Hockey World League final tournament
-
జర్మనీపై గెలిచి... కాంస్యంతో మెరిసి
భువనేశ్వర్: సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నీలో భారత్ కాంస్య పతకంతో మెరిసింది. ఒలింపిక్స్, ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీతో ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట 21వ నిమిషంలో ఎస్వీ సునీల్ గోల్‌తో భారత్ ఖాతా తెరువగా... 36వ నిమిషంలో మార్క్ అపెల్ గోల్‌తో జర్మనీ స్కోరును సమం చేసింది. మ్యాచ్ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా... 54వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి టీమిండియాకు 2–1తో ఆధిక్యాన్ని అందించాడు. కాంస్య పతకం నెగ్గిన భారత జట్టు సభ్యులందరికీ రూ. 10 లక్షల చొప్పున నగదు పురస్కారం అందజేస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. మరోవైపు ఫైనల్లో విశ్వవిజేత ఆస్ట్రేలియా 2–1తో రియో ఒలింపిక్స్ విజేత అర్జెంటీనాను ఓడించి వరుసగా రెండోసారి హెచ్‌డబ్ల్యూఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
మరో సంచలనంపై దృష్టి
* నేడు బెల్జియంతో భారత్ సెమీస్ మ్యాచ్ * హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ రాయ్‌పూర్: అమోఘమైన ఆటతీరుతో గ్రేట్ బ్రిటన్‌పై సంచలన విజయం సాధించిన భారత హాకీ జట్టు మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీలో శనివారం జరిగే సెమీఫైనల్లో పటిష్టమైన బెల్జియంతో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో పూర్తిగా నిరాశపర్చిన సర్దార్‌సేన ప్రస్తుతం నిలకడలేమితో ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని కోచ్ ఓల్ట్మన్ కూడా అంగీకరిస్తున్నారు. అయితే బ్రిటన్‌పై భారత డిఫెన్స్ సమర్థంగా పని చేసింది. ఈ మ్యాచ్‌లో కూడా ఇది కొనసాగితే మరో సంచలనాన్ని ఊహించొచ్చు. లీగ్ దశ నుంచి అద్భుతంగా ఆడుతున్న బెల్జియంను ఓడించడం అనుకున్నంత సులువు కాదు. అన్ని రంగాల్లోనూ ఈ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో హెచ్‌డబ్ల్యూఎల్ సెమీస్‌లో భారత్‌పై గెలవడం వాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. ఊహించని రీతిలో గోల్స్ కొట్టడంలో బెల్జియన్లు సిద్ధహస్తులు. కాబట్టి వాళ్లను నిలువరించాలంటే భారత్ శక్తికి మించి పోరాడాల్సిందే. నెదర్లాండ్స్‌కు షాక్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్ జట్టుకు ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా 3-2 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆస్ట్రేలియా తరఫున వొతెర్స్పూన్ (8వ ని.లో), బీల్ (22వ ని.లో), గోడ్స్ (42వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్‌కు జోంకర్ (29వ ని.లో), ప్రుసెర్ (33వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. భారత్, బెల్జియంల మధ్య సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా తలపడుతుంది. -
భారత్‌కు తాడోపేడో
నేడు బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్ హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ నేటి క్వార్టర్ ఫైనల్స్ సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం రాయ్‌పూర్: లీగ్ దశలో నిరాశపరిచిన భారత హాకీ జట్టు నాకౌట్ దశలో లభించిన ఏకైక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో భాగంగా గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ ‘బి’లో అజేయంగా నిలిచి అగ్రస్థానాన్ని దక్కించుకున్న బ్రిటన్ను ఓడించాలంటే భారత ఆటగాళ్లు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. గ్రూప్ ‘ఎ’లో చివరిదైన నాలుగో స్థానంలో నిలిచిన భారత్ నిర్ణాయక మ్యాచ్‌లో పూర్తి సమన్వయంతో ఆడటంతోపాటు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతుంది. ‘భారత ఆటగాళ్లలో నిలకడలేమి ఉందని చెప్పలేను. అయితే కొన్ని విభాగాల్లో మాత్రం కచ్చితంగా పురోగతి సాధించాల్సి ఉంది. సంయమనంతో ఆడుతూ అనుకున్న వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. మిడ్ ఫీల్డర్లు రాణిస్తున్నా... ఫార్వర్డ్స్ ఫినిషింగ్ మాత్రం చేయలేకపోతున్నారు’ అని భారత జట్టు చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్ తెలిపారు. మరో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనాతో బెల్జియం తలపడుతుంది. సెమీస్‌లో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్ 2-0 గోల్స్ తేడాతో కెనడాను ఓడించగా... ఆస్ట్రేలియా 3-1తో జర్మనీపై గెలిచి సెమీఫైనల్స్‌కు చేరాయి. -
సర్దార్ సింగ్‌కే పగ్గాలు
హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీకి భారత జట్టు ప్రకటన బెంగళూరు: స్వదేశంలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్లో పాల్గొనే భారత పురుషుల జట్టుకు సర్దార్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈనెల 27 నుంచి డిసెంబరు 6 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరుగుతుంది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, బ్రిటన్, అర్జెంటీనా, జర్మనీ, నెదర్లాండ్స్ జట్లు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి. 18 మంది సభ్యులుగల ఈ జట్టుకు గోల్‌కీపర్ శ్రీజేష్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ టోర్నీకి సన్నాహకంగా భారత జట్టు ఈనెల 19 నుంచి 23 తేదీల మధ్య ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొంటుంది. భారత హాకీ జట్టు: సర్దార్ సింగ్ (కెప్టెన్), శ్రీజేష్ (వైస్ కెప్టెన్), హర్జోత్ సింగ్, బీరేంద్ర లాక్రా, కొతాజిత్ సింగ్, రఘునాథ్, జస్జీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, చింగ్లెన్సనా సింగ్, దేవిందర్ వాల్మీకి, మన్‌ప్రీత్ సింగ్, ధరమ్వీర్ సింగ్, డానిష్ ముజ్తబా, ఎస్వీ సునీల్, రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, తల్వీందర్ సింగ్.