Rutvika Shivani
-
ప్రిక్వార్టర్స్‌లో రుత్విక ఓటమి
సార్‌బ్రకెన్ (జర్మనీ): బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగమ్మారుు గద్దె రుత్విక శివాని పోరాటం ముగిసింది. ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రుత్విక 16-21, 13-21తో టాప్ సీడ్ హి బింగ్ జియావో (చైనా) చేతిలో ఓడింది. జోరుమీదున్న చైనా అమ్మారుు కేవలం 29 నిమిషాల్లోనే వరుస గేముల్లో రుత్వికను ఇంటిదారి పట్టించింది. పురుషుల సింగిల్స్‌లో వర్మ సోదరులు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 14వ సీడ్ జూ సంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్ సౌరభ్ వర్మ 9-16తో వెనుకంజలో ఉన్న దశలో చైనా ఆటగాడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సమీర్ వర్మ 21-10, 21-16తో ఈటు హెరుునో (ఫిన్లాండ్)పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్‌లో యోగేంద్రన్ కృష్ణన్ (మలేసియా)తో జతకట్టిన ప్రజక్తా సావంత్ 21-18, 21-17తో అండర్స్ రస్మ్సెన్- ఫ్రుయెర్గార్డ్ (డెన్మార్క్) జంటపై గెలిచింది. -
ప్రిక్వార్టర్స్‌లో రుత్విక శివాని
సార్‌బ్రకెన్ (జర్మనీ): బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు అమ్మారుు గద్దె రుత్విక శివాని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రుత్విక శివాని 21-11, 21-13తో సొరాయ డి విష్ ఇజ్బెర్గన్ (నెదర్లాండ్స)పై విజయం సాధించింది. కేవలం 27 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రుత్వికకు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో తన్వీ లాడ్ (భారత్) 14-21, 17-21తో గేల్ మహులెట్టి (నెదర్లాండ్స) చేతిలో ఓడిపోరుుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో వర్మ సోదరులు సౌరభ్, సమీర్ శుభారంభం చేశారు. తొలి రౌండ్లో సౌరభ్ 21-16, 21-11తో రుడిగెర్ జెనెడిట్ (ఆస్ట్రియా)పై, సమీర్ 21-11, 21-11తో అలెగ్జాండర్ రూవర్స్ (జర్మనీ)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ 17-21, 16-21తో మౌలానా ముస్తఫా (ఇండోనేసియా) చేతిలో, శుభాంకర్ డే (భారత్) 19-21, 18-21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. -
సెమీస్‌లో రుత్విక, సిరిల్
న్యూఢిల్లీ: రష్యా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన గద్దె రుత్విక శివాని, సిరిల్ వర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక శివాని 13-21, 21-10, 21-17తో ఎలీనా కొమెన్డ్రోవ్స్కా (రష్యా)ను ఓడించగా... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సిరిల్ వర్మ 21-12, 21-18తో జుల్హెల్మీ జుల్కిఫి (మలేసియా)పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి సిక్కిరెడ్డి తన భాగస్వామి ప్రణవ్ చోప్రాతో కలిసి సెమీస్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో సిక్కి-ప్రణవ్ ద్వయం 21-10, 21-8తో వాసిల్కిన్-క్రిస్టినా విర్విచ్ (రష్యా) జోడీపై గెలిచింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన తన్వీ లాడ్ 16-21, 19-21తో ఎవగెనియా కొసెట్‌స్కాయ (రష్యా) చేతి లో ఓడిపోయి0ది. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో అనతోలి యార్ట్‌సెవ్-ఎవగెనియా కొసెట్‌స్కాయ (రష్యా) జంటతో సిక్కి రెడ్డి-ప్రణవ్ జోడీ; సెనియా పొలికర్పోవా (రష్యా)తో రుత్విక శివాని; అనతోలి యార్ట్‌సెవ్ (రష్యా)తో సిరిల్ వర్మ తలపడతారు. -
ఫైనల్లో రుత్విక, రాహుల్ యాదవ్
వల్సాడ్ (గుజరాత్): అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు గద్దె రుత్విక శివాని, రాహుల్ యాదవ్ టైటిల్ పోరుకు అర్హత సాధించారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రుత్విక శివాని 21-11, 21-19తో అరుంధతి పంతవానె (మహారాష్ట్ర)పై విజయం సాధించగా... పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రాహుల్ యాదవ్ 22-24, 21-16, 21-16తో టాప్ సీడ్ ఆదిత్య జోషి (ఎయిరిండియా)ను బోల్తా కొట్టించాడు. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో పీసీ తులసీ ( కేరళ)తో రుత్విక; శ్రేయాన్ష్ జైస్వాల్ (చత్తీస్‌గఢ్)తో రాహుల్ యాదవ్ తలపడతారు. -
ఫైనల్లో రుత్విక శివాని
కొచ్చి: తన నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తూ హైదరాబాద్ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని... ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రుత్విక 21-7, 21-14తో రేష్మా కార్తీక్ (ఎయిరిండియా)పై గెలుపొందింది. మంగళవారం జరిగే ఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన రితూపర్ణ దాస్‌తో రుత్విక తలపడుతుంది. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ రితూపర్ణ 21-14, 19-21, 21-16తో తన్వీ లాడ్ (ఎయిరిండియా)పై విజయం సాధించింది. హైదరాబాద్‌కే చెందిన మరో అమ్మాయి శ్రీకృష్ణప్రియ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. శ్రీకృష్ణప్రియ 17-21, 21-16, 14-21తో రేష్మా కార్తీక్ చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్ విభాగంలో మేఘన-మనీషా (ఆంధ్రప్రదేశ్) జోడి ఫైనల్‌కు చేరింది. -
మూడో రౌండ్లో రుత్విక
అలోర్ సెటార్ (మలేసియా): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రుత్విక శివాని శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన రుత్విక... సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 21-9, 21-6తో కిట్ లెంగ్ వాంగ్ (మకావు)పై విజయం సాధించింది. మంగళవారం జరిగే మూడో రౌండ్లో నత్సుకి నిదైరా (జపాన్)తో రుత్విక తలపడుతుంది. భారత్‌కే చెందిన రేష్మా కార్తీక్ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. రేష్మా 12-21, 16-21తో బ్రిట్నీ టామ్ (కెనడా) చేతిలో ఓటమి పాలైంది. ఈ చాంపియన్‌షిప్‌లో పురుషుల, మహిళల విభాగాలలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న వారు ఈ ఏడాది ఆగస్టులో 16 నుంచి 28 వరకు చైనాలో జరిగే యూత్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తారు. -
రుత్వికా శివాని ముందంజ
జింఖానా, న్యూస్‌లైన్: ఏపీ స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్ రుత్వికా శివాని మూడో రౌండ్లోకి ప్రవేశించింది. విజయవాడలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రుత్విక 21-1, 21-4తో అనూష (ప్రకాశం)పై విజయం సాధించింది. హైదరాబాదీ క్రీడాకారిణిలు నాలుగో సీడ్ శ్రీకృష్ణప్రియ, పూజ తమ సత్తా చాటారు. కృష్ణప్రియ 21-7, 21-12తో అర్చన (రంగారెడ్డి)పై, పూజ 25-23, 14-21, 21-11తో ఐదో సీడ్ పూర్ణిమపై గెలుపొందారు. వీరితో పాటు పురుషుల సింగిల్స్ విభాగం మొదటి రౌండ్లో అర్జున్ రెడ్డి 21-18, 11-21, 21-14తో గంగాధర రావు(కాకినాడ)ను, వినాయక్ 21-19, 21-11తో అనీత్ కుమార్ (రంగారెడ్డి)ను ఓడించి రెండో రౌండ్లోకి చేరుకున్నారు. ఇతర ఫలితాలు పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్ ఫలితాలు: లోకేష్ (విశాఖపట్నం) 21-18, 21-13తో రవితేజ (వరంగల్)పై; కిర ణ్ కుమార్ (రంగారెడ్డి) 21-16, 21-18తో మోహన్ సుబ్రమణ్యం (వరంగల్)పై; కనిష్క్ (గుంటూరు) 21-15, 21-10తో చంద్రమౌలి (అనంతపురం)పై; అఖిలేష్ (ఆదిలాబాద్) 21-16, 21-10తో ప్రసాద్ (వరంగల్)పై; సంతోష్ (రంగారెడ్డి) 21-17, 22-20తో రామకృష్ణ (శ్రీకాకుళం)పై; అవినాష్ ( తూర్పు గోదావరి) 21-13, 21-18తో శశిభూషణరావు (చిత్తూరు)పై; రఘునాథ్ (ఆదిలాబాద్) 16-21, 27-25, 21-9తో శ్రీ దత్తాత్రేయ రెడ్డి (కడప)పై, వసీం అక్రమ్ (నెల్లూరు) 21-7, 21-15తో ప్రకాష్ నారాయణ (నల్గొండ)పై; కిషోర్ కుమార్ (కడప) 12-21, 21-12, 21-17తో మనోజ్ (చిత్తూరు)పై; ప్రశాంత్ రెడ్డి (మెదక్) 21-7, 21-10తో గోవిందరావు (విజయనగరం)పై; ప్రవీణ్ (వరంగల్) 21-13, 21-13తో సిరాజ్ (అనంతపురం)పై; అరుణ్ కుమార్ (వరంగల్) 21-9, 21-11తో సందీప్ (వరంగల్)పై; వినోద్ (తూర్పు గోదావరి) 21-13, 21-8తో చైతన్య కృష్ణ (చిత్తూరు)పై; ఉపేంద్ర (కర్నూలు) 21-11, 21-17తో నరేందర్ (ఆదిలాబాద్)పై; చైతన్య (కాకినాడ) 21-12, 21-18తో ఖాజా ఫాజిల్ అహ్మద్ (నల్గొండ)పై; ప్రదీప్ కుమార్ (కర్నూలు) 17-21, 22-20, 21-10తో ఆదిత్య బాపినీడు (ఖమ్మం)పై గెలిచారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ ఫలితాలు: దివ్య (తూర్పు గోదావరి) 21-7, 21-7తో అనూష (చిత్తూరు)పై; ఏడో సీడ్ సిరి చందన (మెదక్) 21-10, 21-6తో జాహ్నవి (తూర్పు గోదావరి)పై; మేధాన్విత రెడ్డి (విశాఖపట్నం) 21-23, 21-15, 21-19తో మమిత (రంగారెడ్డి)పై; శ్యామ్ భాను (ఖమ్మం) 12-21, 22-20, 21-17తో లక్ష్మి (వరంగల్)పై; ప్రణవి రెడ్డి ( కరీంనగర్) 21-18, 21-15తో ఎనిమిదో సీడ్ ఉత్తేజ్రావు (విశాఖపట్నం)పై; లావణ్య (కాకినాడ) 20-22, 21-17, 21-9తో శ్రావణి (తూర్పు గోదావరి)పై; వైష్ణవి (రంగారెడ్డి) 21-8, 21-8తో నవ్యారావు (తూర్పుగోదావరి)పై; పూజ (చిత్తూరు) 21-5, 21-6తో ప్రఖ్యాతి (మెదక్)పై; సోనికా సాయి (కాకినాడ) 21-3, 21-6తో సాయి శ్రీ (వరంగల్)పై నెగ్గారు.