కేరళలో నిశ్చితార్థం...చెన్నయ్‌లో వివాహం!
‘‘దర్శకుడు విజయ్‌తో నా భవిష్యత్తు ఏంటో తర్వాత చెబుతా. ప్రస్తుతం తను విదేశాల్లో ఉన్నాడు’’ అంటూ ఇటీవల అమలాపాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీరి ప్రేమకు పెద్దల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని తెలుస్తోంది. ఎందుకంటే, స్వయంగా అమలాపాల్ అమ్మ ఓ సందర్భంలో ఈ విషయం గురించి మాట్లాడారు. ప్రస్తుతం తమ కుమార్తె చేస్తున్న సినిమాలన్నీ పూర్తయిన తర్వాతే పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్పారామె. విజయ్‌ని అమలాపాల్ ప్రేమిస్తున్న విషయం నాలుగు నెలల క్రితమే తెలిసిందని, అది కూడా గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతుంటే అనుమానం వచ్చిందని ఆమె పేర్కొన్నారు. బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తే భయపడేవాళ్లమని, కానీ అమలాపాల్ వృత్తి పట్ల బాధ్యతగా ఉండటం తమను ఆనందపరిచిందని ఆమె తెలిపారు. కేరళలో నిశ్చితార్థం, చెన్నయ్‌లో పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్పారామె.