టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్
బీజింగ్ : భారత టెన్నిస్ దిగ్గజం, వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ అరుదైన ఘనత సాధించారు. డేవిస్ కప్ టోర్నీల్లో డబుల్స్ విభాగంలో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. డేవిస్ కప్‌లో భాగంగా శనివారం రోహన్ బోపన్నతో జోడి కట్టిన పేస్ చైనా జంట జీ జాంగ్, జిన్ గాంగ్ పై 5-7,7-6(5), 7-6(3)తో విజయం సాధించారు. తద్వారా ఇరాన్ ఆటగాడు నికోలా పిట్రాంగిలీ డేవిస్‌లో అత్యధిక డబుల్స్ విజయాల( 42) రికార్డును పేస్ తిరగరాశారు. తద్వారా 43 విజయాలతో ఎవరికీ సాధ్యం కాని రికార్డు సృష్టించారు.
పేస్ డేవిస్ కప్ విజయాల ట్రాక్‌ను పరిశీలిస్తే... 1990లో డేవిస్ కప్‌లో జీసన్ అలీతో తొలిసారి జతకట్టిన పేస్ ఇప్పటివరకు 12మంది భాగస్వాములతో ఈ ఘనత సాధించారు. అత్యధికంగా మహేశ్ భూపతితో కలిసి 25 విజయాలు అందుకున్నారు. గత ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరుకు పేస్‌ను పక్కన పెట్టారు. దీంతో ఈసారి డేవిస్‌కప్‌లో పేస్ పాల్గొనడం పై సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) డేవిస్‌కప్ పోరుకు పేస్‌ను ఎంపిక చేసింది.
Comments
Please login to add a commentAdd a comment