ఫైనల్లో రుత్విక, రాహుల్ యాదవ్ | finals in Rutvika Rahul Yadav | Sakshi
Sakshi News home page

ఫైనల్లో రుత్విక, రాహుల్ యాదవ్

Published Sun, Feb 28 2016 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

ఫైనల్లో రుత్విక, రాహుల్ యాదవ్

ఫైనల్లో రుత్విక, రాహుల్ యాదవ్

వల్సాడ్ (గుజరాత్): అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారులు గద్దె రుత్విక శివాని, రాహుల్ యాదవ్ టైటిల్ పోరుకు అర్హత సాధించారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రుత్విక శివాని 21-11, 21-19తో అరుంధతి పంతవానె (మహారాష్ట్ర)పై విజయం సాధించగా... పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రాహుల్ యాదవ్ 22-24, 21-16, 21-16తో టాప్ సీడ్ ఆదిత్య జోషి (ఎయిరిండియా)ను బోల్తా కొట్టించాడు. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో పీసీ తులసీ ( కేరళ)తో రుత్విక; శ్రేయాన్ష్ జైస్వాల్ (చత్తీస్‌గఢ్)తో రాహుల్ యాదవ్ తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement