సాక్షి, చెన్నై : తప్పయితే సరిదిద్దుకుంటానంటోంది నటి అమలాపాల్. సింధు సమవెళి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మలయాళీ బ్యూటీ ఈ అమ్మడన్న విషయం తెలిసిందే. మైనా చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అమలాపాల్ ఆ తరువాత వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా విజయ్‌తో జత కట్టిన తలైవా చిత్రం ఆమెను దర్శకుడు విజయ్‌కు దగ్గర చేసింది. ఆయనతో ప్రేమ పెళ్లికి దారి తీసింది. చాలా తక్కువ కాలంలోనే పెళ్లి చేసుకున్న నటిగా పేరు తెచ్చుకున్నా ఆ వివాహ జీవితం మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. భేదాభిప్రాయాలతో ఈ సినీ జంట విడిపోయారు. దర్శకుడు విజయ్ నుంచి అమలాపాల్ విడాకులు పొంది మళ్లీ నటనపై దృష్టి సారించింది. అయినా హీరోయిన్‌గా కొనసాగడం ఈమె అదృష్టం అనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు చేతిలో ఉన్నాయి. అరవిందస్వామితో నటించిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం పలు ఒడుదుడుకులను ఎదురొడ్డి ఎట్టకేలకు శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా అమలాపాల్ ఒక తమిళ పత్రికకు ఇచ్చిన భేటీ చూద్దాం.
భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రంలో నటించిన అనుభవం గురించి?
భాస్కర్ ఒరు రాస్కెల్ చాలా సరదాగా సాగే కుటుంబ కథా చిత్రం. వేర్వేరు మనస్తత్వాలు కలిగిన ఇద్దరిని కలపడానికి పిల్లల ప్రయత్నం ప్రధానంగా చిత్రం సాగుతుంది. అయితే చిత్రం ఎంటర్ టెయిన్ పాళు ఎక్కువగా ఉండే చిత్రం భాస్కర్ ఒరు రాస్కెల్. ఇందుల్లో తాను 8 ఏళ్ల బిడ్డకు తల్లిగా నటించాను.
తల్లి పాత్రలో నటించిన మీరు గ్లామరస్‌గా నటించారనే విమర్శల గురించి ఎలా స్పందిస్తారు?
ఈ చిత్రంలో అమ్మ పాత్ర అయినా సాధారణ పాత్రలకు భిన్నంగా ఉంటుంది. అందుకే ఆ పాత్రను గ్లామర్‌గా మలచాలనుకున్నాం. అరవిందస్వామి చిత్రంలో చాలా రఫ్‌గా కనిపిస్తారు. అందుకే నా పాత్ర మోడరన్‌గా ఉండాలని గ్లామరస్ దుస్తులు వాడాం.
తాజాగా ఏఏ చిత్రాల్లో నటిస్తున్నారు?
తదుపరి రాక్షన్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అవళ్ ఒరు పరవై బోల చిత్రం చివరి దశలో ఉంది. మలయాళంలో ఆడుజీవితం అనే చిత్రంలో నటిస్తున్నాను. తాజాగా ఒక హిందీ చిత్రానికి ఓకే చెప్పాను. ఈ చిత్రం జూన్‌లో ప్రారంభం కానుంది
మీ గురించి తరచూ గ్యాసిప్స్ వస్తుంటాయే?
నిజం చెప్పాలంటే నేను అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోను. సాధారణంగా నీ గురించి రెండు రకాలుగా గ్యాసిప్స్ ప్రచారం అవుతుంటాయి. వాటిలో నేను తప్పు దారిలో పయనిస్తున్నానని, రెండోది సక్రమ మార్గంలోనే నడుస్తున్నానని. తాజాగా అమలాపాల్ మంచి దారిలోనే పయనిస్తోంది అంటున్నారు. అందుకే నా దారి మార్చుకోవలసిన అవసరం లేదు. అయితే తన మార్గం సరికాదని చెబితే నేను కచ్చితంగా నా తప్పును సరిదిద్దుకుంటాను. అంతే కానీ పని పాటా లేని వారు నాపై పుట్టించే గాసిప్స్ గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment