సర్దార్ సింగ్‌కే పగ్గాలు
హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీకి భారత జట్టు ప్రకటన
బెంగళూరు: స్వదేశంలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టుకు సర్దార్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈనెల 27 నుంచి డిసెంబరు 6 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరుగుతుంది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, బ్రిటన్, అర్జెంటీనా, జర్మనీ, నెదర్లాండ్స్ జట్లు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి. 18 మంది సభ్యులుగల ఈ జట్టుకు గోల్‌కీపర్ శ్రీజేష్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
ఈ టోర్నీకి సన్నాహకంగా భారత జట్టు ఈనెల 19 నుంచి 23 తేదీల మధ్య ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొంటుంది.
భారత హాకీ జట్టు: సర్దార్ సింగ్ (కెప్టెన్), శ్రీజేష్ (వైస్ కెప్టెన్), హర్జోత్ సింగ్, బీరేంద్ర లాక్రా, కొతాజిత్ సింగ్, రఘునాథ్, జస్జీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, చింగ్లెన్‌సనా సింగ్, దేవిందర్ వాల్మీకి, మన్‌ప్రీత్ సింగ్, ధరమ్‌వీర్ సింగ్, డానిష్ ముజ్తబా, ఎస్‌వీ సునీల్, రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, తల్వీందర్ సింగ్.