doubles match
-
సాత్విక్–చిరాగ్ ఓటమి
సార్‌బ్రకెన్ (జర్మనీ): హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో భారత జంట 21–17, 18–21, 21–8తో సు యా చింగ్–లిన్ వాన్ చింగ్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది. అయితే పురుషుల డబుల్స్‌లో భారత మేటి జంట సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టిలకు క్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 17–21, 14–21తో బెన్ లేన్–సిన్ వెండీ (ఇంగ్లండ్) జోడీ చేతిలో కంగుతింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–13, 21–19తో ఆరో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ని వరుస గేముల్లోనే కంగు తినిపించాడు. -
ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్, నాదల్ కన్నీటీ పర్యంతం
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఓటమితో కెరీర్‌కు ముగింపు పలికాడు. చిరకాల మిత్రుడు.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్‌తో కలిసి లావెర్ కప్‌లో డబుల్స్ మ్యాచ్ ఆడిన ఫెదరర్ మ్యాచ్ అనంతరం కన్నీటి పర్యంతమయ్యాడు. ఫెదరర్ కన్నీళ్లు పెట్టడం చూసి నాదల్ కూడా తట్టుకోలేకపోయాడు. ఇక తన చిరకాల మిత్రుడు టెన్నిస్ కోర్టులో కనిపించడన్న బాధను కన్నీటి రూపంలో బయటపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు.. ఫెదరర్, నాదల్ ఏడుస్తున్న ఫోటోలను షేర్ చేసి.. ''చిరకాల ప్రత్యర్థులు.. బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్.. ఈ దృశ్యం చూడడానికే బాధగా ఉంది'' అంటూ క్యాప్షన్ జత చేసింది. Biggest rivals, best mates 🥹 #Fedal pic.twitter.com/CZcEkGVrXA — #AusOpen (@AustralianOpen) September 24, 2022 Rafa Nadal and Roger Federer in tears after Federer’s retirement is the best sports moment you’ll see in some time. Ultimate respect. 🐐🐐 pic.twitter.com/fUeY8wQSTM — Barstool Sports (@barstoolsports) September 23, 2022 లావెర్ కప్ 2022లో భాగంగా శుక్రవారం అర్థరాత్రి జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో ఫెదరర్-నాదల్ జోడి ఓటమి పాలైంది. టీమ్ వరల్డ్ ఫ్రాన్సెస్కు చెందిన టియాఫో-జాక్ సాక్ జంట చేతిలో 4-6, 7-6(7-2), 11-9తో ఓటమి పాలయ్యారు. తొలి సెట్‌ను నాదల్-ఫెదరర్ జంట గెలిచినప్పటికి.. రెండో సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. అయితే టై బ్రేక్‌లో టియాఫో-జాక్ సాక్ జంట విజృంభించి రెండో సెట్‌ను కైవసం చేసుకున్నారు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో హోరాహోరీగా తలపడినప్పటికి టియాఫో-జాక్ జంట అద్భుతమైన షాట్లతో ఫెదరర్-నాదల్‌ను నిలువరించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. ఇక ఓటమితో కెరీర్‌కు ముగింపు పలికిన ఫెదరర్‌కు టెన్నిస్ అభిమానులు చివరిసారి ఘనంగా వీడ్కోలు పలికారు.'' నీలాంటి క్లాసిక్ ఆటగాడు మళ్లీ టెన్నిస్‌లో దొరక్కపోవచ్చు.. మిస్ యూ ఫెడ్డీ'' అంటూ కామెంట్ చేశారు. ఇక చిరకాల మిత్రులైన నాదల్- ఫెదరర్ ముఖాముఖి పోరులో 40 సార్లు తలపడగా.. 16 సార్లు ఫెదరర్.. 24 సార్లు నాదల్ విజయాలు సాధించాడు. ఇక మరొక టెన్నిస్ స్టార్ జొకోవిచ్‌తో 50 సార్లు తలపడగా.. 23 సార్లు ఫెదరర్.. 27 సార్లు జొకోవిచ్ గెలుపు రుచి చూశాడు. ఫెదరర్ తన కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్స్ నెగ్గగా.. అందులో ఆస్ట్రేలియా ఓపెన్ ఆరుసార్లు, ఫ్రెంచ్ ఓపెన్ ఒకసారి, ఎనిమిది సార్లు వింబుల్డన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించాడు. తన కెరీర్ మొత్తంలో 1526 సింగిల్స్, 223 డబుల్స్ మ్యాచ్‌లు ఆడిన ఫెడరర్ ఒక్కసారి కూడా మ్యాచ్ మధ్యలో రిటైర్ కాలేదు. ►కెరీర్లో గెలిచిన మొత్తం టైటిల్స్ – 103 ►గెలుపు–ఓటములు – 1251–275 ►కెరీర్ ప్రైజ్‌మనీ – 13 కోట్ల డాలర్లు (సుమారు రూ.1042 కోట్లు) ►తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ – 02/02/2004 ►ఒలింపిక్ పతకాలు (2) – 2008 బీజింగ్‌లో డబుల్స్ స్వర్ణం, 2012 లండన్‌లో సింగిల్స్ కాంస్యం ►వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ – మొత్తం 310 వారాలు (ఇందులో వరుసగా 237 వారాలు) ►గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ విజయాల సంఖ్య – 369 ►కెరీర్లో కొట్టిన ఏస్‌లు – 11,478 చదవండి: ఒకే ఫ్రేమ్‌లో ఆ 'నలుగురు'.. షేక్ అవుతున్న ఇంటర్నెట్ 'సంతాపం కాదు.. సంబరంలా ఉండాలి' -
కాంస్యం నెగ్గిన సాత్విక్-చిరాగ్ శెట్టి.. అయినా చరిత్రే
అంచనాలకు మించి రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. శనివారం(ఆగస్టు 27న) జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి జంట.. మలేషియాకు చెందిన ఆరోన్ చియా-వూయి యిక్ సోహ్లతో 22-20, 18-21, 16-21తో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్‌ను 22-20తో గెలిచిన సాత్విక్- చిరాగ్.. అదే టెంపోనూ తర్వాతి గేమ్స్‌లో కొనసాగించలేకపోయారు. తొలి గేమ్ ఓడినప్పటికి వరల్డ్ నెంబర్-7 అయిన మలేషియా జంట ఫుంజుకొని భారత ద్వయానికి మరో అవకాశం ఇవ్వకుండా వరుస గేముల్లో ఓడించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఇటీవలి కాలంలో సాత్విక్-చిరాగ్ జంట బ్యాడ్మింటన్‌లో అద్భుతాలు చేస్తున్నారు. ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు.. ఆ తర్వాత ఇండియా ఓపెన్, థామస్ కప్, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన సాత్విక్- చిరాగ్ శెట్టి జోడి కొత్త చరిత్ర లిఖించింది. BWF World Championships 2022 Men's Doubles - Semi Finals Aaron Chia/Soh Wooi Yik 🇲🇾 vs Satwiksairaj Rankireddy/Chirag Shetty 🇮🇳 20-22, 21-18, 21-16 Alhamdulillah they finally break the SF curse! 🤧 Huge congrats for advancing to the FINAL ChiaSoh 👏👏 #BWC2022 pic.twitter.com/uCWsJtBo3p — レディディラ (@ladydyla__) August 27, 2022 చదవండి: Rafael Nadal-Serena Williams: అద్భుత దృశ్యం.. దిగ్గజాలు ఎదురుపడిన వేళ సాత్విక్–చిరాగ్ ‘డబుల్స్’ ధమాకా -
ఫైనల్లో విష్ణువర్ధన్ జంట
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నీలో భారత డేవిస్‌కప్ జట్టు మాజీ సభ్యుడు, హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ విష్ణువర్ధన్–శశికుమార్ ముకుంద్ (భారత్) జంట 6–3, 2–6, 10–8తో మూడో సీడ్ సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయంపై గెలుపొందింది. -
శ్రీజ జోడీకి కాంస్యం
మస్కట్ (ఒమన్): ప్రపంచ టేబుల్ టెన్నిస్ మస్కట్ కంటెండర్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. సెమీఫైనల్లో శ్రీజ–సెలీనా (భారత్) జంట 4–11, 6–11, 10–12తో సుతీర్థ–అహిక (భారత్) ద్వయం చేతిలో ఓడింది. ఫైనల్లో సుతీర్థ–అహిక జోడీ 6–11, 11–8, 10– 12, 7–11తో జాంగ్ రుయ్–కుయ్ మాన్ (చైనా) జంట చేతిలో ఓడి రజతం దక్కించుకుంది. -
టాప్ సీడ్ జోడీపై సానియా జంట సంచలన విజయం
ఖతర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో 7–6 (7/5), 4–3తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్, టాప్ సీడ్ జోడీ సినియకోవా–క్రిచికోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి సెట్‌ను సొంతం చేసుకొని రెండో సెట్లో సానియా–హర్డెస్కా 4–3తో ఆధిక్యంలో ఉన్న దశలో సినియకోవా–క్రిచికోవా గాయంతో వైదొలిగారు. -
క్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా జోడీ
ఖతర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్) –లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దోహాలో మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 86 నిమిషాల్లో 7–5, 7–5తో ఎనిమిదో సీడ్ అనా డానిలినా (కజకిస్తాన్)–బీట్రిజ్ (బ్రెజిల్) జోడీపై గెలిచింది. తొలి రౌండ్లో సానియా–హర్డెస్కా6–4, 6–3తో మోనికా నికెలెస్కూ (రొమేనియా)–వెరా జ్వొనరేవా (రష్యా)లపై విజయం సాధించారు. -
వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం
లండన్: వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ఒక సింగిల్స్ మ్యాచ్, మరో డబుల్స్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు గుర్తించిన ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) విచారణ జరుపుతోంది. విషయంలోకి వస్తే.. మెన్స్ డబుల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ అనుమానాస్పద లిస్ట్‌లో ఉంది. లైవ్ బెట్స్ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో ఈ మ్యాచ్ ఫేవరెట్ జోడీ ఓడిపోయినట్లు పలు బెట్టింగ్ సంస్థలు ఫిర్యాదు చేశాయి. ఈ జోడీ తొలి సెట్ గెలిచి తర్వాతి రెండు సెట్లను ఓడిపోయింది. ఇక మరొకటి జర్మన్ ప్లేయర్ ఆడిన ఫస్ట్ రౌండ్ సింగిల్స్ మ్యాచ్. అయితే ఆ ప్లేయర్ ప్రత్యర్థిపై ఈ మ్యాచ్‌లో అనుమానాలు ఉన్నాయి. సెకండ్ సెట్ తర్వాత పరిస్థితిపై ఐదు అంకెలలో బెట్టింగ్ నడిచినట్లు తేలింది. ఈ మ్యాచ్‌లో సర్వీస్ గేమ్స్ సంఖ్యపై కూడా ప్రత్యేక బెట్స్ నడిచాయి. దీంతోపాటు ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య మొత్తం 11 మ్యాచ్‌లపై ఫిక్సింగ్ ఫిర్యాదులను ఐటీఐఏ అందుకుంది. -
సెమీస్‌లో పేస్ జంట
న్యూపోర్ట్ (అమెరికా): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఏటీపీ–250 టోర్నమెంట్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ లియాండర్ పేస్–మార్కస్ డానియల్ (న్యూజిలాండ్) ద్వయం 6–4, 5–7, 14–12తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)–రాబర్ట్ లిండ్‌స్టెట్ (స్వీడన్) జోడీపై గెలిచింది. 46 ఏళ్ల పేస్ 1995లో హాల్ ఆఫ్ ఫేమ్ టోర్నీలో తొలిసారి ఆడాడు. తాజా విజయంతో పేస్ జాన్ మెకన్రో (47 ఏళ్లు–2006 సాన్‌జోస్ టోర్నీ) తర్వాత ఏటీపీ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. -
డబుల్స్‌లోనూ నిరాశే
క్రాల్‌జివో (సెర్బియా): విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్‌లో భారత జంట ఓడిపోయింది. డేవిస్‌కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భాగంగా శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–సాకేత్ మైనేని జోడీ 6–7 (5/7), 2–6, 6–7 (4/7)తో నికోలా మిలోజెవిచ్–డానిలో పెట్రోవిచ్ (సెర్బియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. ఈ గెలుపుతో ఆతిథ్య సెర్బియా జట్టు 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు నామమాత్రం కానున్నాయి. రెండు గంటల 22 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మ్యూలం చెల్లించుకుంది. మూడో సెట్లో 5–3తో ఆధిక్యంలో ఉండి సెట్ పాయింట్ కూడా సంపాదించిన భారత జంట దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సెట్ పాయింట్‌ను కాపాడుకోవడంతోపాటు సెర్బియా ద్వయం సాకేత్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత రెండు జంటలు తమ సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో మూడో సెట్లో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సెర్బియా జోడీ పైచేయి సాధించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. సెర్బియా చేతిలో ఓడినప్పటికీ వచ్చే ఏడాది కొత్త పద్ధతిలో, కొత్త నిబంధనలతో 18 జట్ల మధ్య నిర్వహించనున్న డేవిస్ కప్ ఫైనల్స్ ఈవెంట్‌కు భారత్ అర్హత సాధించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో 24 జట్ల మధ్య ఇంటా, బయటా పద్ధతిలో క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగనుంది. క్వాలిఫయింగ్ టోర్నీలో నెగ్గిన 12 జట్లు నవంబర్‌లో జరిగే ఫైనల్స్‌కు అర్హత పొందుతాయి. ఈ సీజన్లో సెమీస్‌కు చేరిన నాలుగు జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. మరో రెండు జట్లకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వైల్డ్ కార్డు ఇస్తుంది. -
లియాండర్ పేస్.. అరుదైన ఫీట్
బీజింగ్ : భారత టెన్నిస్ దిగ్గజం, వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ అరుదైన ఘనత సాధించారు. డేవిస్ కప్ టోర్నీల్లో డబుల్స్ విభాగంలో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. డేవిస్ కప్‌లో భాగంగా శనివారం రోహన్ బోపన్నతో జోడి కట్టిన పేస్ చైనా జంట జీ జాంగ్, జిన్ గాంగ్ పై 5-7,7-6(5), 7-6(3)తో విజయం సాధించారు. తద్వారా ఇరాన్ ఆటగాడు నికోలా పిట్రాంగిలీ డేవిస్‌లో అత్యధిక డబుల్స్ విజయాల( 42) రికార్డును పేస్ తిరగరాశారు. తద్వారా 43 విజయాలతో ఎవరికీ సాధ్యం కాని రికార్డు సృష్టించారు. పేస్ డేవిస్ కప్ విజయాల ట్రాక్‌ను పరిశీలిస్తే... 1990లో డేవిస్ కప్‌లో జీసన్ అలీతో తొలిసారి జతకట్టిన పేస్ ఇప్పటివరకు 12మంది భాగస్వాములతో ఈ ఘనత సాధించారు. అత్యధికంగా మహేశ్ భూపతితో కలిసి 25 విజయాలు అందుకున్నారు. గత ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరుకు పేస్‌ను పక్కన పెట్టారు. దీంతో ఈసారి డేవిస్‌కప్‌లో పేస్ పాల్గొనడం పై సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) డేవిస్‌కప్ పోరుకు పేస్‌ను ఎంపిక చేసింది. -
సెరెనా ఆడింది... సోదరి జతగా
అషేవిల్లే (అమెరికా): అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆట మొదలైంది. అమ్మ హోదా వచ్చాక అధికారిక టోర్నమెంట్లో తొలిసారి బరిలోకి దిగిన ఆమెకు పరాజయమే ఎదురైంది. ఫెడ్ కప్ టీమ్ టోర్నమెంట్లో సోదరి వీనస్ విలియమ్స్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడిన సెరెనా 2–6, 3–6తో లెస్లే కెర్కోవ్–డెమి షర్స్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడింది. 36 ఏళ్ల సెరెనా గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ తర్వాత మళ్లీ రాకెట్ పట్టడం ఇదే మొదటిసారి. వారాల గర్భంతోనే టైటిల్ సాధించిన ఆమె ఇప్పుడు తన గారాలపట్టి ఒలింపియా (ఐదు నెలల కుమార్తె)ను ప్రేక్షకుల గ్యాలరీలో ఉంచి కోర్టులో ఆడింది. ఈ టీమ్ చాంపియన్‌షిప్‌లో 15 ఏళ్ల తర్వాత విలియమ్స్ సిస్టర్స్ జోడీ కట్టడం మరో విశేషం. 2003 తర్వాత జతగా ఈ ఇద్దరు ఫెడ్‌కప్ ఆడలేకపోయారు. అయితే చివరి సారిగా ఇద్దరు కలిసి ఆడిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (2016)లో మాత్రం డబుల్స్ టైటిల్ నెగ్గారు. మ్యాచ్ ముగిశాక సెరెనా మాట్లాడుతూ ‘కెరీర్లో ఎత్తుపల్లాలు సహజం. తిరిగి నా ఆట నేను తేలిగ్గా ఆడేందుకు సోదరి వీనస్ జత కావడమే కారణం’ అని చెప్పింది. డబుల్స్‌లో అమెరికన్ జోడీ ఓడినప్పటికీ సింగిల్స్‌లో వీనస్... రిచెల్ హొగెన్కెంప్పై విజయం సాధించడంతో అమెరికా జట్టు 3–1తో నెదర్లాండ్స్‌పై గెలిచి సెమీఫైనల్స్ చేరింది. మ్యాచ్ వీక్షిస్తున్న సెరెనా భర్త అలెక్సిస్, కుమార్తె ఒలింపియా -
బోపన్న-సాకేత్ జంటకు షాక్
కివీస్ జోడీ చేతిలో అనూహ్య ఓటమి భారత్ 1-2తో వెనుకంజ నేటి రివర్స్ సింగిల్స్ కీలకం క్రైస్ట్‌చర్చ్: కచ్చితంగా గెలుస్తారనుకున్న చోట భారత పురుషుల టెన్నిస్ జట్టుకు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న డేవిస్ కప్ ఆసియా ఒషియానియా గ్రూప్-1 పోటీలో భాగంగా డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న-సాకేత్ మైనేని (భారత్) జోడీకి ఊహించని ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న-సాకేత్ ద్వయం 3-6, 6-7 (1/7), 3-6తో ఆర్తెమ్ సితాక్-మార్కస్ డానియల్ (న్యూజిలాండ్) జంట చేతిలో ఓడిపోయింది. గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ ద్వయం ఏదశలోనూ భారత్ జోడీకి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ పరాజయంతో భారత్ 1-2తో వెనుకబడింది. వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధించాలంటే ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్‌లలో భారత ఆటగాళ్లు తప్పనిసరిగా గెలవాల్సిందే. తొలి మ్యాచ్‌లో జోస్ స్థాతమ్‌తో సోమ్‌దేవ్; మైకేల్ వీనస్‌తో యూకీ బాంబ్రీ తలపడతారు. బోపన్న-సాకేత్ జంటకు డేవిస్ కప్‌లో ఇదే తొలి ఓటమి. గతంలో ఈ జంట కొరియా, చైనీస్ తైపీలతో జరిగిన మ్యాచ్‌ల్లో గెలిచింది. డేవిస్ కప్‌లో మూడేళ్ల తర్వాత భారత జంటకు ఎదురైన ఓటమి ఇదే కావడం గమనార్హం. 2012లో డెనిస్ ఇస్టోమిన్-మురాద్ ఇనోయతోవ్ (ఉజ్బెకిస్థాన్) జోడీ చేతిలో బోపన్న-లియాండర్ పేస్ జంట ఓటమి చవిచూసింది. ఆజానుబాహులైన బోపన్న, సాకేత్‌లు భారీ సర్వీస్‌లతో హడలెత్తిస్తారని భావించినా అలా జరగలేదు. కేవలం ఐదు ఏస్‌లు సంధించిన భారత జంట మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయిన బోపన్న-సాకేత్‌లు ప్రత్యర్థి సర్వీస్‌ను ఒక్కసారి కూడా బ్రేక్ చేయలేకపోయారు. ‘డబుల్స్‌లో ఓడినప్పటికీ భారత్‌కు ఇంకా విజయావకాశాలు ఉన్నాయి. ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్‌లో మనోళ్లు గెలుస్తారనే నమ్మకంతో ఉన్నాను’ అని భారత కోచ్ జీషాన్ అలీ తెలిపారు. -
డబుల్స్ మ్యాచ్ మనదే
సాకేత్-బోపన్న జోడి గెలుపు భారత్‌కు 2-1 ఆధిక్యం కొరియాతో డేవిస్‌కప్ పోరు బుసాన్ (కొరియా): డేవిస్‌కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత పొందేందుకు భారత్ మరో అడుగు దూరంలో నిలిచింది. ఆసియా-ఓసియానియా గ్రూప్-1 రెండో రౌండ్లో భాగంగా కొరియాతో శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో గెలిచి భారత్ 2-1 ఆధిక్యం సాధించింది. రోహన్ బోపన్న-సాకేత్ మైనేని జోడి 7-6 (7/4), 5-7, 7-6 (2/7), 6-3తో హ్యుంగ్ తైక్ లీ-లిమ్ యాంగ్ క్యు జంటపై గెలుపొందింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ మ్యాచ్‌ల్లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ విజయం సాధించగా... సనమ్‌సింగ్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం జరగనున్న రివర్స్ సింగిల్స్‌లో ఒక్క మ్యాచ్‌లో గెలుపొందినా కొరియాపై భారత్ విజయం నమోదు చేయనుంది. దీంతో కొరియాతో ఇప్పటిదాకా 3-6గా ఉన్న ముఖాముఖి రికార్డును సవరించుకోవడంతోపాటు 2008 తరువాత తొలిసారి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ బెర్తును దక్కించుకుంటుంది. ఆదివారం జరిగే రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో లిమ్ యాంగ్ క్యు తో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్; హ్యున్ చుంగ్‌తో సనమ్‌సింగ్ తలపడతారు.