Rahul Yadav
-
ఏ టైటిల్ పెట్టాలో తెలియక 'మసూద' అని పెట్టాం : నిర్మాత
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, హర్రర్ డ్రామా ‘మసూద’ వంటి విభిన్న కథలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మీడియా సమావేశం నిర్వహించి తన జర్నీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నారు. ► ‘మసూద’ సినిమా విజయం సాధించినందుకు, అందరి నమ్మకం నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ► హ్యాట్రిక్ అనిగానీ, నెంబర్స్ గురించిగానీ అస్సలు ఆలోచించలేదు. మంచి స్టోరీ. జెన్యూన్‌గా, హానెస్ట్‌గా, క్రమశిక్షణతో సినిమా తీస్తే.. జనాలకు నచ్చుతుంది. డబ్బులు కూడా వస్తాయని నమ్మాను. మొదటి సినిమా ‘మళ్లీరావా’ నుంచి ఇదే నమ్ముతున్నాను. ► ‘మసూద’ ఫస్ట్ డే తక్కువ థియేటర్లలోనే విడుదలైంది. ఆ తర్వాత వచ్చిన టాక్‌తో రోజురోజుకు థియేటర్లు పెరిగాయి. నా ఫస్ట్ సినిమా నుంచి శుక్రవారం సినిమా విడుదలైతే.. శనివారం నుంచే థియేటర్లు పెరుగుతూ వచ్చాయి. ► స్టార్ హీరోల సినిమాలకు పబ్లిసిటీ ఎంత చేస్తే అంత జనాల్లోకి ఆ సినిమా వెళుతుంది. మొదటి నుంచి సినిమాపై అంచనాలు ఉంటాయి కాబట్టి.. థియేటర్లకి ప్రేక్షకులు వస్తారు. కానీ ‘మసూద’ వంటి సినిమాలకు.. సినిమా బాగుంటే తప్పితే.. విడుదలకు ముందు ఎంత ప్రమోట్ చేసినా జనాలు పట్టించుకోరు. నేను సినిమా తీసే విధానంలో ఎంత జాగ్రత్త పడతానో.. ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను. ► బై ఛాన్స్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను ఇంజనీరింగ్ చేశాను. తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాను. ఆ తర్వాత ఓన్‌గా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో రియల్ ఎస్టేట్‌లోకి వచ్చాను. చిన్న ఫార్మా ఇండస్ట్రీ కూడా రన్ చేయాలని అనుకున్నాను. అట్లాంటి టైమ్‌లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా గౌతమ్ నన్ను కలిశాడు. అతని గురించి చెప్పి.. ‘మళ్ళీరావా’ స్క్రిఫ్ట్ ఇచ్చాడు. మొత్తం చదివాను. నాకు చాలా బాగా నచ్చింది. అలా ఇండస్ట్రీలోకి వచ్చాను. ► నేను టైమ్ ఎక్కువ తీసుకుంటాను. అలాగే నాకు వర్క్‌షాప్ కూడా చేయాలి. ఎంత ప్రూవ్డ్ యాక్టర్స్ అయినా.. కాంబినేషన్ సీన్స్ విషయంలో ఖచ్చితంగా వర్క్ షాప్ చేయాలి. కొత్త డైరెక్టర్స్‌తో రిస్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది అవసరం అని భావిస్తాను. ► నేను సినిమా ఇండస్ట్రీకి వెళుతున్నానని చెప్పినప్పుడు.. ఇంట్లో అందరూ క్లాస్ తీసుకున్నారు. మా నాన్నగారు కొన్ని రోజుల పాటు మాట్లాడలేదు కూడా. ఈ ఒక్కసారికి నాకు సపోర్ట్ చేయండి. ఇది చేయలేకపోతే.. మీరు ఏది చెబితే అది చేస్తాను అని చెప్పా. నా బిగ్గెస్ట్ సపోర్ట్ నా వైఫ్, పిల్లలు, మా అమ్మనాన్న, నా చెల్లెలు, ఫ్యామిలీ. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేము. ► ‘మళ్ళీరావా’ సినిమాకి మా నాన్నగారు చాలా సపోర్ట్, ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ► ‘మసూద’ సినిమాకు మాత్రం టెక్నికల్‌గా అద్భుతంగా తీయాలని అనుకున్నాను. ఏం జరిగినా సరే.. నేను అనుకున్నది చేశాను. ఒక పొరిగింటి వ్యక్తికి మంచి టైటిల్ ఏమీ దొరకక ‘మసూద’ అని పెట్టాం. ► నేను అందరి హీరోల సినిమాలు చూస్తాను. పర్సనల్‌గా అయితే మాత్రం చిన్నప్పటి నుంచి వెంకటేష్‌గారంటే ఇష్టం. ► డిసెంబర్ 8తో మా బ్యానర్ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ బ్యానర్ స్థాపించినప్పుడు అనుకున్నదానికంటే.. ఎక్కువే సాధించానని అనుకుంటున్నాను. మూడు సినిమాలు తీస్తాననిగానీ, ఆ మూడు సక్సెస్ అవుతాయనిగానీ, ముగ్గురు దర్శకులని పరిచయం చేస్తాననిగానీ, కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తాననిగానీ అనుకోలేదు. కానీ ఇవన్నీ జరిగాయి. అందుకే, నేను చాలా ఎక్కువే సాధించానని చెబుతాను. ► ఒక మంచి కథ, నాకు ఛాలెంజింగ్‌గా అనిపించాలి.. అలాంటి కథ దొరికితే వెంటనే తర్వాత చేయబోయే సినిమా అనౌన్స్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇంకా ఏ కథ చదవలేదు. స్క్రిప్ట్స్ మాత్రం 2019 నుంచి నా టేబుల్ మీదే ఉన్నాయి. దాదాపు 30 కథలు ఉన్నాయి. వాటిలో ఏదీ ఇంకా చదవలేదు. ► మా సంస్థను, మా సంస్థ నుంచి వస్తున్న సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సహకరిస్తున్న మీడియావారికి, శ్రేయోభిలాషులకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. -
నేనేదో డబ్బు కోసం ఈ పని చేయట్లేదు: దిల్ రాజు
‘మళ్ళీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న విడుదలైన ఈ హారర్ డ్రామా ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టుకుంటోంది. రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని ఎస్విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు యాంకర్‌గా మారి చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్‌ను కొన్ని ఆసక్తకరమైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వారిద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ మీకోసం... దిల్ రాజు: 50 సినిమాలు తీసిన నిర్మాతగా అడుగుతున్నా... నాకు 2గం. ల 45 నిమిషాల సినిమా చూపించావు. నిడివి తగ్గించమని అడిగితే.. కుదరదని అన్నావు.. అసలు నీ ధైర్యం ఏంటి? నేను అయితే.. ఇంకో 15 నిమిషాలు ఎడిట్ చేయించేవాడిని. రాహుల్ యాదవ్: ఏం లేదు సార్.. సినిమా విషయంలో హానెస్ట్‌గా ఉండాలనుకున్నా. కమర్షియల్‌గా చేయడానికి స్క్రిఫ్ట్ పరంగా నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ స్క్రిప్ట్ ఒప్పుకుందే.. హర్రర్ అంశాలతో పాటు ఎవరికైనా సహాయం చేయడానికి రీజన్ అవసరం లేదన్న మెసేజ్ కూడా కారణం. దిల్ రాజు: ఇంత డబ్బు పెట్టావు.. ఓటీటీ, శాటిలైట్ అమ్మావా? అంటే అమ్మలేదు సార్ అన్నావ్. రిలీజ్ అంటున్నావ్.. ముందు నాన్ థియేట్రికల్ అమ్మి డబ్బు సేవ్ చేయమంటే.. పరవాలేదు సార్ అన్నావ్. అసలు ఏంటిది? అంత డబ్బు పెట్టావ్.. నీ కాన్ఫిడెన్స్ ఏంటి? రాహుల్: నిజంగా చెప్పాలంటే.. కొన్ని ఆఫర్స్ వచ్చాయి సార్. హీరో లేడు.. హర్రర్ సినిమా.. ఇలా రకరకాల కామెంట్స్‌తో వాళ్లు నాకు కొన్ని నంబర్స్ (డబ్బు) చెప్పారు. కానీ ఆ నెంబర్స్ నేను తీసుకున్నా... తీసుకోక పోయినా పర్లేదు అనుకున్నా. అందుకే అమ్మలేదు. దిల్ రాజు: చాలా మంది సినిమాలు తీస్తుంటారు. కానీ కొంతమందికే సక్సెస్ అవకాశం ఉంటుంది. అందులో నువ్వు కూడా ఒకడివి. అందుకే నేను సపోర్ట్ చేస్తున్నా.. మంచి సినిమాకి సపోర్ట్ చేస్తున్నా. నీ సినిమా టేస్ట్‌కి సపోర్ట్ చేస్తున్నా. చాలా మంది అనుకుంటారు.. నేను ఏదో మనీ కోసం చేస్తున్నా అని. కానే కాదు. కానీ ఒక మంచి సినిమా తీసినప్పుడు.. సపోర్ట్ చేస్తే.. కొంతమందికైనా సినిమా రీచ్ అవుతుందనేది నా నమ్మకం. రాహుల్: థ్యాంక్యూ సార్ దిల్ రాజు: సౌండ్ డిజైనింగ్ దగ్గర నుంచి, డైరెక్టర్ విజన్ వరకు అంతా రాహులే చూసుకున్నాడు. నేను డైరెక్టర్‌తో కూడా మాట్లాడలేదు. రాహుల్‌తోనే లెంగ్త్ గురించి మాట్లాడా. కానీ ఒక్క ఫ్రేమ్ కూడా కట్ చేసేది లేదు సార్ అంటాడు. అప్పుడనిపించింది.. అతను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని! అని చెప్పుకొచ్చాడు. అనంతరం నటి సంగీత మాట్లాడుతూ.. ‘‘మామూలుగా నాకు హర్రర్ సినిమాలంటే చాలా భయం. పెద్దగా చూడను. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. మేకప్ లేకుండా చేయాలంటే ఏ ఆర్టిస్ట్‌కి అయినా భయమే. కానీ నేనే థ్రిల్ అయ్యేలా చేశారు కెమెరా మ్యాన్’’ అన్నారు దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ.. '‘వెళ్లిపోమాకే’ దగ్గర నుంచి దిల్ రాజుగారిని ఫాలో అవుతున్నా. ఒక మంచి ప్రయత్నాన్ని ఆయన ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్యూ దిల్ రాజుగారు. ఒక సంవత్సరం క్రితం రాహుల్ ఆఫీస్‌కి వెళితే.. ఇప్పుడే వస్తానని చెప్పి రాహుల్ బయటికి వెళ్లి రెండు గంటల వరకు రాలేదు. అక్కడెవరూ లేకపోవడంతో.. నేనంతా పరీక్షగా చూస్తూ ఉన్నా. ఒక కార్నర్లో పిచ్చిపిచ్చి బొమ్మలు గీసి ఉన్నాయి. పిచ్చి పిచ్చి అని కాదు. చాలా క్రీపీ స్టఫ్ ఉంది.ఆ రోజు నేను చూసిన బొమ్మలు.. వాటి నుంచి వచ్చిన చిత్రాన్ని నేను తెరపై చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది’’ అని కోరారు. నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘‘10 ఏళ్ల క్రితం కాంజురింగ్ సినిమా చూశా.. ఆ తరువాత మళ్లీ ఈ సినిమాలో భయపడ్డా. సాయికిరణ్ ఈ సినిమాను చాలా అందంగా రాశాడు. హారర్ సినిమా కూడా ఎందుకింత అందంగా ఉందీ అంటే.. అది మీరు చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాకు, నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ.. సినిమా చూశాక అందరినీ అభినందించాలని అనిపించింది. తిరువీర్ అంటే నాకు ఈర్ష్య. చాలా మంచి నటుడు. 10 ఏళ్ల క్రితం నేను, తిరువీర్ ప్రయాణం మొదలెట్టాం. ఇలాంటి సినిమాలకు సపోర్ట్ వస్తే.. అలాంటి నటీనటులు బయటికి వస్తారు. ఈ సినిమా సీక్వెల్లో నేనే హీరో (నవ్వుతూ)..’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తీరువీర్, కావ్య కల్యాణ్ రామ్, బాందవీ శ్రీధర్, సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి, సినిమాటోగ్రాఫర్ నగేశ్, నటుడు కృష్ణతేజ, మసూద పాత్ర పోషించిన అఖిల రామ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: హౌస్మేట్స్ పొట్ట కొడుతున్న సింగర్ రేవంత్ కృష్ణానదిలో కృష్ణ అస్థికల నిమజ్జనం -
అతని సినిమాలకు నేను అభిమానిని.. దిల్ రాజు కామెంట్స్ వైరల్
హీరో తిరువీర్, హీరోయిన్ కావ్య కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రం 'మసూద'. రామ్ స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాహుల్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 18న విడుదల కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కాతో పాలు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. (చదవండి: విభిన్న కథాంశంగా 'మిస్టర్ మమ్మీ'.. ఆకట్టుకుంటున్న వీడియో సాంగ్) ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'రాహుల్ యాదవ్ ఇంతకు ముందు తీసిన రెండు సినిమాలకు నేను అభిమానిని. రాహుల్ అభిరుచిగల నిర్మాత. ఆ రెండు సినిమాల జర్నీ నాకు నచ్చి.. అప్పుడే రాహుల్‌కి మాటిచ్చా. ఆయన నిర్మించిన ‘మసూద’ చిత్రాన్ని మా ఎస్వీసి ద్వారా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమా టీజర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. టీజర్ చూడగానే రాహుల్‌కి ఫోన్ చేసి చెప్పాను. నవంబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది' అని అన్నారు. చిత్ర నిర్మాత రాహూల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. 'ముందుగా దిల్ రాజుకు చాలా థ్యాంక్స్. మసూద విషయానికి వస్తే మూడేళ్ల కష్టమిది. మధ్యలో కొవిడ్ రావడంతో ఆలస్యమైంది. ఈ చిత్రం ద్వారా సాయికిరణ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా టీమ్ సభ్యులు మధ్యలో వేరే అవకాశాలు వచ్చినా వెళ్లకుండా.. అందరూ నిలబడ్డారు కాబట్టే మంచి సినిమా తీయగలిగా. నాకీ అవకాశం ఇచ్చిన రాజుగారికి థ్యాంక్స్. ఆయన నమ్మకం నిలబెట్టుకుంటాననే నమ్మకం నాకుంది. బుధవారం సాయంత్రం సోనీ మ్యూజిక్ ద్వారా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నాం. సినిమా నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది..' అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో తిరువీర్, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్, బాందవి శ్రీధర్, సంగీత దర్శకుడు ప్రశాంత్, సినిమాటోగ్రాఫర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. The Scare has a NEW DATE #MASOODA - Horror Drama, coming to theatres on Nov 18th! A @SVC_official (#DilRaju) Release!#MasoodaOnNov18th @RahulYadavNakka #SaiKiran @Swadharm_Ent @SonyMusicSouth @IamThiruveeR @KavyaKalyanram @sangithakrish @Bandhavisri @prashanthvihari pic.twitter.com/Pd6iTzX2km — Vamsi Kaka (@vamsikaka) November 9, 2022 -
పాన్ ఇండియా చిత్రంగా 'మసూద'
‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే తన మూడో సినిమా ‘మసూద’ను ప్రకటించింది. హారర్-డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భగా చిత్ర నిర్మాత రాహూల్ యాదవ్ నక్క మాట్లాడుతూ ‘మనం ఒక మంచి హారర్ డ్రామాను చూసి చాలా కాలం అయ్యింది. మంచి హార్రర్ చిత్రాలలో మసూద ఒకటిగా నిలుస్తుందని నా గట్టి నమ్మకం. ఇప్పటి వరకు విడుదలైన టీజర్‌కి, పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అతి త్వరలో ఇతర వివరాలను తెలియజేస్తాం. అన్నారు. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. -
మరో రెండు భాగాలు
నవీన్ పోలిశెట్టి హీరోగా, శ్రుతి శర్మ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’. డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జె తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది జూన్‌లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఈ చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా పుట్టినరోజుని పురస్కరించుకొని ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ ట్రయాలజీగా వస్తుందని ప్రకటించారు. అంటే ఈ చిత్రానికి మరో రెండు భాగాలు రానున్నాయన్న మాట. ఈ సందర్భంగా రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ–‘‘స్వరూప్ ఆర్ఎస్జె ప్రస్తుతం స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు. తను దర్శకత్వం వహిస్తోన్న రెండో సినిమా పూర్తవగానే ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ రెండో భాగం షూటింగ్ మొదలవుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడిస్తాం. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమా హిందీ, తమిళ, మలయాళం రీమేక్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడుపోయాయి. త్వరలో కన్నడ హక్కులు కూడా అమ్ముడు కానున్నాయి. మా చిత్రం జపాన్ భాషలో అనువాదం అవుతుండటం మరో విశేషం. సెప్టెంబర్ 11న అక్కడ విడుదలవుతోంది’’ అన్నారు. -
మెయిన్ ‘డ్రా’కు రాహుల్ యాదవ్
లక్నో: సయ్యద్ మోదీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో తొలి రౌండ్లో రాహుల్ 21–13, 21–17తో కార్తికేయ (భారత్)పై... రెండో రౌండ్లో 21–10, 21–16తో ఆర్యమాన్ (భారత్)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన ఆలాప్ మిశ్రా, అన్సల్ యాదవ్ కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో హైదరాబాద్ అమ్మాయి ప్రాషి జోషికి నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో ప్రాషి 21–19, 18–21, 8–21తో భారత్‌కే చెందిన తన్వీ లాడ్ చేతిలో ఓడిపోయింది. ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్, లక్ష్య సేన్ : అన్ని విభాగాల్లో నేటి నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, లక్ష్య సేన్ బరిలోకి దిగకుండానే నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. కశ్యప్‌తో ఆడాల్సిన లూకాస్ కోర్వీ (ఫ్రాన్స్)... లక్ష్య సేన్‌తో ఆడాల్సిన థామస్ రుక్సెల్ (ఫ్రాన్స్) టోర్నీ నుంచి వైదొలగడంతో భారత ఆటగాళ్లకు తొలి రౌండ్లో ‘వాకోవర్’ లభించింది. -
సివిల్స్ ప్లాప్.. సినిమా హిట్..!
అతనికి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు.. చిత్రసీమతో అనుబంధం గాని.. అనుభవం గానీ అసలే లేవు. అనుకోకుండా నిర్మాతగా మారి సరికొత్త కథలను తెరకెక్కిస్తున్నాడు నగరానికి చెందిన యువ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. సుమంత్ హీరోగా ‘మళ్ళీరావా’ అంటూ డీసెంట్ హిట్ కొట్టి.. రీసెంట్గా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌తో పాటు హిట్ అందుకున్నాడు. బీటెక్ చదువుకుని సివిల్స్‌లో ఇంటర్వ్యూ దాకా వెళ్లిన హైదరాబాదీ రాహుల్ యాదవ్ తన సినీ ప్రస్థానాన్ని, అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు అతడి మాటల్లోనే.. సిటీలో వనస్థలిపురం నా అడ్డా. నాన్న ఉమేష్‌కుమార్ యాదవ్ వ్యాపారి. అమ్మ సావిత్రి గృహిణి. ఇక్కడే బీటెక్ పూర్తి చేశాను. మూడు సార్లు సివిల్స్‌లో ఇంటర్వ్యూ దాకా వెళ్లి అదృష్టం లేక అక్కడే ఆగిపోయాను. ఏదైనా కొత్త రంగంలోకి వెళ్లి అక్కడ విషయాలను తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. అందులో విజయం సాధించడమంటే ఇంకా ఇష్టం. సివిల్స్ మిస్సయ్యాక నా ఫ్రెండ్ తను చేస్తున్న రైల్వే ప్రాజెక్ట్‌లోకి రమ్మని ఆహ్వానించాడు. నాకు సంబంధం లేని వ్యాపార రంగం.. అందులోనూ రైల్వే. ఛాలెంజింగ్ అనిపించి ఆ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా చేరాను. సంవత్సరం పాటు అక్కడే ఉండి రైల్వే లైన్‌ను సక్సెస్ఫుల్ చేశాం. పాప పుట్టాక సిటీకి వచ్చేశాను. ‘హైదరాబాద్ ఎన్జీఓస్’ గ్రూప్‌లో ఉంటూ అక్కడ స్టార్టప్స్ గురించి తెలుసుకునేవాడిని. అలా చాలా వ్యాపారాలపై అవగాహన పెంచుకున్నాను. అలా నిర్మాతగా మారాను.. కామన్ ఫ్రెండ్స్ ద్వారా దర్శకుడు గౌతం తిన్ననూరి పరిచయమయ్యాడు. నాకు సినిమాలు చూడ్డం తప్ప ఆ ప్రపంచం అంతా కొత్త. అయితే, బుక్స్ బాగా చదువుతాను. గౌతం రాసుకున్న కథ, స్క్రిప్ట్(మళ్ళీరావా) నేను చదివాను. అతడు చెప్పాలనుకున్న పాయింట్, స్క్రీన్‌ప్లే చాలా బాగా నచ్చింది. గౌతం కథ బాగున్నా నిర్మాతగా ఎవరూ ముందుకు రావట్లేదు. దాంతో నేనే నిర్మాతగా మారాలనుకున్నా. సినిమా నిర్మాణంలో సగభాగం నేను నిర్మాతగా ఉంటాను. మరో నిర్మాతతో కలిసి సినిమా చేద్దాం అని చెప్పాడు. గౌతం కూడా చాలా ట్రై చేశాడు. కానీ ఎవరూ ముందుకు రాకపోయేసరికి నేనే పూర్తి స్థాయి నిర్మాతగా మారాల్సి వచ్చింది. ‘ఏజెంట్ స్పై థ్రిల్లర్’తో వచ్చా.. మళ్ళీరావా తర్వాత చాలా కథలు విన్నాను. కానీ కొత్తదనం అనిపించలేదు. దర్శకుడు స్వరూప్, నటుడు నవీన్ పొలిశెట్టి మిత్రులు. స్వరూప్ రాసుకున్న కథను నాకు చెప్పాడు.. థ్రిల్లింగ్‌గా అనిపించింది. స్పై సినిమాలు వస్తుంటాయి. కానీ తెలుగుతో లోకల్ ఏజెంట్‌గా స్పై థ్రిల్లింగ్ మూవీలు వచ్చి చాలా ఏళ్లయింది. మెగాస్టార్ చిరంజీవి ‘చంటబ్బాయి’ తర్వాత కామెడీతో పాటు థ్రిల్లర్ మూవీలు రాలేదు. కథ కొత్తగా.. చాలా బాగుంది. నవీన్ హైదరాబాదీ. భోపాల్ ఎన్ఐటీలో చదివి అక్కడే యూట్యూబ్ చానల్లో తన సత్తాను చాటాడు. తెలుగువాడు బాలీవుడ్ సోషల్ మీడియాలో సక్సెస్ అవడం అంటే మామూలు విషయం కాదు. నవీన్‌లో ఈజ్‌తో పాటు అన్ని షేడ్స్ ఉన్నాయి. నవీన్–స్వరూప్ కథలోని కొన్ని మలుపులు, కొత్తదనంతో ఫైనల్ స్క్రిప్ట్‌తో రెడీ అయ్యారు. నెల్లూరులోనే పూర్తి షూటింగ్.. 65 శాతం కొత్తవాళ్లతో వైవిద్యంగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ టైటిల్ పెట్టాం. నెల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో సినిమా.. అక్కడే షూటింగ్. అనుకున్న ప్రకారం సినిమాను పూర్తి చేశాంగానీ రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. బడా డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి పెదవి విరిచారు. నమ్మకం లేదని తేల్చి చెప్పారు. దాంతో మేమే సొంతంగా రిలీజ్ చేసుకున్నాం. సిటీలో మొదటి రోజు 9 షోలతో రిలీజ్ చేశాం. సాయంత్రానికి విమర్శకుల ప్రశంశలతో పాటు సినిమా అభిమానులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఆదివారానికి 64 షోలు నగరంలో పడ్డాయి. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ గుండెల్లో దాచుకుంటారని మరోసారి రుజువు చేశారు. ఇండస్ట్రీలో కొత్త తరాన్ని ప్రోత్సహించాలి. వైవిధ్యమైన కథలను ప్రేక్షకులకు అందించాలి. టాలెంట్‌కే నా ఓటు. కొత్త కథతో ఎవరు వచ్చినా ప్రోత్సహిస్తాను. వైవిధ్య కథలతో ప్రేక్షకుల మెప్పు పొంది తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని పెంచాలన్నది నా ప్రయత్నం.. అంటూ ముగించారు రాహుల్ యాదవ్. మొదటిసారి భయమేసింది.. ‘మళ్ళీరావా’ కథను హీరో సుమంత్‌కి చెప్పాం. తనకి బాగా నచ్చి చేద్దామన్నాడు. కానీ ఎక్కడో చిన్న భయం. అనుకున్న బడ్జెట్ దాటిపోతుందనుకున్నాం. ఈ విషయాన్ని సుమంత్‌కి చెబితే.. తను మాలోని భయాన్ని పోగొట్టి సినిమాకు చాలా సహకరించారు. అనుకున్న బడ్జెట్ కన్నా తక్కువలోనే పూర్తి చేశాం. వీటి తర్వాత రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ సినిమా మీదున్న నమ్మకంతో మేమే రిలీజ్ చేశాం. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. భారీ లాభాలు రాకపోయినా లాభాలతో కొత్తగా చిత్రాన్ని నిర్మించామన్న సంతృప్తి మిగిలింది. నాలో సినిమాపై నమ్మకాన్ని, ధైర్యాన్ని రెట్టింపు చేసింది.-సత్య గడేకారి -
రాహుల్ యాదవ్ ముందంజ
గువాహటి: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. తెలంగాణకే చెందిన సిరిల్ వర్మ, ఎన్వీఎస్ విజేత మాత్రం రెండో రౌండ్లో నిష్క్రమించారు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఐదో సీడ్ రాహుల్ యాదవ్ రెండో రౌండ్లో 21–17, 21–8తో కరణ్ చౌదరీ (హిమాచల్‌ప్రదేశ్)పై గెలుపొందాడు. తొలి రౌండ్లో సిరిల్ వర్మ 21–7, 21–13తో మాల్‌స్వామ్‌సంగా (మిజోరం)పై నెగ్గి... రెండో రౌండ్లో 21–23, 17–21తో హర్షీల్ డాని (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో విజేత 21–12, 20–22, 21–9తో మయూఖ్ ఘోష్ (పశ్చిమ బెంగాల్)పై గెలిచి... రెండో రౌండ్లో 13–21, 21–14, 17–21తో ప్రియాన్షు రజావత్ (మధ్యప్రదేశ్) చేతిలో ఓటమి చవిచూశాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జశ్వంత్, జగదీశ్ కూడా మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో జశ్వంత్ 21–18, 17–21, 21–17తో రఘు (కర్ణాటక)పై, జగదీశ్ 23–21, 20–22, 21–16తో ధ్రువ్ రావత్ (ఉత్తరాఖండ్)పై గెలిచారు. మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు గుమ్మడి వృశాలి, కె.ప్రీతి మూడో రౌండ్‌కు చేరగా... పాకలపాటి నిశిత వర్మ రెండో రౌండ్లో ఓడిపోయింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన వృశాలి... రెండో రౌండ్లో 21–11, 21–5తో మైత్రేయి ఖత్రి (గుజరాత్)పై గెలిచింది. కె.ప్రీతి తొలి రౌండ్లో 21–12, 21–8తో దెబహుటి లహోన్ (అస్సాం)పై విజయం సాధించగా... రెండో రౌండ్లో ఆమెకు రేవతి దేవస్థలే (ఆలిండియా యూనివర్సిటీస్) నుంచి వాకోవర్ లభించింది. నిశిత తొలి రౌండ్లో 21–17, 21–14తో ఇషారాణి బారువా (అస్సాం)పై గెలిచి... రెండో రౌండ్లో 20–22, 10–21తో కవిప్రియ (పాండిచ్చేరి) చేతిలో ఓటమి చవిచూసింది. -
సెమీస్‌లో హైదరాబాద్
అహ్మదాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో హైదరాబాద్ హంటర్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 4–3తో అహ్మదాబాద్ స్మాష్‌మాస్టర్స్‌పై విజయం సాధించింది. దీంతో 21 పాయింట్లతో అగ్రస్థానంలోకి వెళ్లింది. మొదట మిక్స్డ్ డబుల్స్‌లో బొదిన్ ఇసారా–ఇయోమ్ హ్యే వోన్ జోడీ 15–14, 15–9తో సాత్విక్ సాయిరాజ్–సిక్కి రెడ్డి జంటపై గెలిచి శుభారంభం చేసింది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌కు ట్రంప్ మ్యాచ్ కాగా... ఇందులో డారెన్ ల్యూ 15–13, 15–9తో రాహుల్ యాదవ్ (హైదరాబాద్)పై గెలుపొందాడు. రెండో సింగిల్స్‌లో విక్టర్ అక్సెల్సన్ 15–11, 13–15, 15–8తో మార్క్ కాల్జౌ (హైదరాబాద్)పై నెగ్గడంతో అహ్మదాబాద్ ఆధిక్యం 3–1కు చేరింది. తర్వాత మహిళల సింగిల్స్ బరిలో సింధు ఉండటంతో హైదరాబాద్ ట్రంప్‌గా ఎంచుకుంది. సింధు 15–14, 12–15, 15–14తో కిర్స్టీ గిల్మోర్ (అహ్మదాబాద్)పై చెమటోడ్చి నెగ్గడంతో స్కోరు 3–3తో సమమైంది. ఇక నిర్ణాయక పురుషల డబుల్స్‌లో బొదిన్ ఇసారా–కిమ్ సా రంగ్ (హైదరాబాద్) జోడీ 15–10, 11–15, 15–14తో సాత్విక్ –రెగినాల్డ్ ద్వయంపై నెగ్గడంతో హైదరాబాద్ విజయం ఖాయమైంది. మరోవైపు ఢిల్లీ డాషర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఐదో మ్యాచ్‌లోనూ ఢిల్లీ 0–6తో పుణే సెవెన్ ఏసెస్ చేతిలో చిత్తుగా ఓడింది. నేటి మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌తో చెన్నై స్మాషర్స్ తలపడుతుంది. -
రాహుల్ యాదవ్‌కు పురుషుల సింగిల్స్ టైటిల్
వీవీ నాథూ స్మారక అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. పుణేలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాహుల్ యాదవ్ 21–14, 16–21, 21–15తో ఆలాప్ మిశ్రా (మధ్యప్రదేశ్)పై గెలుపొందాడు. ఆర్బీఐ తరఫున బరిలోకి దిగిన హైదరాబాద్ అమ్మాయి కె.మనీషా మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో మనీషా–సాన్యామ్ శుక్లా (ఎయిరిండియా) ద్వయం 22–20, 21–18తో షేక్ గౌస్ (ఆంధ్రప్రదేశ్)–పూజ (ఎయిరిండియా) జంటపై నెగ్గింది. -
రాహుల్ శుభారంభం
వ్లాదివోస్టాక్ (రష్యా): బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్– 100 రష్యా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఐదు గురు భారత ఆటగాళ్లు రెండో రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హైదరాబాద్ ప్లేయర్ రాహుల్ యాదవ్ 21–11, 21–10తో మకలోవ్ (రష్యా)ను ఓడించగా... జయరామ్ 21–14, 21–8తో జియోడాంగ్ షెంగ్ (కెనడా)పై, ప్రతుల్ జోషి 21–11, 21–8తో జెఫ్రీ లామ్ (కెనడా)పై, మిథున్ 21–14, 21–13తో ఇలియాస్ బ్రాకె (బెల్జియం)పై, సిద్ధార్థ్ 21–17, 21–16తో జియా వె తాన్ (మలేసియా)పై గెలిచారు. -
రాహుల్... జిగేల్
లాగోస్ ఓపెన్‌లో సింగిల్స్ టైటిల్ సొంతం హైదరాబాద్: గత వారం రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్... ఈసారి లాగోస్ ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ టోర్నీలో విజేతగా అవతరించాడు. నైజీరియాలో జరిగిన ఈ టోర్నీలో 19 ఏళ్ల రాహుల్ పురుషుల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. భారత్‌కే చెందిన కరణ్ రాజన్‌తో జరిగిన ఫైనల్లో రాహుల్ 21–15, 21–13తో విజయం సాధించాడు. నాలుగో సీడ్‌గా ఈ టోర్నీలో బరిలోకి దిగిన రాహుల్ సెమీఫైనల్లో 21–13, 22–24, 21–14తో టాప్ సీడ్ మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)ను బోల్తా కొట్టించాడు. గతేడాది మారిషస్ అంతర్జాతీయ సిరీస్ టోర్నీ ఫైనల్లో తన సోదరుడు రోహిత్ యాదవ్‌ను ఓడించి రాహుల్ తన కెరీర్లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను గెలిచాడు. తాజా విజయంతో అతను తన ఖాతాలో రెండో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న రాహుల్‌కు ఈ విజయంతో 2,200 డాలర్ల (రూ. లక్షా 41 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి టైటిల్‌ను గెలిచాడు. ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం 21–13, 21–15తో గాడ్విన్ ఒలోఫువా–జువన్ ఒపెయోరి (నైజీరియా) జంటపై నెగ్గింది. -
సెమీస్‌లో రాహుల్ యాదవ్
న్యూఢిల్లీ: అంచనాలకు మించి రాణిస్తూ... హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో జరుగుతున్న రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీలో 19 ఏళ్ల ఈ హైదరాబాద్ కుర్రాడు తన విజయపరంపర కొనసాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రాహుల్ యాదవ్ 13–11, 11–5, 11–6తో కేవలం 22 నిమిషాల్లో వాంగ్ యుహాంగ్ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో రెండో సీడ్, ప్రపంచ 63వ ర్యాంకర్ వ్లాదిమిర్ మల్కోవ్ (రష్యా)తో రాహుల్ యాదవ్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఆనంద్ పవార్ (భారత్) 4–11, 11–7, 8–11, 3–11తో వ్లాదిమిర్ మల్కోవ్ చేతిలో ఓటమి చవిచూశాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ ద్వయం 7–11, 11–9, 11–8, 11–9తో మసాతో తకానో–యోషికి సుకమోతో (జపాన్) జంటపై గెలిచి సెమీస్‌కు చేరింది. పోరాడి ఓడిన వృశాలి మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో తెలుగు అమ్మాయి గుమ్మడి వృశాలి 11–8, 8–11, 12–10, 9–11, 9–11తో మూడో సీడ్ నటాలియా పెర్మినోవా (రష్యా) చేతిలో... ఆరో సీడ్ రసికా రాజే (భారత్) 2–11, 4–11, 7–11తో నత్సుకి నిదైరా (జపాన్) చేతిలో ఓడిపోయారు. -
మళ్లీ రియల్టీలోకి హౌసింగ్‌డాట్‌కామ్
♦ రాహుల్ యాదవ్ ♦ అనారాక్ సీటీవోగా బాధ్యతలు న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లతో విభేదాల కారణంగా హౌసింగ్‌డాట్‌కామ్ నుంచి తప్పుకున్న సహ వ్యవస్థాపకుడు రాహుల్ యాదవ్ మళ్లీ రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ మాజీ హెడ్ అనుజ్ పురికి చెందిన అనారాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సంస్థలో చీఫ్ ప్రోడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఆయన నియమితులయ్యారు. ఆన్లైన్ రెసిడెన్షియల్ బ్రోకరేజీ, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం, ఫండ్ కార్యకలాపాలున్న ఈ సంస్థను జేఎల్ఎల్ నుంచి పురి ఇటీవలే కొనుగోలు చేశారు. జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ వంటి భారీ సంస్థలు ఇన్వెస్ట్ చేసిన ఆన్లైన్ రియల్టీ సేవల సంస్థ హౌసింగ్‌డాట్‌కామ్ నుంచి యాదవ్ 2015 జులైలో తప్పుకున్నారు. ఇన్వెస్టర్లతో విభేదాలు తలెత్తడమే ఇందుకు కారణం. -
మళ్లీ ప్రేమకథలో..
‘ఐయామ్ ఇన్ లవ్.. ఐయామ్ ఇన్ లవ్’ అంటున్నారు సుమంత్. రియల్ లైఫ్‌లో కాదులెండి.. రీల్ లైఫ్‌లో. హీరోగా సుమంత్ డిఫరెంట్ సినిమాల్లో నటించినా... ఆయనకు ప్రేమకథలు ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. లేటెస్ట్గా మరో ప్రేమకథా చిత్రంలో నటించడానికి అంగీకరించారు సుమంత్. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్‌యాదవ్ నక్కా నిర్మించనున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్ క్లాప్ ఇవ్వగా, చిత్రనిర్మాత రాహుల్ తల్లి సావిత్రి కెమేరా స్విచ్చాన్ చేశారు. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభించను న్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్, కాదంబరి కిరణ్, ప్రవీణ్ (వెంకట్) యాదవ్, బందరు బాబీ పాల్గొన్నారు. సుమంత్‌కు జోడీగా ఆకాంక్ష సింగ్ నటించనున్న ఈ సినిమాలో అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, ‘మిర్చి’ కిరణ్, అభినవ్, అప్పాజీ అంబరీష తదితరులు ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి పాటలు: కృష్ణకాంత్, సంగీతం: శ్రవణ్. -
తొలి రౌండ్లోనే సిరిల్, రాహుల్ ఓటమి
సారావక్ (మలేసియా): మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ఆటగాళ్లు సిరిల్ వర్మ, చిట్టబోయిన రాహుల్ యాదవ్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. భారత్‌కే చెందిన హర్షీల్ దాని, ప్రతుల్ జోషి, హేమంత్ గౌడ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో సిరిల్ వర్మ 10–21, 21–18, 17–21తో పనావత్ తోంగ్‌నువామ్ (థాయ్‌లాండ్) చేతిలో, రాహుల్ యాదవ్ 16–21, 11–21తో సుయె సువాన్ యి (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు. హర్షీల్ 21–19, 21–17తో జి జియా లీ (మలేసియా)పై, ప్రతుల్ జోషి 15–21, 21–16, 24–22తో జిన్ రీ రియాన్ ఎన్జీ (సింగపూర్)పై, హేమంత్ 21–14, 21–15తో యెహిజకిల్ మైనాకి (ఇండోనేసియా)పై విజయం సాధించారు. -
ఫైనల్లో రుత్విక, రాహుల్ యాదవ్
వల్సాడ్ (గుజరాత్): అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు గద్దె రుత్విక శివాని, రాహుల్ యాదవ్ టైటిల్ పోరుకు అర్హత సాధించారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రుత్విక శివాని 21-11, 21-19తో అరుంధతి పంతవానె (మహారాష్ట్ర)పై విజయం సాధించగా... పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రాహుల్ యాదవ్ 22-24, 21-16, 21-16తో టాప్ సీడ్ ఆదిత్య జోషి (ఎయిరిండియా)ను బోల్తా కొట్టించాడు. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో పీసీ తులసీ ( కేరళ)తో రుత్విక; శ్రేయాన్ష్ జైస్వాల్ (చత్తీస్‌గఢ్)తో రాహుల్ యాదవ్ తలపడతారు. -
హౌసింగ్‌డాట్‌కామ్ కొత్త సీఈఓగా రిషభ్ గుప్తా
రాహుల్ యాదవ్ స్థానంలో న్యూఢిల్లీ: హౌసింగ్‌డాట్‌కామ్ తాత్కాలిక సీఈఓగా రిషభ్ గుప్తా నియమితులయ్యారు. రాహుల్ యాదవ్ స్థానంలో గుప్తాను నియమిస్తున్నామని, ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని హౌసింగ్‌డాట్‌కామ్ తెలిపింది. సాఫ్ట్‌బ్యాంక్ తోడ్పాటుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హౌసింగ్‌డాట్‌కామ్‌కు రిషభ్ గుప్తా ప్రస్తుతం చీఫ్ అపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా పనిచేస్తున్నారు. రిషభ్ గుప్తా, హరీశ్ చావ్లా, అభిషేక్ ఆనంద్‌లు కంపెనీ నిర్వహణ బోర్డ్‌లో సభ్యులుగా ఉంటారని తెలిపింది. రాహుల్ యాదవ్ ప్రవర్తన ఒక సీఈఓకు తగ్గట్లుగా లేదని, అందుకే ఆయనకు ఉద్వాసన పలికామని పేర్కొంది. -
భలే బాసులు!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) జేబులో పది రూపాయిలు ఉంటే రూపాయి దానం చేయడానికి ఆలోచిస్తాం. అలాంటిది రూ.200 కోట్ల విలువైన వాటాను ఉదారంగా వదిలేస్తే. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మూడు పదుల వయసు కూడా లేని యువ సీఈవో ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ఇక్కడ విశేషం. తన వాటా మొత్తాన్ని ఉద్యోగులకు ఇచ్చివేస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు హౌసింగ్‌డాట్‌కామ్ సీఈవో రాహుల్ యాదవ్. సుమారు రూ. 200 కోట్ల విలువైన తన వాటా మొత్తాన్ని కంపెనీలలోని 2,251 మంది స్టాఫ్ కు ఇచ్చేశారాయన. ఈలెక్కన చూసుకుంటే ఒక్కో ఉద్యోగికి రూ.6.50 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు ముడుతుందన్న మాట. ఒక్కో ఉద్యోగికి ఏడాది జీతానికి సమానమైన మొత్తం అందుతుందని అంచనా. ఇప్పటినుంచే డబ్బు గురించి ఆలోచించడం లేదని 26 ఏళ్ల రాహుల్ ప్రకటించడం ఆసక్తి గొలిపే అంశం. సీటెల్ కేంద్రంగా పనిచేస్తున్న క్రెడిట్ కార్డ్ ప్రాసెసర్ కంపెనీ గ్రావిటీ పేమెంట్స్ సంస్థ అధినేత డాన్ ప్రైస్ కూడా ఇలాంటి పనే చేశారు. సిబ్బంది జీతాలు పెంచేందుకు తన వేతనాన్ని వదులుకున్నారు. సుమారు 10 కోట్ల రూపాయల జీతాన్ని త్యాగం చేసి 70 మంది ఉద్యోగులకు పంచారు. వీరిలో 30 మందికి జీతం డబుల్ కావడం విశేషం. అమెరికాలో సగటు వేతన జీవుల జీతం సుమారు రూ.13 లక్షలు ఉండగా, డాన్ ప్రైస్ ఉదారతతో గ్రావిటీ పేమెంట్ ఉద్యోగుల సగటు వేతనం దాదాపు రూ. 45 లక్షలకు చేరింది. బాస్ తన జీతం కుదించుకుని తమ వేతనం పెంచడంతో డాన్ ప్రైస్ పై ఉద్యోగులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలావుంటే నాలోని టీన్స్ గ్రూప్ అధిపతి లీ జినువాన్‌లా తన ఉద్యోగులకు ఊహించని కానుక ఇచ్చారు. ఏకంగా 6,400 మంది తన సంస్థ ఉద్యోగులను హాలిడే టూర్ కోసం ఫ్రాన్స్ తీసుకెళ్లి ఔరా అనిపించారు. రూ. 240 కోట్లు ఖర్చు పెట్టి తొమ్మిది రోజుల పాటు ఫ్రాన్స్ లోని నగరాలన్ని చూపించారు. ఇక పర్యటన చివరి రోజున ఫ్రాన్స్ నగరం నీస్‌లో టీన్స్ ఉద్యోగులంతా ఒకే తరహా దుస్తులు ధరించి మానవహారంతో అందరి దృష్టిని ఆకర్షించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి విదేశీయానం చేయించిన తమ బాస్ ను టీన్స్ గ్రూప్ ఉద్యోగులు తెగ పొగిడేస్తున్నారు. సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలకియా కూడా ఇదేవిధంగా ఊహించని బహుమతులు ఇచ్చి ఉద్యోగులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. ఢోలకియాకు చెందిన హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థలో పనిచేసే 1200 మందికి ఉద్యోగులకు గతేడాది దీపావళికి విలువైన కానుకలిచ్చి వార్తల్లో నిలిచారు. 491 ఫియట్ పుంటో కార్లు, 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. ఇంకా ఆభరణాలు మొదలైనవి ఉద్యోగులకు పంచారు. సంస్థ వృద్ధికి తోడ్పడిన ఉద్యోగులను ప్రోత్సహించే ఉద్దేశంతో వీటిని అందించినట్లు ఢోలకియా చెప్పారు. విలువైన బహుమతులిచ్చిన తమ యజమాని ఢోలకియాకు 'షుక్రియా' అంటూ ధన్యవాదాలు తెలిపారు ఉద్యోగులు. -
రూ.150 కోట్ల వాటా ఉద్యోగులకు ధారాదత్తం
హౌసింగ్ డాట్ కామ్ సీఈవో సంచలన నిర్ణయం ముంబై: హౌసింగ్‌డాట్‌కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ యాదవ్ ఆ కంపెనీలో ఉన్న తన వాటా మొత్తాన్ని ఉద్యోగులకు ఇచ్చివేశారు. కంపెనీ సీఈఓగా రాజీనామా చేసి, ఆ రాజీనామాను ఉపసంహరించుకున్న వారం రోజుల్లోనే ఇలాంటి ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని రాహుల్ యాదవ్ తీసుకున్నారు. హౌసింగ్‌డాట్‌కామ్‌లో రాహుల్ యాదవ్ వాటా విలువ రూ.150-200కోట్లని అంచనా. ఈ మొత్తాన్ని డాట్‌కామ్‌లో పనిచేస్తున్న మొత్తం 2,251 మంది ఉద్యోగులకు ఆయన ఇచ్చివేశారని డాట్‌కామ్ వెల్లడించింది. ఈ వాటా విలువ ఉద్యోగుల ఏడాది వేతనానికి సమానమని పేర్కొంది. తన వయస్సు 26 సంవత్సరాలేనని, ఇప్పుడే డబ్బు గురించి సీరియస్‌గా ఆలోచించడం తొందరపాటవుతుందనే ఉద్దేశంతోనే ఈ వాటాను ఉద్యోగులకు ఇచ్చినట్లు యాదవ్ పేర్కొన్నారు. -
ప్రిక్వార్టర్స్‌లో సిరిల్, రాహుల్
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ కుర్రాళ్లు సిరిల్ వర్మ, రాహుల్ యాదవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. చండీగఢ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన బాలుర సింగిల్స్ అండర్-17 మూడో రౌండ్లో రెండో సీడ్ రాహుల్ 21-8, 21-16తో హర్ష్ జగ్ధనే (మహారాష్ట్ర)పై, ఐదో సీడ్ సిరిల్ 15-21, 21-10, 21-15తో సిద్ధార్థ్ ప్రతాప్ సింగ్ (చండీగఢ్)పై గెలుపొందారు. ఆరో సీడ్ కనిష్క్ 21-12, 21-11తో ధర్మశేఖరన్ (తమిళనాడు)ను కంగుతినిపించగా, చంద్రకుమార్ 21-15, 15-21, 21-10తో 11వ సీడ్ బొధిత్ జోషి (ఉత్తరాఖండ్)కి షాకిచ్చాడు. బాలికల విభాగంలో పదో సీడ్ వృశాలి, రుత్విక శివాని ప్రిక్వార్టర్స్‌కు అర్హత పొందారు. వృశాలి 21-6, 21-5తో నికిత సింగ్ (జార్ఖండ్)పై, రెండో సీడ్ రుత్విక 21-1, 21-5తో జాస్మిన్ సాహు (ఒరిస్సా)పై విజయం సాధించారు. ఇతర ఫలితాలు అండర్-19 బాలుర సింగిల్స్: కనిష్క్ 13-21, 21-18, 14-21తో హర్షిల్ డాని (ఎయిరిండియా) చేతిలో, ఉపేంద్ర 17-21, 14-21తో అన్సల్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడారు. బాలికలు: రుత్విక శివాని 21-6, 21-8తో హర్షిత చాలిహ (అస్సాం)పై, శ్రీకృష్ణప్రియా 21-8, 21-9 స్నేహన్ క్రిస్టియన్ (గుజరాత్)పై గెలువగా, వృశాలి 15-21, 17-21తో శ్రీయాన్షి పరదేశి (ఎయిరిండియా) చేతిలో ఓడింది. -
సెమీస్‌కు చేరిన రాహుల్
జింఖానా, న్యూస్‌లైన్: ఏపీ స్టేట్ జూనియర్ అండర్-17 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాడు రాహుల్ యాదవ్ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. చీరాలలో బుధవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో రాహుల్ 21-17, 21-11తో కృష్ణప్రసాద్ (తూర్పుగోదావరి)పై విజయం సాధించాడు. రంగారెడ్డికి చెందిన అనీత్ కుమార్, జీకే రెడ్డి కూడా సెమీస్‌కు అర్హత సాధించారు. అనీత్ కుమార్ 15-21, 21-17, 21-14తో సాగర్ (మెదక్)పై, జీకే రెడ్డి 21-18, 21-13తో ఆదిత్య బాపినీడు (ఖమ్మం)పై గెలుపొందారు. కినష్క్ (గుంటూరు) 21-16, 21-17తో చంద్రకుమార్ (తూర్పుగోదావరి)పై గెలిచాడు. బాలికల క్వార్టర్‌ఫైనల్స్‌లో హైదరాబాద్ క్రీడాకారిణి టాప్‌సీడ్ శ్రీకృష్ణప్రియ సెమీస్‌కు చేరుకుంది. శ్రీకృష్ణ ప్రియ 21-16, 21-15తో ప్రణవిపై నెగ్గింది. ఉత్తేజా రావు (విశాఖపట్నం) 21-16, 21-10తో వైష్ణవి (రంగారెడ్డి)పై, వృషాలిని (రంగారెడ్డి) 21-18, 21-19తో తనిష్క్ (గుంటూరు)పై, హాసిని (విశాఖపట్నం) 21-11, 21-18తో సిరి చందన (మెదక్)పై గెలుపొందారు. బాలుర డబుల్స్ క్వార్టర్‌ఫైనల్స్ రఘునాథ్ సాయి (గుంటూరు)-అనిత్‌కుమార్ (రంగారెడ్డి) జోడి 21-13, 21-14తో ఆదిత్య (ఖమ్మం)-జగదీశ్ (విశాఖపట్నం) జోడిపై, కృష్ణప్రసాద్-సాత్విక్ (తూర్పుగోదావరి)జోడి 21-13, 16-21, 21-18తో అఖిల్-నితిన్ (తూర్పుగోదావరి) జోడిపై, దత్తాత్రేయ-మనోహర్ రెడ్డి (కర్నూల్) జోడి 21-17, 18-21, 21-10తో ముత్తు-సాయి కుమార్ (నెల్లూరు) జోడిపై గెలుపొందాయి.