
రాంచీ: భారత ఒలింపియన్ ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్ ‘ప్రేమ బాణం’ సరిగ్గా లక్ష్యాన్ని చేరింది. ఐదేళ్ల క్రితం తొలిసారి కుదిరిన గురి ఇప్పుడు పెళ్లి దాకా చేరింది. మైదానంలో కలిసి ఆడిన, కలిసి పతకాలు పంచుకున్న క్రీడాకారులు జీవితాన్ని కూడా పంచుకునేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరికి ఈ నెల 10న వివాహ నిశ్చితార్ధం రాంచీలో జరగనుంది. వచ్చే ఏడాది నవంబర్‌లో పెళ్లి జరుగుతుంది.
ఐదేళ్ల క్రితం కొలంబియాలో జరిగిన ప్రపంచకప్‌లో వీరిద్దరు కలిసి మిక్స్‌డ్ ఈవెంట్లో కాంస్యం గెలిచారు. నాటి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. 24 ఏళ్ల దీపిక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు సాధించింది. 6 ప్రపంచకప్ పతకాలతో పాటు 2 కామన్వెల్త్ క్రీడల స్వర్ణాలు, ఆసియా క్రీడల కాంస్యం ఆమె ఖాతాలో ఉన్నాయి. బెంగాల్‌కు చెందిన 26 ఏళ్ల అతాను 4 ప్రపంచకప్ పతకాలు గెలుచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment