బెంగళూరు: ఒక మంత్రి తీవ్ర అసహనంతో బహిరంగంగా ఒక మహిళ చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే....కర్ణాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి వి సోమన్న చామరాజనగర్ జిల్లా హంగల గ్రామంలో సుమారు 175 మందికి భూ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.
ఆ కార్యక్రమంలో ఒక మహిళ తనకు భూమి పట్టా రాలేదన్న కోపంతో ఆయన మీదకు వచ్చింది. దీంతో సదరు మంత్రి ఆ మహిళ చెంప చెళ్లుమనిపించారు. ఐతే ఆ మహిళ తర్వాత సదరు మంత్రి పాదాలను తాకి మరీ ఆశీర్వాదం తీసుకుంది. తదనంతరం ఆ మంత్రి కూడా సదరు మహిళకు క్షమాపణాలు చెప్పారు. వాస్తవానికి మంత్రిగారు ఆ కార్యక్రమానికి చాలా ఆలస్యంగా చేరుకున్నారు.
మరోవైపు ఆమెకు భూమి పట్టా అందకపోవడం, వారందర్నీ ఎదురుచూసేలా చేయడం తదతర కారణాల రీత్యా ఆయన ఇలాంటి సంఘటనను ఎదుర్కోవల్సి వచ్చింది. అచ్చం అలానే ఇటీవల ఒక జనతాదళ్(సెక్యులర్) నాయకుడు శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపాల్‌పై ఇలానే చేతివాటం చూపి కెమెరాకు చిక్కిన సంగతి తెలిసింది.
(చదవండి: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు)
Comments
Please login to add a commentAdd a comment