కాంస్యం నెగ్గిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి.. అయినా చరిత్రే | BWF 2022: Satwiksairaj Rankireddy-Chirag Shetty Clinch Bronze Medal | Sakshi
Sakshi News home page

BWF Championship 2022: కాంస్యం నెగ్గిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి.. అయినా చరిత్రే

Published Sat, Aug 27 2022 10:53 AM | Last Updated on Sat, Aug 27 2022 10:59 AM

BWF 2022: Satwiksairaj Rankireddy-Chirag Shetty Clinch Bronze Medal - Sakshi

Photo Credit: AP

అంచనాలకు మించి రాణిస్తున్న సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంట ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. శనివారం(ఆగస్టు 27న) జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జంట.. మలేషియాకు చెందిన ఆరోన్ చియా-వూయి యిక్ సోహ్లతో 22-20, 18-21, 16-21తో ఓటమి పాలయ్యారు.

తొలి గేమ్‌ను 22-20తో గెలిచిన సాత్విక్‌- చిరాగ్‌.. అదే టెంపోనూ తర్వాతి గేమ్స్‌లో కొనసాగించలేకపోయారు. తొలి గేమ్‌ ఓడినప్పటికి వరల్డ్‌ నెంబర్‌-7 అయిన మలేషియా జంట ఫుంజుకొని భారత ద్వయానికి మరో అవకాశం ఇవ్వకుండా వరుస గేముల్లో ఓడించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఇటీవలి కాలంలో సాత్విక్‌-చిరాగ్‌ జంట బ్యాడ్మింటన్‌లో అద్భుతాలు చేస్తున్నారు. ఆల్‌ఇంగ్లండ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ వరకు.. ఆ తర్వాత ఇండియా ఓపెన్‌, థామస్‌ కప్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన సాత్విక్‌- చిరాగ్‌ శెట్టి జోడి కొత్త చరిత్ర లిఖించింది.

చదవండి: Rafael Nadal-Serena Williams: అద్భుత దృశ్యం.. దిగ్గజాలు ఎదురుపడిన వేళ

సాత్విక్‌–చిరాగ్‌ ‘డబుల్స్‌’ ధమాకా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement