
ఖతర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్) –లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దోహాలో మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 86 నిమిషాల్లో 7–5, 7–5తో ఎనిమిదో సీడ్ అనా డానిలినా (కజకిస్తాన్)–బీట్రిజ్ (బ్రెజిల్) జోడీపై గెలిచింది. తొలి రౌండ్‌లో సానియా–హర్డెస్కా6–4, 6–3తో మోనికా నికెలెస్కూ (రొమేనియా)–వెరా జ్వొనరేవా (రష్యా)లపై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment