Housing.com
-
రియల్ ఎస్టేట్: ఫ్లాటా.. ప్లాటా.. ఏది బెటర్?
ఓపెన్ ప్లాట్ (Open plot), అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్.. ఇలా రియల్ ఎస్టేట్ (Real estate) పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ, ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్స్తోనే అధిక రాబడి వస్తుందని హౌసింగ్.కామ్ సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి సంవత్సరం స్థలాల ధరలలో 7 శాతం వృద్ధి నమోదవుతుంటే.. అపార్ట్మెంట్లలో మాత్రం 2 శాతమే పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. హైదరాబాద్ (Hyderabad), చెన్నై, బెంగళూరు నగరాల్లోని నివాస ప్లాట్లకే ఎక్కువ డిమాండ్ ఉందని వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోపెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు, ఇండిపెండెంగ్ గృహాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ పునఃప్రారంభమైందని చెప్పారు.కరోనాతో పెరిగిన డిమాండ్.. ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్ ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే ఫ్లాట్లు కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటు పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, కరోనా నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం, అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవడమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు.13–21 శాతం పెరిగిన ధరలు..హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని హౌసింగ్.కామ్ రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్రైమాసికంలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: జూబ్లీహిల్స్‌లో బంగ్లా.. రూ.40 కోట్లు!హైదరాబాద్‌లో ప్లాట్లకే డిమాండ్ ఎక్కువఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ గా ఉంది. 2018–24 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్‌నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్కబల్లాపూర్, హోస్కేట్, కొంబల్‌గోడు ప్రాంతాల్లోని ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది.2018–24 మధ్య ఢిల్లీ–ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. సెక్టార్ 99, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, సెక్టార్ 95ఏ, సెక్టార్ 70ఏ, సెక్టార్ 63లలోని నివాస స్థలాలలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
విశాలమైన ఇళ్ల కొనుగోలు.. టైర్–2 జోరు
కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ (Work form Home) నేటికీ కొనసాగుతుండటంతో ‘టైర్–2’ (tier 2 cities) ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపు తున్నారు. -సాక్షి, సిటీబ్యూరోకరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఆన్లైన్లో ప్రాపర్టీల శోధన గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబై లోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్ చేస్తాయని తెలిపింది.మారిన అభిరుచులు.. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకటిన్నర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాత నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుందని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. 3 బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాల్లో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2021లో 15 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది.అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్‌ల ఆలస్యం, దివాలా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ప్రాపర్టీ శోధనలు గణనీయమైన స్థాయిలో పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రీజియన్‌లో పలు మౌలిక సదుపాయ ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్‌లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది.ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి మరీ ముఖ్యంగా నివాస సముదాయ మార్కెట్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అత్యంత కీలకంగా కానున్నాయని అంచనా వేసింది. -
రియల్ ఎస్టేట్‌కే అధిక ప్రాధాన్యం
హైదరాబాద్: రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడులకే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ మండలి నరెడ్కో సాయంతో హౌసింగ్ డాట్ కామ్ నిర్వహించిన సర్వేలో.. రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడికి మొదటి ప్రాధాన్యమిస్తామని 48 శాతం మంది తెలిపారు. ఆ తర్వాత 19 శాతం మంది డిపాజిట్లలో పెట్టుబడులు పెడతామని చెప్పగా, 18 శాతం మంది స్టాక్స్‌లో, 15 శాతం మంది బంగారానికి తమ ప్రాధాన్యమని తెలిపారు. ముఖ్యంగా గడిచిన ఏడాదిన్నర కాలంలో గృహ రుణాలపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో పన్ను ప్రోత్సాహకాలు క్పలించాలని, సులభతర చెల్లింపులకు అవకాశం కలి్పంచాలని కోరుకుంటున్నట్టు ఈ సర్వేలో తెలిసింది. అలాగే, డెవలపర్లు ఇచ్చే ఆఫర్లకూ మొగ్గు చూపిస్తున్నారు. సర్వేలోని వివరాలతో హౌసింగ్ డాట్ కామ్ ఒక నివేదికను విడుదల చేసింది. స్టాంప్‌డ్యూటీ, జీఎస్టీ పరంగా రాయితీలు, సులభతర తిరిగి చెల్లింపుల ప్లాన్లు వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల కొనుగోలుకు వినియోగదారులను ప్రేరేపించే అంశాలని ఈ సర్వే తెలిపింది. నిర్మాణంలో ఉన్న ఇళ్ల కంటే ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లకే వినియోగదారుల ప్రాధాన్యం పెరిగింది. మాడ్యులర్ కిచెన్లు, తాము కోరుకున్న విధంగా వుడ్ వర్క్ చేసి ఇవ్వడం కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో హౌసింగ్ డాట్ కామ్ ఈ సర్వే నిర్వహించింది. సొంతిల్లుకు ప్రాధాన్యం.. ‘‘చరిత్రను చూస్తే పెట్టుబడులకు రియల్ ఎస్టేట్ మూలస్తంభంగా ఉంటోంది. కరోనా మహమ్మారి దీని ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. ఎంతో మందికి సొంతిల్లు ప్రాధాన్య లక్ష్యంగా మారిపోయింది. హైబ్రిడ్ పని నమూనాలు, భద్రత, రక్షణ అనేవి రియల్ ఎస్టేట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయి’’అని హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు. దశాబ్ద కాలం పాటు స్తబ్దత తర్వాత ఇటీవలి కాలంలో ఇళ్ల ధరలు పుంజుకుంటున్నట్టు చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో రుణాలపై రేట్లు 2.5 శాతం పెరిగినప్పటికీ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలంగా నిలబడినట్టు చెప్పారు. పెంటప్ డిమాండ్‌కు తోడు, కొత్త డిమాండ్ ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు అగర్వాల్ వెల్లడించారు. ‘‘ఇటీవలి జీ20 సదస్సు ఆర్థిక వ్యవస్థను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది విధానాలు, పెట్టుబడుల పరంగా భారత రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని మార్చేస్తుంది. కరోనా సమయంతో పోలిస్తే వినియోగదారుల్లో విశ్వాసం మరింత పెరిగింది. 48 శాతం మందికి రియల్ ఎస్టేట్ ప్రాధాన్య పెట్టుబడిగా కొనసాగుతోంది. ప్రాపరీ్ట, వడ్డీ రేట్లు పెరగడంతో సమీప కాలంలో కొనుగోళ్లకు జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ ఎత్తివేత కీలకంగా పనిచేస్తాయి’’అని నరెడ్కో ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ పేర్కొన్నారు. -
ప్రాప్‌టెక్ కంపెనీల్లోకి తగ్గిన నిధులు, రియల్టిలో పెట్టుబడులు ఢమాల్
న్యూఢిల్లీ: ప్రాపర్టీటెక్నాలజీ (ప్రాప్‌టెక్) సంస్థల్లోకి గతేడాది పెట్టుబడుల ప్రవాహం స్వల్పంగా తగ్గింది. 3 శాతం క్షీణించి 719 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. 2021లో ప్రాప్‌టెక్ సంస్థలు 742 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయి. హౌసింగ్‌డాట్‌కామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశి్చతులు నెలకొన్నప్పటికీ ప్రాప్‌టెక్ సంస్థల్లోకి పెట్టుబడుల రాక స్వల్పంగానే తగ్గినట్లు హౌసింగ్‌డాట్‌కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాలా తెలిపారు. గడిచిన దశాబ్ద కాలంలో, ముఖ్యంగా గత మూడేళ్లలో వినూత్న టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా పురోగమించిందని ఆయన పేర్కొన్నారు. కో-వర్కింగ్ విభాగం భారీగా విస్తరించిందని తెలిపారు. కోవిడ్-19 సమయంలో స్కూళ్లు, కాలేజీలు మూతబడటంతో తాత్కాలికంగా సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ విద్యా సంస్థలు, ఆఫీసులు తెరుచుకున్నా కో-లివింగ్ విభాగం చెప్పుకోతగ్గ స్థాయిలో కోలుకుందని అగర్వాలా పేర్కొన్నారు. నివేదిక ప్రకారం 2009లో ప్రాప్‌టెక్‌లో 0.2 మిలియన్ డాలర్లు రాగా.. 2020లో 551 మిలియన్ డాలర్లు వచ్చాయి. (భారీ లాభాల్లోకి ఇండిగో: ఆదాయంలోనూ కొత్త రికార్డ్) వృద్ధికి మరింత అవకాశం.. దేశీయంగా ప్రాప్‌టెక్ ప్రస్తుతం తొలి దశల్లోనే ఉందని కానీ వృద్ధి చెందడానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని కో-లివింగ్ సంస్థ సెటిల్ సహ వ్యవస్థాపకుడు అభిõÙక్ త్రిపాఠి చెప్పారు. రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ప్రస్తుతం అన్ని దశల్లోనూ టెక్నాలజీ వినియోగం పెరిగిందని హౌసింగ్‌డాట్‌కామ్ రీసెర్చ్ విభాగం హెడ్ అంకిత సూద్ తెలిపారు. మరోవైపు అంతర్జాతీయంగా ఎకానమీల్లో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొనడంతో ఇన్వెస్టర్లు గత అనుభవాల రీత్యా కొంత కాలంగా డీల్స్ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని స్టార్టప్ సంస్థ రిలాయ్ వ్యవస్థాపకుడు అఖిల్ సరాఫ్ తెలిపారు. వ్యయాల భారం భారీగా ఉన్న స్టార్టప్‌లు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. (ఆన్లైన్ గేమింగ్: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం) రియల్టిలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు డౌన్ రియల్ ఎస్టేట్‌లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో గణనీయంగా తగ్గాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలి్చనప్పుడు 41 శాతం క్షీణించి 1.6 బిలియన్ డాలర్లకు (రూ.13,120 కోట్లు) పరిమితమయ్యాయి. కానీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోలి్చచూసినప్పుడు 33 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఈ వివరాలను ప్రాపర్టీ కన్సల్టెంట్ ‘వెస్టియన్’ విడుదల చేసింది. జూన్ త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడుల్లో ఎక్కువ శాతం విదేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచే ఉన్నాయి. 92 శాతం పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లే సమకూర్చడం గమనార్హం. భారత వృద్ధి పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శమని వెస్టియన్ పేర్కొంది. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో రియల్ ఎస్టేట్‌లోకి వచ్చిన ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులు 2.7 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఇవి 1.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అనిశి్చత పరిస్థితుల్లోనూ భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ బలమైన పనితీరు చూపించినట్టు, మార్చి త్రైమాసికంతో పోలి్చనప్పుడు జూన్ క్వార్టర్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడమే ఇందుకు నిదర్శమని వెస్టియన్ పేర్కొంది. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) రానున్న త్రైమాసికాల్లో బలమైన పనితీరు జీడీపీ స్థిరమైన పనితీరు, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతుతో రానున్న త్రైమాసికాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో మరింత బలమైన పనితీరు సాధ్యపడుతుందని వెస్టియన్ సీఈవో శ్రీనివాస్‌రావు అభిప్రాయపడ్డారు. ఆఫీస్ స్పేస్, కోవర్కింగ్, రిటైల్, హోటల్స్ ప్రాజెక్టులు జూన్ త్రైమాసికంలో 88 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. ముఖ్యంగా క్రితం ఏడాది ఇదే కాలంలో పోలి్చనప్పుడు జూన్ క్వార్టర్లో వాణిజ్య రియల్ ఎసేŠట్ట్ ఆస్తుల్లోకి వచ్చిన సంస్థాగత పెట్టుబడులు 1.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇండ్రస్టియల్, వేర్ హౌసింగ్‌లో పెట్టుబడులు గణనీయంగా తగ్గి 134 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కానీ, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ విభాగంలోకి వచి్చన పెట్టుబడులు బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. -
హౌసింగ్ డాట్ కామ్ ద్వారా వ్యక్తిగత రుణాలు
న్యూఢిల్లీ: ప్రాపర్టీ టెక్నాలజీ సంస్థ ‘హౌసింగ్ డాట్ కామ్’ ఫిన్‌బాక్స్ భాగస్వామ్యంతో వ్యక్తిగత రుణాలను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. రూ.10 లక్షల వరకు రుణాలను తక్షణమే జారీ చేయనున్నట్టు తెలిపింది. రెంటల్ సెక్యూరిటీ డిపాజిట్, ఇంటి నవీకరణ, ఫరి్నచర్ కొనుగోలు అవసరాలను తీర్చేందుకు గాను కస్టమర్లకు రుణ సాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. మరింత సౌకర్యవంతంగా డిజిటల్ రూపంలో రుణాల మంజూరుకు గాను ఈ సేవను తన యాప్, వెబ్‌సైట్‌తో అనుసంధానించనున్నట్టు ప్రకటించింది. హౌసింగ్ ఎడ్జ్ ద్వారా కస్టమర్లు ఈ సేవను పొందొచ్చని తెలిపింది. సంక్లిష్టమైన రుణ దరఖాస్తులకు కాలం చెల్లిపోయిందని, మొత్తం రుణ దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్లోనే 3 నిమిషాల్లోనే పూర్తయ్యేలా ఏర్పాటు చేసినట్టు హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు. దరఖాస్తు ఆమోదం పొందిన 24 గంటల్లోనే రుణాన్ని మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ఇళ్లకు సంబంధించి అన్ని అవసరాలను అందించే ఏకీకృత వేదికగా అవతరించడమే తమ లక్ష్యమని తెలిపారు. -
క్రెడిట్‌పై అద్దె చెల్లించవచ్చు
న్యూఢిల్లీ: ప్రాపర్టీటెక్ కంపెనీ హౌసింగ్.కామ్ కస్టమర్లకు క్రెడిట్‌పై అద్దె చెల్లించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు ఫిన్‌టెక్ సంస్థ నీరోతో చేతులు కలిపింది. వెరసి కస్టమర్లకు ప్రస్తుతం అద్దె చెల్లించు– తదుపరి దశలో తిరిగి చెల్లించు(రెంట్ నౌ పే లేటర్– ఆర్ఎన్పీఎల్) సేవలను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం పలు ఫిన్‌టెక్ కంపెనీలు క్రెడిట్ కార్డుల తరహాలో ప్రస్తుత కొనుగోలుకి తరువాత చెల్లింపు(బయ్ నౌ పే లేటర్– బీపీఎన్ఎల్) సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరు సంస్థ నీరోతో ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియన్ కంపెనీ ఆర్ఈఏలో భాగమైన హౌసింగ్.కామ్ కస్టమర్లకు తాజాగా ఆర్ఎన్పీఎల్ సేవలను ప్రారంభించింది. దీంతో కస్టమర్లకు ఎలాంటి కన్వినెన్స్ ఫీజు లేకుండా 40 రోజుల క్రెడిట్ ద్వారా అద్దెను చెల్లించేందుకు వీలు కల్పిస్తోంది. అంతేకాకుండా అద్దె చెల్లింపులను అవసరమైతే కస్టమర్లు సులభ వాయిదా పద్ధతి(ఈఎంఐ)లోకి మార్పిడి చేసుకునేందుకు అవకాశమున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా 4 శాతం ప్రజలకే క్రెడిట్ కార్డులున్నందున రెంట్ నౌ పే లేటర్ సర్వీసు వినియోగదారులకు ప్రయోజనకరంగా నిలవనున్నట్లు వివరించింది. హౌసింగ్.కామ్ ఇప్పటికే క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లింపులకు తెరతీసిన విషయం విదితమే. -
NAREDCO: రానున్న నెలల్లో ఇళ్ల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: రానున్న నెలల్లో ఇళ్ల ధరలు పెరుగుతాయని భవిష్యత్తు కొనుగోలు దారుల్లో సగం మంది భావిస్తున్నారు. రియల్టీ పోర్టల్ హౌసింగ్ డాట్ కామ్, రియల్ ఎస్టేట్ పరిశ్రమ మండలి అయిన నరెడ్కో కలసి సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించాయి. ఇందులో పాల్గొన్న వారిలో 47 శాతం మంది రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. 21 శాతం మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని చెప్పగా, 16 శాతం మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటామని, 15 శాతం మంది బంగారంలో పెట్టుబడి పెడతామని తెలిపారు. ‘రెసిడెన్షియల్ రియల్టీ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే హెచ్2 2022’ పేరుతో ఈ సంస్థలు సర్వే నివేదికను విడుదల చేశాయి. ఇందులో 1,000 మందికి పైగా పాల్గొన్నారు. 48 శాతం మంది భవిష్యత్తులో ధరల పెరుగుదలను అంచనా వేస్తున్నారు. 58% మంది రెడీ టు మూవ్ (ప్రవేశానికి సిద్ధంగా ఉన్న) ప్రాపర్టీల పట్ల ఆసక్తితో ఉన్నట్టు చెప్పారు. ‘‘కరోనా రెండో విడత తీవ్రత తర్వాత భారత నివా స గృహాల మార్కెట్లో డిమాండ్ వేగంగా కోలుకుంది. రుణ వ్యయాలు పెరుగుతుండడ, నిర్మాణ ముడి సరుకుల ధరలు పెరగడం, బలమైన డిమాండ్ ఇళ్ల ధరల పెరుగుదలకు దారితీశాయి’’అని హౌసింగ్ డాట్ కామ్ సీఈవో అగర్వాల్ తెలిపారు. బలంగా డిమాండ్.. పెరిగిన నిర్మాణ వ్యయాలను సర్దుబాటు చేసుకునేందుకు, లాభాల మార్జిన్లను పెంచుకునేందుకు ప్రాపర్టీల ధరలను పెంచినట్టు లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఫలితాల సందర్భంగా ప్రకటించడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంటుందని ధృవ్ అగర్వాల్ అంచనా వేశారు. పండుగల సమయాల్లో డిమాండ్ పుంజుకోవడానికి తోడు, కన్జ్యూమర్ సెంటిమెంట్ బలంగా ఉన్నట్టు గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉంటాయని ఇళ్ల కొనుగోలు దారులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని 73 శాతం మంది చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఎన్నో విధానపరమైన నిర్ణయాలు పరిశ్రమ రికవరీకి మద్దతుగా నిలిచినట్టు నరెడ్కో ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ తెలిపారు. సొంతింటిని కలిగి ఉండాలన్న కోరిక వినియోగదారుల్లో ఉన్నందున ఇళ్లకు డిమాండ్ కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ధర తగ్గిస్తే ఇల్లు కొంటాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇల్లు కొనాలంటే డిస్కౌంట్ ఇవ్వాల్సిందే. అలాగే సులభ వాయిదాలూ ఉండాల్సిందేనని 73 శాతం కస్టమర్లు చెబుతున్నారని హౌజింగ్.కామ్, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) సంయుక్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 3,000 మంది ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. 2022 జనవరి–జూన్ రెసిడెన్షియల్ రియల్టీ కన్జూమర్ సెంటిమెంట్ ఔట్లుక్ ప్రకారం.. రియల్టీలో పెట్టుబడులకు 47 శాతం మంది మొగ్గుచూపుతున్నారు. స్టాక్స్, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే ఇదే అత్యధికం. 2020 జూలై–డిసెంబర్ కాలానికి చేపట్టిన సర్వేలో ఇల్లు, స్థలంలో పెట్టుబడులకు ఆసక్తి చూపినవారి సంఖ్య 35 శాతం మాత్రమే. వినియోగానికి సిద్ధంగా ఉన్న ఇంటిని కొనేందుకు 57 శాతం మంది మొగ్గుచూపుతున్నారు. విశ్వసనీయత లేమి కారణంగా కాబోయే కొనుగోలుదార్లు నిర్మాణంలో ఉన్న భవనాల్లో ఫ్లాట్‌ను బుక్ చేయడానికి ఇప్పటికీ జాగ్రత్తగానే ఉన్నారని చెప్పడానికి ఇది ఉదాహరణ అని నరెడ్కో చెబుతోంది. డెవలపర్లు తమ నిబద్ధతతో కూడిన గడువుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంపై దృష్టి సారిస్తుండటంతో పరిస్థితి మారవచ్చని వివరించింది. ధరలు పెరుగుతాయ్..: ముడిసరుకు వ్యయాలు పెరుగుతున్నందున వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల ధరలు అధికం అవుతాయని 51 శాతం మంది వినియోగదార్లు భావిస్తున్నారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి రియల్ ఎస్టేట్ రంగంలో సాంకేతికత వినియోగంలో వేగం ఊపందుకుంది. ఆన్లైన్లో ఇల్లు చూసి కొనడం లేదా ఒకసారి ఇంటిని పరిశీలించిన వెంటనే ఒప్పందాన్ని పూర్తి చేయడానికి 40 శాతం మంది కస్టమర్లు సిద్ధంగా ఉన్నారు. ఎనిమిది ప్రధాన నగరాల్లోని గృహ కొనుగోలుదారులు విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, వినోద స్థలాలకు సమీపంలో ఇంటిని కోరుకుంటున్నారు. అత్యధికులు తమ ఇళ్ల నుండి 1–1.5 కిలోమీటరు దూరంలో ఇటువంటి సౌకర్యాలు ఉండాలంటున్నారు. గృహ రుణాల వడ్డీపై రిబేట్ పెంపు, నిర్మాణ సామగ్రిపై గూడ్స్, సర్వీస్ ట్యాక్స్ తగ్గింపు, చిన్న డెవలపర్లకు రుణ లభ్యత విస్తరణ, స్టాంప్ డ్యూటీ కుదింపు వంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలని హౌజింగ్.కామ్, నరెడ్కో చెబుతున్నాయి. కోవిడ్ ముందస్తు స్థాయికి..: రానున్న 6 నెలల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొనసాగుతుందని 79% మంది అభిప్రాయపడ్డారని సర్వే పేర్కొంది. మహమ్మారి ఫస్ట్ వేవ్‌లో 41%తో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉంటుందని 21% మంది మాత్రమే సూచించారు. 63% మంది గృహ కొనుగోలుదారులు రాబోయే 6 నెలలకు తమ ఆదాయంపై నమ్మకంతో ఉన్నారు. డిమాండ్ తిరిగి పుంజుకోవడంతో 2021 లో ఇళ్ల అమ్మకాలు 13% పెరిగాయి. ఈ ఏడాది అమ్మకాలు కోవిడ్‌కు ముందు స్థాయిలను దాటతాయని గట్టిగా విశ్వసిస్తున్నాం’ అని హౌజింగ్.కామ్ గ్రూప్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. -
రాయితీలుంటేనే గృహ కొనుగోళ్లు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో గృహ కొనుగోలుదారులు వైఖరిలో మార్పులు వచ్చాయి. కొనుగోళ్లను ప్రోత్సహించేలా రాయితీలు, సౌకర్యవంతమైన చెల్లింపు విధానాలను కస్టమర్లు కోరుకుంటున్నారని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ పోర్టల్ హౌసింగ్.కామ్, నరెడ్కో సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో 3 వేల మంది కస్టమర్లతో సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం గతంతో పోలిస్తే పెట్టుబడి సరైన సాధనంగా రియల్ ఎస్టేట్ అని భావించే వారి శాతం పెరిగింది. గతంలో 35% ఉండగా.. ఇప్పుడది 43 శాతానికి పెరిగింది. గతంలో స్టాక్ మార్కెట్లు సరైన ఇన్వెస్ట్‌మెంట్స్‌గా 15%మంది భావించగా.. ఇప్పుడది 20 శాతానికి చేరింది. కాగా.. ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ), బంగారంలో పెట్టుబడులపై కస్టమర్ల ఆసక్తి క్షీణించింది. గతంలో 22 శాతం మంది ఎఫ్డీలు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని భావించగా.. ఇప్పుడు 19 శాతానికి, గతంలో బంగారంలో పెట్టుబడులకు 28 శాతం మంది ఆసక్తి కనబర్చగా.. ఇప్పుడది 18 శాతానికి తగ్గింది. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికంగా 71% మంది కొనుగోలు నిర్ణయాలను తీసుకునేలా, ఆర్ధిక ప్రోత్సాహాన్ని అందించే విధంగా డిస్కౌంట్లు, ఫ్లెక్సిబుల్ చెల్లింపు విధానాలను కోరుకుంటున్నారు. అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ), సరఫరా ఎక్కువ ఉన్న డెవలపర్లు డిస్కౌంట్లను అందిస్తున్నారని, రుణ చెల్లింపులు, ఇతరత్రా నిర్వహణ కోసం తప్పదని నరెడ్కో ప్రెసిడెంట్ నిరంజన్ హిరానందాని చెప్పారు. ఇప్పటికే డెవలపర్లు తక్కువ మార్జిన్లలో ఉన్నారని పేర్కొన్నారు. డిమాండ్–సరఫరాలను బట్టి ధరలపై నియంత్రణ ఉంటుందన్నారు. చాలా మంది కస్టమర్లు పెద్ద సైజు అపార్ట్మెంట్లకు అప్‌గ్రేడ్ అవుతుండటం, తొలిసారి గృహ కొనుగోలుదారులు పెరగడం కారణంగా ఇళ్లకు డిమాండ్ పెరిగిందని హౌసింగ్.కామ్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. అందుబాటులో ఇళ్ల ధరలు, తక్కువ వడ్డీ రేట్లు వంటివి కూడా డిమాండ్‌కు ఊతమిస్తున్నాయని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటం, కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో హోమ్బయ్యర్లు ఇళ్ల కోసం వెతుకులాట ప్రారంభించారని తెలిపారు. 33 బిలియన్ డాలర్ల రియల్టీ రుణాలు ఒత్తిడిలోనే..: అనరాక్ కాగా, బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి 100 బిలియన్ డాలర్ల రుణాలను అందించాయని.. వీటిలో 67 శాతం లోన్లు మాత్రమే సురక్షిత జోన్లో ఉండగా.. మిగిలిన 33 శాతం (33 బిలియన్ డాలర్లు) రుణాలు మాత్రం తీవ్రమైన ఒత్తిడిలోనే ఉన్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఆ 33 శాతంలో 15 శాతం (15 బిలియన్ డాలర్లు) కొంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ రికవరీకి అవకాశం ఉందని.. 18 శాతం (18 బిలియన్ డాలర్లు) రుణాలు మాత్రం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. ఆయా డెవలపర్ రుణగ్రహీతలు అధిక పరపతి కలిగి ఉన్నారని తెలిపింది. 2019 ముగింపు నాటికి 93 బిలియన్ డాలర్ల రియల్టీ రుణాలలో 16 శాతం తీవ్రమైన ఒత్తిడి లోన్లని పేర్కొంది. దేశీయ రియల్టీ రుణాలలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీ), ట్రస్టీషిప్స్ వాటా 63 శాతం వరకున్నాయని తెలిపింది. శాఖల వారీగా చూస్తే. బ్యాంక్‌ల వాటా 37 శాతం, హెచ్ఎఫ్సీలు 34 శాతం, ఎన్‌బీఎఫ్‌సీల వాటా 16 శాతం, ట్రస్టీషిప్స్ వాటా 13 శాతంగా ఉందని పేర్కొంది. బ్యాంక్‌లు, హెచ్ఎఫ్సీల లోన్ బుక్‌లలో వరుసగా 75, 66 శాతంతో సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నాయని తెలిపింది. మొత్తం ఎన్‌బీఎఫ్‌సీల రుణాలలో 46 శాతం వాచ్‌లిస్ట్ జాబితాలో ఉన్నాయని పేర్కొంది. గ్రేడ్–ఏ డెవలపర్లకు ఇచ్చే లోన్లలో 75 శాతం సురక్షిత జోన్లోనే ఉన్నాయని.. రియల్టీ రంగానికి పంపిణీ చేసే మొత్తం రుణాలలో 73 బిలియన్ డాలర్లు గ్రేడ్–ఏ బిల్డర్లకే అందుతాయని అనరాక్ రిపోర్ట్ తెలిపింది. పుణే ఎన్సీఆర్, ముంబై నగరాలలోని మొత్తం రుణాలలో వరుసగా 40, 39, 37 శాతం లోన్లు, తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత బెంగళూరులో 15 శాతం, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై నగరాలలో 3–4 శాతం లోన్లు ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. -
ఆరోగ్య రంగం.. హైదరాబాద్‌కు 5వ స్థానం
న్యూఢిల్లీ: ఆరోగ్య మౌలిక సదుపాయాల విషయంలో దేశంలోని ఎనిమిది అతిపెద్ద పట్టణాల్లో పుణె ముందుంది. ప్రధాన పట్టణాల్లో ఆరోగ్య సదుపాయాలను విశ్లేషిస్తూ హౌసింగ్ డాట్ కామ్ పోర్టల్ ‘భారత్‌లో ఆరోగ్యరంగ స్థితి’ పేరుతో ఒక నివేదికను బుధవారం విడుదల చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె పట్టణాల్లోని ఆరోగ్య సదుపాయాలను ఈ నివేదికలో విశ్లేషించి ర్యాంకులను కేటాయించింది. ప్రతీ 1,000 మంది ప్రజలకు ఎన్ని ఆస్పత్రుల పడకలు అందుబాటులో ఉన్నాయి, గాలి, నీటి నాణ్యత, పారిశుద్ధ్యం, నివాసయోగ్యతా సూచీ తదితర అంశాల ఆధారంగా పట్టణాలకు ర్యాంకులను కేటాయించింది. 40 శాతం స్కోర్‌ను ఒక్క ఆస్పత్రుల్లోని పడకల ఆధారంగానే నిర్ణయించింది. అహ్మదాబాద్, బెంగళూరు రెండు, మూడో స్థానాల్లో నిలవగా.. ముంబై ఎంఎంఆర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ ఎన్సీఆర్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రతీ వెయ్యి మందికి 3.5 పడకలు ఆరోగ్య మౌలిక సదుపాయాల విషయంలో పుణె దేశంలోనే మెరుగ్గా ఉంది. ‘‘పుణెలో ప్రతీ వెయ్యి మంది ప్రజలకు 3.5 పడకలు అందుబాటులో ఉన్నాయి. భారత జాతీయ సగటుతో పోలిస్తే ఇది ఎంతో అధికం. జాతీయ స్థాయిలో కేవలం ప్రభుత్వరంగంలోని ఆరోగ్య సంరక్షణ సదుపాయాలనే పరిగ ణనలోకి తీసుకుంటే ప్రతీ వెయ్యి మందికి సగటున ఒక్క పడక కూడా లేదు. అర పడకే అందుబాటులో ఉంది. అదే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కలిపి చూస్తే 1.4 పడకలు ఉన్నాయి. అదే ప్రపంచ సగటు 3.2 పడకలుగా ఉంది’’ అని హౌసింగ్ డాట్ కామ్ తెలిపింది. నివాస అనుకూలత, నీటి నాణ్యత, స్థానిక ప్రభుత్వాలు చేపట్టిన చర్యల పరంగా చూస్తే పుణె ఎక్కువ స్కోరు సంపాదించింది. రెండో స్థానంలో ఉన్న అహ్మదాబాద్‌లో 1,000 మంది ప్రజలకు 3.2 ఆస్పత్రి పడకల లభ్యత ఉంది. బెంగళూరులో భిన్నం బెంగళూరు నగరం కొన్ని అంశాల్లో మెరుగ్గాను.. అదే సమయంలో మరికొన్ని అంశాల్లో దారుణంగాను ఉంది. ఆస్పత్రి పడకల లభ్యత, నివాస సౌలభ్యం విషయంలో మెరుగ్గా ఉంటే.. వాయు నాణ్యత, నీటి నాణ్యత, నీటి లభ్యత, మున్సిపల్ పనితీరు అంశాల వల్ల మూడో ర్యాంకుకు పరిమి తం అయింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడం తెలిసిందే. దీనికితోడు నీటి నాణ్యత, పారిశుద్ధ్యం పనితీరు దారుణంగా ఉండడం వల్ల జాబితాలో అట్టడుగు స్థానా నికి పరిమితం అయింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఢిల్లీతోపాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ఉన్నాయి. ఆరోగ్యానికి కేటాయింపులు భారీగా పెంచాలి ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఆరోగ్యసంరక్షణపై వ్యయాలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక అభిప్రాయపడింది. హైదరాబాద్‌లో గాలి నాణ్యత మెరుగు భాగ్యనగరంలో ఆస్పత్రి పడకలు తక్కువగా ఉన్నప్పటికీ.. వాయు నాణ్యత, పారిశుద్ధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ అంశాల్లో మెరుగైన స్కోరు సంపాదించింది. నగరంలోనూ ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు ఎక్కువగా పశ్చిమ, సెంట్రల్ సబర్బన్ ప్రాంతాల్లోనే కేంద్రీకృమైనట్టు నివేదిక పేర్కొంది. ‘‘భారీగా పెరిగిపోతున్న నగర జనాభా కారణంగా నీటి సరఫరాపై ఒత్తిడి పెరిగుతోంది. సరఫరా మించి డిమాండ్ ఉండడంతో నీటికి కొరత ఏర్పడు తోంది’’ అని తెలియజేసింది. నివాస సౌలభ్యం విషయంలో హైదరాబాద్‌కు తక్కువ స్కోరును, ఆస్పత్రి పడకలు, మున్సిపల్ పనితీరు అంశాల్లో మధ్యస్థ స్కోరును కేటాయించింది. -
హౌసింగ్.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా జాసన్ కొఠారి
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్టీ పోర్టల్ హౌసింగ్.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా జాసన్ కొఠారి నియమితులయ్యారు. గతంలో జాసన్ కొఠారి వాలియంట్ ఎంటర్టైన్మెంట్ సీఈవోగా వ్యవహరించేవారు. ప్రస్తుతం ఆయన పలు స్టార్టప్స్‌కు పర్సనల్ ఇన్వెస్టర్‌గా కూడా ఉన్నారు. జాసన్ నియామకం వల్ల కంపెనీకి ఎంతో ప్రయోజనం కలుగుతుందని హౌసింగ్.కామ్ తాత్కాలిక సీఈవో రిషబ్ గుప్తా ధీమా వ్యక్తంచేశారు. -
ఆర్ఈ/మ్యాక్స్‌తో హౌసింగ్‌డాట్‌కామ్ ఒప్పందం
న్యూఢిల్లీ: ప్రాపర్టీ పోర్టల్ హౌసింగ్‌డాట్‌కామ్ తాజాగా రియల్ ఎస్టేట్ బ్రోకరేజి సంస్థ ఆర్ఈ/ఎంఏఎక్స్తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఆర్ఈ/ఎంఏఎక్స్ తమ దగ్గరున్న ప్రాపర్టీలను హౌసింగ్‌డాట్‌కామ్ సైటులో పొందుపరుస్తుంది. ప్రతిగా హౌసింగ్‌డాట్‌కామ్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో ఆర్ఈ/మ్యాక్స్‌కి కార్యకలాపాలు ఉన్నాయి. 6,500 కార్యాలయాలు.. 1,00,000 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారు. నచ్చిన ఇంటి అన్వేషణ నుంచి కొనుగోలుదాకా అన్ని అంశాల్లోనూ గృహ కొనుగోలుదారులకు అవసరమైన సేవలు అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని హౌసింగ్‌డాట్‌కామ్ సీవోవో రిషభ్ గుప్తా, ఆర్ఈ/ఎంఏఎక్స్ ఇండియా చైర్మన్ శామ్ చోప్రా తెలిపారు. -
హౌసింగ్‌డాట్‌కామ్ కొత్త సీఈఓగా రిషభ్ గుప్తా
రాహుల్ యాదవ్ స్థానంలో న్యూఢిల్లీ: హౌసింగ్‌డాట్‌కామ్ తాత్కాలిక సీఈఓగా రిషభ్ గుప్తా నియమితులయ్యారు. రాహుల్ యాదవ్ స్థానంలో గుప్తాను నియమిస్తున్నామని, ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని హౌసింగ్‌డాట్‌కామ్ తెలిపింది. సాఫ్ట్‌బ్యాంక్ తోడ్పాటుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హౌసింగ్‌డాట్‌కామ్‌కు రిషభ్ గుప్తా ప్రస్తుతం చీఫ్ అపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా పనిచేస్తున్నారు. రిషభ్ గుప్తా, హరీశ్ చావ్లా, అభిషేక్ ఆనంద్‌లు కంపెనీ నిర్వహణ బోర్డ్‌లో సభ్యులుగా ఉంటారని తెలిపింది. రాహుల్ యాదవ్ ప్రవర్తన ఒక సీఈఓకు తగ్గట్లుగా లేదని, అందుకే ఆయనకు ఉద్వాసన పలికామని పేర్కొంది. -
రాహుల్ యాదవ్‌కు ‘హౌసింగ్’ ఉద్వాసన
న్యూఢిల్లీ: వివాదాస్పద సీఈవో రాహుల్ యాదవ్‌కు రియల్టీ పోర్టల్ హౌసింగ్‌డాట్‌కామ్ ఉద్వాసన పలికింది. సంస్థ బోర్డు బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్వెస్టర్లతోను, మీడియాతోను ఆయన వ్యవహార శైలి సీఈవో హోదాకు తగ్గట్లుగా లేదని వ్యాఖ్యానించింది. రాహుల్ తీరు కంపెనీ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉందని బోర్డు సభ్యులు అభిప్రాయపడినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సీఈవో బాధ్యతల నుంచి యాదవ్‌ను ‘తక్షణమే విముక్తుణ్ని’ చేస్తున్నట్లు వివరించింది. తాత్కాలిక సీఈవో నియామకం కోసం కసరత్తు జరుగుతోందని పేర్కొంది. ఆసాంతం వివాదాస్పదం.. రాహుల్ యాదవ్ (26) సహ వ్యవస్థాపకుడిగా రియల్టీ పోర్టల్ హౌసింగ్‌డాట్‌కామ్ రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. తక్కువ వ్యవధిలోనే రియల్ ఎస్టేట్ రంగంలో పేరొందింది. జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ గతేడాది 90 మిలియన్ డాలర్లు ఇందులో ఇన్వెస్ట్ చేసింది. అయితే, కొన్నాళ్ల క్రితం తన మేథస్సుతో తూగలేని ఇన్వెస్టర్లతో తాను వేగలేనంటూ, కంపెనీ నుంచి వైదొలుగుతానంటూ రాహుల్ యాదవ్ కొన్నాళ్ల క్రితం రాజీనామా ప్రకటించడం వివాదాస్పదమైంది. దీనిపై ఆయన ఆ తర్వాత క్షమాపణ చెప్పి, రాజీనామా వెనక్కి తీసుకున్నారు. ఇదే కాకుండా జొమాటో సంస్థపైనా, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కాపైనా రాహుల్ వ్యాఖ్యలు వివాదాస్పదమాయ్యాయి. -
ఇంటి కొనుగోలు నిర్ణయాల్లో మహిళలదే పైచేయి
ముంబై: ఇంటి కొనుగోలు నిర్ణయాల్లో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోంది. ఇంటిని కొనుగోలు చేయాలా? లేదా అద్దెకు తీసుకోవాలా? అనే అంశాల్లో మహిళలే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయం హౌసింగ్.కామ్ సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం..ఇంటికి సంబంధించిన కొనుగోలు, అద్దె వంటి అంశాల్లో 95 శాతానికి పైగా మహిళలే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే మహిళల శాతం 30కి పైగానే ఉంది. కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకునే మహిళలు 50 శాతంగా ఉన్నారు. ఇళ్లు, ఇతర రియల్టీ సంబంధిత నిర్ణయాలు తీసుకునేవారిలో 18-34 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా ఉన్నారు. ప్రాపర్టీ ప్లాట్‌ఫామ్స్‌ను సందర్శిస్తున్న మహిళలు 58 శాతంగా ఉన్నారు. ఇంటి కొనుగోలు, అద్దెకు సంబంధించిన లావాదేవీల్లో మహిళల పాత్ర పెరుగుతోంది. మహిళల స్వతంత్రత పెరిగే కొద్ది ఆస్తి కొనుగోలు నిర్ణయాల్లో వారి పాత్ర పెరుగుతుందని హౌసింగ్.కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రిషాబ్ గుప్తా తెలిపారు. -
హౌసింగ్‌డాట్‌కామ్ చేతికి రియల్టీ బిజినెస్ ఇంటెలిజెన్స్
ముంబై: రియల్టీకి సంబంధించి రిస్క్ అసెస్మెంట్ సర్వీసులందజేసే రియల్టీ బిజినెస్ ఇంటెలిజెన్స్‌ను రూ. 10 కోట్లకు ప్రముఖ రియల్ ఎస్టేట్ పోర్టల్ హౌసింగ్‌డాట్‌కామ్ కొనుగోలు చేసింది. రియల్టీ బిజినెస్ ఇంటెలిజెన్స్ అందించే సమాచారంతో తమ వినియోగదారులు ఏ రియల్టీ ప్రాజెక్టులోనైనా ఇన్వెస్ట్ చేయడానికి తగిన విధంగా నిర్ణయలు తీసుకోవచ్చని హౌసింగ్‌డాట్‌కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ యాదవ్ చెప్పారు. రియల్టీ రంగంలో పారదర్శకతను పెంపొందించాలన్న తమ వ్యూహాంలో భాగంగా రియల్టీ బిజినెస్ ఇంటెలిజెన్స్‌ను కొనుగోలు చేశామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
భలే బాసులు!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) జేబులో పది రూపాయిలు ఉంటే రూపాయి దానం చేయడానికి ఆలోచిస్తాం. అలాంటిది రూ.200 కోట్ల విలువైన వాటాను ఉదారంగా వదిలేస్తే. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మూడు పదుల వయసు కూడా లేని యువ సీఈవో ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ఇక్కడ విశేషం. తన వాటా మొత్తాన్ని ఉద్యోగులకు ఇచ్చివేస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు హౌసింగ్‌డాట్‌కామ్ సీఈవో రాహుల్ యాదవ్. సుమారు రూ. 200 కోట్ల విలువైన తన వాటా మొత్తాన్ని కంపెనీలలోని 2,251 మంది స్టాఫ్ కు ఇచ్చేశారాయన. ఈలెక్కన చూసుకుంటే ఒక్కో ఉద్యోగికి రూ.6.50 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు ముడుతుందన్న మాట. ఒక్కో ఉద్యోగికి ఏడాది జీతానికి సమానమైన మొత్తం అందుతుందని అంచనా. ఇప్పటినుంచే డబ్బు గురించి ఆలోచించడం లేదని 26 ఏళ్ల రాహుల్ ప్రకటించడం ఆసక్తి గొలిపే అంశం. సీటెల్ కేంద్రంగా పనిచేస్తున్న క్రెడిట్ కార్డ్ ప్రాసెసర్ కంపెనీ గ్రావిటీ పేమెంట్స్ సంస్థ అధినేత డాన్ ప్రైస్ కూడా ఇలాంటి పనే చేశారు. సిబ్బంది జీతాలు పెంచేందుకు తన వేతనాన్ని వదులుకున్నారు. సుమారు 10 కోట్ల రూపాయల జీతాన్ని త్యాగం చేసి 70 మంది ఉద్యోగులకు పంచారు. వీరిలో 30 మందికి జీతం డబుల్ కావడం విశేషం. అమెరికాలో సగటు వేతన జీవుల జీతం సుమారు రూ.13 లక్షలు ఉండగా, డాన్ ప్రైస్ ఉదారతతో గ్రావిటీ పేమెంట్ ఉద్యోగుల సగటు వేతనం దాదాపు రూ. 45 లక్షలకు చేరింది. బాస్ తన జీతం కుదించుకుని తమ వేతనం పెంచడంతో డాన్ ప్రైస్ పై ఉద్యోగులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలావుంటే నాలోని టీన్స్ గ్రూప్ అధిపతి లీ జినువాన్‌లా తన ఉద్యోగులకు ఊహించని కానుక ఇచ్చారు. ఏకంగా 6,400 మంది తన సంస్థ ఉద్యోగులను హాలిడే టూర్ కోసం ఫ్రాన్స్ తీసుకెళ్లి ఔరా అనిపించారు. రూ. 240 కోట్లు ఖర్చు పెట్టి తొమ్మిది రోజుల పాటు ఫ్రాన్స్ లోని నగరాలన్ని చూపించారు. ఇక పర్యటన చివరి రోజున ఫ్రాన్స్ నగరం నీస్‌లో టీన్స్ ఉద్యోగులంతా ఒకే తరహా దుస్తులు ధరించి మానవహారంతో అందరి దృష్టిని ఆకర్షించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి విదేశీయానం చేయించిన తమ బాస్ ను టీన్స్ గ్రూప్ ఉద్యోగులు తెగ పొగిడేస్తున్నారు. సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలకియా కూడా ఇదేవిధంగా ఊహించని బహుమతులు ఇచ్చి ఉద్యోగులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. ఢోలకియాకు చెందిన హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థలో పనిచేసే 1200 మందికి ఉద్యోగులకు గతేడాది దీపావళికి విలువైన కానుకలిచ్చి వార్తల్లో నిలిచారు. 491 ఫియట్ పుంటో కార్లు, 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. ఇంకా ఆభరణాలు మొదలైనవి ఉద్యోగులకు పంచారు. సంస్థ వృద్ధికి తోడ్పడిన ఉద్యోగులను ప్రోత్సహించే ఉద్దేశంతో వీటిని అందించినట్లు ఢోలకియా చెప్పారు. విలువైన బహుమతులిచ్చిన తమ యజమాని ఢోలకియాకు 'షుక్రియా' అంటూ ధన్యవాదాలు తెలిపారు ఉద్యోగులు. -
రూ.150 కోట్ల వాటా ఉద్యోగులకు ధారాదత్తం
హౌసింగ్ డాట్ కామ్ సీఈవో సంచలన నిర్ణయం ముంబై: హౌసింగ్‌డాట్‌కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ యాదవ్ ఆ కంపెనీలో ఉన్న తన వాటా మొత్తాన్ని ఉద్యోగులకు ఇచ్చివేశారు. కంపెనీ సీఈఓగా రాజీనామా చేసి, ఆ రాజీనామాను ఉపసంహరించుకున్న వారం రోజుల్లోనే ఇలాంటి ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని రాహుల్ యాదవ్ తీసుకున్నారు. హౌసింగ్‌డాట్‌కామ్‌లో రాహుల్ యాదవ్ వాటా విలువ రూ.150-200కోట్లని అంచనా. ఈ మొత్తాన్ని డాట్‌కామ్‌లో పనిచేస్తున్న మొత్తం 2,251 మంది ఉద్యోగులకు ఆయన ఇచ్చివేశారని డాట్‌కామ్ వెల్లడించింది. ఈ వాటా విలువ ఉద్యోగుల ఏడాది వేతనానికి సమానమని పేర్కొంది. తన వయస్సు 26 సంవత్సరాలేనని, ఇప్పుడే డబ్బు గురించి సీరియస్‌గా ఆలోచించడం తొందరపాటవుతుందనే ఉద్దేశంతోనే ఈ వాటాను ఉద్యోగులకు ఇచ్చినట్లు యాదవ్ పేర్కొన్నారు. -
హౌసింగ్.కామ్‌లో జనప్రియ ఫ్లాట్లు!
రూ.520 కోట్లు ఫ్లాట్లను విక్రయించేందుకు ఒప్పందం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హౌసింగ్.కామ్‌లో తమ సంస్థ నిర్మించిన పలు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను విక్రయించడానికి హైదరాబాద్‌కు చెందిన జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్ నిర్మాణ సంస్థ సిద్ధమైంది. ఈమేరకు ఏడాది పాటు రూ.520 కోట్ల విలువైన ఫ్లాట్లను విక్రయించేందుకు హౌసింగ్.కామ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని జనప్రియ సీఎండీ కే రవీందర్ రెడ్డి చెప్పారు. గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో హౌసింగ్.కామ్ సీఎఫ్ఓ అజీమ్ జైనుల్భాయ్తో కలిసి ఆయన మాట్లాడారు. జనప్రియ సంస్థకు చెందిన ఆర్కాడియా, క్లాసిక్ హోమ్స్, లేక్ ఫ్రంట్, మెట్రోపొలిస్, సిల్వర్ క్రెస్ట్ ప్రాజెక్ట్‌లు సుమారు 1,900 ప్రాపర్టీలు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో రూ.16.95 లక్షల నుంచి రూ.56 లక్షల విలువ గల 3 పడక గదుల ఇళ్లు, విల్లాలు, రో-హౌజెస్లున్నాయి. బుకింగ్ ధరను రూ.21 వేలుగా నిర్ణయించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.