
వ్లాదివోస్టాక్ (రష్యా): బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్– 100 రష్యా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఐదు గురు భారత ఆటగాళ్లు రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో హైదరాబాద్ ప్లేయర్ రాహుల్ యాదవ్ 21–11, 21–10తో మకలోవ్ (రష్యా)ను ఓడించగా... జయరామ్ 21–14, 21–8తో జియోడాంగ్ షెంగ్ (కెనడా)పై, ప్రతుల్ జోషి 21–11, 21–8తో జెఫ్రీ లామ్ (కెనడా)పై, మిథున్ 21–14, 21–13తో ఇలియాస్ బ్రాకె (బెల్జియం)పై, సిద్ధార్థ్ 21–17, 21–16తో జియా వె తాన్ (మలేసియా)పై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment