రూ.150 కోట్ల వాటా ఉద్యోగులకు ధారాదత్తం | Housing.com CEO pledges his shares to employees | Sakshi
Sakshi News home page

రూ.150 కోట్ల వాటా ఉద్యోగులకు ధారాదత్తం

Published Thu, May 14 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

రూ.150 కోట్ల వాటా ఉద్యోగులకు ధారాదత్తం

రూ.150 కోట్ల వాటా ఉద్యోగులకు ధారాదత్తం

హౌసింగ్ డాట్ కామ్ సీఈవో సంచలన నిర్ణయం


ముంబై: హౌసింగ్‌డాట్‌కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ యాదవ్ ఆ కంపెనీలో ఉన్న తన వాటా మొత్తాన్ని ఉద్యోగులకు ఇచ్చివేశారు. కంపెనీ సీఈఓగా రాజీనామా చేసి, ఆ రాజీనామాను ఉపసంహరించుకున్న వారం రోజుల్లోనే ఇలాంటి ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని రాహుల్ యాదవ్ తీసుకున్నారు. హౌసింగ్‌డాట్‌కామ్‌లో రాహుల్ యాదవ్ వాటా విలువ  రూ.150-200కోట్లని అంచనా.

ఈ మొత్తాన్ని డాట్‌కామ్‌లో పనిచేస్తున్న మొత్తం 2,251 మంది ఉద్యోగులకు ఆయన ఇచ్చివేశారని డాట్‌కామ్ వెల్లడించింది. ఈ వాటా విలువ ఉద్యోగుల ఏడాది వేతనానికి సమానమని పేర్కొంది. తన వయస్సు 26 సంవత్సరాలేనని, ఇప్పుడే డబ్బు గురించి సీరియస్‌గా ఆలోచించడం తొందరపాటవుతుందనే ఉద్దేశంతోనే ఈ వాటాను ఉద్యోగులకు ఇచ్చినట్లు యాదవ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement