
ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా మూడోసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 2021, 2023 ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ భారత జట్టుకు కాంస్య పతకాలు లభించాయి. కజకిస్తాన్‌లో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 0–3తో చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓడిపోయింది.
తొలి మ్యాచ్‌లో శరత్ కమల్ 7–11, 10–12, 9–11తో లిన్ యున్ జు చేతిలో... రెండో మ్యాచ్‌లో మానవ్ ఠక్కర్ 9–11, 11–8, 3–11, 11–13తో చెంగ్ జుయ్ చేతిలో... మూడో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 6–11, 9–11, 7–11తో హువాంగ్ యాన్ చెంగ్ చేతిలో ఓటమి చవిచూశారు.
నేటి నుంచి మొదలయ్యే వ్యక్తిగత విభాగంలో శరత్ కమల్, సత్యన్, హర్మీత్, మనుష్ షా, మానవ్ ఠక్కర్, ఆకుల శ్రీజ, మనిక బత్రా, ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ, దియా పరాగ్ పోటీపడతారు.