టైటిల్‌ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...  | Indian mens team in the Thomas Cup | Sakshi
Sakshi News home page

టైటిల్‌ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో... 

Published Sat, Apr 27 2024 12:53 AM | Last Updated on Sat, Apr 27 2024 12:53 AM

Indian mens team in the Thomas Cup

థామస్‌ కప్‌ బరిలో భారత పురుషుల జట్టు

తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో ‘ఢీ’  

చెంగ్డూ (చైనా): రెండేళ్ల క్రితం థామస్‌ కప్‌ టోర్నమెంట్‌లో తొలిసారి విజేతగా నిలిచి పెను సంచలనం  సృష్టించిన భారత పురుషుల జట్టు అదే ఫలితాన్ని ఈసారీ పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టీమ్‌ ఈవెంట్‌లో భారత జట్టు బరిలోకి దిగనుంది. 

గ్రూప్‌ ‘సి’లో ఇండోనేసియా, థాయ్‌లాండ్, ఇంగ్లండ్‌లతో కలిసి భారత్‌ పోటీపడనుంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్‌ ‘ఢీ’ కొంటుంది. మహిళల టీమ్‌ ఈవెంట్‌ అయిన ఉబెర్‌ కప్‌లో  భారత జట్టు ద్వితీయ శ్రేణి క్రీడాకారిణులతో బరిలోకి దిగనుంది.

సింధు, అశ్విని పొన్నప్ప, తనీషా, గాయత్రి, ట్రెసా ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. గ్రూప్‌ ‘ఎ’లో కెనడా, చైనా, సింగపూర్‌లతో కలిసి భారత్‌ ఉంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో కెనడాతో భారత్‌ ఆడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement