న్యూఢిల్లీ: ఆరోగ్య మౌలిక సదుపాయాల విషయంలో దేశంలోని ఎనిమిది అతిపెద్ద పట్టణాల్లో పుణె ముందుంది. ప్రధాన పట్టణాల్లో ఆరోగ్య సదుపాయాలను విశ్లేషిస్తూ హౌసింగ్ డాట్ కామ్ పోర్టల్ ‘భారత్‌లో ఆరోగ్యరంగ స్థితి’ పేరుతో ఒక నివేదికను బుధవారం విడుదల చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె పట్టణాల్లోని ఆరోగ్య సదుపాయాలను ఈ నివేదికలో విశ్లేషించి ర్యాంకులను కేటాయించింది.
ప్రతీ 1,000 మంది ప్రజలకు ఎన్ని ఆస్పత్రుల పడకలు అందుబాటులో ఉన్నాయి, గాలి, నీటి నాణ్యత, పారిశుద్ధ్యం, నివాసయోగ్యతా సూచీ తదితర అంశాల ఆధారంగా పట్టణాలకు ర్యాంకులను కేటాయించింది. 40 శాతం స్కోర్‌ను ఒక్క ఆస్పత్రుల్లోని పడకల ఆధారంగానే నిర్ణయించింది. అహ్మదాబాద్, బెంగళూరు రెండు, మూడో స్థానాల్లో నిలవగా.. ముంబై ఎంఎంఆర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ ఎన్‌సీఆర్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ప్రతీ వెయ్యి మందికి 3.5 పడకలు
ఆరోగ్య మౌలిక సదుపాయాల విషయంలో పుణె దేశంలోనే మెరుగ్గా ఉంది. ‘‘పుణెలో ప్రతీ వెయ్యి మంది ప్రజలకు 3.5 పడకలు అందుబాటులో ఉన్నాయి. భారత జాతీయ సగటుతో పోలిస్తే ఇది ఎంతో అధికం. జాతీయ స్థాయిలో కేవలం ప్రభుత్వరంగంలోని ఆరోగ్య సంరక్షణ సదుపాయాలనే పరిగ ణనలోకి తీసుకుంటే ప్రతీ వెయ్యి మందికి సగటున ఒక్క పడక కూడా లేదు. అర పడకే అందుబాటులో ఉంది. అదే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కలిపి చూస్తే 1.4 పడకలు ఉన్నాయి. అదే ప్రపంచ సగటు 3.2 పడకలుగా ఉంది’’ అని హౌసింగ్ డాట్ కామ్ తెలిపింది. నివాస అనుకూలత, నీటి నాణ్యత, స్థానిక ప్రభుత్వాలు చేపట్టిన చర్యల పరంగా చూస్తే పుణె ఎక్కువ స్కోరు సంపాదించింది. రెండో స్థానంలో ఉన్న అహ్మదాబాద్‌లో 1,000 మంది ప్రజలకు 3.2 ఆస్పత్రి పడకల లభ్యత ఉంది.
బెంగళూరులో భిన్నం
బెంగళూరు నగరం కొన్ని అంశాల్లో మెరుగ్గాను.. అదే సమయంలో మరికొన్ని అంశాల్లో దారుణంగాను ఉంది. ఆస్పత్రి పడకల లభ్యత, నివాస సౌలభ్యం విషయంలో మెరుగ్గా ఉంటే.. వాయు నాణ్యత, నీటి నాణ్యత, నీటి లభ్యత, మున్సిపల్ పనితీరు అంశాల వల్ల మూడో ర్యాంకుకు పరిమి తం అయింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడం తెలిసిందే. దీనికితోడు నీటి నాణ్యత, పారిశుద్ధ్యం పనితీరు దారుణంగా ఉండడం వల్ల జాబితాలో అట్టడుగు స్థానా నికి పరిమితం అయింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో ఢిల్లీతోపాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ఉన్నాయి.
ఆరోగ్యానికి కేటాయింపులు భారీగా పెంచాలి
ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఆరోగ్యసంరక్షణపై వ్యయాలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక అభిప్రాయపడింది.
హైదరాబాద్‌లో గాలి నాణ్యత మెరుగు
భాగ్యనగరంలో ఆస్పత్రి పడకలు తక్కువగా ఉన్నప్పటికీ.. వాయు నాణ్యత, పారిశుద్ధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ అంశాల్లో మెరుగైన స్కోరు సంపాదించింది. నగరంలోనూ ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు ఎక్కువగా పశ్చిమ, సెంట్రల్ సబర్బన్ ప్రాంతాల్లోనే కేంద్రీకృమైనట్టు నివేదిక పేర్కొంది. ‘‘భారీగా పెరిగిపోతున్న నగర జనాభా కారణంగా నీటి సరఫరాపై ఒత్తిడి పెరిగుతోంది. సరఫరా మించి డిమాండ్ ఉండడంతో నీటికి కొరత ఏర్పడు తోంది’’ అని తెలియజేసింది. నివాస సౌలభ్యం విషయంలో హైదరాబాద్‌కు తక్కువ స్కోరును, ఆస్పత్రి పడకలు, మున్సిపల్ పనితీరు అంశాల్లో మధ్యస్థ స్కోరును కేటాయించింది.
ఆరోగ్య రంగం.. హైదరాబాద్‌కు 5వ స్థానం
Published Thu, May 13 2021 2:11 AM | Last Updated on Thu, May 13 2021 2:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment