Atanu Das
-
Tokyo Olympics: మహిళల 100 మీ. విభాగం.. ప్రపంచ రికార్డు
Tokyo Olympics 2020: మహిళల 100 మీటర్ల విభాగంలో స్ప్రింటర్ ఎలైన్ థామ్సన్‌కు స్వర్ణం దక్కింది. 10.61 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసిన ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పింది. క్వార్టర్ ఫైనల్లోకి భారత మహిళల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. బ్రిటన్ జట్టు ఐర్లాండ్ ను 2-0 గోల్స్ తేడాతో ఓడించడంతో భారత్ క్వార్టర్ ఫైనల్లో ఆడే అవకాశం దక్కింది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల హాకీ జట్టు క్వార్టర్స కు చేరుకుంది. ఒలింపిక్స్ క్రీడలు మొదలైనప్పటి నుంచి ఇది మూడోసారి మాత్రమే. రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై 4-3తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. పోరాడి ఓడిన సింధు సెమీ ఫైనల్లో తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. చైనీస్ తైపీకి చెందిన తైజుయింగ్ చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో 18-21, రెండో గేమ్‌లో 12-21 తేడాతో తైజు చేతిలో ఓడిపోయింది. రెండో గేమ్‌లోనూ వెనుకంజ సెమీస్‌లో తొలి గేమ్ ఓడిన పీవీ సింధు రెండో గేమ్‌లోనూ వెనుకబడి ఉంది. తైజు 20-12తో ముందంజలో నిలిచింది. సింధుపై ఒత్తిడి పెంచుతూ తైజు అటాకింగ్ కొనసాగిస్తోంది. తొలి గేమ్ ఓడిపోయిన పీవీ సింధు సెమీ ఫైనల్లో వరల్డ్ నెంబర్ వన్ తైజుయింగ్ సత్తా చాటుతోంది. తొలి గేమ్‌లో 21-18తో పీవీ సింధును ఓడించింది. హోరాహోరీగా పీవీ సింధు- తైజు సమరం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీస్‌లో పీవీ సింధు- తైజుయింగ్ మధ్య పోరు నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతోంది. తొలి గేమ్‌లో ఆధిక్యం దిశగా సింధు దూసుకుపోయినప్పటికీ.. తైజు సైతం గట్టి పోటీనిస్తోంది. క్వార్టర్ ఫైనల్లో బాక్సర్ పూజారాణి ఓటమి టోక్యో ఒలింపిక్స్ లో బాక్సర్ పూజారాణి పోరాటం ముగిసింది. మహిళల (69-75 కేజీలు) విభాగంలో క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన క్వియాన్ లీ చేతిలో పూజారాణి ఓటమి పాలయ్యింది. సెమీస్ మ్యాచ్ 1 లో గెలిచి ఫైనల్ చేరిన చైనా షట్లర్ చెన్ యు ఫెయ్.. టోక్యో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ -2లో చైనా షట్లర్ చెన్ యు ఫెయ్, బింగ్జియావో పై విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది. హోరాహోరీగా ఈ మ్యాచ్ లో ఫస్ట్ గేమ్‌లో చెన్ యూ ఫెయ్ 21-16తో విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో బింగ్జియావో13-21 తో విజయం సాధించింది.దీంతో మూడో మ్యాచ్‌లో చైనా షట్లర్ చెన్ యు ఫెయ్ విజయం సాధించింది మొదటి రౌండ్లో ఓడిన భారత బాక్సర్ పూజా రాణి టోక్యో ఒలింపిక్స్ లో మహిళల మిడిల్ వెయిట్ (75 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన క్వియాన్ లీతో భారత పూజా రాణి మొదటి రౌండ్ 0-5తో ఓడిపోయింది. టోక్యో: బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్(2) కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. తొలి సెమీస్ ముగిసిన తర్వాతే పీవీ సింధు- తైజుయింగ్ పోరుకు రంగం సిద్ధం కానుంది. కాసేపట్లో తైజుయింగ్‌తో తలపడనున్న పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ తైజుయింగ్‌తో సింధు మరికాసెపట్లో తలపడునుంది. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించి విశ్వ యవనికపై భారత పతకాన్ని రెపరెపలాడించిన సింధు టోక్యోలోనూ సత్తా చాటుతోంది. తాజా ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సింధు పతకానికి రెండడుగుల దూరంలో ఉంది. సింధు, తైజుయింగ్ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. (చదవండి: Tokyo Olympics 2020: భారత్ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు..) 50 మీ రైఫిల్ విభాగంలో భారత షూటర్లకు నిరాశ ►టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు మరోసారి నిరాశపరిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో అంజుమ్ ముద్గిల్, తేజస్విని సావంత్‌లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన అంజుమ్. ఇవాళ జరిగిన ఈవెంట్లో క్వాలిఫయింగ్ రౌండ్లో 15వ స్థానంలో నిలిచింది. ఆమె 1167 స్కోర్ చేసింది. మరో షూటర్ తేజస్విని 1154 స్కోర్‌తో 33వ స్థానంలో నిలిచింది. అయితే కేవలం టాప్ 8 మంది షూటర్లు మాత్రమే ఈ ఈవెంట్లో ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. యుసియా జికోవా ఒలింపిక్ రికార్డు క్రియేట్ చేసింది. 1182 స్కోర్ చేసి ఆమె ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. భారత మహిళల హాకీ జట్టుకు మరో విజయం ►టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీ మ్యాచ్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ మహిళల జట్టు విజయాన్ని అందుకుంది. చివరివరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో భారత్ 4-3 తేడాతో గెలిచి క్వార్టర్స్ రేసులో నిలిచింది. భారత్ తరపున ఆట 4,17, 49వ నిమిషంలో వందన కటారియా, 32 నిమిషంలో నేహా గోల్స్ చేయగా.. దక్షిణాఫ్రికా తరపున మారియా, హంటర్, టీసీ గ్లాస్బీలు గోల్స్ చేశారు. ప్రస్తుతం క్వార్టర్స్ రేసులో ఉన్న భారత్ .. బ్రిటన్, ఐర్లాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓడిపోయినా లేక మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా భారత్‌కు క్వార్టర్స్ అవకాశం ఉంటుంది. డిస్కస్ త్రో ఫైనల్లో కమల్‌ప్రీత్ కౌర్ ►టోక్యో ఒలింపిక్స్‌లో డిస్కస్ త్రో విభాగంలో కమల్‌ప్రీత్ కౌర్ సంచలనం సృష్టించింది. డిస్కస్ త్రో విభాగంలో 64 మీటర్ల దూరం విసిరితే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. కాగా కమల్‌ప్రీత్ మూడో ప్రయత్నంలో సరిగ్గా 64 మీ విసిరి ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. మొత్తం మూడు రౌండ్లపాటు జరిగిన డిస్కస్‌త్రోలో కమల్‌ప్రీత్ తొలి రౌండ్లో 60.29, రెండో రౌండ్లో 63.97, మూడో రౌండ్లో 64 మీ విసరడం విశేషం. ఇక ఈ ఈవెంట్లోనే గ్రూప్-ఏలో పార్టిసిపేట్ చేసిన మరో ఇండియన్ డిస్కస్ త్రోయర్ సీమా పూనియా 60.57 మీటర్ల దూరమే విసిరి ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయింది. మొత్తంగా సీమా పూనియా16వ స్థానంలో నిలిచింది. #TeamIndia | #Tokyo2020 | #Athletics Women's Discus Throw Qualification Results A superb 6⃣4⃣m throw by #KamalpreetKaur to qualify for the Finals in Group B, while #SeemaPunia bows out, finishing 6th in Group A! #RukengeNahi #EkIndiaTeamIndia #Cheer4India pic.twitter.com/7ZwoeX8rWy — Team India (@WeAreTeamIndia) July 31, 2021 ప్రీక్వార్టర్స్‌లో అమిత్ పంగల్ ఓటమి ►ఇండియాకు బాక్సింగ్‌లో కచ్చితంగా మెడల్ తీసుకొస్తాడనుకున్న బాక్సర్ అమిత్ పంగాల్‌కు షాక్ తగిలింది. అతడు ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టాడు. కొలంబియా బాక్సర్ మార్టినెజ్ రివాస్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్ బౌట్లో1-4 తేడాతో అమిత్ పరాజయం పాలయ్యాడు. 48-52 కేజీల ఫ్లైవెయిట్ కేటగిరీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన అమిత్.. ఈసారి మెడల్ హాట్ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్నాడు. కానీ అతడు కనీసం క్వార్టర్స్‌కు చేరుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగించేదే. బౌట్ మొత్తం అటాకింగ్ కంటే డిఫెన్స్‌కే ప్రాధాన్యమిచ్చిన అమిత్.. తగిన మూల్యం చెల్లించాడు. రౌండ్ ఆఫ్ 8లో అతాను దాస్ ఓటమి ►టోక్యో ఒలింపిక్స్‌లో ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాస్ పోరు ముగిసింది. ప్రీక్వార్టర్స్‌లో భాగంగా జపాన్‌కు చెందిన ఫురుకవా తకహారుతో జరిగిన మ్యాచ్‌లో అతాను 6-4 తేడాతో పరాజయం పాలయ్యాడు. తొలి మూడు సెట్ల పాటు వీరిద్దరు హోరాహోరీగా తలప్డడారు. అయితే నాలుగ, ఐదో సెట్లో అతాను వరుసగా 27, 28 పాయింట్లు సాధించాడు. అయితే జపాన్ ఆటగాడు తకహారు 28, 29 పాయింట్లు సాధించడంతో అతాను దాస్ ఓటమి ఖాయమైంది. డిస్కస్ త్రోలో సీమా పూనియా ఐదో స్థానం ►టోక్యో ఒలింపిక్స్‌లో డిస్కస్ త్రో విభాగంలో సీమా పూనియా బరిలోకి దిగి నిరాశపరిచింది. లాంగ్ డిస్కస్ త్రో విభాగంలో ఆమె 60.57 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో నేటి మ్యాచ్‌లు ఉదయం 7 గంటలకు స్విమ్మింగ్ పురుషుల 100 మీ. బటర్‌ఫ్లై ఫైనల్ ఉదయం 7:07 గంటలకు స్విమ్మింగ్ మహిళల 200 మీ. బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్ ఉదయం 7:16కు స్విమ్మింగ్ మహిళల 800 మీ. ప్రీ స్టైల్ ఫైనల్ ఉదయం 7:18కి ఆర్చరీ పురుషుల వ్యక్తిగత రికర్వ్ ప్రి క్వార్టర్స్ (అతానుదాస్) -
ఆర్చర్లు అద్భుతం చేసేనా?
టోక్యో ఒలింపిక్స్ క్రీడల మూడో రోజు తొమ్మిది క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే మూడింటిలో (ఆర్చరీ, షూటింగ్, ఫెన్సింగ్) మాత్రమే మనోళ్లు పతకాల కోసం పోటీపడనున్నారు. పురుషుల ఆర్చరీ టీమ్ విభాగంలో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కూడిన భారత బృందం తొలి రౌండ్లో కజకిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా జట్టుతో టీమిండియా ఆడాల్సి ఉంటుంది. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో తొలిసారి టీమ్ ఈవెంట్ మొదలయ్యాక దక్షిణ కొరియా పురుషుల జట్టు ఐదుసార్లు స్వర్ణ పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో కొరియాపై భారత్ అద్భుతం చేస్తే సెమీఫైనల్ చేరుకొని కాంస్య పతకం రేసులో నిలుస్తుంది. పురుషుల టీమ్ విభాగం తొలి రౌండ్: భారత్ x కజకిస్తాన్ (ఉదయం గం. 6 నుంచి) -
సెమీస్‌లో దీపిక, అతాను దాస్
గ్వాటెమాలా సిటీ: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో పురుషుల, మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ ఆర్చర్లు, భార్యభర్తలైన దీపిక కుమారి, అతాను దాస్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల క్వార్టర్ ఫైనల్స్‌లో దీపిక కుమారి 6–0తో మిచెల్లి క్రాపెన్ (జర్మనీ)పై గెలుపొందగా... అంకిత 2–6తో అలెజాండ్రా వలెన్సియా (మెక్సికో) చేతిలో ఓడిపోయింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో 6–4తో ఎరిక్ పీటర్స్ (కెనడా)పై గెలుపొందాడు. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రెండో రౌండ్లో 5–6తో డానియల్ క్యాస్ట్రో (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల టీమ్ విభాగం క్వార్టర్ ఫైనల్లో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కూడిన భారత జట్టు 4–5తో గార్సియా, క్యాస్ట్రో, పాబ్లోలతో కూడిన స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో మహిళల జట్టు మహిళల టీమ్ విభాగంలో దీపిక కుమారి, అంకిత, కోమలికలతో కూడిన భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో టీమిండియా 6–0తో ఇలియా, ఇనెస్, లెరీ ఫెర్నాండెజ్‌లతో కూడిన స్పెయిన్‌పై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 6–0తో నాన్సీ, సింతియా, కామిలాలతో కూడిన గ్వాటెమాలా జట్టును ఓడించింది. -
‘టోక్యో’ ఈవెంట్‌ను కెరీర్ బెస్ట్‌గా మలచుకుంటా
న్యూఢిల్లీ: ఆర్చర్ అతాను దాస్ వచ్చే ఏడాది జరిగే ‘టోక్యో ఒలింపిక్స్’ను తన కెరీర్లోనే అత్యుత్తమంగా మలచుకుంటానని చెప్పాడు. గత రియో ఒలింపిక్స్‌లో సాధారణ ప్రదర్శనతో తేలిపోయిన అతను టోక్యో క్రీడల కోసం పట్టుదలతో సిద్ధమయ్యానని చెప్పాడు. లైవ్ చాట్‌లో ఆర్చర్ మాట్లాడుతూ ‘నాలుగేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌పై ఎక్కడలేని ఆసక్తి కనబరిచాను. అది నా తొలి మెగా ఈవెంట్. అయినాసరే నేను నా శక్తిమేర రాణించాను. ఉత్తమ ప్రదర్శనే ఇచ్చాను. కానీ దురదృష్టవశాత్తు క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాను. దీంతో నిరాశ చెందాను. దీనిపై మాట్లాడేందుకు కూడా ఇష్టపడేవాణ్ని కాదు. మెల్లిగా ఆ ఓటమి నుంచి ఎంతో నేర్చుకున్నాను. నా లోటుపాట్లేంటో బాగా తెలుసుకున్నాను. వాటిపైనే దృష్టి పెట్టాను. సానుకూల దృక్పథం కోసం మంచి ఆలోచనలే చేయాలనుకున్నాను’ అని వివరించాడు. ‘రియో’ నైరాశ్యం అధిగమించేందుకు తాను మానసిక ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చాడు. 2006లో ఆర్చరీని కెరీర్‌గా ఎంచుకున్న తనకు మరుసటి ఏడాది టాటా అకాడమీలో శిక్షణ కోసం వెళితే తిరస్కరణ ఎదురైందని దీంతో మరింత కష్టపడి పట్టుదలగా ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. ఆరు నెలల వ్యవధిలో సబ్–జూనియర్ జాతీయ పోటీల్లో రికర్వ్ ఈవెంట్లో స్వర్ణం గెలవడంతో టాటా అకాడమీ ఎంపిక చేసుకుందని అనాటి విషయాల్ని అతాను దాస్ వివరించాడు. -
అర్జున అవార్డుకు ఇషాంత్ నామినేట్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. అతడితో పాటు ఆర్చర్ అతాను దాస్, హాకీ క్రీడాకారిణి దీపికా ఠాకూర్, క్రికెటర్ దీపక్ హుడా, టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరన్ సహా 29 మంది అథెట్ల పేర్లను ఈ పురస్కారానికి నామినేట్ చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా 31 ఏళ్ల ఇషాంత్ శర్మ 97 టెస్టులు, 80 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు తీశాడు. (ఖేల్ రత్న అవార్డుకు రోహిత్ శర్మ నామినేట్) ఇక రియో ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్, వరల్డ్ చాంఫియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను పేర్లను కూడా ఈ అవార్డుకు పరిశీలించగా చివరి నిమిషంలో పక్కకు పెట్టినట్లు సమాచారం. రియో ఒలంపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన సాక్షి 2016లో క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్న పొందగా.. మీరాబాయి 2018లో ఈ అవార్డు అందుకున్నారు. ఈ కారణంతో వారి పేర్లను క్రీడా మంత్రి కిరణ్ రిజిజు పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాభినందనలు టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరును క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు క్రీడా మంత్రిత్వశాఖ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్‌తో పాటు రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ సంచలనం మనిక బాత్రా, రియో పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు పేర్లను ప్రతిష్టాత్మక పురస్కారానికి సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రోహిత్ శర్మ, వినేశ్ ఫొగట్, మనిక బాత్రా, మరియప్పన్ తంగవేలుకు శుభాభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. -
జూన్ 30న దీపిక–అతాను పెళ్లి
ఎట్టకేలకు భారత అగ్రశ్రేణి ఆర్చరీ జంట దీపికా కుమారి, అతాను దాస్‌ల వివాహానికి ముహూర్తం కుదిరింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూనే ఈ నెల 30న వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండేళ్ల క్రితమే వీరిద్దరికి నిశ్చితార్ధం జరిగినా... వేర్వేరు కారణాలతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. గత సంవత్సరమే పెళ్లి చేసుకోవాలనుకున్నా బిజీ షెడ్యూల్ కారణంగా కుదర్లేదు. దాంతో టోక్యో ఒలింపిక్స్ ముగియగానే ఒకటి కావాలని భావించారు. అయితే కోవిడ్–19 కారణంగా ఒలింపిక్స్ ఏకంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. కరోనాతో కఠిన నిబంధనల మధ్య తక్కువ మంది అతిథులతోనే చేసుకోవాల్సి వస్తున్నా... ఇక వాయిదా వేసే పరిస్థితి లేదని, పెళ్లికి ఇంతకంటే సరైన సమయం లభించదని దీపిక వెల్లడించింది. -
విల్లు వదిలి వంట గదిలో...
కోల్‌కతా: టోక్యో ఒలింపిక్స్ తర్వాత పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న ఆ జంటకు కరోనా ‘శరా’ఘాతంలా తగిలింది. మెగా ఈవెంట్ ఏకంగా ఏడాదిపాటు వాయిదా పడటంతో వారి ప్రణాళిక మారిపోయింది. ఒలింపిక్స్‌కు సమయముంది కాబట్టి ఇక ముందుగా పెళ్ళికే వీరిద్దరు సిద్ధమైపోతున్నారు. భారత అగ్రశ్రేణి ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్ గురించే ఇదంతా. వీరిద్దరి నిశ్చితార్థం జరిగి దాదాపు రెండేళ్లవుతోంది. టోక్యో ఒలింపిక్స్‌కు వీరిద్దరు ఇప్పటికే అర్హత సాధించారు. రాంచీకి చెందిన దీపిక, ప్రస్తుతం కోల్‌కతాలో దాస్‌తో కలిసే ఉంటోంది. ఇప్పుడు లభించిన విరామంలో ఆమె దృష్టి ప్రస్తుతం విల్లంబులకంటే వంటగదిపైనే ఉంది. ఇదే విషయాన్ని తాను చెప్పుకుంది. ‘ఇప్పటివరకు నాకు అన్నం, కొంత వరకు పప్పు వండటం మాత్రమే వచ్చు. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నా. ముఖ్యంగా చికెన్ వంటకాలంటే ఇష్టం. రాంచీ నుంచి మా అమ్మ ఆన్లైన్లో ఇవన్నీ నాకు నేర్పిస్తోంది. ప్రాణాయామంతో రోజు మొదలు పెడితే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నా పని వంట నేర్చుకోవడమే’ అని దీపిక చెప్పింది. దీపిక, అతాను దాస్ కలిసి ప్రస్తుతం తమ ఇంట్లోనే ఐదు మీటర్ల తాత్కాలిక రేంజ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి అసలు లక్ష్యంతో పోలిస్తే ఇది ఏమాత్రం లెక్కలోనికి రాదు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే ఏమీ చేయలేం. ఒక రకంగా ఇది కంప్యూటర్ గేమ్లాంటిదే. కానీ కనీసం ఆర్చరీని మరచిపోకుండా ఇది గుర్తు చేస్తున్నట్లు, క్యాంప్ మొదలయ్యే సమయానికి ఆటపై ఆసక్తి పోకుండా ఉంచుతుందనేది మా నమ్మకం. కనీసం రెండు గంటల పాటు ఇలా సాధన చేస్తున్నాం’ అని దీపిక వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్ ముగియగానే పెళ్లి చేసుకోవాలనుకున్నా... ఇప్పుడు కరోనా నుంచి అంతా సాధారణ స్థితికి మారగానే వివాహ ఏర్పాట్లు మొదలుపెడతామని వీరిద్దరు చెప్పారు. దీపిక 2012, 2016 ఒలింపిక్స్‌లలో, అతాను 2016 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. -
పసిడిపై గురి
ఎస్–హెర్టోజెన్‌బాష్ (నెదర్లాండ్స్): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత పురుషుల ఆర్చరీ జట్టు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. బుధవారం క్వార్టర్ ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత బృందం... గురువారం మరో రెండు విజయాలు సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ రమేశ్ జాదవ్‌లతో కూడిన భారత బృందం క్వార్టర్ ఫైనల్లో 6–0తో చి చుంగ్ టాన్, యు చెంగ్ డెంగ్, చున్ హెంగ్ చెలతో కూడిన చైనీస్ తైపీ జట్టును ఓడించింది. భారత్ తొలి సెట్‌ను 55–52తో, రెండో సెట్‌ను 55–48తో, మూడో సెట్‌ను 55–54తో గెల్చుకుంది. ఒక్కో సెట్‌కు రెండు పాయింట్ల చొప్పున ఇస్తారు. సెమీఫైనల్లో భారత జట్టు ‘షూట్ ఆఫ్’లో వాన్ డెన్ బెర్గ్, వాన్ డెర్ వెన్, స్టీవ్ విజ్లెర్‌లతో కూడిన నెదర్లాండ్స్ జట్టుపై గెలిచింది. తొలి సెట్‌ను నెదర్లాండ్స్ 56–54తో, రెండో సెట్‌ను భారత్ 52–49తో, మూడో సెట్‌ను నెదర్లాండ్స్ 57–56తో, నాలుగో సెట్‌ను భారత్ 57–55తో గెల్చుకున్నాయి. దాంతో స్కోరు 4–4తో సమమైంది. విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ను నిర్వహించగా... భారత్ 29–28తో నెదర్లాండ్స్‌ను ఓడించి ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. 14 ఏళ్ల తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్ చేరింది. చివరిసారి 2005లో భారత్ ఫైనల్ చేరి తుది పోరులో 232–244తో కొరియా చేతిలో ఓడి రజతం దక్కించుకుంది. చివరిసారి ఫైనల్ చేరిన నాటి భారత జట్టులోనూ తరుణ్‌దీప్ రాయ్ సభ్యుడిగా ఉండటం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో భారత్ పోటీపడుతుంది. -
భారత పురుషుల ఆర్చరీ జట్టుకు ‘టోక్యో’ బెర్త్
ఎస్–హెర్టోగెన్బాష్ (నెదర్లాండ్స్): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడం ద్వారా భారత పురుషుల రికర్వ్ జట్టు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ రమేశ్ జాదవ్‌లతో కూడిన భారత బృందం ప్రిక్వార్టర్ ఫైనల్లో 5–3తో కెనడా జట్టును ఓడించింది. మరోవైపు దీపిక, బొంబేలా దేవి, కోమలికలతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో 2–6తో బెలారస్ చేతిలో ఓడింది. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో మూడో రౌండ్లోకి ప్రవేశించింది. -
‘టోక్యో’కు విజయం దూరంలో...
డెన్ బాష్ (నెదర్లాండ్స్): వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే దిశగా భారత పురుషుల, మహిళల రికర్వ్ విభాగం జట్లు మరో అడుగు ముందుకు వేశాయి. ప్రపంచ ఆర్చరీ చాంపియన్ షిప్ టీమ్ విభాగంలో భారత జట్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కెనడాతో భారత పురుషుల జట్టు... బెలారస్‌తో భారత మహిళల జట్టు తలపడతాయి. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత జట్లు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌లను ఖాయం చేసుకుంటాయి. మంగళవారం జరిగిన పురుషుల టీమ్ విభాగం తొలి రౌండ్లో తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ రమేశ్ జాదవ్‌లతో కూడిన భారత బృందం 5–1 సెట్ పాయింట్లతో సాండెర్, నెస్టింగ్, హాగెన్‌లతో కూడిన నార్వే జట్టును ఓడించింది. సెట్ గెలిస్తే రెండు పాయింట్లు, సెట్లో స్కోరు టై అయితే ఒక్కోపాయింట్ ఇస్తారు. ఒక జట్టులోని ముగ్గురు ఆర్చర్లకు ఒక్కో సెట్లో రెండు బాణాల చొప్పున అవకాశం ఇస్తారు. తొలి సెట్లో భారత్, నార్వే 55–55తో సమంగా నిలిచాయి. దాంతో స్కోరు 1–1తో సమంగా ఉంది. రెండో సెట్‌ను భారత్ 59–56తో దక్కించుకొని 3–1తో ముందంజ వేసింది. మూడో సెట్‌ను భారత్ 57–56తో గెల్చుకొని 5–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు దీపిక కుమారి, బొంబేలా దేవి, కోమలిక బారిలతో కూడిన భారత మహిళల జట్టుకు తొలి రౌండ్లో ‘బై’ లభించడంతో ఆ జట్టు నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. -
పెళ్లి ‘గురి’ కుదిరింది...
రాంచీ: భారత ఒలింపియన్ ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్ ‘ప్రేమ బాణం’ సరిగ్గా లక్ష్యాన్ని చేరింది. ఐదేళ్ల క్రితం తొలిసారి కుదిరిన గురి ఇప్పుడు పెళ్లి దాకా చేరింది. మైదానంలో కలిసి ఆడిన, కలిసి పతకాలు పంచుకున్న క్రీడాకారులు జీవితాన్ని కూడా పంచుకునేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరికి ఈ నెల 10న వివాహ నిశ్చితార్ధం రాంచీలో జరగనుంది. వచ్చే ఏడాది నవంబర్‌లో పెళ్లి జరుగుతుంది. ఐదేళ్ల క్రితం కొలంబియాలో జరిగిన ప్రపంచకప్‌లో వీరిద్దరు కలిసి మిక్స్డ్ ఈవెంట్లో కాంస్యం గెలిచారు. నాటి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. 24 ఏళ్ల దీపిక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు సాధించింది. 6 ప్రపంచకప్ పతకాలతో పాటు 2 కామన్వెల్త్ క్రీడల స్వర్ణాలు, ఆసియా క్రీడల కాంస్యం ఆమె ఖాతాలో ఉన్నాయి. బెంగాల్‌కు చెందిన 26 ఏళ్ల అతాను 4 ప్రపంచకప్ పతకాలు గెలుచుకున్నాడు. -
అతాను-దీపిక జంటకు రజతం
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్లో అతాను దాస్-దీపిక కుమారిలతో కూడిన భారత జోడీ రజత పతకాన్ని సాధించింది. ఆదివారం జరిగిన రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో అతాను దాస్-దీపిక ద్వయం 1-5 తేడాతో కు బొన్‌చాన్-మిసున్ చోయ్ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. సెట్ల పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఒక్కో జంటకు నాలుగేసి బాణాలు సంధించే అవకాశాన్ని కల్పిస్తారు. సెట్ నెగ్గిన వారికి రెండు పాయింట్లు ఇస్తారు. స్కోరు సమమైతే ఒక్కో పాయింట్ లభిస్తుంది. తొలి సెట్‌ను కొరియా 36-33తో నెగ్గి 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో సెట్లో 36-36తో స్కోరు సమంగా నిలిచింది. దాంతో కొరియా ఆధిక్యం 3-1కి పెరిగింది. మూడో సెట్‌ను కొరియా 38-37తో గెలిచి 5-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో నాలుగో సెట్‌ను నిర్వహించలేదు. అంతకుముందు మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 1-5తో ఇటలీ జట్టు చేతిలో ఓటమి చవిచూసింది.