జూన్‌ 30న దీపిక–అతాను పెళ్లి | Indian Archers Atanu Das And Deepika Kumari Getting Married on june 30 | Sakshi
Sakshi News home page

జూన్‌ 30న దీపిక–అతాను పెళ్లి

Published Wed, Jun 17 2020 4:07 AM | Last Updated on Wed, Jun 17 2020 4:07 AM

Indian Archers Atanu Das And Deepika Kumari Getting Married on june 30 - Sakshi

ఎట్టకేలకు భారత అగ్రశ్రేణి ఆర్చరీ జంట దీపికా కుమారి, అతాను దాస్‌ల వివాహానికి ముహూర్తం కుదిరింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూనే ఈ నెల 30న వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండేళ్ల క్రితమే వీరిద్దరికి నిశ్చితార్ధం జరిగినా... వేర్వేరు కారణాలతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. గత సంవత్సరమే పెళ్లి చేసుకోవాలనుకున్నా బిజీ షెడ్యూల్‌ కారణంగా కుదర్లేదు. దాంతో టోక్యో ఒలింపిక్స్‌ ముగియగానే ఒకటి కావాలని భావించారు. అయితే కోవిడ్‌–19 కారణంగా ఒలింపిక్స్‌ ఏకంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. కరోనాతో కఠిన నిబంధనల మధ్య తక్కువ మంది అతిథులతోనే చేసుకోవాల్సి వస్తున్నా... ఇక వాయిదా వేసే పరిస్థితి లేదని, పెళ్లికి ఇంతకంటే సరైన సమయం లభించదని దీపిక వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement