
హీరో తిరువీర్, హీరోయిన్ కావ్య కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం 'మసూద'. రామ్ స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాహుల్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 18న విడుదల కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కాతో పాలు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
(చదవండి: విభిన్న కథాంశంగా 'మిస్టర్ మమ్మీ'.. ఆకట్టుకుంటున్న వీడియో సాంగ్)
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'రాహుల్ యాదవ్ ఇంతకు ముందు తీసిన రెండు సినిమాలకు నేను అభిమానిని. రాహుల్ అభిరుచిగల నిర్మాత. ఆ రెండు సినిమాల జర్నీ నాకు నచ్చి.. అప్పుడే రాహుల్‌కి మాటిచ్చా. ఆయన నిర్మించిన ‘మసూద’ చిత్రాన్ని మా ఎస్‌వీసి ద్వారా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమా టీజర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. టీజర్ చూడగానే రాహుల్‌కి ఫోన్ చేసి చెప్పాను. నవంబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది' అని అన్నారు.
చిత్ర నిర్మాత రాహూల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. 'ముందుగా దిల్ రాజుకు చాలా థ్యాంక్స్. మసూద విషయానికి వస్తే మూడేళ్ల కష్టమిది. మధ్యలో కొవిడ్ రావడంతో ఆలస్యమైంది. ఈ చిత్రం ద్వారా సాయికిరణ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా టీమ్ సభ్యులు మధ్యలో వేరే అవకాశాలు వచ్చినా వెళ్లకుండా.. అందరూ నిలబడ్డారు కాబట్టే మంచి సినిమా తీయగలిగా. నాకీ అవకాశం ఇచ్చిన రాజుగారికి థ్యాంక్స్. ఆయన నమ్మకం నిలబెట్టుకుంటాననే నమ్మకం నాకుంది. బుధవారం సాయంత్రం సోనీ మ్యూజిక్ ద్వారా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నాం. సినిమా నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది..' అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో తిరువీర్, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్, బాందవి శ్రీధర్, సంగీత దర్శకుడు ప్రశాంత్, సినిమాటోగ్రాఫర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
The Scare has a NEW DATE #MASOODA - Horror Drama, coming to theatres on Nov 18th!
— Vamsi Kaka (@vamsikaka) November 9, 2022
A @SVC_official (#DilRaju) Release!#MasoodaOnNov18th @RahulYadavNakka #SaiKiran @Swadharm_Ent @SonyMusicSouth @IamThiruveeR @KavyaKalyanram @sangithakrish @Bandhavisri @prashanthvihari pic.twitter.com/Pd6iTzX2km
Comments
Please login to add a commentAdd a comment