డబుల్స్ మ్యాచ్ మనదే
సాకేత్-బోపన్న జోడి గెలుపు
భారత్‌కు 2-1 ఆధిక్యం
కొరియాతో డేవిస్‌కప్ పోరు
బుసాన్ (కొరియా): డేవిస్‌కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత పొందేందుకు భారత్ మరో అడుగు దూరంలో నిలిచింది. ఆసియా-ఓసియానియా గ్రూప్-1 రెండో రౌండ్‌లో భాగంగా కొరియాతో శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో గెలిచి భారత్ 2-1 ఆధిక్యం సాధించింది. రోహన్ బోపన్న-సాకేత్ మైనేని జోడి 7-6 (7/4), 5-7, 7-6 (2/7), 6-3తో హ్యుంగ్ తైక్ లీ-లిమ్ యాంగ్ క్యు జంటపై గెలుపొందింది.
శుక్రవారం జరిగిన సింగిల్స్ మ్యాచ్‌ల్లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ విజయం సాధించగా... సనమ్‌సింగ్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం జరగనున్న రివర్స్ సింగిల్స్‌లో ఒక్క మ్యాచ్‌లో గెలుపొందినా కొరియాపై భారత్ విజయం నమోదు చేయనుంది. దీంతో కొరియాతో ఇప్పటిదాకా 3-6గా ఉన్న ముఖాముఖి రికార్డును సవరించుకోవడంతోపాటు 2008 తరువాత తొలిసారి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ బెర్తును దక్కించుకుంటుంది. ఆదివారం జరిగే రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో లిమ్ యాంగ్ క్యు తో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్; హ్యున్ చుంగ్‌తో సనమ్‌సింగ్ తలపడతారు.