తొలి రౌండ్‌లోనే సిరిల్, రాహుల్‌ ఓటమి | Malaysia Masters Grand Prix: Harsheel Dani, Pratul Joshi advance to Round 2 | Sakshi
Sakshi News home page

తొలి రౌండ్‌లోనే సిరిల్, రాహుల్‌ ఓటమి

Published Wed, Jan 18 2017 1:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

Malaysia Masters Grand Prix: Harsheel Dani, Pratul Joshi advance to Round 2

సారావక్‌ (మలేసియా): మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ఆటగాళ్లు సిరిల్‌ వర్మ, చిట్టబోయిన రాహుల్‌ యాదవ్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. భారత్‌కే చెందిన హర్షీల్‌ దాని, ప్రతుల్‌ జోషి, హేమంత్‌ గౌడ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో సిరిల్‌ వర్మ 10–21, 21–18, 17–21తో పనావత్‌ తోంగ్‌నువామ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, రాహుల్‌ యాదవ్‌ 16–21, 11–21తో సుయె సువాన్‌ యి (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు. హర్షీల్‌ 21–19, 21–17తో జి జియా లీ (మలేసియా)పై, ప్రతుల్‌ జోషి 15–21, 21–16, 24–22తో జిన్‌ రీ రియాన్‌ ఎన్జీ (సింగపూర్‌)పై, హేమంత్‌ 21–14, 21–15తో యెహిజకిల్‌ మైనాకి (ఇండోనేసియా)పై విజయం సాధించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement