ 2029 నాటికి 6.5 శాతానికి చేరుతుంది. దాని ఫలితంగా రాబోయే ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ భారీగా పెరుగుతుంది.‘ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం..భారత షిప్‌యార్డ్‌ల్లో కంటైనర్లు ఉండే సగటు సమయాన్ని ముడు రోజులకు తగ్గించారు. అందుకోసం హైవేలు, రైల్వేలు ఎంతో తోడ్పడుతున్నాయి. ఇది యూఏఈ, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో నాలుగు రోజులు, యూఎస్ఏలో ఏడు రోజులు, జర్మనీలో పది రోజులుగా ఉంది. భారతీయ ఓడరేవుల ‘టర్నరౌండ్ సమయం(అన్లోడ్ చేసి లోడ్ చేయడానికి పట్టే సమయం)’ 0.9 రోజులకు చేరుకుంది. ఇది యూఎస్ఏలో 1.5 రోజులుగా, ఆస్ట్రేలియాలో 1.7 రోజులుగా, సింగపూర్‌లో ఒక రోజుగా ఉంది. అక్టోబరు 2021లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పీఎం గతి శక్తి పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ఇప్పటివరకు పోర్ట్‌లు, షిప్పింగ్ రంగాల్లో రూ.60,900 కోట్ల విలువైన 101 ప్రాజెక్టులు గుర్తించారు. ఏప్రిల్ 2023 నాటికి రూ.8,900 కోట్ల విలువైన 26 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.15,340 కోట్ల విలువైన 42 ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నాయి. రూ.36,640 కోట్ల విలువైన 33 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి’ అని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.ఇదీ చదవండి: ఇన్‌స్టా పోస్ట్ వైరల్ కావాలంటే.. సీఈఓ సూచనసాగరమాల కార్యక్రమం కింద రూ.1.12 లక్షల కోట్ల విలువైన 220 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.2.21 లక్షల కోట్ల విలువైన 231 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. రూ.2.07 లక్షల కోట్ల విలువైన 351 ప్రాజెక్టులు మూల్యాంకన దశలో ఉన్నాయని మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది. -
ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం జగన్
తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రెండో సారి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం ఖాయమని ప్రకటించారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ప్రజలను ధైర్యంగా అడుగుతున్నానని సీఎం జగన్ చెప్పారు. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తామన్న సీఎం జగన్.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామని, మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు ఇది నిదర్శనమని చెప్పిన సీఎం జగన్... కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని, విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినట్టే.. తమ కుటుంబాన్ని కూడా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ చెప్పినదాంట్లో ముఖ్యాంశాలు పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు అయితే విద్య అలాంటి అంశాలపై దృష్టి పెట్టకపోతే పేదరికాన్ని నిర్మూలించలేం నేను ఏ హామీ ఇచ్చాను, ఏం చేశాను అన్నది చూడాలి మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.4 శాతం అమలు చేశాను అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేశాం కచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు కాని ఈ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ చేయగలిగింది చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది నాకు లేనే లేదు చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది.? సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా? వాటిని చూసి కన్విన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికి పెద్దగా లేదు పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే ఉంటుంది ప్రతి పార్టీ కూడా సర్వేలు చేస్తుంది వాటి ఫలితాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు కాని కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం జాతీయ రాజకీయాలు విషయంలో మా విధానం స్పష్టం: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నాం: కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతూ ఉంటుంది అది ఆ పార్టీ సంప్రదాయంగా గమనిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించాలనుకుంది అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు వారు పాఠాలు నేర్వలేదు కాంగ్రెస్ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు ఇండియాటుడే తరపున రాజ్‌దీప్ ప్రశ్నలు, ముఖ్యమంత్రి జగన్ సమాధానాలు సవివరంగా.. రాజ్‌దీప్ : తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో విద్యపై సదస్సు నిర్వహించడం సంతోషకరం, చదువుతో వచ్చే మార్పు ఏంటన్నది కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఆ మార్పే చోటు చేసుకోబోతుంది. ఏపీలోని అత్యంత సామాన్య విద్యార్థులు అమెరికాలోని వాషింగ్టన్ డీసీని పర్యటించడం గొప్ప విషయం సీఎం జగన్ : ఇండియా టుడే జర్నలిస్టులు తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాలలు చూడడం గొప్ప విషయం పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది నా బలమైన నమ్మకం నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు కావాలి పేదలు చదివేది ఒకటయితే, ధనిక పిల్లలు చదివేది మరొకటి పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది, ధనిక పిల్లలు ఇంగ్లీషులో చదివేవారు రాజ్‌దీప్ : మూడో తరగతి నుంచే గ్లోబల్ ఎగ్జామ్ టోఫెల్ లాంటిపై అవగాహన కల్పించేలా చేసిన మార్పులపై విమర్శలొచ్చాయి. తెలుగు మీడియంలోనే బోధించాలని విమర్శలు చేశారు కదా.? సీఎం జగన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధించేలా చేయరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? నన్ను, ప్రభుత్వ విధానాలను విమర్శించే ముందు మీ విధానాలను ప్రశ్నించుకోండి రాజ్‌దీప్ : అకస్మాత్తుగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు పాఠశాల మానేసే ప్రమాదం లేదా? సీఎం జగన్ : ఇలా జరక్కుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్ పెట్టాం. మా బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్ అంశాలను చేర్చాం. పాఠశాలలు అన్నింటిలోనూ సౌకర్యాలు మెరుగుపరిచాం. ఒక విధంగా చెప్పాలంటే సమగ్ర ప్రణాళికతో వీటిని అమల్లోకి తెచ్చాం. నాడు-నేడు తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాం. 62వేల తరగతి గదులుంటే .. 40 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ టీవీలు ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరుకల్లా మిగతా చోట కూడా పూర్తవుతాయి. టీచర్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా ప్రణాళికకు ఒక సమగ్ర రూపం తీసుకొచ్చాం. 8వ తరగతి విద్యార్థులందరికీ ఒక ఆధునికమైన టాబ్ నేర్చుకునేందుకు అందించాం. రాజ్‌దీప్ : 8వ తరగతి విద్యార్థికి టాబ్ ఇచ్చారా? కోవిడ్ సమయంలో తగిన సాధన సంపత్తి (టీవీలు, మొబైళ్లు, టెక్నాలజీ) లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు? ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు కదా.? వచ్చే మూడేళ్లలో పదో తరగతి విద్యార్థులందరికీ టాబ్లు ఉంటాయని నమ్మకంగా చెప్పగలరా? సీఎం జగన్ : 8వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టాబ్‌లున్నాయి. డిసెంబర్ 21న టాబ్లు ఇచ్చాం. నా పుట్టిన రోజు నాడు నేనే తరగతి గదికి వెళ్లి పిల్లలను కలిసి వాళ్లకు టాబ్ అందజేస్తాం. రాజ్‌దీప్ : ప్రభుత్వాల్లో పనులు అంత వేగంగా జరగవని చెబుతారు, మీరు మీ యంత్రాంగాన్ని తగిన విధంగా ప్రోత్సహిస్తున్నారా? IB సిలబస్ కూడా ప్రవేశపెట్టారా? అది కేవలం కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉంది కదా.? అయితే ఇదంతా తొందరపడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. తల్లితండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత మంచి అవకాశం ఎలా వచ్చిందని.? సీఎం జగన్ : ఐబీ సిలబస్ మన రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో చేతులు కలిపింది. IB అన్నది ప్రస్తుతం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. జూన్ 2025 తర్వాత మొదటి తరగతిలో IB సిలబస్ ప్రవేశపెడతాం. అక్కడి నుంచి దశలవారీగా ఏడో తరగతి వరకు ప్రవేశపెడతాం. ఐదేళ్ల తర్వాత మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్ సర్టిఫెకెట్ కోసం పోటీ పడతారు. ఈ ప్రయత్నం ఎందుకంటే.. విద్యలో నాణ్యత అనేది చాలా ముఖ్యం. అదే లేకుంటే మా రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేరు కదా.. ఈ పోటీలో కేవలం ధనికులు మాత్రమే గెలిచే పరిస్థితి ఉండకూడదు, అణగారిన వర్గాల వారికి కూడా అవకాశం దక్కాలి రాజ్‌దీప్ : అది గొప్ప దార్శనికతే. గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన విద్యార్థి పోటీ పడాలన్న ఆలోచన మంచిదే. కానీ విద్యార్థులకు మంచి బోధన అందించేందుకు నాణ్యమైన ఉపాధ్యాయులు ఉన్నారనుకుంటున్నారా? సీఎం జగన్ : ఒక మంచి ఆలోచనకు మావంతు ప్రయత్నం జోడిస్తున్నాం. IB, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి. IBతో చర్చలు జరిపి మాతో కలిసి పని చేసేలా వారిని ఒప్పించాం. ఇందుకు వారిని అభినందిస్తున్నాను. ఫలితంగా IB తన అధికారిక కార్యాలయాన్ని SCERTతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది. ఇది విప్లవాత్మకమైన మార్పుకు నాంది. 2035 నాటికి IBలో చదువుకున్న విద్యార్థులు పదో తరగతిలో ప్రవేశిస్తారు. ఈ లక్ష్యంతోనే మేం పని చేస్తున్నాం. రాజ్‌దీప్ : ఈ పన్నెండేళ్ల ప్రాజెక్టులో IB తో కలిసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నది మీ ఆలోచనా? దీనికి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి, తగినన్ని మీ దగ్గర నిధులున్నాయా? సీఎం జగన్ : ముందు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ.. చిన్న నుంచి పెద్ద తరగతుల వారికి IB బోధన ఇస్తున్నాం ఆ తర్వాత 11, 12 తరగతుల వరకు IB సిలబస్ బోధన అందుతుంది ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అన్న విషయం IBకి కూడా తెలుసు. వాళ్లు కూడా ప్రభుత్వంలో భాగమైనందున.. మిగిలిన వారి వద్ద తీసుకునే స్థాయిలో రాయల్టీలాంటివి ఉండకపోవచ్చు. అట్టడుగు స్థాయి విద్యార్థులకు కూడా అంతర్జాతీయ స్థాయి విద్యను అందించవచ్చన్నది ప్రపంచానికి తెలిపేందుకు ఏపీ ప్రభుత్వం, IB కలిసి చేస్తున్న ప్రయత్నం ఇది. ఇక నిధుల విషయానికొస్తే.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.14వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇప్పటివరకు రూ.8200 కోట్లను ఖర్చు పెట్టాం. నాడు-నేడు తొలిదశలో భాగంగా మొత్తం 44వేల పాఠశాలల్లో 15వేల పాఠశాలలు పూర్తయ్యాయి. రెండో దశలో భాగంగా 16వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. మార్చి నాటికి రెండో దశ పూర్తవుతుంది. వచ్చే ఏడాది మిగిలిన పాఠశాలల్లో పనులు చేపడుతాం. రాజ్‌దీప్ : 2018లో ఏపీలో పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల శాతం 84.48, ఆ ఏడాది జాతీయ సగటు 99.21. ఈ పరిస్థితుల్లో డ్రాపవుట్లను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు? జగనన్న అమ్మ ఒడిలా నేరుగా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తారా? ఆ డబ్బును పిల్లల చదువుకు ఖర్చు పెట్టేలా చూస్తారా? సీఎం జగన్ : మేం పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అట్టడుగున ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మధ్యాహ్నా భోజన పథకాలు, అమ్మ ఒడి లాంటి వాటి సాయంతో డ్రాప్ అవుట్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. మా రాష్ట్రంలో అమలవుతోన్న మధ్యాహ్న భోజన పథకం చాలా వినూత్నమైంది. గోరు ముద్ద పేరుతో ఇస్తోన్న ఈ పథకంలో ఒక్కో రోజు ఒక్కో మెనూతో పౌష్టికాహరం అందిస్తున్నాం. అవసరమయితే రాష్ట్రంలోని ఏ పాఠశాలకైనా మీరు వెళ్లి పరిశీలించుకోవచ్చు. రాజ్‌దీప్ : ఈ పథకాల అమలును ఎలా పర్యవేక్షిస్తున్నారు? గతంలో ప్రభుత్వాలు పాఠశాలలపై పెద్దగా దృష్టి పెట్టలేదు కదా.? నాకిపుడు అర్థమైంది మీరు ఢిల్లీలో ఎందుకు తక్కువ సమయం గడుపుతారన్నది అయితే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గతంలోనూ ఒక సమస్య ఉండేది, ఈ రాష్ట్ర యువతకు నిరుద్యోగం సమస్య ఎక్కువ. ఒక దశలో 35% దాకా ఉండేది. ఈ నేపథ్యంలో వీరికి నైపుణ్యాలు అందించడం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం ఒక సవాలేనా? సీఎం జగన్ : ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా చూస్తోంది. నేనే స్వయంగా పాఠశాలలను పర్యవేక్షిస్తున్నాను. కలెక్టర్లతో నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నాను. మేం పాఠశాల విద్య మీద మాత్రమే కాదు ఉన్నత విద్యపైనా దృష్టి పెట్టాం. ఉద్యోగాలకు అవసరమైనట్టుగా బోధనాంశాల్లో మార్పులు చేశాం. మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో భాగంగా ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాం. అన్ని డిగ్రీలను నాలుగేళ్లు చేస్తున్నాం, ఆన్లైన్ కోర్సులు ఇస్తున్నాం. ఇందులో భాగంగానే త్వరలో ఎడెక్స్తోనూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. పిల్లలు ఆన్లైన్లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం బీకాం నేర్చుకునేవారికి అసెట్ మేనేజ్ మెంట్ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం: ------------- విద్యారంగంలో ఏపీ కొత్త ఒరవడి 5.12pm, జనవరి 24, 2024 విద్యా రంగంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై ఇంట్రో ఏపీలో విద్యారంగంలో సమూల మార్పులు, విద్యా రంగంలో ఆంధ్ర మోడల్, కొత్త ఒరవడి సృష్టించిన సీఎం జగన్ ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు సీఎం జగన్ 5.11pm, జనవరి 24, 2024 ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చర్చ తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ 5.10pm, జనవరి 24, 2024 మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సీఎం జగన్ తిరుపతిలోని ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ Updates: ►ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం జగన్ ►ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానం, మన బడి నాడు - నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, టోఫెల్ శిక్షణ మొదలైన అంశాలపై చర్చ ►దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానంపై ఇండియా టుడే సమ్మిట్ ప్రతినిధులు ప్రశంస ►రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►మరి కొద్దిసేపట్లో తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు హాజరుకానున్న సీఎం జగన్ ►తిరుపతి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడే జరిగే ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు పర్యటన వివరాలను సీఎంవో తెలియజేసింది. బుధవారం సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి సీఎం జగన్ తిరుపతికి( Tirupati ) బయలుదేరతారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తాజ్ హోటల్‌కు వెళ్తారు. అక్కడ జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి ప్రయాణం అవుతారు. సీఎం రాక నేపథ్యంలో.. తిరుపతిలో అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. -
యూత్ పవర్ అంటే ఇదే, త్వరలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
సమీప భవిష్యత్తు అంతా భారతదేశానిదే ‘ఈ దశాబ్దం చివరికల్లా (2029–30) ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరిస్తుంది. దేశంలోని కార్మికులు, కర్షకులు ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు,’ అన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖడ్ మాటలు నిజమవుతాయని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను వారి ముంగిట్లోనే అందజేస్తున్నారని అంటూ భారత్ సాధించే విశేష ప్రగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు ధంఖడ్. ఉపరాష్ట్రపతి అభిప్రాయాలతో ఏకీభవించే విధంగా ప్రఖ్యాత గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ డాయిష్ బ్యాంక్ కూడా ఇండియాపై తన అంచనాలు ప్రకటించింది. ‘ప్రస్తుత భారత వార్షిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 7 లక్షల కోట్ల డాలర్లకు 2030 నాటికి పెరుగుతుంది. ఇంతటి ఆర్థికాభివృద్ధిని మధ్యకాలంలో నిలకడగా సాధించాలంటే–తరచు చెప్పే అధిక జనాభా లేదా వస్తు వినియోగం మాత్రమే సరిపోదు. ఈ రెండూ ఇండియాకు ఆర్థికంగా సత్తువ ఇచ్చే కీలకాంశాలు,’ అని డాయిష్ బ్యాంక్ వ్యాఖ్యానించింది. తన అంచనాకు కారణాలు వివరిస్తూ, ‘ప్రస్తుత దశాబ్దంలో భారత్ మంచి ప్రగతి సాధించడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. దేశంలో గణనీయ సంఖ్యలో ఉన్న యువత జనాభా ఆర్థిక అభివృద్ధికి ప్రధాన కారణం కాగా, ప్రభుత్వ విధానాలు దీనికి తోడవుతున్నాయి,’ అని ఈ సంస్థ వివరించింది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ 2025 కల్లా ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రులు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, 2027 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరిస్తుందని ప్రపంచ దేశాల ఆర్థిక గమనాన్ని నిరంతరం విశ్లేషించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇటీవల అంచనా వేసింది. డిజిటలైజేషన్, ఫైనాన్షియలైజేషన్ తో ఆర్థిక వ్యవస్థ దూకుడు నగదు వాడకం స్థానంలో డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడంతో ఉత్పాదకత పెరిగింది. ఫైనాన్షియలైజేషన్ (మార్కెట్లు వంటి ఫైనాన్షియల్ సంస్థల సైజు, ప్రభావం పెరగడం) వల్ల సమాంతర ఆర్థిక వ్యవస్థ తగ్గిపోయింది. పరిశుభ్రమైన ఇంథన వినియోగం వల్ల కూడా వ్యవస్థలో సామర్ధ్యం పెరుగుతుందని డాయిష్ బ్యాంక్ అభిప్రాయపడింది. మరో ప్రోత్సాహకర అంశం ఏమంటే–ఇండియాలో పనిచేసే వయసున్న జనాభా సైజు విస్తరించడం. ప్రస్తుతం ఇలాంటి యువత సంఖ్య 2007లో చైనాలో ఉన్న స్థాయిలో ఇండియాలో ఉంది. భారత సమగ్ర జీడీపీ, తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి ఇదే విధంగా చైనాను పోలి ఉన్నాయి. వచ్చే పదేళ్లలో దేశంలో పనిచేసే యువతరం సంఖ్యకు అదనంగా 9 కోట్ల 80 లక్షల మంది తోడవుతారు. ప్రపంచంలో పనిచేసే జనాభా సంఖ్యలో పెరుగుదల ఒక్క ఇండియాలోనే 22 శాతంగా ఉంటుందని కూడా ఈ జర్మన్ సంస్థ అంచనావేసింది. సంతృప్తికర కొనుగోలు శక్తి ఉండే భారత మధ్య తరగతి ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రస్తుతం 37 కోట్ల 10 లక్షల మంది మధ్య తరగతి (మిడిల్ క్లాస్) దేశంలో వస్తు వినిమయం పెరగడానికి దోహదం చేస్తోంది. వచ్చే దశాబ్దాల్లో కూడా వినియోగం పెరగడానికి భారత మధ్య తరగతి ప్రజానీకం కారణమౌతారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు కేవలం ఇంటి పనులకు పరిమితం కాకుండా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. భారత అభివృద్ధికి మరో కీలకాంశం ఏమంటే జేఏఎం (జన్ ధన్ అకౌంట్, ఆధార్ నంబర్, మొబైల్ ఫోన్) అనే మూడు ఆయుధాలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పక్కదారులు పట్టకుండా కాపాడుతున్నాయి. జేఏఎం ద్వారా నగదు బదిలీ వేగంగా, సునాయాసంగా జరుగుతున్న కారణంగా కోట్లాది మంది సామాన్య ప్రజానీకానికి మేలు చేకూరుతోంది. మౌలిక సందుపాయాల్లో అత్యంత ప్రధానమైన రహదారుల అభివృద్ధి, విస్తరణ మున్నెన్నడూ లేని విధంగా ముందుకుసాగుతున్నాయి. రహదారుల వ్యవస్థకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం వల్ల ఇప్పుడు దేశంలో రోజుకు సగటున 36 కిలోమీటర్ల పొడవైన రోడ్డు మార్గాలు నిర్మిస్తున్నారు. గడచిన పది సంవత్సరాల్లో ఇండియాలో మొత్తం 73,000 కిలోమీటర్ల పొడవు గల రహదారులు నిర్మించారు. ఇటీవల కాలంలో దేశంలో విద్చుచ్ఛక్తి సరఫరా, శుభ్రమైన వంట పద్ధతులు అమలు చేయడంలో సాధించిన ప్రగతి కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడానికి పురికొల్పుతోంది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సిపి, రాజ్యసభ సభ్యులు -
మహిళపై మంత్రి చేతివాటం ... తర్వాత పాదాలను తాకి...
బెంగళూరు: ఒక మంత్రి తీవ్ర అసహనంతో బహిరంగంగా ఒక మహిళ చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే....కర్ణాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి వి సోమన్న చామరాజనగర్ జిల్లా హంగల గ్రామంలో సుమారు 175 మందికి భూ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో ఒక మహిళ తనకు భూమి పట్టా రాలేదన్న కోపంతో ఆయన మీదకు వచ్చింది. దీంతో సదరు మంత్రి ఆ మహిళ చెంప చెళ్లుమనిపించారు. ఐతే ఆ మహిళ తర్వాత సదరు మంత్రి పాదాలను తాకి మరీ ఆశీర్వాదం తీసుకుంది. తదనంతరం ఆ మంత్రి కూడా సదరు మహిళకు క్షమాపణాలు చెప్పారు. వాస్తవానికి మంత్రిగారు ఆ కార్యక్రమానికి చాలా ఆలస్యంగా చేరుకున్నారు. మరోవైపు ఆమెకు భూమి పట్టా అందకపోవడం, వారందర్నీ ఎదురుచూసేలా చేయడం తదతర కారణాల రీత్యా ఆయన ఇలాంటి సంఘటనను ఎదుర్కోవల్సి వచ్చింది. అచ్చం అలానే ఇటీవల ఒక జనతాదళ్(సెక్యులర్) నాయకుడు శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపాల్‌పై ఇలానే చేతివాటం చూపి కెమెరాకు చిక్కిన సంగతి తెలిసింది. (చదవండి: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు) -
ఒక్క రూపాయికే పక్కా ఇల్లు
మాటే మంత్రంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్రాభివృద్ధే ఆశయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నారు. ఒకే ఒక్క రూపాయికి లక్షలాది రూపాయలు విలువచేసే పక్కా ఇంటిని పేదలకు అందించే బృహత్తర కార్యక్రమానికి విజయనగరంలోని సారిపల్లి వేదికగా మారింది. సకల సదుపాయాలతో నిర్మించిన టిడ్కో ఇళ్లను మంత్రులు ప్రారంభించి లబ్ధిదారులకు గురువారం అప్పగించనున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: పట్టణాల్లో ఇళ్లులేని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి, పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ పత్రాలను చేతికి అందిస్తానన్న సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ సాకారమవుతోంది. విజయనగరానికి సమీపంలోని సారిపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో జగనన్న కాలనీ సిద్ధమైంది. 800 ఇళ్లను జిల్లా ఇన్చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ గురువారం ప్రారంభించనున్నారు. ఆయా లబ్ధిదారులకు ఇంటిపత్రాలను అందించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచే అక్కడ పండగ వాతావరణం నెలకొంది. విద్యుత్‌దీపాల కాంతులతో కాలనీలోని ఇళ్లు జిగేల్మంటున్నాయి. అందంగా.. విశాలంగా.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదల కోసం ప్రభుత్వం నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్ద జి+3 విధానంలో రూ.161.52 కోట్ల వ్యయంతో 2,656 ఇళ్ల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. వాటిలో ఏ–కేటగిరిలో 300 చదరపు అడుగుల చొప్పున విస్తీర్ణంతో 1,536 ఇళ్లు, బి–కేటగిరీలో 365 చదరపు అడుగుల విస్తీర్ణంతో 192 ఇళ్లు, సి–కేటగిరీలో 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో 928 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్నాయి. వాటిలో అన్ని రకాల సౌకర్యాలతో సిద్ధమైన 800 ఇళ్లను లబ్ధిదారులకు గురువారం మంత్రుల చేతుల మీదుగా అందించడానికి ఏపీ టిడ్కో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షల ఆస్తి ఒక్క రూపాయికే... రాష్ట్ర ప్రభుత్వం ఏ–కేటగిరి కింద ఒక్కో ఇంటిని రూ.6.55 లక్షల వ్యయంతో నిర్మింస్తోంది. ఆ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు ఇస్తోంది. మిగతా రూ.5.05 లక్షలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మొత్తంమీద లబ్ధిదారులకు మాత్రం కేవలం ఒక్క రూపాయికే రూ.6.55 లక్షల విలువగల ఇంటిని అందజేస్తోంది. సి–కేటగిరీ కింద నిర్మించే 430 చదరపు అడుగుల విస్తీర్ణంగల డబుల్ బెడ్రూం ఇళ్లకు ఒక్కోదానికి రూ.8.55 లక్షల చొప్పున నిర్మాణ వ్యయం అవుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1.50 లక్షలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం రూ.2.90 లక్షలు సమకూర్చుతోంది. లబ్ధిదారు తన వాటా కింద రూ.50వేలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణం కింద రూ.3.65 లక్షలను అధికారులు సమకూరుస్తున్నారు. రూ.41 కోట్లతో మౌలిక సదుపాయాలు... సారిపల్లిలోని జగనన్న టిడ్కో కాలనీ లేఅవుట్లో లబ్ధిదారుల ఇళ్లకు సామాజిక, మౌలిక వసతులు కల్పించేందుకు రూ.41.02 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. తాగునీటి సరఫరా కోసం రూ.8.93 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.2.55 కోట్లు, డ్రైనేజీ ఏర్పాటుకు రూ.1.61 కోట్లు, విద్యుత్ సరఫరా కోసం రూ.3.97 కోట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి రూ.4.92 కోట్లు, కాలనీ చుట్టూ రిటైనింగ్ వాల్ కోసం రూ.11.27 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అలాగే, విజయనగరం శివారు సోనియానగర్‌లో 1120 ఇళ్లు, నెల్లిమర్లలో 570, బొబ్బిలిలో 1680, రాజాంలో 336 మొత్తం 3,712 ప్లాట్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని కూడా పూర్తిచేసి వచ్చే డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్లో చక్కని వసతులు... ఇళ్లలో పూర్తిగా టైల్స్‌తో కూడిన గచ్చు ఏర్పాటు చేశారు. బెడ్ రూమ్, లివింగ్ రూమ్ ఆకట్టుకునేలా రూపొందించారు. గ్రానైట్ ఫ్లాట్‌ఫాంతో కూడిన వంటగది, సింక్ చక్కగా ఉన్నాయి. ఆధునిక వసతులతో కూడిన టాయిలెట్ కూడా ఉంది. ఇక కాలనీలో 40 అడుగుల వెడల్పుతో కూడిన రోడ్ల నిర్మాణ పనులను ఇప్పటికే పూర్తిచేశారు. విద్యుత్ సరఫరా ఇప్పటికే కల్పించారు. అన్ని వసతులతో సిద్ధమైన ఇళ్లను మంత్రులు లబ్ధిదారులకు అందజేయనున్నారు. లబ్ధిదారుల చేతికి రిజిస్ట్రేషన్ పత్రాలు... టిడ్కో కాలనీలో ఇళ్ల మంజూరుపత్రాలతో పాటు లబ్ధిదారుల పేరిట రిజి స్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను కూడా మంత్రుల చేతుల మీదుగా అందజేస్తాం. తొలివిడతలో ఏ–కేటగిరీకి సంబంధించిన 15 బ్లాకుల్లోని 480 ఇళ్లు, సి–కేటగిరీకి సంబంధించి 10 బ్లాకుల్లోని 320 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సిద్ధం చేశాం. లబ్ధిదారులకు ఎలాంటి ఖర్చులు, వ్యయప్రయాసలు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్లను ఇస్తాం. సారిపల్లి లే అవుట్లో మిగిలిన 1,856 ప్లాట్లను ఆగస్టునాటికి సిద్ధం చేస్తాం. – ఎస్.జ్యోతి, ఎస్ఈ, ఏపీటిడ్కో (చదవండి: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్) -
మౌలిక రంగానికి రుణ లభ్యత అంతంతే!
ముంబై: బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ–ఐఎఫ్‌సీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2021 ఏప్రిల్–జూన్) మౌలిక రంగం ప్రాజెక్టులకు ఇచ్చిన రుణం అంతంతేనని ఇక్రా రేటింగ్స్ నివేదిక ఒకటి పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ సవాళ్లు దీనికి ప్రధాన కారణమని సంస్థ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. అయితే మౌలిక రంగం పరోగతిపై సమీప భవిష్యత్తులో ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తుందని మధ్య కాలికంగా ఈ విభాగం గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉందని వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... - 2021 మర్చి 31 నాటికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ–ఐఎఫ్సీలు కలిసి మౌలిక రంగానికి ఇచ్చిన రుణ అంచనా రూ.24.7 లక్షల కోట్లు. 2020 ఇదే కాలంతో పోల్చితే ఇది 10 శాతం తక్కువ. జూన్ 30 వరకూ మౌలిక రంగానికి రుణ పరిమాణం బలహీనంగానే ఉంది. కరోనా సెకండ్‌వేవ్ ప్రేరిత సవాళ్లు దీనికి ప్రధాన కారణం. - ఒక్క ఐఎఫ్‌సీల విషయంలో మౌలిక రంగానికి గత ఐదేళ్లలో రుణం పెరుగుతోంది. 2021మార్చి 31 వతేదీ నాటికి 54 శాతం పురోగమించింది. అయితే బ్యాంకుల షేర్ గడచిన ఐదేళ్లలో 61 శాతం నుంచి నుంచి 46శాతానికి పడిపోయింది. - 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి 2024– 2025 ఆర్థిక సంవత్సరం వరకూ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) కింద రూ.111 లక్షల కోట్లకు పైగా మౌలిక రంగం పెట్టుబడులపై కేంద్రం దృష్టి సారించడం ఈ రంగానికి భవిష్యత్ సానుకూల అంశాల్లో కీలకమైనది. - ప్రస్తుతం ఎన్బీఎఫ్సీ–ఐఎఫ్‌సీల ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పరిస్థితులు బాగున్నాయి. స్వల్ప కాలిక రుణాలకు సంబంధించి లిక్విడిటీ పరిస్థితులు మెరుగుపడ్డాయి. - ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీల విషయానికి వస్తే, ప్రభుత్వ రంగంలో సంస్థలు లాభాల బాటకు మళ్లాయి. మొండిబకాయిల (ఎన్పీఏ) వాటా తగ్గింది. రుణ వ్యయాలు తక్కువగా ఉన్నాయి. - ఎన్బీఎఫ్సీ–ఐఎఫ్‌సీల రుణ నాణ్యత మెరుగుదల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. -
ఆరోగ్య రంగం.. హైదరాబాద్‌కు 5వ స్థానం
న్యూఢిల్లీ: ఆరోగ్య మౌలిక సదుపాయాల విషయంలో దేశంలోని ఎనిమిది అతిపెద్ద పట్టణాల్లో పుణె ముందుంది. ప్రధాన పట్టణాల్లో ఆరోగ్య సదుపాయాలను విశ్లేషిస్తూ హౌసింగ్ డాట్ కామ్ పోర్టల్ ‘భారత్‌లో ఆరోగ్యరంగ స్థితి’ పేరుతో ఒక నివేదికను బుధవారం విడుదల చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె పట్టణాల్లోని ఆరోగ్య సదుపాయాలను ఈ నివేదికలో విశ్లేషించి ర్యాంకులను కేటాయించింది. ప్రతీ 1,000 మంది ప్రజలకు ఎన్ని ఆస్పత్రుల పడకలు అందుబాటులో ఉన్నాయి, గాలి, నీటి నాణ్యత, పారిశుద్ధ్యం, నివాసయోగ్యతా సూచీ తదితర అంశాల ఆధారంగా పట్టణాలకు ర్యాంకులను కేటాయించింది. 40 శాతం స్కోర్‌ను ఒక్క ఆస్పత్రుల్లోని పడకల ఆధారంగానే నిర్ణయించింది. అహ్మదాబాద్, బెంగళూరు రెండు, మూడో స్థానాల్లో నిలవగా.. ముంబై ఎంఎంఆర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ ఎన్సీఆర్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రతీ వెయ్యి మందికి 3.5 పడకలు ఆరోగ్య మౌలిక సదుపాయాల విషయంలో పుణె దేశంలోనే మెరుగ్గా ఉంది. ‘‘పుణెలో ప్రతీ వెయ్యి మంది ప్రజలకు 3.5 పడకలు అందుబాటులో ఉన్నాయి. భారత జాతీయ సగటుతో పోలిస్తే ఇది ఎంతో అధికం. జాతీయ స్థాయిలో కేవలం ప్రభుత్వరంగంలోని ఆరోగ్య సంరక్షణ సదుపాయాలనే పరిగ ణనలోకి తీసుకుంటే ప్రతీ వెయ్యి మందికి సగటున ఒక్క పడక కూడా లేదు. అర పడకే అందుబాటులో ఉంది. అదే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కలిపి చూస్తే 1.4 పడకలు ఉన్నాయి. అదే ప్రపంచ సగటు 3.2 పడకలుగా ఉంది’’ అని హౌసింగ్ డాట్ కామ్ తెలిపింది. నివాస అనుకూలత, నీటి నాణ్యత, స్థానిక ప్రభుత్వాలు చేపట్టిన చర్యల పరంగా చూస్తే పుణె ఎక్కువ స్కోరు సంపాదించింది. రెండో స్థానంలో ఉన్న అహ్మదాబాద్‌లో 1,000 మంది ప్రజలకు 3.2 ఆస్పత్రి పడకల లభ్యత ఉంది. బెంగళూరులో భిన్నం బెంగళూరు నగరం కొన్ని అంశాల్లో మెరుగ్గాను.. అదే సమయంలో మరికొన్ని అంశాల్లో దారుణంగాను ఉంది. ఆస్పత్రి పడకల లభ్యత, నివాస సౌలభ్యం విషయంలో మెరుగ్గా ఉంటే.. వాయు నాణ్యత, నీటి నాణ్యత, నీటి లభ్యత, మున్సిపల్ పనితీరు అంశాల వల్ల మూడో ర్యాంకుకు పరిమి తం అయింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడం తెలిసిందే. దీనికితోడు నీటి నాణ్యత, పారిశుద్ధ్యం పనితీరు దారుణంగా ఉండడం వల్ల జాబితాలో అట్టడుగు స్థానా నికి పరిమితం అయింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఢిల్లీతోపాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ఉన్నాయి. ఆరోగ్యానికి కేటాయింపులు భారీగా పెంచాలి ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఆరోగ్యసంరక్షణపై వ్యయాలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక అభిప్రాయపడింది. హైదరాబాద్‌లో గాలి నాణ్యత మెరుగు భాగ్యనగరంలో ఆస్పత్రి పడకలు తక్కువగా ఉన్నప్పటికీ.. వాయు నాణ్యత, పారిశుద్ధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ అంశాల్లో మెరుగైన స్కోరు సంపాదించింది. నగరంలోనూ ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు ఎక్కువగా పశ్చిమ, సెంట్రల్ సబర్బన్ ప్రాంతాల్లోనే కేంద్రీకృమైనట్టు నివేదిక పేర్కొంది. ‘‘భారీగా పెరిగిపోతున్న నగర జనాభా కారణంగా నీటి సరఫరాపై ఒత్తిడి పెరిగుతోంది. సరఫరా మించి డిమాండ్ ఉండడంతో నీటికి కొరత ఏర్పడు తోంది’’ అని తెలియజేసింది. నివాస సౌలభ్యం విషయంలో హైదరాబాద్‌కు తక్కువ స్కోరును, ఆస్పత్రి పడకలు, మున్సిపల్ పనితీరు అంశాల్లో మధ్యస్థ స్కోరును కేటాయించింది. -
బడ్జెట్ 2021: మౌలిక సదుపాయాలకు భారీగా..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రోడ్లు, రైల్వేలు, విమాన రంగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పెట్టుబడుదారులకు మరిన్ని మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఎయిర్‌పోర్టుల్లో ఉన్న ప్రభుత్వ వాటాను విక్రయిస్తామన్నారు. ఇక ఈ ఏడాది బడ్జెట్లో అయిదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి 5వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కేరళలో 11వేల కి.మీ. జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టారు. దానిలో భాగంగా పశ్చిమ బెంగాల్లో 25 వేల కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. తమిళనాడులో రహదారలు అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు. అస్సాంలో రహదారుల అభివృద్ధికి 19వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. మెట్రోకి భారీగా నిధులు ఇక బడ్జెట్లో మెట్రోలైట్, మైట్రో న్యూ పేరుతో కొత్త ప్రాజెక్ట్‌లు ప్రతిపాదించారు నిర్మలా సీతారామన్. బెంగళూరు, నాగ్‌పూర్, కొచ్చి మెట్రోరైలు అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. చెన్నై మెట్రోకు 63వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. బెంగళూరు మెట్రోరైలు అభివృద్ధికి 14,788 కోట్ల రూపాయలు, కొచ్చి మెట్రోరైలు ఫేజ్-2 అభివృద్ధికి 1957 కోట్ల రూపాయలు.. బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసుల అభివృద్ధికి రూ.18వేల కోట్లు కేటాయించారు. ఇక దేశంలో లక్షా 18వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు గాను 1,01,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్ 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు అందులోకి తెస్తామన్నారు. ఇందులో భాగంగా ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. 2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ పూర్తి చేస్తామన్నారు. 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 2021-22లో పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ చేయనున్నాట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. -
ఇన్ఫ్రా కంపెనీలకు ప్రధాని మోదీ జోష్
మౌలిక సదుపాయాల కల్పనా రంగ కంపెనీలకు ప్రధాని మోదీ ప్రసంగం తాజాగా జోష్‌నిస్తోంది. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగించిన ప్రధాని మోదీ.. రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాల రంగానికి భారీగా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. దేశాన్ని ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తూ.. ఉపాధికి ఊతమిస్తూ.. రూ. 110 లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు వివరించారు. ఇందుకు విభిన్న రంగాలలో 7,000 ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పలు లిస్టెండ్ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. లాభాల తీరు.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధ పలు కంపెనీల కౌంటర్లు ప్రస్తుతం వెలుగులో నిలుస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో జేఎంసీ ప్రాజెక్ట్స్ 6 శాతం జంప్‌చేసి రూ. 53ను తాకగా.. అశోకా బిల్డ్‌కాన్ 4 శాతం ఎగసి రూ. 74కు చేరింది. ఈ బాటలో కేఎన్ఆర్ 5.2 శాతం పురోగమించి రూ. 226 వద్ద, ఎన్సీసీ 3 శాతం లాభంతో రూ. 33 వద్ద, ఎల్అండ్టీ 2 శాతం బలపడి రూ. 1002 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో దిలీప్ బిల్డ్‌కాన్, హెచ్‌జీ ఇన్ఫ్రా, యాక్షన్ కన్స్ట్రక్షన్, అదానీ పోర్ట్స్, అహ్లువాలియా, గాయత్రి ప్రాజెక్ట్స్ 2 శాతం చొప్పున ఎగశాయి. -
నాడు- నేడు సదుపాయలను పరిశీలిస్తున్న వైఎస్ జగన్
-
నాడు-నేడు దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది..
సాక్షి, తాడేపల్లి: విద్యా రంగంలో నాడు-నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. నాడు–నేడులో భాగంగా స్కూళ్లలో ఏర్పాటు చేయనున్న సదుపాయాలను ఆయన పరిశీలించి, అందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గవర్నమెంటు స్కూళ్లలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫర్నీచర్ ఏర్పాటు చేయడమే కాదు, వాటి నిర్వహణ కూడా ఎంతో ముఖ్యమన్న ఆయన పలు సూచనలు చేశారు. పిల్లలకు రెండు రకాలుగా ఉపయోగపడే బల్లలు, గ్రీన్ చాక్ బోర్డు, వాటర్ ప్యూరిఫైర్, ఫిల్టర్, అల్మరాలు, సీలింగ్ ఫ్యాన్లను సీఎం స్వయంగా చూశారు. పిల్లలు కూర్చునే బల్లల నమూనాలను సీఎం పరిశీలించారు. అనంతరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలోనే నాడు-నేడు కార్యక్రమం నిలిచిపోతుందని అన్నారు. జులై చివరికి అన్ని పాఠశాల్లో నాడు-నేడు పూర్తి చేస్తామని, ఇప్పటికే చాలాచోట్ల పనులు ఊపందుకున్నాయని వివరించారు. మొదటి దశలో నాడు-నేడు కింద 15,700 మౌలిక సదుపాయాల కల్పిస్తున్నామని వివరించారు. నాడు-నేడు మీద సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించిర టెండర్లు ఇప్పటికే పూర్తి చేశామని మంత్రి తెలిపారు. (ఈ నెల 11న ఏపీ కేబినెట్ సమావేశం) టీచర్ల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్: నాడు-నేడు కార్యక్రమం దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. మొదట దశలో 500 కొత్తగా జునియర్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘జగన్న గోరు ముద్ద’ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. టీచర్ల బదిలీలకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామని వివరించారు. వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు దిలీలు కోసం టీచర్లు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పదవ తరగతి పరీక్షలు పూర్తి అయ్యాక స్కూల్స్ ప్రారంభం అయ్యే లోపు టీచర్ల బదీలీలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు లేరన్న సాకుతో స్కూళ్లు మూసివేయడం లేదని చెప్పారు. గతం ప్రభుత్వం హయాంలో 7 వేలకు పైగా స్కూళ్లు మూసేశారని తెలిపారు. ఒక్క స్కూల్ కూడా మూయడానికి వీల్లేదని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. -
మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడుతున్నాం
-
మిషన్ కర్నూలే ఎజెండా
సాక్షి, కర్నూలు(సెంట్రల్): విద్య, వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలని జిల్లా యంత్రాంగం నిర్దేశించుకున్న మిషన్ కర్నూలే ఎజెండాగా జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ పి.అనిల్‌కుమార్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. కర్నూలులోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. అభివృద్ధిపై ‘ప్రత్యేక’ దృష్టి ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం జిల్లా యంత్రాంగం.. మిషన్ కర్నూలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి నియోజకవర్గానికి జిల్లా అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకాధికారులు ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. రాత్రి బస చేయడంతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై దృష్టి సారిస్తారు. వారంలో ప్రతిరోజు ఒక్క పాఠశాలను, ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. ఆ సమయంలో వచ్చిన సమస్యలను నివేదిక రూపంలో కలెక్టర్‌కు అందజేస్తే వారాంతరం జరిగే సమీక్ష సమావేశంలో వాటికి పరిష్కారం చూపుతారు. ఏదైనా పాఠశాలకు ఆకస్మికంగా తనిఖీకి వెళితే అక్కడ విద్యార్థులు తమకు తాగునీరు లేదని, మరుగుదొడ్లు పనిచేయడంలేదని, తరగతి గదుల కొరత ఉందని చెబితే వాటిని తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారు. అలాగే ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, 500 రకాల మాత్రలు, పారిశుద్ధ్యం, వైద్య పరికారాలు అందుబాటులో లేకపోతే కల్పించానికి చర్యలు తీసుకుంటారు. అలాగే గత సమీక్ష సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలు, వాటికి పరిష్కారాలపై లోతైనా విశ్లేషణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తనిఖీలు,రాత్రి బసలేవీ? మిషన్ కర్నూలులో భాగంగా విద్య, వైద్య శాఖల్లో సమస్యలను నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, ఇతర జిల్లా అధికారులు తనిఖీలు, రాత్రి బస చేసి స్వయంగా తెలుసుకోవాలి. అయితే ఎక్కడా తనిఖీలు లేవు. రాత్రి బసలు చేయడంలేదు. జిల్లా కలెక్టర్ ఇటీవల కల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, పీహెచ్‌సీని తనిఖీ చేశారు. గూడూరులోని కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేశారు. ఇక జాయింట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్–2, ఇతర ఉన్నతాధికారులు, నియోజకవర్గ అధికారులుగాని తనిఖీ చేయడంలేదు.ఇలా అయితే స్వయంగా సమస్యలను తెలుసుకోవడానికి అధికారులకు ఎలా వీలు అవుతుందో వారే చెప్పాలి. పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో అంతంత మాత్రమే వైద్యం జిల్లాలో 87 పీహెచ్‌సీలు, 18 సీహెచ్‌సీలు ఉన్నాయి. పీహెచ్‌సీల్లో నామమాత్రపు వైద్యం అందుతోంది. రోడ్డు ప్రమాదాల బాధితులకు వైద్యం సక్రమంగా అందడంలేదు. ప్రాథమిక చికిత్స చేసి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, ఆదోని ఏరియా ఏసుపత్రి, నంద్యాల జిల్లా ఆసుపత్రులకు సిఫారసు చేస్తున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ఏరియా ఆసుపత్రుల్లో సదుపాయాలను పెంచాల్సి ఉంది. కర్నూలు పెద్దాసుపత్రిలో ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ సేవలను విస్తృత పరచాలి. మిషన్ కర్నూలులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పదో తరగతిలో వంద శాతం ఫలితాలను సాధించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇదంతా జరగాలంటే ఎక్కడిక్కడే పర్యవేక్షణ చేసే అధికారులు ఉండాలి. విద్యాశాఖను పర్యవేక్షణాధికారుల ఖాళీలు వేధిస్తున్నాయి. ఆదోని, నంద్యాల, డోన్ డిప్యూటీడీఈఓ పోస్టులతో 17 మండలాలకు ఎంఈఓలు లేరు. కొన్ని పాఠశాలల్లో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ గాడి తప్పింది. దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉంది. -
‘అమ్మఒడి’తో ప్రతితల్లికీ రూ.15 వేల ఆర్థిక సాయం
సాక్షి, అనంతపురం అర్బన్: ‘‘విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ‘అమ్మఒడి’ పథకం ద్వారా రూ.15 వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో రూపురేఖలు మారనున్నాయి. ఉపాధ్యాయులు కూడా తగు చర్యలు తీసుకుని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి ’’ అని కలెక్టర్ సత్యనారాయణ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో విద్యావ్యవస్థపై ఎంఈఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తక్కువగా ఉందంటూ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీల నుంచి మొదటి తరగతిలో కేవలం 18,781 మంది పిల్లలనే చేర్పించడం ఏమిటని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటే ఇంత తక్కువ మంది చేరినట్లు నివేదికలే చెబుతున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులంటే తనకు గౌరవమని, దానిని నిలుపుకోవాలన్నారు. 80 శాతం కంటే లక్ష్యం తక్కువ చేసిన వారికి మెమోలు జారీ చేయాని డీఈఓ దేవరాజ్‌ను ఆదేశించారు. బడిబయటి పిల్లలను చేర్పించడంలోనూ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. అమ్మ ఒడితో పాటు ఇతర కార్యక్రమాలను విస్తృతంగా గ్రామాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 2.69 లక్షల మంది విద్యార్థులకు యూనిఫారం త్వరిగతిన అందజేయాలన్నారు. సమావేశానికి హాజరైన ఎంఈఓలు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి పాఠశాలల్లో టాయ్లెట్లు నిర్మిస్తే... వాటిని ఎందుకు వినియోగించడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు. రొద్దం మండలం పెద్ద మణుతూరు పాఠశాలను తాను సందర్శించిన సమయంలో టాయ్‌లెట్‌కు తాళం వేసి ఉందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలతో కలిసి సహఫంక్తి భోజనం చేయాలని చెప్పారు. ఉపాధ్యాయులు గైర్హాజరైతే చర్యలు ఉపాధ్యాయులు సక్రమంగా పాఠశాలలకు హాజరుకావాలన్నారు. కొందరు టీచర్లు స్కూల్ సమయం కంటే ముందే ఇళ్లకు వెళుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఉపాధ్యాయుల హాజరును ఎంఈఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు. పాఠశాలలకు తాను అకస్మిక తనిఖీకి వస్తానని... ఎక్కడైనా ఉపాధ్యాయులు గైర్హాజరైనట్లు తన దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హాస్టల్ వెల్ఫేర్ అధికారులు (వార్డెన్లు), మోడల్ స్కూళ్లు, కేజీబీవీల ప్రిన్సిపాళ్లందరూ స్థానికంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజనం అమలు, పాఠశాలల్లో పరిశుభ్రత, తదితర అంశాలపై మండలాల వారీగా కలెక్టర్, జేసీ–2 సమీక్షించారు. సమావేశంలో జేసీ–2 హెచ్.సుబ్బరాజు, ఎస్ఎస్ఏ పీఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, ఎస్టీ సంక్షేమ శాఖాధికారి కొండలరావు, బీసీ సంక్షేమ శాఖ అధకారి రబ్బానిబాషా ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆయుధాల్లో సగానికి పైగా పురాతనమైనవే!
న్యూఢిల్లీ : అమెరికా, చైనా లాంటి దేశాల్లో రక్షణ శాఖకు కేటాయింపులు భారీగా ఉండగా.. మన దేశంలో మాత్రం ఆ కేటాయింపులు కేవలం రూ.25 వేల కోట్లకు మించడం లేదు. ఆయా దేశాల్లో ఆర్మీ మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా వారు ఆయుధ సామాగ్రిని సమకూరుస్తుండగా మన దేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మన సైన్యం దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రిలో దాదాపు 70 శాతం చాలా పురాతనమైనవేనని ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి చెప్పారు. ‘ప్రస్తుతం ఉన్న ఆయుధ సామాగ్రిలో 68శాతం పాతవే ఉన్నాయి. 24 శాతం మాత్రమే ఈ కాలం నాటివి. మిగతా 8 శాతం ఆర్ట్ విభాగానికి చెందినవి. మేకిన్ ఇండియాలో భాగంగా ఆయుధాల ఆధునీకీకరణ కోసం 25 కార్యక్రమాలు ప్రారంభించాం. కానీ సరైన నిధుల కేటాయింపులు లేనందున ప్రస్తుతం వీటన్నింటిని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌పై మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. కానీ చాలా తక్కువ కేటాయింపులు చేశారు’ అన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో ఆర్మీ ఆధునీకీకరణ కోసం రూ.31 వేల కోట్లను కోరగా, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కేవలం రూ.21,338 కోట్లను మాత్రమే కేటాయించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 125 ప్రాజెక్టులకే రూ.29 వేల కోట్లు అవసరం ఉండగా, కేంద్రం కేటాయించిన రూ.21 వేల కోట్లు వాటికే సరిపోవని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, నూతన ఆయుధాల కొనుగోలు ఇక సాధ్యం కాదని తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుతం వినియోగిస్తున్న టీ-72 యుద్ద ట్యాంకులు 1980 నాటివని, వీటి స్థానంలో కొత్త కంబాట్ వాహానాలను కొనుగోలు చేయాలని భావించినట్టు చెప్పారు. కానీ అరకొర బడ్జెట్ కేటాయింపులతో ఇప్పుడు వీటి కొనుగోలుకు మరికొన్ని సంవత్సరాలు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో రెండు యుద్దాలు వచ్చే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో ఆర్మీ ఆధునీకీకరణ, లోటుపాట్లను పూరించుకోవడం వంటి వాటిపై దృష్టి సారించాల్సినవసరం ఉందని పార్లమెంటరీ కమిటీకి నివేదించామని లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ తెలిపారు. ప్రస్తుతం చాలా పెద్ద సంఖ్యలో చైనా వ్యూహాత్మక రహదారుల నిర్మాణం చేపడుతుందని, ఉత్తర సరిహద్దు వెంట మనం కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అడిగిన దాని కన్నా తక్కువగా సుమారు రూ. 902 కోట్లు మాత్రమే కేటాయించినట్టు పేర్కొన్నారు. మొత్తం మీద తాము అడిగిన దానికి, కేంద్ర కేటాయింపులకు మధ్య రూ. 12,296 కోట్లు వ్యత్యాసం ఉందని లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ అన్నారు. -
ప్రభుత్వభూములు అమ్మి నిధులు తెస్తాం: కేసీఆర్
నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు అమ్మి నిధులు సమకూరుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని పట్టణప్రాంత ఎమ్మెల్యేలతో ఆయన ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు. పట్టణప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, మురికివాడల మెరుగు, గృహనిర్మాణానికి కొత్త విధానం తీసుకొస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సమన్వయంతో తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల స్థితిగతులు మెరుగుపడాల్సి ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల విషయంలో సొంత భవనాలు కావాల్సినవి, మరమ్మతులు చేయాల్సినవి, కొత్తగా కట్టాల్సిన వాటిపై కలెక్టర్ల నుంచి నివేదిక తెప్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పట్టణప్రాంతాల్లో కూడా డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పథకం అమలు చేస్తామన్నారు. రోడ్ల మరమ్మతులు, నిర్వహణ బాధ్యతను ఐదేళ్ల వరకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని తెలిపారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, గజ్వేల్ పట్టణాలకు రింగ్ రోడ్లు ఏర్పాటుచేస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.