Indian archery
-
జూన్ 30న దీపిక–అతాను పెళ్లి
ఎట్టకేలకు భారత అగ్రశ్రేణి ఆర్చరీ జంట దీపికా కుమారి, అతాను దాస్ల వివాహానికి ముహూర్తం కుదిరింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూనే ఈ నెల 30న వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండేళ్ల క్రితమే వీరిద్దరికి నిశ్చితార్ధం జరిగినా... వేర్వేరు కారణాలతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. గత సంవత్సరమే పెళ్లి చేసుకోవాలనుకున్నా బిజీ షెడ్యూల్ కారణంగా కుదర్లేదు. దాంతో టోక్యో ఒలింపిక్స్ ముగియగానే ఒకటి కావాలని భావించారు. అయితే కోవిడ్–19 కారణంగా ఒలింపిక్స్ ఏకంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. కరోనాతో కఠిన నిబంధనల మధ్య తక్కువ మంది అతిథులతోనే చేసుకోవాల్సి వస్తున్నా... ఇక వాయిదా వేసే పరిస్థితి లేదని, పెళ్లికి ఇంతకంటే సరైన సమయం లభించదని దీపిక వెల్లడించింది. -
బొంబేలా, దీపికా కుమారి ఔట్!
రియో డి జనీరో: ఒలింపిక్స్లో భారత మహిళా ఆర్చర్లు దీపికా కుమారి, బొంబేలా దేవి కథ ముగిసింది. మొదట దీపిక ఓటమి పాలవ్వగా, ఆమె బాటలోనే బొంబేలా దేవి నడిచి నిరాశపరిచింది. ప్రీక్వార్టర్స్లో చైనీస్ తైపీ క్రీడాకారిణి టన్యా టింగ్తో జరిగిన మ్యాచ్లో దీపిక 0-6తో పరాజయాన్ని చవిచూసింది. 27-28, 26-29, 27-30తో వరుస సెట్లను కోల్పోయి రియో నుంచి నిష్క్రమించింది. అనంతరం జరిగిన వ్యక్తిగత రికర్వ్ విభాగంలో బొంబేలా దేవి 6-2తేడాతో మెక్సికోకు చెందిన వాలేన్సికా చేతిలో ఓటమి చెందింది.భారత ఆర్చర్లు ఇద్దరూ ప్రి క్వార్టర్స్ (రౌండ్-16)లోనే ఇంటిదారి పట్టారు. -
'రియో'కు మహిళా ఆర్చర్ల త్రయం
న్యూఢిల్లీ: భారత మహిళా ఆర్చర్లు దీపికా కుమారి, బాంబాయ్లా దేవి, లక్ష్మీరాణి మహిలు రియో ఒలింపిక్స్కు ఎంపికయ్యారు. గత మూడు నెలల ప్రదర్శన ఆధారంగా చేసుకుని భారత ఆర్చరీ సంఘం వీరిని ఎంపిక చేసింది.ఈ ముగ్గురు వ్యక్తిగత విభాగాల్లో పోటీ పడటంతో పాటు, టీమ్ ఈవెంట్లో కూడా ఈ త్రయమే జట్టు కట్టనుంది. ఆర్చరీ ట్రయల్స్, శిక్షణలో భాగంగా గత మూడు నెలల నుంచి వివిధ నగరాల్లో ఆరు స్టేజ్లలో నిర్వహించిన సెలక్షన్ అనంతరం ఈ ముగ్గురు పేర్లను భారత అర్చరీ సంఘం ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం మహిళా ఆర్చర్ల పేర్లను ప్రకటించింది.