Marry
-
బాబర్ ఆజం పెళ్లి చేసుకోవాలని కోరితే.. నా ఆన్సర్ ఇదే అన్నందుకు ట్రోలింగ్! (ఫొటోలు)
-
అవిభక్త కవలలకు వివాహం.. వరుడెవరంటే..
అమెరికాకు చెందిన అవిభక్త కవలలు (కంజోయిన్డ్ ట్విన్స్)అబ్బి, బ్రిట్నీ హెన్సెల్‌లు రిటైర్డ్ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకుని ముఖ్యాంశాలలో నిలిచారు. 1996లో ‘ది ఓప్రా విన్ఫ్రే షో’లో కనిపించి, ఇద్దరూ తొలిసారి వెలుగులోకి వచ్చారు. తాజాగా ఈ అవిభక్త కవలలు అమెరికా ఆర్మీ రిటైర్డ్ అధికారి జోష్ బౌలింగ్‌ను వివాహం చేసుకున్నారు. బ్రిట్నీ హాన్సెల్ ఫేస్బుక్ ప్రొఫైల్‌లో వారి పెళ్లి ఫొటో ప్రత్యక్షమయ్యింది. దానిలో పెళ్లి దుస్తుల్లో ఈ అవిభక్త కవలలు జోష్ బౌలింగ్ ముందు నిలబడి అతని చేతిని పట్టుకోవడాన్ని చూడవచ్చు. ఈ కవల సోదరీమణులు ప్రస్తుతం ఐదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వీరు వీరి స్వస్థలమైన మిన్నెసోటాలో నివసిస్తున్నారు. మరోవైపు జోష్ బౌలింగ్ ఫేస్బుక్ పేజీలో అతను ఆ అవిభక్త కవలలకు ఐస్ క్రీం అందిస్తున్న ఫొటోలు, వెకేషన్ ఫోటోలు ఉన్నాయి. వీరి వివాహానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. దానిలో వారు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అబ్బి, బ్రిట్నీ హెన్సెల్ల శరీరం కలసిపోయివుంటుంది. అబ్బి కుడి చేయి , కుడి కాలును నియంత్రిస్తుండగా, బ్రిట్నీ ఎడమ వైపు అవయవాలను నియంత్రిస్తుంది. -
Taapsee-Mathias: తాప్సితో ప్రేమ.. మథియస్ బ్యాగ్రౌండ్ ఇదే! (ఫొటోలు)
-
ప్రపంచంలోనే తొలి AI మ్యారేజ్!!
ఏఐ సాంకేతికత ప్రస్తుతం ఓ ప్రభంజనంలా దూసుకుపోతోంది. రోజుకో కొత్త సాంకేతికతను పరిచయం చేస్తూ..అన్నింటిని ఏఐతో చక్కపెట్టేసుకోవచ్చు అనేంతగా శరవేగంగా వెళ్లిపోతుంది. మొన్నటి వరకు ఎంప్లాయిస్ లేకుండా జస్ట్ ఏఐ సాంకేతికతో ఎంప్లాయిస్‌ని సృష్టించి వర్క్ పూర్తి చెయ్యొచ్చు అన్నారు. అసలే నిరుద్యోగ సమస్యతో సతమతమవుతుంటే మళ్లీ ఇదా! అని అంతా బెంబేలెత్తిపోయారు. ఇప్పడూ ఏకంగా ప్రేమ, సాన్నిహిత్యం, ఓ కంపెనీ వంటివి కూడా ఏఐ సాంకేతికతోనా!. ఔను! మీరు వింటుంది నిజమే..! ఓ మహిళ ఏఐతో రూపొందించిన హోలోగ్రామ్‌ని వివాహం చేసుకుంటుందట. ఈ షాకింగ్ ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా స్పెయిన్‌కి చెందిన పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అలీసియా ఫ్రామిస్ అనే మహిళ కృత్రిమ మేధతో రూపొందించిన హోలోగ్రామ్‌ని పెళ్లి చేసుకోనుంది. డిజిటల్ సంస్థ మెషిన్ లెర్నింగ్ అండ్ హోలోగ్రామ్ సాంకేతికతో కూడిన మనిషిని రూపొదించినట్లు తెలిపింది. అంతేగాదు తమ వివాహం కోసం పెళ్లిమండపాన్ని కూడా బుక్ చేసుకుందట. ఈ ఏడాది రోటర్‌డామ్‌లోని మ్యూజియంలో ఆమె వివాహం జరగనుంది. ఇక ఆమె పెళ్లి చేసుకోనున్న ఏఐ హోలోగ్రామ్ పేరు అలెక్స్. తన భావోద్యేగాలన్నింటిని పంచుకునేలా ఈ హోలోగ్రామ్‌ని రూపొందించినట్లు తెలిపింది. తన వర్చువల్ భాగస్వామి మద్య వయస్కుడైన వ్యక్తిగా ఉన్నాడని చెబుతోంది. 'హైబ్రిడ్ కపుల్' అనే కొత్ర ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ హోలోగ్రామ్‌ని డిజైన్ చేసినట్లు అలీసియా పేర్కొంది. ఇప్పుడూ ఏఐ సాంకేతికతను ప్రేమ, సాన్నిహిత్యం, వంటి సరిహద్దులను అందుకునేలా ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపింది.. ఇంతవరకు ఐఏ సాంకేతికతను కవిత్వం కళల దిశగా ప్రయోగాలు చేయలేదని పేర్కొంది. తన భాగస్వామితో కొనసాగనున్న కొత్త జీవితం గురించి ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించనుందని అలీసియా తెలిపింది. అలాగే తన వర్చువల్ భాగస్వామిని జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి, అతనితో మసులకోవాలో అనే వాటి గురించి కలలు కంటున్నట్లు వెల్లడించింది. అంతేగాదు తమ వివాహ దుస్తులను కూడా డిజైన్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అలీయాసీ తన ఇన్‌స్టాగ్రాంలో తన భాగస్వామి అలెక్సీతో కలిసి దిగిన వీడియోలను కూడా షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో రోబోలు, హోలోగ్రామ్లోతో ప్రేమ, శృంగార జీవిత అనివార్యం అనేది గొప్ప వాస్తవం. అయితే వారు గొప్ప సహచరులుగా సానుభూతిని వ్యక్తపర్చగలరని రాసుకొచ్చింది. ఫోన్లు ఒంటరితనం నుంచి రక్షించి జీవితంలోని శూన్యాన్ని దూరం చేశాయి. అలాగే ఈ హోలోగ్రామ్‌లు మన ఇళ్లల్లో ఉంటూ మనతో ఇంటరాక్టివ్ అవుతూ ఉనికిని చాటుకుంటాయని అంటోంది అలీసియా. అందుకోసం తన స్నేహితురాలి జీవితాన్ని ఉదాహరిస్తూ..తన స్నేహితురాలు భర్త చనిపోవడం వితంతువుగా మిగిలిపోయిందని, ఇప్పుడు ఆమెకు భర్త లేని లోటుని భర్తీ చేయడం కష్టం అని చెప్పుకొచ్చింది. అలాంటప్పుడూ ఈ ఏఐ మానవ సహచరులు మనకు బెస్ట్ ఆప్షన్ అవ్వొచ్చు అని ధీమాగా చెబుతోంది. మనం ఇష్టపడ్డ ఇష్టపకపోయినా కొత్త తరం ప్రేమ పుట్టుకొస్తుంది. హోలోగ్రామ్‌లు, రోబోలను పెళ్లి చేసుకునే రోజులు వస్తాయి అని చెబుతోంది అలీసియా. ఇక భాగస్వామ్య సహచర్యం కూడా ఏఐ మాయతోనేనా..!. (చదవండి: నెల రోజులు పాలు, పెరుగు మానేస్తే ఏమవుతుందో తెలుసా?) -
ప్రియుని కోసం పాక్ వెళ్లిన అంజూ తిరిగొచ్చింది!
జైపూర్: ప్రియుని కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజూ తిరిగి స్వదేశానికి వచ్చింది. వాఘా సరిహద్దు దాటి భారత్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం దర్యాప్తు బృందాల అదుపులో ఉంది. విచారణ అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు. ప్రియుడు నస్రుల్లా కోసం గత జులైలో అంజూ పాకిస్థాన్‌కు వెళ్లింది. అంజూ రాజస్థాన్ బివాండీకి చెందిన మహిళ. భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్బుక్లో పరిచయమైన పాక్ వ్యక్తి నస్రుల్లాను ప్రేమించింది. అతని కోసం గత జులైలో భారత్ సరిహద్దు దాటి ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌కి వెళ్లింది. అయితే.. తన స్నేహితున్ని కలుసుకోవడానికి మాత్రమే వెళ్లానని తెలిపిన అంజూ.. ఆ మరుసటి రోజే అతనితో వివాహం చేసుకుంది. అంజూ నుంచి ఫాతిమాగా పేరు మార్చుకుని ఇస్లాం స్వీకరించింది. జైపూర్ మాత్రమే వెళ్తున్నట్లు, మరో రెండు రోజుల్లో వెచ్చేస్తానని అప్పట్లో తనతో చెప్పినట్లు అంజూ భర్త అరవింద్ తెలిపారు. అప్పటి నుంచి అంజూతో వాట్సాప్‌లో టచ్‌లోనే ఉన్నట్లు వెల్లడించారు. అంజూ, నస్రుల్లాల స్నేహం గురించి తనకు ముందే తెలుసని చెప్పారు. అంజూ ఎప్పటికైనా భారత్ తిరిగివస్తుందని తనకు ముందే తెలుసని అన్నారు. అరవింద్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఇరువురు క్రిస్టియన్ స్వీకరించారు. ఇదీ చదవండి: కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం.. అమిత్ షా కీలక ప్రకటన -
ప్రేమ పెళ్లిళ్లను పెద్దలు కాదనలేరు: ఢిల్లీ హైకోర్టు
ఇకపై మేజర్లయిన పిల్లల పెళ్లిళ్లను పెద్దలు అడ్డుకోలేరు. వివాహానికి తగిన వయసు కలిగిన యువతీయువకులు తమకు ఇష్టమైన భాగస్వామిని వివాహం చేసుకోవచ్చని, ఇటువంటి సందర్భంలో ఆ జంటల వివాహానికి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరని, రాజ్యాంగం ఆ జంటకు రక్షణ కల్పిస్తుందని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న జంటలకు పోలీసులు రక్షణ కల్పిస్తారని, అవసరమైన పక్షంలో వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు రక్షణ అందిస్తారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్యాభర్తల వివాహ హక్కును ఏ విధంగానూ తక్కువ చేయకూడదని, ఇలాంటి జంటలకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ఆ రాష్ట్రంపై ఉందని జస్టిస్ తుషార్ రావు గేదెల అభిప్రాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో.. తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న ఒక జంటకు పోలీసు రక్షణ కల్పిస్తూ, మేజర్లయిన యువతీయువకులు తమకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని కోర్టు పేర్కొంది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వీరిలో భర్తపై నమోదైన తప్పుడు ఎఫ్ఐఆర్ను గత ఆగస్టులో కోఆర్డినేట్ బెంచ్ రద్దు చేసిందని జస్టిస్ గేదెలకు చెప్పారు. కాగా ఎఫ్ఐఆర్ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే వారు వివాహం చేసుకుని, ఆనందంగా జీవిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ దంపతులకు హాని జరగకుండా చూసుకోవాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇది కూడా చదవండి: ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు? Right To Marry Person Of Choice Protected Under Constitution, Not Even Family Members Can Object: Delhi High Court @nupur_0111 https://t.co/JEDBQuyQI8 — Live Law (@LiveLawIndia) October 26, 2023 -
ఇద్దరు యువతుల ప్రేమ పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్రమైన సంఘటన జరిగింది. ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకోవడానికి కోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం వారిలో ఒకరు లింగమార్పిడి చేసుకున్నారు. ఆ సంబంధిత ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. బరేలీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని బరేలీలో ఇద్దరు అమ్మాయిలు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరి మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. వీరిలో ఒకరు బరేలికి చెందినవారు కాగా.. మరొకరు బదాయూ ప్రాంతానికి చెందినవారు. ప్రేమలో ఉన్న వీరు పెళ్లి చేసుకుని కలిసి బతకాలనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో వారు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ జంటలోని ఓ అమ్మాయి లింగమార్పిడి చేయించుకుంది. చికిత్స అనంతరం ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. డిజిస్ట్రేషన్ ద్వారా వివాహానికి ప్రత్యేక వివాహ చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారని బరేలీ ఎస్డీఎం ప్రత్యూష పాండే తెలిపారు. ఇలాంటి కేసు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పారు. ఇదీ చదవండి: అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్.. అసలే పేషెంట్.. మళ్ళీ పేషెంట్ అయ్యాడు.. -
పెళ్లి చేసుకో.. లేకపోతే ఫోటోలు, వీడియోలు బయటపెడతా..
రాయవరం(కోనసీమ జిల్లా): వివాహం చేసుకోవాలని, లేకుంటే చంపుతానని బెదిరిస్తున్నాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్ఐ పి.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. వివరాలివి... రాయవరం గ్రామానికి చెందిన యువతికి మండలంలోని వి.సావరం గ్రామానికి చెందిన నీలం సూర్యప్రకాశ్‌తో గతంలో తల్లిదండ్రులు వివాహం నిశ్చయించారు. చదవండి👉: వివాహేతర సంబంధం.. వ్యక్తికి ఘోరమైన శిక్ష సూర్యప్రకాష్ ప్రవర్తన నచ్చకపోవడంతో యువతి అతనితో వివాహానికి నిరాకరించడంతో వివాహం రద్దు చేశారు. తనను వివాహం చేసుకోవాలంటూ సూర్యప్రకాష్ యువతిని తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఏప్రిల్ 25న సూర్యప్రకాష్ యువతి ఇంటికి వెళ్లి వివాహం చేసుకోకుంటే తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు బయట పెడతానని, వివాహం చేయకుంటే చంపుతానంటూ అసభ్య పదజాలంతో యువతిని, ఆమె తల్లిని బెదిరించాడు. దీనిపై యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ తెలిపారు. -
ఇష్టం లేనిపెళ్లి.. నిశ్చితార్థం విషయం తెలిసి యువతి ఏం చేసిందంటే?
గుంటూరు రూరల్: తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని మానసిక ఒత్తిడికి గురై యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ తరంగిణి తెలిపిన వివరాలు.. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరంట్ల గ్రామానికి చెందిన దమ్ము జయపాల్‌కు ఒక కుమార్తె సంధ్య(19) ఉంది. ఈనెల 25వ తేదీన సంధ్యకు తల్లిదండ్రులు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు నిశ్చితార్థం విషయం తెలిసిన నాటి నుంచి పెళ్లి ఇష్టంలేదని తల్లిందండ్రులకు చెప్పలేక మానసిక ఒత్తిడికి గురైంది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. -
విషాదం: కూతుళ్లకు పెళ్లి చేయలేక.. తీవ్ర మనస్తాపంతో
ధర్మవరం అర్బన్(అనంతపురం జిల్లా): పేదరికం అతని జీవితాన్ని అపహాస్యం చేసింది. కన్న బిడ్డలకు పెళ్లిళ్లు చేయలేని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని గీతానగర్‌కు చెందిన దుస్సా రవిశంకర్ (52), దేవి దంపతులు. వీరికి లావణ్య, చందన అనే ఇద్దరు కుమార్తెలతో పాటు ఓబులేసు అనే కుమారుడూ ఉన్నాడు. చదవండి: పానీపూరి తెచ్చిన తంటా.. చివరకు పోలీస్‌స్టేషన్‌కు.. రవిశంకర్ ఓ గ్యారేజ్‌లో పనిచేస్తూ వచ్చే అరకొర సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేయడం భారంగా మారింది. కుటుంబ పోషణకే కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో కుమార్తెల పెళ్లిళ్లు చేయలేకపోతున్నానంటూ రోజూ మదనపడేవాడు. తీవ్ర మనస్తాపంతో ఆదివారం తెల్లవారుజామున అగ్నిమాపక శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ధర్మవరం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
తమన్నాకు తాళి కడతా!
హెడ్డింగ్ చదివి ఈ మాట అన్నది తమన్నా అంటే బాగా ఇష్టపడే అబ్బాయి అనుకునేరు. అయితే ఈ మాట అన్నది కథానాయిక శ్రుతీహాసన్. అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా! ఏం లేదండీ. ఇటీవల ఓ చాట్ షోలో శ్రుతి పాల్గొన్నారు. ఒకవేళ మీరు అబ్బాయి అయితే ఎవర్ని డేట్‌కు తీసుకెళ్లేవారు? అన్న ప్రశ్నను శ్రుతీహాసన్ ముందు ఉంచితే... ‘‘నేను అబ్బాయిని అయితే తమన్నాను డేట్‌కు తీసుకెళ్లేదాన్ని. ఆమెను పెళ్లి చేసుకునేదాన్ని’’ అని చెప్పారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఇటాలియన్ యాక్టర్ మైఖేల్ కోర్సలేతో శ్రుతీహాసన్ లవ్‌లో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలను కుంటున్నారనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయం గురించి శ్రుతీహాసన్ నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ లేదు. ‘మైఖేల్ నా లైఫ్‌లో చాలా స్పెషల్ పర్సన్’ అని మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు. -
పెళ్లి ‘గురి’ కుదిరింది...
రాంచీ: భారత ఒలింపియన్ ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్ ‘ప్రేమ బాణం’ సరిగ్గా లక్ష్యాన్ని చేరింది. ఐదేళ్ల క్రితం తొలిసారి కుదిరిన గురి ఇప్పుడు పెళ్లి దాకా చేరింది. మైదానంలో కలిసి ఆడిన, కలిసి పతకాలు పంచుకున్న క్రీడాకారులు జీవితాన్ని కూడా పంచుకునేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరికి ఈ నెల 10న వివాహ నిశ్చితార్ధం రాంచీలో జరగనుంది. వచ్చే ఏడాది నవంబర్‌లో పెళ్లి జరుగుతుంది. ఐదేళ్ల క్రితం కొలంబియాలో జరిగిన ప్రపంచకప్‌లో వీరిద్దరు కలిసి మిక్స్డ్ ఈవెంట్లో కాంస్యం గెలిచారు. నాటి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. 24 ఏళ్ల దీపిక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు సాధించింది. 6 ప్రపంచకప్ పతకాలతో పాటు 2 కామన్వెల్త్ క్రీడల స్వర్ణాలు, ఆసియా క్రీడల కాంస్యం ఆమె ఖాతాలో ఉన్నాయి. బెంగాల్‌కు చెందిన 26 ఏళ్ల అతాను 4 ప్రపంచకప్ పతకాలు గెలుచుకున్నాడు. -
ప్రేమించి పెళ్లాడతానని మోసం
అర్ధరాత్రి గోదావరిలోకి తోసేసి పరారైన ప్రియుడు యువతిని రక్షించిన మత్స్యకారులు యానాం (ముమ్మిడివరం) : ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, అనంతరం ఆమెను మట్టుబెట్టాలని పథకం రచించాడు ఓ వ్యక్తి. ప్రియురాలిని గోదావరిలోకి తోసేసి పరారైన ఓ వ్యక్తి ఉదంతమిది. బాధితురాలి కథనం ప్రకారం రాజమహేంద్రవరం సీటీఆర్ఐ పనస చెట్టు సందుకు చెందిన గండి అలివేణి , నాసిక శ్రీనివాసరావు ఇద్దరూ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ఇళ్లు ఎదురెదురుగా ఉండడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఎంబీఏ చదివిన అలివేణి ఉప్పలగుప్తం మండలం సూరసేన (ఎస్)యానాంలో కెయిర్న్ ఎనర్జీలో ఎక్సెస్ కంట్రోలర్‌గా పనిచేస్తుంది. శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో సొంతంగా వస్త్ర దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం బైక్‌పై అలివేణి వద్దకు శ్రీనివాస్ ఎస్.యానాం వచ్చాడు. ఈ నేపథ్యంలో పెళ్లి ప్రస్తావనను అలివేణి తీసుకువచ్చింది. దీంతో ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. పెళ్లికి కులం అడ్డుపడుతుందనే కోణంలో కొంత కాలంగా వీరిద్దరి మధ్య విషయం జరుగుతోంది. ద్రాక్షారామ భీమేశ్వర దేవాలయంలో వివాహం చేసుకుందామని చెప్పడంతో వీరిద్దరూ కలిసి ఆదివారం రాత్రి అమలాపురంలో భోజనం చేసి అనంతరం బయలు దేరారు. యానాం ఎదుర్లంక బాలయోగి వారధి వద్దకు వచ్చేసరికి ఇద్దరూ కలిసి వంతెన వద్ద ఆగారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు అలివేణిని బలవంతంగా కొట్టి పీక నులిమి బ్రిడ్జిపై నుంచి తోసేసి పరారయ్యాడు. తెల్లవారు జాము కావడంతో వీరబాబు అనే వ్యక్తి, మత్స్యకారులు ఆమె కేకలు విని రక్షించి ఒడ్డుకు చేర్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాద వార్తను తెలుసుకున్న ఐపోలవరం ఎస్ఐ టి.క్రాంతికుమార్ బాధితురాలి వాంగ్మూలం విని కేసు నమోదు చేశారు. పెళ్లి పేరిట మోసగించాడు అలివేణిని పెళ్లి చేసుకుంటానని ఎన్నో ఏళ్లుగా శ్రీనివాసరావు చెబుతూ వస్తున్నాడని, కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు ఒప్పుకోరనే వాడని అలివేణి స్వయానా పెద్ద అక్కలు అనూరాధ, అరుణకుమారి, బావ శీలం కోటేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. యానాం జీజీహెచ్ వద్ద వారు మాట్లాడారు. అలివేణి తండ్రి అర్జునరావు గతంలో మృతి చెందగా తల్లి గండి కుమారి వద్ద వుంటుందన్నారు. -
గాసిప్స్ బాధిస్తున్నాయి
తన గురించి చాలా వదంతులు ప్రచారం చేస్తున్నారు. అవి వ్యక్తిగత జీవితాన్ని బాధిస్తున్నాయని విచారాన్ని వ్యక్తం చేశారు నటి సమంత. టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు వెల్లడించి కొత్త చర్చకు దారి తీసిన ఈ చెన్నై చిన్నది తను నటించే చిత్రాలనూ తగ్గించుకుంటూ వచ్చారు. నటుడు ధనుష్‌కు జంటగా నటించాల్సిన వడచెన్నై చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఒకే ఒక్క తెలుగు చిత్రం జనతా గ్యారేజ్‌లో నటిస్తున్నారు. ఆ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ ఒకటో తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. సమంత నటనకు ఫుల్స్టాప్ పెట్టనున్నారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో అనూహ్యంగా తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించడానికి పచ్చజెండా ఊపి మరోసారి చర్చకు తావిచ్చారు. ఇలాంటి పరిస్థితిలో ఈ చెన్నై చిన్నది తన మనసులోని మాటల్ని బయట పెట్టారు. అవేమిటో తన మాటల్లోనే. నాపై గాసిప్స్ చాలా ప్రచారం చేస్తున్నారు. అవి నా వ్యక్తిగత జీవితాన్ని వివాదం చేస్తున్నాయి. ఇది బాధాకరం. చర్చించడానికి దేశంలో చాలా మంచి విషయాలున్నాయి. కొందరు పనికట్టుకుని ఎగతాళి చేస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటివి హర్షణీయం కాదు. బ్రహ్మోత్సవం చిత్రంలో నటుడు నాజర్ మంచి విషయాల గురించి ఎన్నిసార్లు అయినా మాట్లాడవచ్చు అన్న డైలాగ్‌ను పదేపదే చెబుతారు. అది నాకు బాగా నచ్చింది. మన చుట్టూ చాలా మంచి విషయాలు జరగుతున్నాయి. వాటి గురించి చర్చించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇతరులను విమర్శించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. సమాజంలో హత్యలు, ఆత్మహత్యలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి వాటి గురించి పేపర్లో చదువుతున్నాం. మంచి విషయాల గురించి చర్చించడం వల్ల మంచి ఆలోచనలు కలుగుతాయి. అది ఆరోగ్యానికి మంచిది. అదే విధంగా చెడు అలవాట్లకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అందరం మంచి విషయాల గురించే చర్చించాలని ఎవరికి వారు ప్రమాణం చేసుకుంటే మంచిది. -
ఓ అమ్మాయికి అంబానీ అందమైన జవాబు
న్యూఢిల్లీ: బిలియనీర్ భర్త కావాలన్న భారతీయ అమ్మాయికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఓ అందమైన జవాబు ఇచ్చారు. విజయవంతమైన వ్యాపార వేత్తగా అందాన్ని, డబ్బును విశ్లేషిస్తూ నొప్పించక తానొవ్వక అన్నట్టు ఉన్న ఆయన సమాధానం ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పూజా చౌహాన్ అనే యువతి సంధించిన ప్రశ్నలు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతను సైతం కదిలించాయి. ఆయన సమాధానం చెప్పకుండా ఉండలేకపోయారు. దీంతో స్వయంగా ముఖేష్ అంబానీయే డైరెక్ట్ గా ఆ అమ్మాయి సందేహాలను నివృత్తి చేస్తూ సమాధానాలు రాశారు. ఇది అందరికీ షాకింగ్ గా ఉండొచ్చు. కానీ ఆ షాకింగ్ నుంచి కాసేపు తేరుకుని అసలు ఆ అమ్మాయి ప్రశ్నలకు ముఖేష్ అంబానీ ఏమని సమాధానమిచ్చారో మీరూ ఓ సారి చదవండి.... పూజ రాసిన లేఖ నా వయస్సు 25 ఏళ్లు. చాలా అందమైన అమ్మాయిని. మంచి అభిరుచులను కూడా కలిగి ఉన్నాను. ఇంత బాగున్న నాకు, సంవత్సరానికి 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ జీతం తెచ్చే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. ఏడాదికి రెండు కోట్ల జీతమొస్తే చాలనకుంటే ఈ కాలంలో ఆ మొత్తాన్ని మిడిల్ క్లాస్ గానే పరిగణిస్తున్నారు. అందుకే నేను ఆశపడటంలో ఏమాత్రం తప్పులేదు. ఎక్కువగా కూడా ఏమి కోరుకోవడం లేదు. ఈ కాలంలో రూ. 100 కోట్ల జీతం వచ్చే వాళ్లు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారందరూ ఎక్కడ ఉన్నారు? వారందరూ పెళ్లిచేసుకున్న వాళ్లేనా? బ్యాచ్ లర్సా? నేను మీలాగా అధిక ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలంటే ఏమి చేయాలో చెప్పండి. నేను డేట్ చేసిన వాళ్లందరిలో రూ.50 కోట్ల వేతనం మాత్రమే ఎక్కువ. అదే పెద్ద మొత్తంగా నేను చూశా. విలాస భవంతుల్లో, ప్రాంతాల్లో నివసించాలంటే రూ.50 కోట్లు సరిపోవని నా ఉద్దేశ్యం. నేను నిజాయితీగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా దయచేసి సమాధానం చెప్పండి పెళ్లికాని ధనవంతులు ఎక్కడ ఉన్నారు? ఏ గ్రూప్ లను నేను టార్గెట్ చేస్తే కోటీశ్వరులు దొరుకుతారు? ఎందుకు ధనవంతుల భార్యలు సాధారణంగా ఉంటారు? కాని వారు పెద్ద పెద్ద ధనవంతుల్ని పెళ్లిచేసుకున్నారు. ఎలా నిర్ణయించుకుంటారు ఈమె నా భార్య, ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అని.. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. -మిస్ పూజా చౌహాన్ డియర్ మిస్ పూజా, నేను మీ పోస్ట్ ను చాలా ఆసక్తితో చదివాను. నీకున్న ఆశలే చాలామంది అమ్మాయిలకీ ఉంటాయి. కానీ వారు బయటపడరు. ఒక ప్రొఫెషనల్ పెట్టుబడిదారుడిగా నేను నీ పరిస్థితిని విశ్లేషించాలనుకుంటున్నాను. నా ఏడాది జీతం రూ.100 కోట్ల కంటే ఎక్కువ. నీవు కోరుకున్న దానికి నా జీతం సరితూగుతుంది. కాబట్టి నేను ఇక్కడ సమయాన్ని వృథా చేయట్లేదని మీరు నమ్ముతున్నారని ఆశిస్తున్నాను. నేను ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి సరియైన వాడినే. నా దృష్టిలో నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది బాడ్ డెసిషన్. అందానికి, పెళ్లికి సంబంధించి ఎక్కువగా నీవు అడిగావు. అందమనేది క్రమంగా అంతరించిపోతుంది. అదే డబ్బైతే ఎలాంటి కారణాలు లేకుండా నశించదు. నిజమేమిటంటే నా ఆర్థికవేతనం ఏటేటా పెరుగుతుందే తప్ప తగ్గదు. కానీ నీవు మాత్రం ఏడాది తర్వాత అందహీనురాలివి అవుతావు. వయస్సు పెరిగే కొద్దీ అందం నశిస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. ఆర్థిక పరిభాషలో నన్ను పెరిగే ఆస్తిగా పరిగణిస్తే నిన్ను తరిగిపోయే ఆస్తిగా లెక్కకడతారు. సాధారణ తరుగుదలగా కూడా కాదు విశేషణమైన తరుగుదలుగా గుర్తిస్తారు. 10 ఏళ్ల తర్వాత నీవు అసలు విలువే లేని ఆస్తిగా పరిగణించబడతావు. తరిగిపోతున్న ఆస్తిని ఎవరైనా కోరుకుంటారా చెప్పు. కచ్చితంగా దాన్ని అమ్మడానికే ప్రయత్నిస్తారు. నిన్ను కూడా అంతే. చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా నీ మంచి కోరి చెబుతున్నా విను. రూ.100 కోట్ల ఏడాది జీతం కలిగి ఉన్నోడేమి పిచ్చోడు కాదు. అతను నిన్ను పెళ్లిచేసుకోవాలనుకోడు కేవలం నీతో డేటింగ్ మాత్రమే చేస్తాడు. కాబట్టి నేను నీ నీకిచ్చే సలహా ఒక్కటే ఈ ఆలోచన మానుకుని, నీవే రూ.100 కోట్లు సంపాదించేలా ప్రణాళికలు వేసుకో. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగలవు. నా సమాధానం నీకు సాయం చేస్తుందని ఆశిస్తూ.. -ముఖేష్ అంబానీ -
కూతురు రక్షణకై తెగించిన తండ్రి
బామర్: బలవంతంగా తన మైనర్ కూతురును ఓ 35 ఏళ్ల వ్యక్తికి కట్టబెట్టాలని చూసిన ఖాప్ పంచాయతీకి వ్యతిరేకంగా ఓ తండ్రి కోర్టు మెట్లెక్కాడు. ఖాప్ పంచాయతీ పెద్దలు చేసిన హెచ్చరికలు సైతం లెక్క చేయకుండా అతడు ఎంతో సాహసంతో కోర్టును ఆశ్రయించాడు. ఫలితంగా కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఘటనకు సంబంధించి మొత్తం 17మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని బామర్ జిల్లాలోగల గుంగా గ్రామంలో గనరాం ప్రజాపత్ అనే వ్యక్తికి ఓ మైనర్ కూతురు ఉంది. ఆమెను 35 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని బెదిరించడమే కాకుండా అలా చేయకుంటే రూ.25లక్షల ఫైన్ కట్టాలని, సామాజిక బహిష్కరణ ఎదుర్కోవాలని ఈ నెల 1న తీర్పు చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని గనరాం ధైర్యం ఇదే 6న కోర్టు మెట్లెక్కాడు. తనకు జరిగిన అన్యాయం కోర్టుకు పిటిషన్ రూపంలో వివరించాడు. గత ఏడాది కూడా లీలారాం అనే వ్యక్తికి తన కూతురును ఇవ్వాలని ఇబ్బందులు పెట్టారని కోర్టుకు వివరించాడు. దీంతో కోర్టు ఆ ఖాప్ పంచాయతీ పెద్దలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఖాప్ పంచాయతీల తీర్పులను ఉల్లంఘిస్తే సాంఘిక బహిష్కరణతోపాటు, రాళ్లతో కొట్టి చంపించడం, కాల్పిపారేయడంలాంటి వికృత చర్యలు చేస్తుంటారు. వీటన్నింటికీ భయపడకుండా ఆ ప్రాంతంలోని ఓ సగటు తండ్రి చేసింది గొప్ప సాహసమే. -
అత్యాచారం చేసిన వాడినే పెళ్లాడింది
చెన్నై : అత్యాచారం చేసిన వ్యక్తినే యువతి వివాహమాడింది. ఈ సంఘటన కడలూరు జిల్లాలో చోటు చేసుకుంది. చర్చనీయాంశంగా మారిన కోర్టు కేసును ఇది మలుపు తిప్పింది. కడలూరు జిల్లా తిట్టకుడి సమీపంలో గల సౌందరచోళపురానికి చెందిన మోహన్.... 2008లో అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భవతి అయి... బాలికకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మోహన్‌ను అరెస్ట్ చేశారు. అయితే సదరు చిన్నారి రెండో తరగతి చదువుతోంది. కడలూరు మహిళా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుంది. ఆ క్రమంలో మోహన్‌కి ఏడేళ్ల జైలుశిక్షతోపాటు రూ. 2 లక్షల జరిమాన విధిస్తూ... న్యాయమూర్తి తీర్పు నిచ్చారు. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ... మోహన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించి... తాను అత్యాచారం చేసిన యువతిని పెళ్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో న్యాయమూర్తులు యువతిని, మోహన్‌ను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరింది. దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. పలువురు న్యాయ నిపుణులు కూడా దీనిని వ్యతిరేకించారు. దీంతో సామరస్య కేంద్రానికి పంపే ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకుంది. ఈ కేసుపై పునర్విచారణ జరపాలంటూ కడలూరు కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మళ్లీ విచారణ సాగింది. అయితే కోర్టు తీర్పు వచ్చే రెండు వారాల ముందుగా వారు ఇరువురూ వివాహం చేసుకున్నట్లు న్యాయవాది చంద్రశేఖర్ కోర్టుకు తెలిపారు. డిసెంబరు 24వ తేదీ ఇరువురికి రిజిస్టర్ పెళ్లి జరిగినట్లు పేర్కొన్నారు. దీంతో కథ సుఖాంతం అయింది. -
స్పీకర్‌పై చీటింగ్ కేసు
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నాబాం రిబియాపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ మహిళను మోసగించిన కేసులో రాష్ట్ర మహిళా కౌన్సిల్ ఇచ్చిన నోటీసులకు స్పీకర్ స్పందించకపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే దోయ్ ముఖ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రిబియా స్థానిక మహిళతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తర్వాత అంటూ దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో వీరి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో గత మూడు నెలల నుంచి ఆ మహిళకు నాబాం రిబియా ముఖం చాటేశాడు. ఫోన్ చేసినా స్పందించడం మానేసాడు. అంతేకాకుండా ఆ మహిళకు.. ఇతరులతో లైంగిక సంబంధాలున్నాయంటూ ప్రచారం మొదలు పెట్టాడు. దీంతో ఆమె.. మహిళా కౌన్సిల్‌ను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ కౌన్సిల్ సహకారంతో స్పీకర్‌కు లీగల్ నోటీసులిచ్చింది. రిబియా దాంపత్య హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ, దీనిపై వారంలోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. అయినా స్పీకర్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. అయితే ఒక రాజకీయ నాయకుడై ఉండి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న రిబియాపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ నేత తాబింగ్ లాంగు డిమాండ్ చేశారు. తమ నోటీసులకు స్పీకర్ స్పందించకపోవడంతో, ఆయనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పెళ్లి పేరుతో మోసం చేయడమే కాకుండా, మహిళను శారీరకంగా మానసికంగా వేధించాడని కౌన్సిల్ పేర్కొంది. -
78 ఏళ్ళ వృద్ధుడితో..
ఆమెకు కేవలం తొమ్మిదేళ్ళు.. పెళ్ళంటే ఏమిటో తెలియని వయసు... కానీ సంప్రదాయం ఆమెను వివాహం ఉచ్చులో దింపింది. తాత వయసున్న 78 ఏళ్ళ ముసలాడికి కట్టబెట్టింది.కెన్యాలోని గిరిజన తెగకు చెందిన యూనిస్.. వారి సంప్రదాయ చట్రంలో ఇరుక్కుపోయింది. తల్లిదండ్రుల బలవంతంతో వృద్ధుడితో ఉండాల్సి వచ్చింది. నాలుగేళ్ళ నరకం తర్వాత అతగాడినుంచి తప్పించుకొని.. కనీసం చెప్పులు కూడ లేకుండా సంబురాలు గరల్స్ ఫౌండేషన్ నడుపుతున్న బోర్డింగ్ స్కూలుకు చేరింది. యూనిస్ కథ.. విన్నవారికి గుండె చెలించిపోతుంది. ఆమె వేధింపులకు గురైన తీరు విన్న వారికి కంట తడి పెట్టిస్తుంది. ''నాకు తొమ్మిదేళ్ళుండగా మా నాన్నఓ 78 ఏళ్ళ వృద్ధుడికిచ్చి వివాహం చేశారు. అతడు నువ్వు నా భార్యవి అన్నాడు. కానీ నాకప్పటికి ఏమీ తెలియదు. నా వయసున్న వారితోపాటు స్కూలుకు వెళ్ళి చదువుకోవాలని కోరికగా ఉండేది. కానీ అతడు నన్ను తన మూడో భార్యగా ఉండాలని చెప్పాడు. దానికి నేనేమాత్రం ఒప్పుకోలేదు. అంటూ యూనిస్... తన భయంకరమైన అనుభవాన్ని చెప్తుంది. అదృష్టవశాత్తు అతగాడి ఉచ్చునుంచి బయటపడిన యూనిస్ కు తనవంటి వారిని ఓ మహిళ చేరదీస్తోందని తెలిసింది. అదే సంబురాలు ఫౌండేషన్... మరో రెండువందల మంది బాలికలు జోసెఫిన్ కూలియా నడుపుతున్న ఆ ఫౌండేషన్ నీడన తలదాచుకుంటున్నారు. నన్ను చూసిన కూలియా రక్షించి, తన కార్యాలయంలోకి తీసుకొని వెళ్ళింది. కుటుంబాలు వదిలేసిన.. లైంగిక వివక్షకు, వేధింపులకు గురౌతున్న... బాలికలను కూలియా చేరదీసి రక్షణ కల్పిస్తోంది. భయానక సంఘటనలను ఎదుర్కొనేందుకు సహాయపడుతోంది. ఇతర ఏ కమ్యూనిటీలో లేని సంప్రదాయం సంబురాలు తెగలోనే కొనసాగుతోందని అదే తెగకు చెందిన కూలియా జోసెఫిన్ చెప్తోంది. ''నేను ఓ నిర్ణయానికి వచ్చాను. బలవంతంగా కొనసాగుతున్న ఆచారం నుంచి బాలికలను బయటకు తెచ్చేందుకు ఫౌండేషన్ ప్రారంభించాను. నిజానికి కెన్యాలో బాల్య వివాహాలు చట్ట విరుద్ధం. కానీ సంబురాలు సమాజంలో ప్రజలు, సంఘాలు అది పాటించడం లేదు. అందుకే వారి బారినుంచీ బాలికలను రక్షించాలని నేను నిర్ణయించుకున్నాను'' అంటారు జోపెఫిన్. సంబురాలు తెగలో పుట్టి ఈ సంప్రదాయాలను వ్యతిరేకించడం సరికాదు. నువ్వు నీ పోరాటాన్ని ఆపమని సంఘంలోని వారెందరో నన్ను బెదిరిస్తుంటారు. నా జీవితానికి ఎప్పటికైనా ఇది ప్రమాదమే కావచ్చు. కానీ నేను మరింత ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నాను అంటుంది జోసెఫిన్. జోసెఫిన్... సంస్థ ప్రారంభించడానికి ప్రధాన కారణం ఆమె బంధువుల్లోని బాలికలకు అటువంటి కష్టం ఎదురు కావడమే. తన ఇద్దరు కజిన్స్ పదేళ్ళ వయసులోనే పెళ్ళి పేరుతో శిక్షకు గురయ్యే సందర్భాన్ని ఆమె కళ్ళారా చూసింది. వెంటనే నిర్ణయించుకుంది. వారిని రక్షించి స్కూలుకు పంపించాలని నిర్ణయించుకుంది. అందుకే మరో వివాహానికి వెడుతున్నట్లుగా చెప్పి వారిని ఆ కూపంనుంచీ మెల్లగా బయటకు రప్పించింది. గిరిజన తెగలోని మరో సంప్రదాయం బాలికకు మెడనిండా పూసల నెక్లెస్ లను కొని వేయడం. అదే వంశంలోని కొందరు వివాహం ముందే బాలికలతో సెక్స్ సంబంధాలను కొనసాగించేందుకు వారి మెడలో పూసల గొలుసులను వేస్తుంటారు. ఏ అమ్మాయి ఎక్కువ గొలుసులు వేసుకుందో ఆమెను కొనేందుకు పురుషులు మరింత ఖర్చుచేస్తుంటారు. ఇటువంటి మూఢాచారాలు, ప్రాచీన సంప్రదాయాల బారినుంచీ బాలికలను రక్షించడమే ధ్యేయంగా జోసెఫిన్ పనిచేస్తోంది. ఏడేళ్ళ వయసు బాలికలు దాటుతుందంటే వారిని పూసల బారినుంచీ రక్షించేందుకు వారి తల్లులకు అవగాహన కల్పిస్తోంది. ఇలా మరింత మందిలో అవగాహన పెంచి... భవిష్యత్తులో తమ కమ్యూనిటీలోని బాలికలంతా స్కూల్లో హాయిగా చదువుకునేలా చూడాలని జోసెఫిన్ ఆరాటపడుతోంది. -
నాకు పెళ్లయ్యింది... ఐతే?
ఇంటర్వ్యూ ‘ఇద్దరమ్మాయిలతో’లో ఒకమ్మాయిగా అమలాపాల్ మనకు బాగా పరిచయం. నటిగా బిజీగా ఉన్నప్పుడే తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ని పెళ్లి చేసుకుని, కొద్ది రోజులు మనకు కనిపించలేదు అమల. కానీ ఇప్పుడు మళ్లీ నటిగా బిజీ అవుతోంది. నిర్మాతగా మారి సినిమాలు తీయబోతోంది. పెళ్లి తర్వాత తన జీవితం గురించి, కెరీర్లో కొత్త మలుపుల గురించి అమల చెప్పిన ముచ్చట్లివి... పెళ్లయ్యాక నటించరా అని నన్ను చాలామంది అడిగారు. పెళ్లయినంత మాత్రాన టాలెంట్స్‌ని చంపేసుకోనక్కర్లేదు. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే కలలను నెరవేర్చుకోవచ్చు. అదృష్టంకొద్దీ నాకు నన్ను ప్రోత్సహించే భర్త దొరికారు. అందుకే నేను నా కలలను నిజం చేసుకోగలుగుతున్నాను. ♦ పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. నా భర్త మంచి మనసున్న వ్యక్తి. నన్ను ప్రోత్సహిస్తారు. నా ఇష్టాలను అర్థం చేసుకుంటారు. ♦ పెళ్లయ్యాక సినిమాలు మానేస్తారని విన్నాం...? మానెయ్యాలని నేనేమీ అనుకోలేదు. మనలో ఉన్న టాలెంట్ పెళ్లవ్వగానే మాయమైపోదు కదా! నిజానికి పెళ్లయ్యాక నాకు ఆఫర్లు బాగా పెరిగాయి. అయితే నేను ఏది పడితే అది చేసెయ్యాలను కోవట్లేదు. పాత్రల ఎంపికలో కాస్త జాగ్రత్త పడుతున్నాను. డబ్బులు తెచ్చేవి కాకుండా పేరు తెచ్చే రోల్స్ కోసం చూస్తున్నాను. ♦ మీవారి డెరైక్షన్‌లో నటిస్తారా? తప్పకుండా. నేను తనకి పెద్ద ఫ్యాన్‌ని. తన సినిమాల్లో మంచి పాత్ర చేసే చాన్స్ వస్తే అస్సలు పోగొట్టుకోను. ♦ తెలుగు, తమిళం, మలయాళం... మూడు భాషల్లో చేశారు. మీ ఓటు దేనికి? మూడింటికీ. మలయాళంలో పాత్రలు బరువుగా ఉంటాయి. తెలుగులో ఫాంటసీ క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయి. తమిళంలో ఈ రెండూ మిక్స్ అయి ఉంటాయి. నేను మూడింటినీ ఎంజాయ్ చేస్తాను. ♦ హీరోయిన్లు పెళ్లయ్యాక లావవుతారు. కానీ మీరు స్లిమ్‌గా ఉన్నారు. ఏం చేస్తున్నారేంటి? జిమ్‌కి వెళ్లే అలవాటు నాకసలు లేదు. పైగా బాగా తింటాను. కాకపోతే డ్యాన్స్, స్విమ్మింగ్, యోగా చేస్తుంటాను. అవే నా ఫిగర్‌ని కాపాడుతున్నాయి. ♦ పెళ్లికి మీరిచ్చే నిర్వచనం? అదొక అందమైన మలుపు. ఎవరైనా సరే... తన మనసును అర్థం చేసుకునే సోల్‌మేట్ దొరికినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లాడేయడం ఉత్తమం. ♦ ఫ్రీ టైమ్‌లో ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికి తీరిక తక్కువే. ఓ పక్క ఫ్యామిలీ, మరోపక్క కెరీర్. కానీ ఏ మాత్రం సమయం చిక్కినా చక్కని మెలోడియస్ సాంగ్స్ వింటూ ఉంటాను. సినిమాలు చూస్తుంటాను. ఫ్యాషన్ మ్యాగజైన్లు చూడటం అన్నిటికంటే ఇష్టమైన పని నాకు. ♦ కొత్త ఫ్యాషన్స్ ఫాలో అవుతుంటారా? ఆ... బాగా. ఎప్పుడూ ఏ కొత్త డిజైన్స్ వచ్చాయి, ఏం కొత్త కాస్మొటిక్స్ వచ్చాయి అని చూసుకుంటూనే ఉంటాను. నా ఫ్రెండ్ పల్లవీ సింగ్ నా దుస్తుల్ని డిజైన్ చేస్తుంది. నేను అందంగా కనిపించానంటే ఆ క్రెడిట్ తనదే. అద్భుతమైన డిజైనర్ తను. ♦ కానీ మొదట్లో గ్లామర్ విషయంలో నెగిటివ్ కామెంట్లు ఎదుర్కొన్నట్టున్నారు? అవును. సినిమాల్లోకి వచ్చినప్పుడు నేను టీనేజ్‌లో ఉన్నాను. మొటిమలు బాగా ఉండేవి. దాంతో కొందరు పింపుల్ బ్యూటీ అన్నారు. ‘మైనా’ చేసినప్పుడు నా పింపుల్స్ కనబడకుండా చేయమని దర్శ కుడు ప్రభు సాల్మన్‌ని అడిగాను. ఆయన గ్రాఫిక్స్‌లో తీయించేస్తానని చెప్పారు కానీ అలానే ఉంచేశారు. అదృష్టంకొద్దీ ఆ సినిమా తర్వాత అంతా మెచ్చుకున్నారు. పింపుల్స్ ఉన్నా క్యూట్‌గా ఉన్నానన్నారు. ♦ కొత్తలో నటన పరంగా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కదా? నటనపరంగా కాదు... ఎంచుకున్న పాత్రల కారణంగా. తమిళంలో నా రెండో సినిమా ‘సింధు సమవేలి’. అందులో మామగారితో సంబంధం పెట్టుకునే కోడలి పాత్ర చేశాను. దాంతో సినిమాని నిషేధించమని గొడవ చేశారు. నన్నూ చాలా విమర్శించారు. అయితే ఆ విమర్శ లన్నీ ‘మైనా’ సినిమాతో పోయాయి. అందులో నా నటన చూసి రజనీకాంత్, కమల్ సార్ లాంటి మహామహులతో పాటు అందరూ ప్రశంసించారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ♦ ప్రొడ్యూసర్‌గా కూడా మారారట! అవును. ఎప్పటి నుంచో అను కుంటున్నాను. ఇప్పుడు నా భర్త సహకారంతో నిర్మాతగా మారాను. నిజానికి నేనెప్పుడూ పెద్ద పెద్ద కలలే కంటాను. అందుకే నా ప్రొడక్షన్ కంపెనీ పేరు కూడా ‘థింక్ బిగ్ స్టూడియోస్’. ♦ భవిష్యత్ ప్రణాళికలు? నిర్మాతగా మంచి సినిమాలు తీయాలి. నటిగా గొప్ప పాత్రల్ని పండించాలి. గృహిణిగానూ నా వాళ్లను సంతోష పెట్టాలి. ఇంతకు మించి ఏముంటుంది! -
ఎంగేజ్మెంట్ అయింది,పెళ్లే తరువాయి
-
గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకో లేదంటే జైలుకెళ్లు
హ్యూస్టన్: అమెరికాలో ఓ న్యాయమూర్తి అరుదైన తీర్పును ఇచ్చాడు. ముప్పై రోజుల్లో గర్ల్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకో లేదంటే.. రెండేళ్లు జైలు శిక్ష అనుభవించు అని తీర్పు చెప్పాడు. ఇంతకీ ఆ అబ్బాయి చేసిన నేరమేమిటో తెలుసా తన గర్ల్ ఫ్రెండ్ మాజీ బాయ్ ప్రెండ్ ను కొట్టడమే. జోస్టెన్ బండీ అనే టెక్సాస్‌కు చెందిన ఓ యువకుడు ఎలిజబెత్ జేన్స్ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఏదో కారణంతో ఆ అమ్మాయి మాజీ ప్రేమికుడితో గొడవపడి గాయాలపాలు చేశాడు. ఈ ఘటన గత ఫిబ్రవరిలో చోటుచేసుకుంది. దీంతో జేన్స్ కు కొంత కలతను కలిగింది. జోస్టెన్ పై కోపం తెప్పించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారిస్తున్న జడ్జి గత జూలైలో రెండు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చాడు. ఆ వెంటనే మరో అవకాశం ఇచ్చి అమ్మాయికి ఇష్టం అయితే 30 రోజుల్లో పెళ్లి చేసుకోవాలని ఆదేశించాడు. కాగా, ఇద్దరు అవగాహన లేని యువతీ యువకుల అభిప్రాయాలను అడిగి అనవసరంగా వారికి ముడిపెట్టారని ఆ న్యాయమూర్తిపై అమ్మాయి తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. గత నెల 30నే వారి వివాహం అయింది. -
భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు..
లక్నో: లేనిపోని అనుమానాలతో, అపోహలతో నిష్కారణంగా భార్యలను వేధించుకు తినే భర్తలని చూశాం. అన్యోన్యంగా కలకాలం ఆదిదంపతుల్లా జీవించిన జంటల్నీ చూశాం. కానీ, భార్య మనసు తెలుసుకుని ఆమెకు తగిన న్యాయం చేసే భర్తలు కూడా ఉన్నారని నిరూపించాడు ఉత్తరప్రదేశ్ కు చెందిన పూల్చాంద్. వినడానికి సినిమా స్టోరీలా అనిపించినా ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో నిజంగానే జరిగిన సంఘటన ఇది. మూడేళ్ల తరువాత భార్యను కలుసుకోవాలని ఎంతో ఆతృతగా సొంత ఊరుకు వచ్చిన పూల్ చంద్‌కు అతని భార్య చందా పెద్ద షాకిచ్చింది. దీంతో అతనికి ఆవేశం పొంగుకొచ్చింది. అయితే ఆవేశాన్ని అణచుకొని స్థిమితంగా ఆలోచించాడు... తమ మధ్య నెలకొన్న సంక్షోభానికి చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నాడు.... అంతేనా..... కుటుంబ సభ్యుల్ని, గ్రామ పెద్దల్ని ఒప్పించాడు. .. ఇంతకీ భార్య ఇచ్చిన షాక్ ఏంటి? ఏమిటా పరిష్కారం.... అందర్నీ ఎలా ఒప్పించాడంటే... వివరాల్లోకి వెడితే ఫైజాబాద్‌కు చెందిన పూల్ చంద్ పెద్దలు కుదిర్చి పెళ్లి చేసుకున్నాడు. సంతోషంగా భార్య చందాను కాపురానికి తీసుకు వచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా జలంధర్‌కు వెళ్ళిపోయాడు. ఫోన్లో మాత్రమే భార్యాభర్తలిద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. అయితే కొన్నాళ్ల తరువాత ఇంటికి వచ్చిన అతనికి భార్య చందా షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను వేరే వ్యక్తిని ఇష్టపడుతున్నానంటూ బాంబు పేల్చింది. కేవలం పెద్దల కోసమే పెళ్లి చేసుకున్నానని... ఇక తన వల్ల కాదని తేల్చిచెప్పింది. దీంతోపాటూ పెళ్లి సమయంలో తనకు పెట్టిన నగలు, బట్టలు అన్నీ అతనికి తిరిగి ఇచ్చేసింది. పూల్చంద్తో కలిసి కాపురం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. దీంతో పూల్ చంద్ హతాశుడయ్యాడు. అందరిలాగానే అతడు కూడా చాలా ఆవేశానికి లోనయ్యాడు. అయితే... భార్య నిజాయితీగా వ్యవహరించిన తీరు తనని ఆకట్టుకుందని పూల్‌చంద్ తెలిపాడు. పెళ్లికి ముందే చందా, సూరజ్ ప్రేమించుకున్నారని, అందుకే ఎలాగైనా వారికి న్యాయం చేయాలని భావించానని చెప్పాడు. తమ పెళ్లి మూలంగా విడిపోయిన ప్రేమికుల్ని తిరిగి కలపాలనే ఉద్దేశంతోనే కష్టపడి తమ కుటుంబసభ్యులను, గ్రామ పెద్దలను ఒప్పించినట్లు పూల్‌చంద్ వెల్లడించాడు. దీంతో గ్రామపెద్దల సమక్షంలో చందాకు కోరుకున్న ప్రియుడితో అంగరంగ వైభవంగా వివాహం జరిపించడమే కాకుండా, కానుకలతో అత్తారింటికి సాగనంపాడు. -
నిజమా!
సినిమా తారల గురించి ఏదో ఒక వార్త ప్రచారం చేయనిదే గాసిప్పురాయుళ్లకు ఆ పూట నిద్రపట్టదు. ఒక్కోసారి ఆ వార్తలు నిజమవుతుంటాయ్ కూడా. ప్రస్తుతం హిందీ రంగంలో ప్రచారమవుతున్న వార్తల్లో టబూకి సంబంధించిన హాట్ న్యూస్ ఒకటి ఉంది. ఫార్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న టబు పెళ్లి చేసుకోనున్నారన్నదే ఆ న్యూస్. ముంబయ్‌కి చెందిన ఒక వ్యాపారవేత్తను ఆమెను పెళ్లాడనున్నారని భోగట్టా. ఈ వార్తకు ఇటీవల టబు మాట్లాడిన మాటలు ఊతం ఇచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఆమెను ఎవరైనా ‘పెళ్లెప్పుడు?’ అనడగితే.. టైమ్ వచ్చినప్పుడనో.. దాని గురించి ఆలోచించడంలేదనో చెప్పేవారు. కానీ, ఇటీవల ఓ విలేకరుల సమాశంలో ‘పెళ్లి చేసుకోవాలని ఉంది’ అని పేర్కొన్నారు. సో.. టబు పెళ్లి ఫిక్సయ్యిందా? వెయిట్ అండ్ సీ. -
అప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది!
పెళ్లి గురించి అడిగితే కొంతమందికి కోపం వస్తుంది. ప్రియాంకా చోప్రా మాత్రం చాలా కూల్‌గా సమాధానం చెబుతారు. ఇప్పటివరకూ తన మనసుకి నచ్చిన వ్యక్తి తారసపడలేదనీ, ఇక పెళ్లెలా చేసుకోననీ అన్నారు ప్రియాంక. పెళ్లయితే చేసుకోలేదు కానీ.. ఇప్పటివరకూ లెక్కలేనన్ని సార్లు పెళ్లి కూతురయ్యానని ప్రియాంకా చోప్రా చెబుతూ -‘‘మీకో గమ్మత్త యిన విషయం చెబుతా. నాలుగేళ్ల వయసులోనే నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది. బోల్డంత మంది పిల్లలు కావాలనిపించింది. అప్పుడు నాకు పెళ్లంటే ఏంటో తెలియదు. కానీ, ఒక్కటి మాత్రం తెలుసు. అదేంటంటే.. పెళ్లప్పుడు బాగా అలకరించుకుంటారు కదా. అందుకే, పెళ్లి చేసుకోవాలనుకున్నా. స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లంటే చాలు.. పెళ్లి కూతురి వేషమే వేసేదాన్ని. కలర్‌ఫుల్ గాగ్రా, చోళీ, నుదుట ఎరుపు రంగు బొట్టు బిళ్ల, చేతి నిండా గాజులు, డిజైనర్ నెక్లెస్.. ఇలా ఓ రేంజ్లో ముస్తాబయ్యి, మురిసిపోయేదాన్ని. ఇక, నిజంగా ఎప్పుడు పెళ్లి కూతురవుతాననేది కాలమే చెప్పాలి’’ అన్నారు.