ప్రిక్వార్టర్స్‌లో రుత్విక శివాని | Shivani rutvika in the pre-quarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో రుత్విక శివాని

Published Wed, Nov 2 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

ప్రిక్వార్టర్స్‌లో రుత్విక శివాని

ప్రిక్వార్టర్స్‌లో రుత్విక శివాని

సార్‌బ్రకెన్ (జర్మనీ): బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మారుు గద్దె రుత్విక శివాని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో రుత్విక శివాని 21-11, 21-13తో సొరాయ డి విష్ ఇజ్‌బెర్గన్ (నెదర్లాండ్‌‌స)పై విజయం సాధించింది. కేవలం 27 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రుత్వికకు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో తన్వీ లాడ్ (భారత్) 14-21, 17-21తో గేల్ మహులెట్టి (నెదర్లాండ్‌‌స) చేతిలో ఓడిపోరుుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో వర్మ సోదరులు సౌరభ్, సమీర్ శుభారంభం చేశారు.

తొలి రౌండ్‌లో సౌరభ్ 21-16, 21-11తో రుడిగెర్ జెనెడిట్ (ఆస్ట్రియా)పై, సమీర్ 21-11, 21-11తో అలెగ్జాండర్ రూవర్స్ (జర్మనీ)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ 17-21, 16-21తో మౌలానా ముస్తఫా (ఇండోనేసియా) చేతిలో, శుభాంకర్ డే (భారత్) 19-21, 18-21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement