BWF World Badmintonship 2022
-
BWF Championships: ఫైనల్లో ఓడినా.. శంకర్ ముత్తుస్వామి అరుదైన రికార్డు
సాంటెండర్ (స్పెయిన్): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ అండర్ –19 పురుషుల సింగిల్స్ విభాగంలో భారత టీనేజర్ శంకర్ ముత్తుస్వామి రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నైకు చెందిన 18 ఏళ్ల శంకర్ 14–21, 20–22తో కువాన్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 30 ఏళ్ల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో రజత పతకం నెగ్గిన నాలుగో భారతీయ ప్లేయర్‌గా శంకర్ నిలిచాడు. గతంలో జూనియర్ మహిళల సింగిల్స్‌లో అపర్ణ పోపట్ (1996లో), సైనా (2006లో)... జూనియర్ పురుషుల సింగిల్స్‌లో సిరిల్ వర్మ (2015) ఫైనల్లో ఓడి రజతం సాధించారు. 2006లో రన్నరప్‌గా నిలిచిన సైనా 2008లో విజేతగా నిలువగా... గురుసాయిదత్ (2008లో), సాయిప్రణీత్, ప్రణయ్ (2010లో), సమీర్ వర్మ (2011లో), లక్ష్య సేన్ (2018లో) సెమీఫైనల్లో ఓడి కాంస్యాలు గెలిచారు. చదవండి: Special Story: ఉరికే జలపాతం.. ఉత్తుంగ తరంగం.. సెరీనా విలియమ్స్ -
కాంస్యం నెగ్గిన సాత్విక్-చిరాగ్ శెట్టి.. అయినా చరిత్రే
అంచనాలకు మించి రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. శనివారం(ఆగస్టు 27న) జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి జంట.. మలేషియాకు చెందిన ఆరోన్ చియా-వూయి యిక్ సోహ్లతో 22-20, 18-21, 16-21తో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్‌ను 22-20తో గెలిచిన సాత్విక్- చిరాగ్.. అదే టెంపోనూ తర్వాతి గేమ్స్‌లో కొనసాగించలేకపోయారు. తొలి గేమ్ ఓడినప్పటికి వరల్డ్ నెంబర్-7 అయిన మలేషియా జంట ఫుంజుకొని భారత ద్వయానికి మరో అవకాశం ఇవ్వకుండా వరుస గేముల్లో ఓడించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఇటీవలి కాలంలో సాత్విక్-చిరాగ్ జంట బ్యాడ్మింటన్‌లో అద్భుతాలు చేస్తున్నారు. ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు.. ఆ తర్వాత ఇండియా ఓపెన్, థామస్ కప్, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన సాత్విక్- చిరాగ్ శెట్టి జోడి కొత్త చరిత్ర లిఖించింది. BWF World Championships 2022 Men's Doubles - Semi Finals Aaron Chia/Soh Wooi Yik 🇲🇾 vs Satwiksairaj Rankireddy/Chirag Shetty 🇮🇳 20-22, 21-18, 21-16 Alhamdulillah they finally break the SF curse! 🤧 Huge congrats for advancing to the FINAL ChiaSoh 👏👏 #BWC2022 pic.twitter.com/uCWsJtBo3p — レディディラ (@ladydyla__) August 27, 2022 చదవండి: Rafael Nadal-Serena Williams: అద్భుత దృశ్యం.. దిగ్గజాలు ఎదురుపడిన వేళ సాత్విక్–చిరాగ్ ‘డబుల్స్’ ధమాకా -
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భారత్ సరికొత్త చరిత్ర
-
BWF World Championships: చిరాగ్- సాత్విక్ జోడీ సంచలన విజయం.. సరికొత్త చరిత్ర
Chirag Shetty and Satwiksairaj Rankireddy: భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం ఖరారు చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ జంటగా నిలిచింది. టోక్యో వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో జపాన్ బ్యాడ్మింటన్ జోడీతో తలపడి ఈ రికార్డు సాధించింది. కాగా బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్-2022లో భాగంగా చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి ద్వయం.. రెండో సీడ్ టకురో హోకి- యుగో కొబయాషి(జపాన్)తో క్వార్టర్ ఫైనల్లో తలపడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్ తొలి గేమ్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురైనా భారత జోడీ 24-22తో పైచేయి సాధించింది. అయితే, రెండో గేమ్‌లో మాత్రం జపాన్ షట్లర్ల ద్వయం.. చిరాగ్- సాత్విక్‌లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. 21-15తో ఓడించింది. తిరిగి పుంజుకున్న భారత జంట 21-14తో టకురో హోకి- యుగో కొబయాషిలను మట్టికరిపించి విజయం సాధించింది. తద్వారా సెమీస్ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. ఇక చిరాగ్- సాత్విక్ జోడీ కామన్వెల్త్ గేమ్స్-2022లో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: Virat Kohli: ధోనితో ఉన్న ఫొటో షేర్ చేసి కోహ్లి భావోద్వేగం! రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అంటూ.. ఫ్యాన్స్ ఆందోళన! ✅ First 🇮🇳 MD pair to secure a #BWFWorldChampionships medal ✅ Only 2nd #WorldChampionships medal from 🇮🇳 doubles pair ✅ 13th medal for 🇮🇳 at World's@satwiksairaj & @Shettychirag04 script history yet again 😍#BWFWorldChampionships2022#BWC2022#Tokyo2022#IndiaontheRise pic.twitter.com/POW0uYt7KC — BAI Media (@BAI_Media) August 26, 2022 -
Badminton World Championships 2022: సైనా ఓటమి.. టోర్నీ నుంచి అవుట్
Badminton World Championships: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్-2022లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రయాణం ముగిసింది. టోక్యో వేదికగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ మాజీ చాంపియన్ ఓటమి పాలైంది. థాయ్‌లాండ్‌కు చెందిన షట్లర్ బుసానన్ ఒంగ్బామ్రంగ్‌ఫాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. గంటా నాలుగు నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ మ్యాచ్‌లో బుసానన్ ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. దీంతో మొదటి గేమ్‌ను సైనా 17-21తో కోల్పోయింది. అయితే, రెండో గేమ్‌లో పుంజుకున్న ఈ లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత 21-16తో ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ క్రమంలో మూడో గేమ్‌లో తిరిగి ఆధిక్యంలోకి వచ్చిన బుసానన్ 21-13తో సైనాను ఓడించింది. తద్వారా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మరోవైపు.. సైనా ఇంటిబాట పట్టింది. ఇక అంతకుముందు మ్యాచ్‌లో సైనా.. హాంకాంగ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చెయుంగ్ న్గన్ యిను 21-19, 21-9తో ఓడించి ప్రిక్వార్టర్స్ వరకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. పురుషుల డబుల్స్‌లో అన్‌సీడెడ్ భారత ప్లేయర్లు ధ్రువ్ కపిల- ఎం.ఆర్ అర్జున్ తొలిసారిగా క్వార్టర్స్‌కు చేరుకున్నారు. అదే విధంగా చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. NZ vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన కివీస్! స్టార్ బౌలర్ వచ్చేశాడు! Despite her best efforts @NSaina falls short against WR-12 🇹🇭's Busanan Ongbamrungphan and ends her #BWFWorldChampionships2022 campaign in R16 💔 Well fought champ 🙌#BWFWorldChampionships#BWC2022#Tokyo2022#Badminton pic.twitter.com/gr04fcsgrQ — BAI Media (@BAI_Media) August 25, 2022 -
క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టిన చిరాగ్ శెట్టి-సాత్విక్ జోడి
చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి జోడి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. టోక్యో వేదికగా జరిగిన ప్రిక్వార్టర్స్‌లో డానిష్ జంట జెప్పీ బే, లాస్సే మోల్హెడేను 21-12, 21-10 తేడాతో ఈ భారత స్టార్ జోడీ ఓడించింది. అంతకుముందు సాత్విక్ ,చిరాగ్ జంట గ్వాటెమాలన్ జంటను ఓడించి ప్రీ-క్వార్టర్ఫైనల్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక జపాన్ ద్వయం టకురో హోకి, యుగో కొబయాషితో క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ ,చిరాగ్ తలపడనుంది. మరోవైపు భారత షట్లర్లు ధ్రువ్ కపిల- ఎం.ఆర్ అర్జున్ తొలి సారి బీడబ్ల్యూఎఫ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన ప్రీ-క్వార్టర్ఫైనల్లో హీ యోంగ్ కాయ్ టెరీ–లో కీన్ హీన్ జంటను ఓడించి ఈ ద్వయం క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. చదవండి: BWF World Badmintonship 2022: చరిత్ర సృష్టించిన ధ్రువ్- అర్జున్ జోడీ.. తొలిసారిగా.. -
BWF World Badmintonship: చరిత్ర సృష్టించిన ధ్రువ్- అర్జున్ జోడీ.. తొలిసారిగా
MR Arjun- Dhruv Kapila: భారత షట్లర్లు ధ్రువ్ కపిల- ఎం.ఆర్ అర్జున్ అద్బుతం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. టోక్యో వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్-2022లో భాగంగా ఈ ద్వయం గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సింగపూర్ జోడీతో తలపడింది. ఈ మ్యాచ్‌లో హీ యోంగ్ కాయ్ టెరీ–లో కీన్ హీన్ జంటను ఓడించింది. మొదటి గేమ్‌లో (18-21) కాస్త వెనుకబడినా.. వరుసగా రెండు గేమ్‌లలో 21-15, 21-16తో సత్తా చాటి విజయం అందుకుంది. తద్వారా ధ్రువ్ కపిల- ఎం. ఆర్ అర్జున్ జంట క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక అంతకు ముందు రెండో రౌండ్లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్(అన్‌సీడెడ్) ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ కిమ్ ఆస్ట్రప్–ఆండెర్స్ రస్ముసెన్ (డెన్మార్క్)పై గెలుపొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 21–17, 21–16తో విజయం నమోదు చేసి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. క్వార్టర్ ఫైనల్లో ధ్రువ్- అర్జున్.. మూడో సీడ్ ఇండోనేషియా ద్వయం మహ్మద్ అహ్సాన్, హెండ్రా సెటీవాన్తో తలపడనున్నారు. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్ కీలక నిర్ణయం! Asia Cup 2022 Ind Vs Pak: బాబర్ ఆజంను పలకరించిన కోహ్లి.. వీడియో వైరల్! రషీద్‌తోనూ ముచ్చట! Big task ahead for @arjunmr & @dhruvkapilaa in their maiden #BWFWorldChampionships quarterfinals and they are up for it 👊🔥#BWFWorldChampionships2022#BWC2022#Tokyo2022#IndiaontheRise#Badminton pic.twitter.com/idvcF3rX2V — BAI Media (@BAI_Media) August 25, 2022 -
బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర.. కొడుకుతో కలిసి తల్లి ప్రపంచ రికార్డు
వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని కొందరు అంటారు. వయసు ఎక్కువైతే ఆట ఆడొద్దని ఎవరు అనరు. ఎందుకంటే ఎలాంటి ఆటైనా సరే వయసుతో సంబంధం ఉండదు(క్రికెట్, ఫుట్‌బాల్ లాంటివి మినహాయిస్తే). 99 ఏళ్ల వయసులోనూ కొందరు తాతలు, బామ్మలు పతకాలు సాధిస్తూ చరిత్ర సృష్టించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ 2022లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన 64 ఏళ్ల మహిళా ప్లేయర్ స్వెత్లానా బీడబ్ల్యూఎఫ్ చాంపియన్‌షిప్‌లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో బీడబ్ల్యూఎఫ్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో విజయం సాధించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా స్వెత్లానా చరిత్ర సృష్టించింది. ఇంతకీ ఆమె జత కట్టింది ఎవరితో తెలుసా.. తన కన్నకొడుకు మిషా జిల్బర్మన్. అవునండీ స్వెత్లానా, మిషా జిల్బర్మన్లు తల్లి కొడుకు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మంగళవారం మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలి రౌండ్ మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా- మిషా జిల్బర్మన్ ద్వయం.. ఈజిప్ట్‌కు చెందిన దోహా హని-ఆడమ్ హాటెమ్ ఎల్గమల్ జోడిపై 16-21, 21-1, 21-11తో విజయం సాధించి ప్రి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మ్యాచ్‌లో తొలి సెట్‌ను తల్లి కొడుకు పోగొట్టుకున్నప్పటికి.. మిగిలిన రెండు సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించి సంచలన విజయం సాధించారు. ఇక 64 ఏళ్ల స్వెత్లానా.. ఆమె కొడుకు మిషా జిల్బర్మన్ను బీడబ్ల్యూఎఫ్ నిర్వాహకులు అభినందనల్లో ముంచెత్తారు. ''64 ఏళ్ల వయసులో స్వెత్లానా బీడబ్ల్యూఎఫ్‌లో మరో విజయాన్ని సాధించింది. 2009లో ఆమె బీడబ్ల్యూఎఫ్‌లో తొలి మ్యాచ్ ఆడింది.ఈ విజయం మాకు గర్వకారణం'' అంటూ ట్వీట్ చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా జిల్బర్మన్ 1986లో యూరోపియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఇజ్రాయెల్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో 17 సార్లు సింగిల్స్ విజేతగా.. మరో 21సార్లు మిక్స్డ్ డబుల్స్‌లో విజయాలు సాధించింది. #MondayMotivation At 6⃣4⃣ years old, Svetlana Zilberman 🇮🇱 has won her first #BWFWorldChampionships opening round match. 👏👏 She made her competition debut in 2⃣0⃣0⃣9⃣. 😮#Tokyo2022 📸 @badmintonphoto https://t.co/Ne3CgUTS9o pic.twitter.com/4odEEV3o5m — BWF (@bwfmedia) August 22, 2022 చదవండి: BWF Championship 2022: అదరగొట్టిన సైనా నెహ్వాల్.. నేరుగా మూడో రౌండ్‌కు -
BWF Championship 2022: అదరగొట్టిన సైనా నెహ్వాల్.. నేరుగా మూడో రౌండ్‌కు
టోక్యో: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మాజీ చాంపియన్.. హైదరాబాదీ సైనా నెహ్వాల్ అదరగొట్టింది. మంగళవారం ఉదయం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన చెయుంగ్ న్గన్ యిపై 21-19, 21-9తో ఓడించింది. కాగా మ్యాచ్ ఫలితం 38 నిమిషాల్లోనే పూర్తయింది. కాగా రెండో రౌండ్లో జపాన్‌కు చెందిన ఆరవ సీడ్ నవోమి ఒకుహరాతో తలపడాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఒకుహరా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో సైనాకు థర్డ్ రౌండ్‌కు బై లభించింది. దీంతో మూడో రౌండ్లో సైనా నెహ్వాల్.. థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్, జర్మనీకి చెందిన వైవోన్ లీ మధ్య విజేతతో తలపడనుంది. శ్రీకాంత్, లక్ష్యసేన్ ముందంజ ఇక తొలి రోజు భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లలో విజయాలు సాధించి ముందంజ వేయగా, మరో భారత ఆటగాడు బి.సాయిప్రణీత్ పోరు మొదటి మ్యాచ్‌లోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌లో కూడా మాళవిక బన్సోద్ తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన సాయిప్రణీత్ 64 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో నాలుగో సీడ్ చౌ టీన్ చెన్ (చైనీస్ తైపీ) ముందు తలవంచాడు. చెన్ 21–15, 15–21, 21–15 స్కోరుతో సాయిప్రణీత్‌ను ఓడించాడు. 51 నిమిషాల పాటు ఆసక్తికరంగా సాగిన మరో పోరులో 12వ సీడ్ శ్రీకాంత్ 22–20, 21–19 తేడాతో ఎన్‌హట్ గుయెన్ (ఐర్లాండ్)పై విజయం సాధించాడు. 9వ సీడ్ లక్ష్య సేన్ 21–12, 21–11తో క్రిస్టియాన్ సోల్బర్గ్ (డెన్మార్క్)ను చిత్తు చేయగా, ప్రణయ్ 21–12, 21–11 స్కోరుతో ల్యూకా రాబర్ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 14–21, 12–21తో లైన్ క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమిపాలైంది. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి– అశ్విని పొన్నప్పతో పాటు పూజ దండు–సంజనా సంతోష్ జోడి కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్లో సిక్కి–అశ్విని 21–7, 21–19తో అమీనత్ నబీహా – ఫాతిమా నబాహా (మాల్దీవులు)ను చిత్తుగా ఓడించారు. పూజ–సంజన 21–6, 10–21, 21–14తో లూసియా సలాజర్–పౌలా రీగల్ (పెరూ)పై గెలుపొందారు. పురుషుల డబుల్స్‌లో భారత జంట ఎంఆర్ అర్జున్–ధ్రువ్ కపిల జోడి 21–17, 17–21, 22–20తో సుపాక్ జోమ్కో– కిటునుపాంగ్ (థాయిలాండ్)ను ఓడించి ముందంజ వేయగా, మను అత్రి–సుమీత్ రెడ్డి ద్వయానికి నిరాశ ఎదురైంది. మను–సుమీత్ 11–21, 21–19, 15–21తో హిరోకి ఒకమురా–మసాయుకి ఒనొడెరా (జపాన్) చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు చెందిన ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో 21–12, 21–13తో ప్యాట్రిక్ షీల్–ఫ్రాన్సిస్కా వోక్మన్ (జర్మనీ)పై గెలుపొంది రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. -
BWF World Championships 2022: షటిల్ సమరం...
థామస్ కప్‌లో చారిత్రక విజయం... కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాల పంట... ఈ రెండు గొప్ప ప్రదర్శనల తర్వాత భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో ప్రతిష్టాత్మక పోరుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి జపాన్ రాజధాని టోక్యోలో మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాలలో కలిపి మొత్తం 26 మంది భారత క్రీడాకారులు సత్తా చాటుకునేందుకు సై అంటున్నారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధికంగా ఐదు పతకాలు గెలిచిన భారతీయ ప్లేయర్‌గా ఘనత వహించిన స్టార్ షట్లర్ పీవీ సింధు గాయం కారణంగా తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడం లేదు. 2011 నుంచి జరిగిన ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కనీసం ఒక్క పతకమైనా లభిస్తోంది. టోక్యో: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై గత పదిహేనేళ్లుగా నిలకడగా రాణిస్తూ... ‘బ్యాడ్మింటన్ పవర్‌హౌస్’గా భావించే చైనా, ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, కొరియా, జపాన్ దేశాలకు దీటుగా ఎదిగిన భారత క్రీడాకారులు మరో సమరానికి సిద్ధమయ్యారు. తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న జపాన్ గడ్డపై భారత ఆటగాళ్లు పతకాలు సాధించాలని పట్టుదలతో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు మినహా మిగతా అగ్రశ్రేణి క్రీడాకారులు భారత్ తరఫున బరిలో ఉన్నారు. గత ఏడాది స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ రజతం, లక్ష్య సేన్ కాంస్యం సాధించి సంచలనం సృష్టించగా... కేరళ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సాయిప్రణీత్‌తోపాటు ఈసారి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్‌లపై భారత్ ఆశలు పెట్టుకుంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో 20వ ర్యాంకర్ సాయిప్రణీత్... 39వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో 13వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్... 19వ ర్యాంకర్ విటింగస్ (డెన్మార్క్)తో 10వ ర్యాంకర్ లక్ష్య సేన్... 94వ ర్యాంకర్ లుకా వ్రాబెర్ (ఆస్ట్రియా)తో 18వ ర్యాంకర్ ప్రణయ్ తలపడనున్నారు. సాయిప్రణీత్ ‘డ్రా’ పై భాగంలో... శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ ముగ్గురూ ‘డ్రా’ కింది భాగంలో ఉన్నారు. దాంతో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్‌లలో ఒక్కరు మాత్రమే సెమీఫైనల్ చేరుకోగలరు. ఈ ముగ్గురికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. పతకాలు సాధించాలంటే వీరందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి లక్ష్య సేన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. చౌ తియెన్ చెన్‌తో ఆడిన నాలుగుసార్లూ సాయిప్రణీత్ ఓడిపోవడం... కొన్నాళ్లుగా ఫామ్‌లో లేకపోవడంతో సాయిప్రణీత్ తొలి రౌండ్ అడ్డంకి దాటడం అనుమానమే. డిఫెండింగ్ చాంపియన్ లో కీన్ యు (సింగపూర్), మాజీ చాంపియన్స్ కెంటో మొమోటా (జపాన్), అక్సెల్సన్ (డెన్మార్క్), జిన్‌టింగ్ (ఇండోనేసియా), లీ జి జియా (మలేసియా) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. సైనా మెరిసేనా... మహిళల సింగిల్స్‌లో ఈసారి భారత్ నుంచి ఇద్దరే బరిలో ఉన్నారు. గాయం కారణంగా పీవీ సింధు వైదొలగగా... సైనా నెహ్వాల్, మాళవిక బన్సోద్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. నేడు జరిగే తొలి రౌండ్లో లినె క్రిస్టోఫెర్సన్ (డెన్మార్క్)తో మాళివిక... మంగళవారం జరిగే తొలి రౌండ్లో చెయుంగ్ ఎన్గాన్ యి (వియత్నాం)తో సైనా ఆడతారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 12వసారి ఆడుతున్న సైనా 2015లో రజతం, 2017లో కాంస్యం గెలిచింది. అయితే ఈ ఏడాది సైనా గొప్ప ఫామ్‌లో లేదు. ఈ సీజన్లో ఆమె తొమ్మిది టోర్నీలలో ఆడితే ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ అకానె యామగుచి (జపాన్), రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), మూడుసార్లు చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), ఆన్ సె యంగ్ (కొరియా), చెన్ యు ఫె, హి బింగ్ జియావో (చైనా) టైటిల్ ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. ఆ ఇద్దరిపైనే... పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం రాలేదు. అంతా సవ్యంగా సాగితే ఈసారి సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం ఆ లోటు తీర్చే అవకాశముంది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన సాత్విక్–చిరాగ్ జోడీకి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. ఇక మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు అంతగా పతకావకాశాలు లేవు. భారత ఆటగాళ్ల వివరాలు పురుషుల సింగిల్స్: లక్ష్య సేన్, శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్. మహిళల సింగిల్స్: సైనా నెహ్వాల్, మాళవిక. పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి–మనూ అత్రి, అర్జున్–ధ్రువ్ కపిల, కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్. మహిళల డబుల్స్: సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప, దండు పూజ–సంజన, పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, అశ్విని భట్–శిఖా. మిక్స్డ్ డబుల్స్: ఇషాన్–తనీషా క్రాస్టో, వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్. మన పతక విజేతలు.. 1983: ప్రకాశ్ పడుకోన్ (పురుషుల సింగిల్స్‌లో కాంస్యం); 2011: గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప (మహిళల డబుల్స్‌లో కాంస్యం); 2013: సింధు (మహిళల సింగిల్స్‌లో కాంస్యం); 2014: సింధు (మహిళల సింగిల్స్‌లో కాంస్యం); 2015: సైనా (మహిళల సింగిల్స్‌లో రజతం); 2017: సింధు (మహిళల సింగిల్స్‌లో రజతం); 2017: సైనా (మహిళల సింగిల్స్‌లో కాంస్యం); 2018: సింధు (మహిళల సింగిల్స్‌లో రజతం); 2019: సింధు (మహిళల సింగిల్స్‌లో స్వర్ణం); 2019: సాయిప్రణీత్ (పురుషుల సింగిల్స్‌లో కాంస్యం); 2021: శ్రీకాంత్ (పురుషుల సింగిల్స్‌లో రజతం); 2021: లక్ష్య సేన్ (పురుషుల సింగిల్స్‌లో కాంస్యం). -
BWF World Championship: భారత్‌కు భారీ షాక్.. పీవీ సింధు దూరం!
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2022కు భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఒలింపిక్ మెడలిస్ట్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చీలమండ గాయం కారణంగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు దూరమైంది. ఈ విషయాన్ని సింధూ తండ్రి పివి రమణ దృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్పోర్ట్స్ స్టార్‌తో మాట్లాడుతూ.. "సింధూ కామన్వెల్త్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో గాయపడింది. ఆమె తీవ్రమైన నొప్పితోనే స్వర్ణం పతకం సాధించింది. ఈ క్రమంలో సింధూ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు దూరం కానుంది. ఆమె గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరిగే పారిస్, డెన్మార్క్ ఓపెన్‌పై సింధు దృష్టంతా ఉంది" అని పేర్కొన్నాడు. కాగా బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు స్వర్ణ పతకం గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఫైనల్లో గాయంతోనే ఆడినట్లు మ్యాచ్ అనంతరం సింధు కూడా వెల్లడించింది. ఇక బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఆగస్టు 21 నుంచి ఆగస్టు 28 వరకు జరగనుంది. కాగా ఇప్పటి వరకు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సింధు 5 పతకాలు సొంతం చేసుకుంది. 2019 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది. అదే విధంగా ఆమె ఖాతాలో రెండు సిల్వర్ మెడల్స్, రెండు కాంస్య పతకాలు కూడా ఉన్నాయి. చదవండి: CWG 2022- Narendra Modi: స్వర్ణ యుగం మొదలైంది.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: ప్రధాని మోదీ