Indian mens team
-
భారత పురుషుల టీటీ జట్టుకు కాంస్యం
ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా మూడోసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 2021, 2023 ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ భారత జట్టుకు కాంస్య పతకాలు లభించాయి. కజకిస్తాన్‌లో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 0–3తో చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో శరత్ కమల్ 7–11, 10–12, 9–11తో లిన్ యున్ జు చేతిలో... రెండో మ్యాచ్‌లో మానవ్ ఠక్కర్ 9–11, 11–8, 3–11, 11–13తో చెంగ్ జుయ్ చేతిలో... మూడో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 6–11, 9–11, 7–11తో హువాంగ్ యాన్ చెంగ్ చేతిలో ఓటమి చవిచూశారు. నేటి నుంచి మొదలయ్యే వ్యక్తిగత విభాగంలో శరత్ కమల్, సత్యన్, హర్మీత్, మనుష్ షా, మానవ్ ఠక్కర్, ఆకుల శ్రీజ, మనిక బత్రా, ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ, దియా పరాగ్ పోటీపడతారు. -
వరుసగా మూడోసారి భారత పురుషుల టీటీ జట్టుకు పతకం ఖరారు
ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–1తో ఆతిథ్య కజకిస్తాన్ జట్టుపై గెలిచింది. 2021, 2023 ఆసియా టీటీ టోర్నీల్లో భారత జట్టు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు సాధించింది. కజకిస్తాన్‌తో జరిగిన పోరులో తొలి మ్యాచ్‌లో మానవ్ 11–9, 11–7, 11–6తో గెరాసిమెంకోపై నెగ్గాడు. రెండో మ్యాచ్‌లో కుర్మంలియెవ్ 11–6, 11–5, 11–8తో హర్మత్ దేశాయ్‌ను ఓడించాడు. మూడో మ్యాచ్‌లో శరత్ కమల్ 11–4, 11–7, 12–10తో కెంజిగులోవ్పై గెలిచాడు. నాలుగో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 6–11, 11–9, 7–11, 11–8, 11–8తో గెరాసిమెంకోను ఓడించడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో చైనీస్ తైపీతో భారత్ ఆడుతుంది. మరోవైపు భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 1–3తో జపాన్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. -
బంగారం... మన చదరంగం
బుడాపెస్ట్: ప్రపంచ చదరంగ సామ్రాజ్యంలో తమకు తిరుగులేదని భారత క్రీడాకారులు నిరూపించారు. ఏ లక్ష్యంతోనైతే చెస్ ఒలింపియాడ్‌లో బరిలోకి దిగారో ఆ లక్ష్యాన్ని భారత క్రీడాకారులు దర్జాగా పూర్తి చేశారు. ఆద్యంతం అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టారు. అంచనాలకు మించి ఎత్తులు వేశారు. తమ ప్రత్యర్థులను చిత్తు చేశారు. వెరసి ఇన్నాళ్లూ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఏకకాలంలో భారత పురుషుల, భారత మహిళల జట్లు చాంపియన్‌గా నిలిచి తొలిసారి స్వర్ణ పతకాలను సొంతం చేసుకొని కొత్త చరిత్రను లిఖించాయి. » ఆదివారం ముగిసిన ఈ మెగా టోర్నీలో గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్ (తెలంగాణ), దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద (తమిళనాడు), విదిత్ సంతోష్ గుజరాతి (మహారాష్ట్ర), పెంటేల హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్)లతో కూడిన భారత పురుషుల జట్టు అజేయంగా నిలిచి 21 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అమెరికా జట్టుకు (17 పాయింట్లు) రజతం, ఉజ్బెకిస్తాన్ జట్టుకు (17 పాయింట్లు) కాంస్యం లభించాయి. » గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్), వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్ (ఢిల్లీ)లతో కూడిన భారత మహిళల జట్టు 19 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. కజకిస్తాన్ (18 పాయింట్లు) జట్టుకు రజతం, అమెరికా (17 పాయింట్లు) జట్టుకు కాంస్యం దక్కాయి. » వ్యక్తిగత విభాగాల్లో గుకేశ్ (బోర్డు–1; 9 పాయింట్లు), అర్జున్ (బోర్డు–2; 10 పాయింట్లు), దివ్య దేశ్‌ముఖ్ (బోర్డు–3; 9.5 పాయింట్లు), వంతిక అగర్వాల్ (బోర్డు–4; 7.5 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. » చివరిదైన 11వ రౌండ్ మ్యాచ్‌ల్లో భారత పురుషుల జట్టు 3.5–0.5తో స్లొవేనియాపై గెలుపొందగా... భారత మహిళల జట్టు కూడా 3.5–0.5తో అజర్బైజాన్ జట్టును ఓడించింది. » పురుషుల 11వ రౌండ్ గేముల్లో గుకేశ్ 48 ఎత్తుల్లో ఫెడోసీవ్‌పై, అర్జున్ 49 ఎత్తుల్లో జాన్ సుబెల్పై, ప్రజ్ఞానంద 53 ఎత్తుల్లో అంటోన్ డెమ్చెంకోపై నెగ్గగా... మాతెజ్ సబెనిక్తో జరిగిన గేమ్‌ను విదిత్ 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. » మహిళల 11వ రౌండ్ గేముల్లో ద్రోణవల్లి హారిక 51 ఎత్తుల్లో గునె మమాద్జాదాపై, దివ్య 39 ఎత్తుల్లో గొవర్ బెదులయేవాపై, వంతిక 53 ఎత్తుల్లో ఖానిమ్ బలజయేవాపై గెలుపొందగా... ఉలివియా ఫతలెవియాతో జరిగిన గేమ్‌ను వైశాలి 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. » గతంలో భారత పురుషుల జట్టు ఈ టోర్నీలో రెండుసార్లు కాంస్య పతకాలు (2014, 2022) గెలుపొందగా... భారత మహిళల జట్టు ఒకసారి (2022) కాంస్య పతకాన్ని సాధించింది.కల నిజమైంది చెస్ ఒలింపియాడ్‌లో నా ప్రస్థానం 13 ఏళ్ల వయస్సులో 2004లో మొదలైంది. 20 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు నా స్వర్ణ స్వప్నం సాకారం అయింది. స్వదేశంలో 2022లో జరిగిన ఒలింపియాడ్‌లో పసిడి పతకం సాధించే అవకాశాలున్నా ఆఖర్లో తడబడి చివరకు కాంస్య పతకంతో సంతృప్తి చెందాం. కానీ ఈసారి ఆఖరి రౌండ్లో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆడి ‘బంగారు’ కలను నిజం చేసుకున్నాం. ఈసారి ఒలింపియాడ్‌కు నేను ప్రత్యేక సన్నాహాలు చేయకుండానే బరిలోకి దిగాను. ఈ మెగా టోర్నీలో నా అపార అనుభవం ఉపయోగపడింది. నాతోపాటు దివ్య, వంతిక, వైశాలి, తానియా సరైన సమయంలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాం. పటిష్ట జట్లతో ఆడి పోరాడి గెలిచాం. ఈ స్వర్ణ పతకానికి మేమందరం అర్హులం. –‘సాక్షి’తో హారిక -
Chess Olympiad 2024: చదరంగంలో స్వర్ణ చరిత్రకు చేరువలో...
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణ చరిత్ర లిఖించేందుకు సిద్ధమైంది. మన గ్రాండ్ మాస్టర్లు ఏళ్ల తరబడి పోటీ పడుతున్నా అందని ద్రాక్షగానే ఉన్న బంగారు పతకం ఎట్టకేలకు దక్కే అవకాశం వచి్చంది. టోర్నీ చరిత్రలో తొలిసారి భారత పురుషుల జట్టు విజేతగా నిలవడం దాదాపుగా ఖాయమైంది. అడుగడుగునా హేమాహేమీ గ్రాండ్‌మాస్టర్లు, క్లిష్టమైన ప్రత్యర్థులు ఎదురైన ఈ మెగా టోరీ్నలో మన ఆటగాళ్లు చిరస్మరణీయ విజయం సాధించారు. పది రౌండ్ల తర్వాత 19 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలవగా చైనా ప్రస్తుతం 17 పాయింట్లతో ఉంది. చివరి రౌండ్లో భారత్ ఓడి చైనా గెలిస్తేనే ఇరు జట్ల సమమై టై బ్రేక్‌కు దారి తీస్తుంది. అయితే మన టీమ్ ప్రస్తుత ఫామ్ చూస్తే ఓటమి అవకాశాలు దాదాపుగా లేవు. కాబట్టి స్వర్ణం లాంఛనమే కావచ్చు. బుడాపెస్ట్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న భారత పురుషుల జట్టు పది రౌండ్ల తర్వాత అజేయంగా అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ కీలకమైన ఆఖరి పోరులో విజయం సాధించడంతో భారత్‌కు పసిడి దిశగా మరో అడుగు ముందుకు వేసింది. అర్జున్, దొమ్మరాజు గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతి, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత్ బృందం మరో రౌండ్ మిగిలుండగానే విజేతగా మారే స్థితిలో నిలిచింది. ఇప్పటిదాకా ఆడిన పది రౌండ్లలో ఏకంగా తొమ్మిదింట విజేతగా నిలిచింది. ఒక్క 9వ రౌండ్లో మాత్రం ఉజ్బెకిస్తాన్ భారత్‌ను డ్రాలతో నిలువరించింది. దీంతో ఈ మ్యాచ్ 2–2తో ‘టై’గా ముగిసింది. శనివారం జరిగిన పదో రౌండ్లో భారత ఆటగాళ్లు 2.5–1.5తో అమెరికాను ఓడించారు. దీంతో భారత్ 19 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంకా ఆఖరిరౌండ్ ఉన్నప్పటికీ భారత్‌ను చేరుకునే జట్టే లేకపోవడంతో పసిడి పతకం వశమైంది. దొమ్మరాజు గుకేశ్...ఫాబియానో కరువానాపై గెలిచి మంచి ఆరంభమిచ్చాడు. కానీ తర్వాతి మ్యాచ్‌లో ఆర్.ప్రజ్ఞానంద... వెస్లి సో చేతిలో ఓడిపోవడంతో స్కోరు సమమైంది. ఈ దశలో విదిత్ గుజరాతి... లెవొన్ అరోనియన్‌తో గేమ్ డ్రా చేసుకోవడంతో మరోసారి 1.5–1.5 వద్ద మళ్లీ స్కోరు టై అయ్యింది. కీలకమైన నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, భారత నంబర్‌వన్ ఇరిగేశి అర్జున్... లినియార్ పెరెజ్‌పై గెలుపొందడంతో భారత్ ఈ టోరీ్నలో తొమ్మిదో విజయాన్ని సాధించింది. మహిళల విభాగంలో భారత బృందం చెప్పుకోదగ్గ విజయం సాధించింది. చదరంగ క్రీడలో గట్టి ప్రత్యర్థి అయిన చైనాకు భారత మహిళల బృందం ఊహించని షాకిచి్చంది. భారత్ 2.5–1.5తో చైనాను కంగుతినిపించింది. సీనియర్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... జూ జినర్‌తో, వంతిక అగర్వాల్... ల్యూ మియోయితో డ్రా చేసుకున్నారు. దివ్య దేశ్‌ముఖ్... ని షిఖన్ను ఓడించడంతో భారత్ విజయానికి బాటపడింది. ఆఖరి మ్యాచ్‌లో వైశాలి... గ్యూ కి గేమ్ డ్రా కావడంతో చైనా కంగుతింది. చివరిదైన 11వ రౌండ్ తర్వాతే మహిళల జట్టు స్థానం ఖరారవుతుంది. -
పురుషుల జట్టుకు అన్నీ ‘డ్రా’లే
బుడాపెస్ట్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు అజేయంగా సాగుతోంది. శుక్రవారం ఉజ్బెకిస్తాన్ జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను భారత పురుషుల జట్టు 2–2తో టై చేసుకుంది. ఈ పోరులో బరిలోకి దిగిన నలుగురు ఆటగాళ్లు కూడా తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. ఈ టోర్నీలో వరుసగా ఎదురులేని విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌ను నిలువరించిన జట్టుగా ఉజ్బెకిస్తాన్ నిలిచింది. దొమ్మరాజు గుకేశ్... నొదిర్బెక్ అబ్దుసత్తొరొవ్తో, ప్రజ్ఞానంద.... జవొఖిర్ సిందరొవ్తో, విదిత్ గుజరాతి... జకొంగిర్ వఖిదొవ్తో, ఇరిగేశి అర్జున్... షంసిద్దీన్తో తమ తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. 9 రౌండ్లు ముగిసేసరికి భారత్ 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మహిళల విభాగంలో తొమ్మిదో రౌండ్లో భారత బృందం 2–2తో అమెరికా జట్టుతో టై చేసుకుంది. మూడు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత 2–1తో అమెరికా ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో వంతిక అగర్వాల్ వేసిన ఎత్తులు భారత్‌ను పైఎత్తుకు చేర్చింది. తప్పక గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో ఆమె ఇరినా క్రుశ్ను ఓడించి 2–2తో స్కోరును సమం భారత మహిళల జట్టు ఊపిరి పీల్చుకుంది. అంతకుముందు ఎనిమిదో రౌండ్లో అమ్మాయిల జట్టు పోలండ్ చేతిలో ఓడింది. దీంతో ఏడురౌండ్ల దాకా అజేయంగా నిలిచిన భారత మహిళల జట్టుకు ఈ టోరీ్నలో తొలిసారి ఓటమి ఎదురైంది. ఉత్తమ ఆటగాళ్లుగా కార్ల్సన్, పోల్గర్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తమ శతాబ్ది ఉత్సవాలను బుడాపెస్ట్‌లోనే ఘనంగా నిర్వహించింది. ‘ఫిడే 100’ పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఒలింపియాడ్‌లో ఎనిమిదో రౌండ్ పోటీలు ముగిసిన తర్వాత ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. తమ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని మొత్తం 18 కేటగిరీల్లో ‘ఫిడే’ అవార్డులు అందజేసింది. శతాబ్ది అత్యుత్తమ ఆటగాళ్లుగా పురుషుల విభాగంలో మాగ్నస్ కార్ల్సన్, మహిళల విభాగంలో జూడిత్ పోల్గర్ ఎంపికయ్యారు. కార్ల్సన్ క్లాసిక్ విభాగంలో ఐదు సార్లు, ర్యాపిడ్ విభాగంలో ఐదు సార్లు, బ్లిట్జ్ విభాగంలో ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ చెస్ చరిత్రలోనే అత్యుత్తమ రేటింగ్ (2882) సాధించిన ఘనత కార్ల్సన్ సొంతం. మహిళల చెస్‌కు సుదీర్ఘ కాలం చిరునామాగా నిలిచిన పోల్గర్ 15 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్ అయింది. 12 ఏళ్లకే టాప్–100 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న పోల్గర్ 2700 రేటింగ్ దాటిన ఏకైక మహిళ. -
చెస్ ఒలింపియాడ్: పసిడి వేటలో మరో విజయం
బుడాపెస్ట్: చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు వరుసగా ఎనిమిదో విజయం సాధించింది. తద్వారా పసిడి వేటలో మరో ముందడుగు పడింది. గురువారం జరిగిన 8వ రౌండ్లో భారత్ 3.5–0.5తో ఇరాన్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది.తెలంగాణకు చెందిన భారత గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్... డానెశ్వర్ బర్డియాపై గెలిచి పురుషుల జట్టుకు చక్కని ఆరంభమిచ్చాడు. అనంతరం దొమ్మరాజు గుకేశ్... పర్హామ్ మగ్సూద్‌ను ఓడించడంతో భారత్ 2–0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో పోరులో ప్రజ్ఞానంద... అమిన్ టబటబేతో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. నాలుగో మ్యాచ్‌లో విదిత్ గుజరాతి విజయంతో భారత్‌కు ఎదురులేని విజయం ఖాయమైంది. అతను డానెశ్వర్ బర్డియాను ఓడించడంతో భారత్ ఆడిన 8 రౌండ్లలోనూ గెలుపొందింది. ఇంకా మూడు రౌండ్లు మాత్రమే మిగిలున్న ఈ టోర్నీలో భారత్ ఇదే జోరు కొనసాగిస్తే ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ‘స్వర్ణ చరిత్ర’ లిఖిస్తుంది. -
భారత చెస్ జట్లకు వరుసగా ఏడో విజయం
బుడాపెస్ట్: చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా ఏడో విజయం సాధించి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి. జార్జియా జట్టుతో బుధవారం జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 3–1తో గెలిచింది. వైశాలి 62 ఎత్తుల్లో లెలా జవాఖి‹Ùవిలిపై, వంతిక 46 ఎత్తుల్లో బెలా ఖొటె నాష్‌విలిపై నెగ్గారు. నానా జాగ్‌నిద్జెతో గేమ్‌ను హారిక 59 ఎత్తుల్లో; నినో బత్సియా‹Ùవిలితో గేమ్ ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. తానియా కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. భారత పురుషుల జట్టు 2.5–1.5తో చైనాపై గెలిచింది. గుకేశ్ 80 ఎత్తుల్లో యి వెను ఓడించగా... ఇరిగేశి అర్జున్–బు జియాంగ్జి గేమ్ 26 ఎత్తుల్లో, ప్రజ్ఞానంద–యు యాంగీ గేమ్ 17 ఎత్తుల్లో, హరికృష్ణ–యు వాంగ్ గేమ్ 56 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. విదిత్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. -
పురుషుల జట్టుకూ నిరాశ
అంటల్యా (టర్కీ): పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ ఆఖరి క్వాలిఫయర్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు కూడా మహిళల టీమ్ బాటలోనే పయనించింది. భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. దాంతో పారిస్ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాలంటే జట్టు ర్యాంకింగ్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఈ టోర్నీలో టాప్–3లో నిలిచే జట్లకు నేరుగా ఒలింపిక్స్ అవకాశం దక్కేది. క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ 2 భారత పురుషుల జట్టు 4–5 (57–56, 57–53, 55–56, 55–58), (26–26) స్కోరుతో మెక్సికో చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి రెండు సెట్లను గెలిచి ఆధిక్యంలో నిలిచిన భారత్ మూడో సెట్లో సమంగా నిలిచినా సెమీస్ చేరేది. కానీ ఒక పాయింట్ తేడాతో సెట్‌ను కోల్పోయిన జట్టు తర్వాతి సెట్‌ను కూడా మెక్సికోకు అప్పగించింది. అయితే షూటౌట్లో భారత్ మ్యాచ్ కోల్పోయింది. మెక్సికో ఆర్చర్లు ల„ ్యానికి అతి సమీపంగా బాణాలను సంధించి పైచేయి సాధించారు. -
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
చెంగ్డూ (చైనా): రెండేళ్ల క్రితం థామస్ కప్ టోర్నమెంట్లో తొలిసారి విజేతగా నిలిచి పెను సంచలనం సృష్టించిన భారత పురుషుల జట్టు అదే ఫలితాన్ని ఈసారీ పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లో భారత జట్టు బరిలోకి దిగనుంది. గ్రూప్ ‘సి’లో ఇండోనేసియా, థాయ్‌లాండ్, ఇంగ్లండ్‌లతో కలిసి భారత్ పోటీపడనుంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ ‘ఢీ’ కొంటుంది. మహిళల టీమ్ ఈవెంట్ అయిన ఉబెర్ కప్‌లో భారత జట్టు ద్వితీయ శ్రేణి క్రీడాకారిణులతో బరిలోకి దిగనుంది.సింధు, అశ్విని పొన్నప్ప, తనీషా, గాయత్రి, ట్రెసా ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. గ్రూప్ ‘ఎ’లో కెనడా, చైనా, సింగపూర్‌లతో కలిసి భారత్ ఉంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో కెనడాతో భారత్ ఆడుతుంది. -
ఫైనల్లో టీమిండియా
గ్వాంగ్జు (కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీలో భారత పురుషుల కాంపౌండ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలత కూడిన భారత జట్టు ‘షూట్ ఆఫ్’లో 29–26తో దక్షిణ కొరియా జట్టును ఓడించింది. నిర్ణీత 24 షాట్ల తర్వాత రెండు జట్లు 233–233తో సమంగా ఉండటంతో ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. అవనీత్, ముస్కాన్, ప్రియాలతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు కాంస్య పతకాన్ని గెలిచింది. -
భారత్ భారీ విజయం.. బంగ్లాపై గెలుపుతో..
Asia Hockey Men Champions Trophy: ఆసియా హాకీ పురుషుల చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తొలి విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 9–0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ (12వ, 22వ, 45వ నిమిషంలో) మూడు గోల్స్... జర్మన్‌ప్రీత్‌సింగ్ (33వ, 43వ ని.లో) రెండు గోల్స్ చేశారు. లలిత్ (28వ ని.లో), ఆకాశ్‌దీప్ (54వ ని.లో), మన్దీప్ మోర్ (55వ ని.లో), హర్మన్‌ప్రీత్ (57వ ని.లో) ఒక్కోగోల్ సాధించారు. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. చదవండి: నన్ను తొలగించడానికి అదో కారణం కావచ్చు: విరాట్ కోహ్లి -
Team India: కుటుంబ సమేతంగా ఇంగ్లండ్‌కు పయనం!
ముంబై: భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు కుటుంబ సమేతంగా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చేందుకు యూకే ప్రభుత్వం సమ్మతి తెలిపింది. తమ దేశంలో సుదీర్ఘ పర్యటన నిమిత్తం రానున్న రెండు జట్ల ప్లేయర్స్.. తమ తమ ఫ్యామిలీస్‌తో కలిసి ఉండేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పర్యటనలో భాగంగా భారత పురుషుల జట్టు ఏకంగా నాలుగున్నర నెలలు యూకేలోనే గడపనుండగా, మహిళా జట్టు కూడా దాదాపు నెలన్నర రోజులు అక్కడే స్టే చేయనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు రూట్ సేనతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో పాల్గొనేందుకు భారత పురుషుల జట్టు, ఇంగ్లండ్ వుమెన్స్ టీమ్‌తో ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు భారత మహిళా జట్లు ఈ నెల 2న ప్రత్యేక విమానంలో లండన్‌కు బయల్దేరనున్నాయి. లండన్‌లో ల్యాండ్ అయ్యాక ఇండియా మెన్స్ టీమ్.. డబ్ల్యూటీసీ ఫైనల్ వేదికైన సౌథాంప్టన్‌కు వెళ్లనుండగా.. భారత మహిళల జట్టు ఏకైక టెస్ట్‌కు వేదికైన బ్రిస్టల్‌కు బయల్దేరుతుంది. అయితే, యూకేలో ల్యాండ్ అయ్యాక భారత బృందం 10 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. అనంతరం ప్లేయర్స్‌తో పాటు వారి కుటుంబ సభ్యుల నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టును కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. కాగా, లండన్‌కు బయల్దేరనున్న భారత బృందం ఇప్పటికే ముంబైలోని ఒకే హోటల్లో క్వారంటైన్లో ఉంటుంది. భారత్‌లో రెండో దశ కరోనా వ్యాప్తి కారణంగా ఇండియా నుంచి ప్రయాణాలపై నిషేధం ఉన్నా.. క్రికెట్ మ్యాచ్‌ల కోసం యూకే ప్రభుత్వం ప్లేయర్స్‌కు సడలింపులు ఇచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. చదవండి: నా 'ఈ స్థాయికి' ధోనినే కారణం: జడ్డూ -
ఆసియా ఆన్లైన్ చెస్: సెమీస్‌లో భారత జట్లు
చెన్నై: ఆసియా నేషన్స్ కప్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు 4–0తో; 3.5–0.5తో కిర్గిస్తాన్‌పై... భారత పురుషుల జట్టు 2.5–1.5తో; 2.5–1.5తో మంగోలియాపై గెలిచాయి. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో మంగోలియాతో భారత మహిళల జట్టు; ఇరాన్‌తో భారత పురుషుల జట్టు తలపడతాయి. టీమ్ విభాగంలో ఫలితాలను లెక్కలోనికి తీసుకొని వ్యక్తిగత విభాగంలో పతకాలను అందజేయగా... మహిళల టాప్ బోర్డుపై ఆడిన ఆర్.వైశాలి (6.5 పాయింట్లు), ఐదో బోర్డుపై ఆడిన మేరీఆన్ గోమ్స్ (5 పాయింట్లు) స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. మూడో బోర్డుపై ఆడిన పద్మిని రౌత్ (7.5 పాయింట్లు) ఖాతాలో రజతం చేరింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో రెండో బోర్డుపై ఆడిన శశికిరణ్ (8 పాయింట్లు) రజతం గెల్చుకున్నాడు. -
ఓటమితో ముగింపు
చెన్నై: నేషన్స్ కప్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నీలో భారత పురుషుల జట్టు తమ పోరాటాన్ని పరాజయంతో ముగించింది. శనివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు ఓడింది. తొలుత చైనాతో జరిగిన మ్యాచ్‌లో 1.5–2.5తో ఓటమి చవిచూసిన టీమిండియా... అనంతరం రష్యాతో జరిగిన మ్యాచ్‌లో కూడా 1.5–2.5తో ఓడిపోయింది. చైనాతో జరిగిన మ్యాచ్‌లో హరికృష్ణ, విదిత్, హారిక తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... ఆధిబన్ ఓడిపోయాడు. రష్యాతో జరిగిన మ్యాచ్‌లో హంపి గెలుపొందగా... హరికృష్ణ తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. విదిత్, ఆధిబన్ తమ గేముల్లో ఓడిపోయారు. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో నిర్ణీత పది రౌండ్ల తర్వాత భారత్ ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన చైనా, అమెరికా జట్లు నేడు జరిగే సూపర్ ఫైనల్లో టైటిల్ కోసం తలపడతాయి. -
పసిడిపై గురి
ఎస్–హెర్టోజెన్‌బాష్ (నెదర్లాండ్స్): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత పురుషుల ఆర్చరీ జట్టు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. బుధవారం క్వార్టర్ ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత బృందం... గురువారం మరో రెండు విజయాలు సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ రమేశ్ జాదవ్‌లతో కూడిన భారత బృందం క్వార్టర్ ఫైనల్లో 6–0తో చి చుంగ్ టాన్, యు చెంగ్ డెంగ్, చున్ హెంగ్ చెలతో కూడిన చైనీస్ తైపీ జట్టును ఓడించింది. భారత్ తొలి సెట్‌ను 55–52తో, రెండో సెట్‌ను 55–48తో, మూడో సెట్‌ను 55–54తో గెల్చుకుంది. ఒక్కో సెట్‌కు రెండు పాయింట్ల చొప్పున ఇస్తారు. సెమీఫైనల్లో భారత జట్టు ‘షూట్ ఆఫ్’లో వాన్ డెన్ బెర్గ్, వాన్ డెర్ వెన్, స్టీవ్ విజ్లెర్‌లతో కూడిన నెదర్లాండ్స్ జట్టుపై గెలిచింది. తొలి సెట్‌ను నెదర్లాండ్స్ 56–54తో, రెండో సెట్‌ను భారత్ 52–49తో, మూడో సెట్‌ను నెదర్లాండ్స్ 57–56తో, నాలుగో సెట్‌ను భారత్ 57–55తో గెల్చుకున్నాయి. దాంతో స్కోరు 4–4తో సమమైంది. విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ను నిర్వహించగా... భారత్ 29–28తో నెదర్లాండ్స్‌ను ఓడించి ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. 14 ఏళ్ల తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్ చేరింది. చివరిసారి 2005లో భారత్ ఫైనల్ చేరి తుది పోరులో 232–244తో కొరియా చేతిలో ఓడి రజతం దక్కించుకుంది. చివరిసారి ఫైనల్ చేరిన నాటి భారత జట్టులోనూ తరుణ్‌దీప్ రాయ్ సభ్యుడిగా ఉండటం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో భారత్ పోటీపడుతుంది. -
భారత పురుషుల ఆర్చరీ జట్టుకు ‘టోక్యో’ బెర్త్
ఎస్–హెర్టోగెన్బాష్ (నెదర్లాండ్స్): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడం ద్వారా భారత పురుషుల రికర్వ్ జట్టు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ రమేశ్ జాదవ్‌లతో కూడిన భారత బృందం ప్రిక్వార్టర్ ఫైనల్లో 5–3తో కెనడా జట్టును ఓడించింది. మరోవైపు దీపిక, బొంబేలా దేవి, కోమలికలతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో 2–6తో బెలారస్ చేతిలో ఓడింది. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో మూడో రౌండ్లోకి ప్రవేశించింది. -
‘టోక్యో’కు విజయం దూరంలో...
డెన్ బాష్ (నెదర్లాండ్స్): వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే దిశగా భారత పురుషుల, మహిళల రికర్వ్ విభాగం జట్లు మరో అడుగు ముందుకు వేశాయి. ప్రపంచ ఆర్చరీ చాంపియన్ షిప్ టీమ్ విభాగంలో భారత జట్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కెనడాతో భారత పురుషుల జట్టు... బెలారస్‌తో భారత మహిళల జట్టు తలపడతాయి. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత జట్లు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌లను ఖాయం చేసుకుంటాయి. మంగళవారం జరిగిన పురుషుల టీమ్ విభాగం తొలి రౌండ్లో తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ రమేశ్ జాదవ్‌లతో కూడిన భారత బృందం 5–1 సెట్ పాయింట్లతో సాండెర్, నెస్టింగ్, హాగెన్‌లతో కూడిన నార్వే జట్టును ఓడించింది. సెట్ గెలిస్తే రెండు పాయింట్లు, సెట్లో స్కోరు టై అయితే ఒక్కోపాయింట్ ఇస్తారు. ఒక జట్టులోని ముగ్గురు ఆర్చర్లకు ఒక్కో సెట్లో రెండు బాణాల చొప్పున అవకాశం ఇస్తారు. తొలి సెట్లో భారత్, నార్వే 55–55తో సమంగా నిలిచాయి. దాంతో స్కోరు 1–1తో సమంగా ఉంది. రెండో సెట్‌ను భారత్ 59–56తో దక్కించుకొని 3–1తో ముందంజ వేసింది. మూడో సెట్‌ను భారత్ 57–56తో గెల్చుకొని 5–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు దీపిక కుమారి, బొంబేలా దేవి, కోమలిక బారిలతో కూడిన భారత మహిళల జట్టుకు తొలి రౌండ్లో ‘బై’ లభించడంతో ఆ జట్టు నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. -
భారత జట్ల శుభారంభం
బటూమి (జార్జియా): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. సోమవారం జరిగిన తొలి రౌండ్లో భారత పురుషుల జట్టు 3.5–0.5తో ఎల్ సాల్వడార్ జట్టుపై... భారత మహిళల జట్టు 4–0తో న్యూజిలాండ్‌పై విజయం సాధించాయి. తొలి మ్యాచ్‌లో విశ్వనాథన్ ఆనంద్, ద్రోణవల్లి హారికలకు విశ్రాంతి ఇచ్చారు. పురుషుల జట్టు తరఫున పెంటేల హరికృష్ణ 33 ఎత్తుల్లో జార్జి ఎర్నెస్టో గిరోన్‌పై, విదిత్ 23 ఎత్తుల్లో రికార్డో చావెజ్‌పై, ఆధిబన్ 30 ఎత్తుల్లో డానియల్ ఎరియాస్‌పై నెగ్గగా... కార్లోస్ బర్గోస్‌తో జరిగిన గేమ్‌ను శశికిరణ్ 52 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల జట్టు తరఫున కోనేరు హంపి 36 ఎత్తుల్లో హెలెన్ మిలిగన్‌పై, తానియా సచ్దేవ్ 67 ఎత్తుల్లో వ్యాన్లా పున్సాలన్‌పై, ఇషా కరవాడే 37 ఎత్తుల్లో జాస్మిన్ జాంగ్‌పై, పద్మిని రౌత్ 36 ఎత్తుల్లో నికోల్ కిన్‌పై గెలిచారు. ఈ విజయాలతో భారత జట్లకు రెండేసి పాయింట్లు లభించాయి. -
న్యూజిలాండ్‌పై భారత్ హ్యాట్రిక్
బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత పురుషుల జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్ 4–0తో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (8వ ని.లో), సురేందర్ కుమార్ (15వ ని.లో), మన్దీప్ సింగ్ (44వ ని.లో), ఆకాశ్‌దీప్ సింగ్ (60వ ని.లో) ఒక్కోగోల్ చేశారు. తొలి క్వార్టర్లో వచ్చిన రెండో పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రూపిందర్ భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించాడు. ఈ సిరీస్‌లో రూపిందర్‌కు ఇది నాలుగో గోల్ కావడం విశేషం. అనంతరం రూపిందర్ ఇచ్చిన పాస్‌ను ప్రత్యర్థి గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ సురేందర్ గోల్ పోస్ట్‌లోకి పంపి ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. మూడో క్వార్టర్లో వెటరన్ ప్లేయర్ సర్దార్ సింగ్ ఇచ్చిన చక్కటి పాస్‌ను మన్దీప్ గోల్‌గా మలిచాడు. మరి కొద్ది క్షణాల్లో ఆట ముగుస్తుందనగా ఆకాశ్‌దీప్ మరో గోల్‌తో భారత్‌కు విజయాన్నందించాడు. -
భారత జట్లకు చుక్కెదురు
స్టార్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గైర్హాజరీ భారత బ్యాడ్మింటన్ జట్ల ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రతిష్టాత్మక థామస్–ఉబెర్ కప్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత పురుషుల, మహిళల జట్లకు అనూహ్య ఓటమి ఎదురైంది. తొలి లీగ్ మ్యాచ్‌లోనే ఓటమితో భారత జట్లకు నాకౌట్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి. బ్యాంకాక్: కోచ్‌ల వ్యూహాత్మక తప్పిదమో... ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేశారో గానీ భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు మూల్యం చెల్లించుకుంది. థామస్ కప్‌లో భాగంగా ఫ్రాన్స్ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–4తో ఓడిపోయింది. సింగిల్స్‌లో అగ్రశ్రేణి షట్లర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్‌ను... డబుల్స్‌లో మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంటను ఆడించకుండా విశ్రాంతి ఇవ్వడం భారత విజయావకాశాలపై ప్రభావం చూపించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–7, 21–18తో బ్రైస్ లెవెర్డెజ్ను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యం అందించాడు. అయితే రెండో మ్యాచ్‌లో అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జంట 13–21, 16–21తో బాస్టియన్ కెర్సాడీ–జూలియన్ మాయో జోడీ చేతిలో ఓడిపోయింది. స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో 21వ ర్యాంకర్ సమీర్ వర్మ 18–21, 22–20, 18–21తో ప్రపంచ 43వ ర్యాంకర్ లుకాస్ కోర్వీ చేతిలో ఓటమి చవిచూశాడు. దాంతో ఫ్రాన్స్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో మ్యాచ్‌లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా జంట 10–21, 12–21తో థోమ్ గికెల్–రోనన్ లాబెర్ ద్వయం చేతిలో ఓడిపోవడంతో ఫ్రాన్స్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నామ మాత్రమైన ఐదో మ్యాచ్‌లో జూనియర్ మాజీ వరల్డ్ నంబర్‌వన్ లక్ష్య సేన్ 20–22, 21–19, 19–21తో తోమా పపోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతుంది. ఇదే గ్రూప్‌లో చైనా కూడా ఉంది. నాలుగు జట్లున్న ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. సైనాకు షాక్... ఉబెర్ కప్‌లో భాగంగా కెనడాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు 1–4తో ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్ 21–15, 16–21, 16–21తో ప్రపంచ 14వ ర్యాంకర్ మిచెల్లి లీ చేతిలో పరాజయం పాలైంది. గతంలో మిచెల్లితో ఆడిన రెండుసార్లూ నెగ్గిన సైనాకు ఈసారి నిరాశ ఎదురైంది. రెండో మ్యాచ్‌లో రాచెల్ హోండెరిచ్ 21–11, 21–13తో జక్కా వైష్ణవి రెడ్డిని ఓడించి కెనడాకు 2–0తో ఆధిక్యం అందించింది. మూడో మ్యాచ్‌లో మేఘన–పూర్వీషా ద్వయం 21–19, 21–15తో మిచెల్లి టాంగ్–జోసెఫిన్ వు జంటను ఓడించింది. అయితే నాలుగో మ్యాచ్‌లో బ్రిట్నీ టామ్ 21–11, 21–15తో శ్రీకృష్ణప్రియపై నెగ్గడంతో కెనడా 3–1 తో విజయాన్ని దక్కించుకుంది. చివరి మ్యాచ్‌లో రాచెల్–క్రిస్టెన్ సాయ్ ద్వయం 21–14, 21–16తో సంయోగిత–ప్రాజక్తా జంటను ఓడించి కెనడాకు 4–1తో విజయాన్ని అందించింది. -
మూడు దశాబ్దాల తర్వాత...
హామ్‌స్టడ్ (స్వీడన్): కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఉత్సాహంతో భారత పురుషుల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. 1985 తర్వాత భారత్ తొలిసారి టాప్–15లో నిలిచింది. స్వీడన్లో ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఆచంట శరత్ కమల్, సత్యన్, హర్మీత్ దేశాయ్, ఆంథోనీ అమల్‌రాజ్, సానిల్ శెట్టిలతో కూడిన భారత జట్టు 13వ స్థానంలో నిలిచింది. ఈ స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 3–1తో రొమేనియాను ఓడించింది. తొలి మ్యాచ్‌లో సత్యన్ ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో శరత్ కమల్ 11–5, 11–9, 11–7తో హునర్‌పై గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. మూడో మ్యాచ్‌లో హర్మీత్ 11–6, 11–6, 11–8తో ప్లెటీ క్రిస్టియన్‌ను ఓడించి భారత్‌కు 2–1తో ఆధిక్యాన్ని అందించాడు. నాలుగో మ్యాచ్‌లో శరత్ కమల్ 11–13, 11–6, 11–7, 11–6తో ఒవిడియుపై నెగ్గి భారత్‌కు 3–1తో విజయాన్ని ఖాయం చేశాడు. 1985 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 12వ స్థానంలో నిలువడమే ఇప్పటివరకు భారత పురుషుల జట్టు అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. తాజా ప్రదర్శనతో భారత్ 2020 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ చాంపియన్‌షిప్ డివిజన్‌లోనే కొనసాగుతుంది. మరోవైపు భారత మహిళల జట్టు 17వ స్థానంతో సరిపెట్టుకుంది. -
భారత్‌ను గెలిపించిన శరత్ కమల్
ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు తొలి విజయం సాధించింది. స్వీడన్లో సోమవారం పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–2తో నెగ్గింది. సీనియర్ ప్లేయర్ శరత్ కమల్ తాను ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో నెగ్గి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ నెగ్గడంతో భారత విజయం ఖాయమైంది. తొలి రోజు ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–3తో ఓడిపోయింది. -
ఓటమితో ముగింపు
డసెల్డార్ఫ్ (జర్మనీ): మూడు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌ను భారత పురుషుల జట్టు ఓటమితో ముగించింది. జర్మనీతో మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. జర్మనీ తరఫున ఒలెప్రింజ్ (7వ నిమిషంలో), హెర్జ్‌బ్రచ్ (60వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మూడో జట్టుగా బెల్జియం బరిలోకి దిగిన ఈ టోర్నీలో జర్మనీ మొత్తం ఏడు పాయింట్లతో విజేతగా నిలిచింది. భారత్ ఒక విజయం, ఒక ‘డ్రా’తో నాలుగు పాయింట్లు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. రెండు విజయాలు సాధించిన బెల్జియం ఆరు పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. -
కాంస్యం నెగ్గిన భారత హాకీ జట్టు
మెల్బోర్న్: వర్గీకరణ మ్యాచ్‌లో ఆద్యంతం ఆధిపత్యం చలారుుంచిన భారత పురుషుల జట్టు నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్లో కాంస్య పతకాన్ని సాధించింది. మలేసియా జట్టుతో మూడు, నాలుగు స్థానాల కోసం ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (2వ ని.లో), కెప్టెన్ రఘునాథ్ (45వ ని.లో), తల్విందర్ సింగ్ (52వ ని.లో), రూపిందర్ పాల్ సింగ్ (58వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... మలేసియా జట్టుకు జోయెల్ వాన్ హుజెల్ (45వ ని.లో) ఏకై క గోల్ అందించాడు. మరోవైపు ఆస్ట్రేలియా మహిళల హాకీ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోరుుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో టీమిండియా 1-3తో ఓడిపోరుుంది. భారత్ తరఫున మోనిక (30వ ని.లో) ఏకై క గోల్ చేసింది. -
సర్దార్ సింగ్‌కే పగ్గాలు
హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీకి భారత జట్టు ప్రకటన బెంగళూరు: స్వదేశంలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్లో పాల్గొనే భారత పురుషుల జట్టుకు సర్దార్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈనెల 27 నుంచి డిసెంబరు 6 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరుగుతుంది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, బ్రిటన్, అర్జెంటీనా, జర్మనీ, నెదర్లాండ్స్ జట్లు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి. 18 మంది సభ్యులుగల ఈ జట్టుకు గోల్‌కీపర్ శ్రీజేష్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ టోర్నీకి సన్నాహకంగా భారత జట్టు ఈనెల 19 నుంచి 23 తేదీల మధ్య ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొంటుంది. భారత హాకీ జట్టు: సర్దార్ సింగ్ (కెప్టెన్), శ్రీజేష్ (వైస్ కెప్టెన్), హర్జోత్ సింగ్, బీరేంద్ర లాక్రా, కొతాజిత్ సింగ్, రఘునాథ్, జస్జీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, చింగ్లెన్సనా సింగ్, దేవిందర్ వాల్మీకి, మన్‌ప్రీత్ సింగ్, ధరమ్వీర్ సింగ్, డానిష్ ముజ్తబా, ఎస్వీ సునీల్, రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, తల్వీందర్ సింగ్.