వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని కొందరు అంటారు. వయసు ఎక్కువైతే ఆట ఆడొద్దని ఎవరు అనరు. ఎందుకంటే ఎలాంటి ఆటైనా సరే వయసుతో సంబంధం ఉండదు(క్రికెట్, ఫుట్‌బాల్ లాంటివి మినహాయిస్తే). 99 ఏళ్ల వయసులోనూ కొందరు తాతలు, బామ్మలు పతకాలు సాధిస్తూ చరిత్ర సృష్టించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ 2022లో ఒక అద్భుతం చోటుచేసుకుంది.
ఇజ్రాయెల్‌కు చెందిన 64 ఏళ్ల మహిళా ప్లేయర్ స్వెత్లానా బీడబ్ల్యూఎఫ్ చాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో బీడబ్ల్యూఎఫ్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో విజయం సాధించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా స్వెత్లానా చరిత్ర సృష్టించింది. ఇంతకీ ఆమె జత కట్టింది ఎవరితో తెలుసా.. తన కన్నకొడుకు మిషా జిల్బర్‌మన్. అవునండీ స్వెత్లానా, మిషా జిల్బర్‌మన్‌లు తల్లి కొడుకు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మంగళవారం మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తొలి రౌండ్ మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా- మిషా జిల్బర్‌మన్ ద్వయం.. ఈజిప్ట్‌కు చెందిన దోహా హని-ఆడమ్ హాటెమ్ ఎల్గమల్ జోడిపై 16-21, 21-1, 21-11తో విజయం సాధించి ప్రి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మ్యాచ్‌లో తొలి సెట్‌ను తల్లి కొడుకు పోగొట్టుకున్నప్పటికి.. మిగిలిన రెండు సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించి సంచలన విజయం సాధించారు.
ఇక 64 ఏళ్ల స్వెత్లానా.. ఆమె కొడుకు మిషా జిల్బర్‌మన్‌ను బీడబ్ల్యూఎఫ్ నిర్వాహకులు అభినందనల్లో ముంచెత్తారు. ''64 ఏళ్ల వయసులో స్వెత్లానా బీడబ్ల్యూఎఫ్‌లో మరో విజయాన్ని సాధించింది. 2009లో ఆమె బీడబ్ల్యూఎఫ్‌లో తొలి మ్యాచ్ ఆడింది.ఈ విజయం మాకు గర్వకారణం'' అంటూ ట్వీట్ చేసింది.
ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా జిల్బర్‌మన్ 1986లో యూరోపియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఇజ్రాయెల్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో 17 సార్లు సింగిల్స్ విజేతగా.. మరో 21సార్లు మిక్స్‌డ్ డబుల్స్‌లో విజయాలు సాధించింది.
#MondayMotivation
— BWF (@bwfmedia) August 22, 2022
At 6⃣4⃣ years old, Svetlana Zilberman 🇮🇱 has won her first #BWFWorldChampionships opening round match. 👏👏
She made her competition debut in 2⃣0⃣0⃣9⃣. 😮#Tokyo2022
📸 @badmintonphoto https://t.co/Ne3CgUTS9o pic.twitter.com/4odEEV3o5m
చదవండి: BWF Championship 2022: అదరగొట్టిన సైనా నెహ్వాల్.. నేరుగా మూడో రౌండ్‌కు
Comments
Please login to add a commentAdd a comment