నాకు పెళ్లయ్యింది... ఐతే? | Interview with actress Amala Paul | Sakshi
Sakshi News home page

నాకు పెళ్లయ్యింది... ఐతే?

Published Sun, Oct 11 2015 1:01 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

నాకు పెళ్లయ్యింది... ఐతే? - Sakshi

నాకు పెళ్లయ్యింది... ఐతే?

ఇంటర్వ్యూ
‘ఇద్దరమ్మాయిలతో’లో ఒకమ్మాయిగా అమలాపాల్ మనకు బాగా పరిచయం.
నటిగా బిజీగా ఉన్నప్పుడే తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ని పెళ్లి చేసుకుని, కొద్ది రోజులు మనకు కనిపించలేదు అమల. కానీ ఇప్పుడు మళ్లీ నటిగా బిజీ అవుతోంది. నిర్మాతగా మారి సినిమాలు తీయబోతోంది. పెళ్లి తర్వాత తన జీవితం గురించి, కెరీర్‌లో కొత్త మలుపుల గురించి అమల చెప్పిన ముచ్చట్లివి...

 
పెళ్లయ్యాక నటించరా అని నన్ను చాలామంది అడిగారు. పెళ్లయినంత మాత్రాన టాలెంట్స్‌ని చంపేసుకోనక్కర్లేదు. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే కలలను నెరవేర్చుకోవచ్చు. అదృష్టంకొద్దీ నాకు నన్ను ప్రోత్సహించే భర్త దొరికారు. అందుకే నేను నా కలలను నిజం చేసుకోగలుగుతున్నాను.

 
♦  పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంది?
చాలా బాగుంది. నా భర్త మంచి మనసున్న వ్యక్తి. నన్ను ప్రోత్సహిస్తారు. నా ఇష్టాలను అర్థం చేసుకుంటారు.

♦  పెళ్లయ్యాక సినిమాలు మానేస్తారని విన్నాం...?
మానెయ్యాలని నేనేమీ అనుకోలేదు. మనలో ఉన్న టాలెంట్ పెళ్లవ్వగానే మాయమైపోదు కదా! నిజానికి పెళ్లయ్యాక నాకు ఆఫర్లు బాగా పెరిగాయి. అయితే నేను ఏది పడితే అది చేసెయ్యాలను కోవట్లేదు. పాత్రల ఎంపికలో కాస్త జాగ్రత్త పడుతున్నాను. డబ్బులు తెచ్చేవి కాకుండా పేరు తెచ్చే రోల్స్ కోసం చూస్తున్నాను.

♦  మీవారి డెరైక్షన్లో నటిస్తారా?
తప్పకుండా. నేను తనకి పెద్ద ఫ్యాన్‌ని. తన సినిమాల్లో మంచి పాత్ర చేసే చాన్స్ వస్తే అస్సలు పోగొట్టుకోను.

♦  తెలుగు, తమిళం, మలయాళం... మూడు భాషల్లో చేశారు. మీ ఓటు దేనికి?
మూడింటికీ. మలయాళంలో పాత్రలు బరువుగా ఉంటాయి. తెలుగులో ఫాంటసీ క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయి. తమిళంలో ఈ రెండూ మిక్స్ అయి ఉంటాయి. నేను మూడింటినీ ఎంజాయ్ చేస్తాను.

♦  హీరోయిన్లు పెళ్లయ్యాక లావవుతారు. కానీ మీరు స్లిమ్‌గా ఉన్నారు. ఏం చేస్తున్నారేంటి?
జిమ్‌కి వెళ్లే అలవాటు నాకసలు లేదు. పైగా బాగా తింటాను. కాకపోతే డ్యాన్స్, స్విమ్మింగ్, యోగా చేస్తుంటాను. అవే నా ఫిగర్‌ని కాపాడుతున్నాయి.

♦  పెళ్లికి మీరిచ్చే నిర్వచనం?
అదొక అందమైన మలుపు.  ఎవరైనా సరే... తన మనసును అర్థం చేసుకునే సోల్‌మేట్ దొరికినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లాడేయడం ఉత్తమం.

♦  ఫ్రీ టైమ్‌లో ఏం చేస్తుంటారు?
ప్రస్తుతానికి తీరిక తక్కువే. ఓ పక్క ఫ్యామిలీ, మరోపక్క కెరీర్. కానీ ఏ మాత్రం సమయం చిక్కినా చక్కని మెలోడియస్ సాంగ్స్ వింటూ ఉంటాను.  సినిమాలు చూస్తుంటాను. ఫ్యాషన్ మ్యాగజైన్లు చూడటం అన్నిటికంటే ఇష్టమైన పని నాకు.
 
  కొత్త ఫ్యాషన్స్ ఫాలో అవుతుంటారా?
ఆ... బాగా. ఎప్పుడూ ఏ కొత్త డిజైన్స్ వచ్చాయి, ఏం కొత్త కాస్మొటిక్స్ వచ్చాయి అని చూసుకుంటూనే ఉంటాను. నా ఫ్రెండ్ పల్లవీ సింగ్ నా దుస్తుల్ని డిజైన్ చేస్తుంది. నేను అందంగా కనిపించానంటే ఆ క్రెడిట్ తనదే. అద్భుతమైన డిజైనర్ తను.

♦  కానీ మొదట్లో గ్లామర్ విషయంలో నెగిటివ్ కామెంట్లు ఎదుర్కొన్నట్టున్నారు?
అవును. సినిమాల్లోకి వచ్చినప్పుడు నేను టీనేజ్‌లో ఉన్నాను. మొటిమలు బాగా ఉండేవి. దాంతో కొందరు పింపుల్ బ్యూటీ అన్నారు. ‘మైనా’ చేసినప్పుడు నా పింపుల్స్ కనబడకుండా చేయమని దర్శ కుడు ప్రభు సాల్మన్‌ని అడిగాను. ఆయన గ్రాఫిక్స్‌లో తీయించేస్తానని చెప్పారు కానీ అలానే ఉంచేశారు. అదృష్టంకొద్దీ ఆ సినిమా తర్వాత అంతా మెచ్చుకున్నారు. పింపుల్స్ ఉన్నా క్యూట్‌గా ఉన్నానన్నారు.

♦  కొత్తలో నటన పరంగా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కదా?
నటనపరంగా కాదు... ఎంచుకున్న పాత్రల కారణంగా. తమిళంలో నా రెండో సినిమా ‘సింధు సమవేలి’. అందులో మామగారితో సంబంధం పెట్టుకునే కోడలి పాత్ర చేశాను. దాంతో సినిమాని నిషేధించమని గొడవ చేశారు. నన్నూ చాలా విమర్శించారు. అయితే ఆ విమర్శ లన్నీ ‘మైనా’ సినిమాతో పోయాయి. అందులో నా నటన చూసి రజనీకాంత్, కమల్ సార్ లాంటి మహామహులతో పాటు అందరూ ప్రశంసించారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
 
♦  ప్రొడ్యూసర్‌గా కూడా మారారట!
అవును. ఎప్పటి నుంచో అను కుంటున్నాను. ఇప్పుడు నా భర్త సహకారంతో నిర్మాతగా మారాను. నిజానికి నేనెప్పుడూ పెద్ద పెద్ద కలలే కంటాను. అందుకే నా ప్రొడక్షన్ కంపెనీ పేరు కూడా ‘థింక్ బిగ్ స్టూడియోస్’.

♦  భవిష్యత్ ప్రణాళికలు?
నిర్మాతగా మంచి సినిమాలు తీయాలి. నటిగా గొప్ప పాత్రల్ని పండించాలి. గృహిణిగానూ నా వాళ్లను సంతోష పెట్టాలి. ఇంతకు మించి ఏముంటుంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement