చెన్నై: తమిళగ వెట్రి కజగం(టీవీకే)చీఫ్, నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావటంకాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రయోజనకరమని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ)అధ్యక్షుడు కె సెల్వపెరుంతగై అన్నారు. ఇండియా కూటమి మిత్రపక్షాలకు నటుడు విజయ్ అధికార భాగస్వామ్యం ఆఫర్ ఇవ్వటంపై ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘విజయ్ రాజకీయ ప్రవేశం రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయ రంగంలో ఎటువంటి మార్పులు తీసుకురాదు. ఆయన రాజకీయ ప్రవేశం ఇండియా కూటమి విజయానికి ఉపయోగపడుతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లను, ముఖ్యంగా ప్రతిపక్ష ఓట్లను విజయ్ పార్టీ చీల్చుతుంది. విజయ్ అధికార భాగస్వామ్యం ఆఫర్ ఇండియా కూటమి మిత్రపక్షలు ఎటువంటి అలజడికి గురికాలేదు.
ఇండియా కూటమి బలంగానే ఉంది. కాంగ్రెస్ 2004-2014 మధ్య కేంద్రంలో అధికారాన్ని పంచుకుంది. దాని ఆధారంగా.. మేం అధికారం పంచుకునే ఆలోచనతో అంగీకరిస్తున్నాం. అయితే అధికారాన్ని పంచుకోవడంపై జాతీయ నాయకత్వందే తుది నిర్ణయం. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ మద్దతుతో మాత్రమే ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది.
సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో.. ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చింది. అధికారంలో వాటా కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి ఉంటే అప్పటి సీఎం కరుణానిధి ఇచ్చి ఉండేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలో వాటా కోరలేదు. అధికార భాగస్వామ్యం ప్రజల ఆదేశంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ అధికారం చేజిక్కించుకోవాలని కోరుకుంటుంది. మేం తమిళనాడులో కామరాజ్ పాలనను ప్రారంభిస్తాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment