
మస్కట్ (ఒమన్): ప్రపంచ టేబుల్ టెన్నిస్ మస్కట్ కంటెండర్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. సెమీఫైనల్లో శ్రీజ–సెలీనా (భారత్) జంట 4–11, 6–11, 10–12తో సుతీర్థ–అహిక (భారత్) ద్వయం చేతిలో ఓడింది. ఫైనల్లో సుతీర్థ–అహిక జోడీ 6–11, 11–8, 10– 12, 7–11తో జాంగ్ రుయ్–కుయ్ మాన్ (చైనా) జంట చేతిలో ఓడి రజతం దక్కించుకుంది.