
ఎస్–హెర్టోగెన్‌బాష్ (నెదర్లాండ్స్): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడం ద్వారా భారత పురుషుల రికర్వ్ జట్టు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ రమేశ్ జాదవ్‌లతో కూడిన భారత బృందం ప్రిక్వార్టర్ ఫైనల్లో 5–3తో కెనడా జట్టును ఓడించింది. మరోవైపు దీపిక, బొంబేలా దేవి, కోమలికలతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో 2–6తో బెలారస్ చేతిలో ఓడింది. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది.
Comments
Please login to add a commentAdd a comment