Bhaskar Oru Rascal
-
కొత్త నిర్మాతలకు తరగతులు
‘‘ప్రస్తుతం మంచి సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన ‘భాస్కర్ ఒక రాస్కెల్’ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. చిత్ర నిర్మాణం పట్ల నూతన నిర్మాతలకు అవగాహన కల్పించడం కోసం నిర్మాత మండలి తరఫున తరగతులు నిర్వహిస్తున్నాం’’ అన్నారు నిర్మాత దామోదర ప్రసాద్. అరవింద స్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో సిద్ధిఖీ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళం చిత్రం ‘భాస్కర్ ఒరు రాస్కెల్’. ఈ చిత్రాన్ని ‘భాస్కర్ ఒక రాస్కెల్’ అనే పేరుతో కార్తికేయ మూవీస్ పతాకంపై పఠాన్ చాన్‌బాషా ఈ నెలాఖరులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు వి. సముద్ర, నిర్మాత దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘కథా బలమే సినిమాకు ప్రాణం’’ అన్నారు సెన్సార్ బోర్డు సభ్యుడు వేణుగోపాల్ యాదవ్. ‘‘తోడులేని ఇద్దరు వ్యక్తులు ఎలా కలిశారు? ఇందుకోసం ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేశారు? అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది’’ అన్నారు పఠాన్ బాషా. -
తప్పయితే సరిదిద్దుకుంటా!
సాక్షి, చెన్నై : తప్పయితే సరిదిద్దుకుంటానంటోంది నటి అమలాపాల్. సింధు సమవెళి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మలయాళీ బ్యూటీ ఈ అమ్మడన్న విషయం తెలిసిందే. మైనా చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అమలాపాల్ ఆ తరువాత వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా విజయ్‌తో జత కట్టిన తలైవా చిత్రం ఆమెను దర్శకుడు విజయ్‌కు దగ్గర చేసింది. ఆయనతో ప్రేమ పెళ్లికి దారి తీసింది. చాలా తక్కువ కాలంలోనే పెళ్లి చేసుకున్న నటిగా పేరు తెచ్చుకున్నా ఆ వివాహ జీవితం మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. భేదాభిప్రాయాలతో ఈ సినీ జంట విడిపోయారు. దర్శకుడు విజయ్ నుంచి అమలాపాల్ విడాకులు పొంది మళ్లీ నటనపై దృష్టి సారించింది. అయినా హీరోయిన్గా కొనసాగడం ఈమె అదృష్టం అనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు చేతిలో ఉన్నాయి. అరవిందస్వామితో నటించిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం పలు ఒడుదుడుకులను ఎదురొడ్డి ఎట్టకేలకు శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా అమలాపాల్ ఒక తమిళ పత్రికకు ఇచ్చిన భేటీ చూద్దాం. భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రంలో నటించిన అనుభవం గురించి? భాస్కర్ ఒరు రాస్కెల్ చాలా సరదాగా సాగే కుటుంబ కథా చిత్రం. వేర్వేరు మనస్తత్వాలు కలిగిన ఇద్దరిని కలపడానికి పిల్లల ప్రయత్నం ప్రధానంగా చిత్రం సాగుతుంది. అయితే చిత్రం ఎంటర్ టెయిన్ పాళు ఎక్కువగా ఉండే చిత్రం భాస్కర్ ఒరు రాస్కెల్. ఇందుల్లో తాను 8 ఏళ్ల బిడ్డకు తల్లిగా నటించాను. తల్లి పాత్రలో నటించిన మీరు గ్లామరస్‌గా నటించారనే విమర్శల గురించి ఎలా స్పందిస్తారు? ఈ చిత్రంలో అమ్మ పాత్ర అయినా సాధారణ పాత్రలకు భిన్నంగా ఉంటుంది. అందుకే ఆ పాత్రను గ్లామర్‌గా మలచాలనుకున్నాం. అరవిందస్వామి చిత్రంలో చాలా రఫ్‌గా కనిపిస్తారు. అందుకే నా పాత్ర మోడరన్‌గా ఉండాలని గ్లామరస్ దుస్తులు వాడాం. తాజాగా ఏఏ చిత్రాల్లో నటిస్తున్నారు? తదుపరి రాక్షన్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అవళ్ ఒరు పరవై బోల చిత్రం చివరి దశలో ఉంది. మలయాళంలో ఆడుజీవితం అనే చిత్రంలో నటిస్తున్నాను. తాజాగా ఒక హిందీ చిత్రానికి ఓకే చెప్పాను. ఈ చిత్రం జూన్‌లో ప్రారంభం కానుంది మీ గురించి తరచూ గ్యాసిప్స్ వస్తుంటాయే? నిజం చెప్పాలంటే నేను అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోను. సాధారణంగా నీ గురించి రెండు రకాలుగా గ్యాసిప్స్ ప్రచారం అవుతుంటాయి. వాటిలో నేను తప్పు దారిలో పయనిస్తున్నానని, రెండోది సక్రమ మార్గంలోనే నడుస్తున్నానని. తాజాగా అమలాపాల్ మంచి దారిలోనే పయనిస్తోంది అంటున్నారు. అందుకే నా దారి మార్చుకోవలసిన అవసరం లేదు. అయితే తన మార్గం సరికాదని చెబితే నేను కచ్చితంగా నా తప్పును సరిదిద్దుకుంటాను. అంతే కానీ పని పాటా లేని వారు నాపై పుట్టించే గాసిప్స్ గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. -
స్టార్ట్ కెమెరా.. యాక్షన్
లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్... అని డైరెక్టర్ అనగానే కెమెరా ముందు నటించే అరవింద్ స్వామి త్వరలో మెగా ఫోన్ పట్టుకోనున్నారట. మానిటర్ ముందు కూర్చుని లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్... అనబోతున్నారని చెన్నై టాక్. నటనకు బ్రేక్ ఇచ్చిన ఆయన ‘కడల్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి, వరుసగా సినిమాలు చేస్తున్నారు. తెలుగు చిత్రం ‘ధృవ’లో విలన్‌గా నటించిన అరవింద్ స్వామి మరోవైపు తమిళంలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ ఈరోజు రిలీజ్ అవుతోంది. మరోవైపు ‘సదురంగవేట్టై 2’, ‘వనంగాముడి’, ‘నరకాసురన్’, ‘చెక్క చివంద వానమ్’ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. నటుడిగా బిజీగా ఉన్నా దర్శకుడిగా కూడా చేయాలను కుంటున్నారట. కథ కూడా రెడీ చేశారట. -
దర్శకుడిగా మారనున్న విలక్షణ నటుడు
సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్న దక్షిణాది నటుడు అరవింద్ స్వామి. తనీ ఒరువన్ సినిమాలో ప్రతినాయక పాత్రలో ఆకట్టుకున్ అరవింద్ స్వామి తరువాత ఆ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ధృవలోనూ అదే పాత్రలో నటించి మెప్పించారు. భాస్కర్ ఒరు రాస్కెల్ సినిమాతో హీరోగానూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం శతురంగవేట్టై, నరకసూరన్, వనంగాముడి సినిమాలతో పాటు మణిరత్నం దర్శకత్వంలో సెక్క సివంద వానం సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. నటుడిగా ఫుల్ బిజీగా కొనసాగుతూనే దర్శకుడిగా మారే ప్రయత్నాల్లో ఉన్నారు అరవింద్ స్వామి. ఇప్పటికే కథ రెడీ చూసుకున్న ఈ విలక్షణ నటుడు ప్రస్తుతం స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు
‘‘నాకు రాజకీయాలు తెలియవు. అందుకే.. రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు’’ అన్నారు అరవింద్ స్వామి. ‘కడల్’ సినిమాతో నటుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆయన నటించిన తాజా చిత్రం ‘భాస్కర్ ఒరు రాస్కెల్’. ఇందులో అమలా పాల్ కథానాయిక. మలయాళ దర్శకుడు సిద్ధిక్ తెరకెక్కించిన ఈ సినిమా మే 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించింది. అరవింద్ స్వామి మాట్లాడుతూ– ‘‘నేను రాజకీయాల గురించి మాట్లాడటంగానీ, రావడంగానీ జరగదు. అయితే.. రాజకీయ నాయకుల నిర్ణయాలు సామాన్య ప్రజలపై ప్రభావం చూపితే స్పందిస్తా’’ అన్నారు. సినిమా గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘భాస్కర్ ది రాస్కెల్’ చిత్రానికి రీమేక్ ‘భాస్కర్ ఒరు రాస్కెల్’. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు నచ్చుతుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందర్నీ మా సినిమా అలరిస్తుంది’’ అన్నారు. -
నాకు రాజకీయాలు తెలియవు
తమిళసినిమా: నాకు రాజకీయాలు తెలియవు. కాబట్టి రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశమే లేదు అన్నారు నటుడు అరవిందస్వామి. ఈయన రీఎంట్రీ తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం భాస్కర్ ఒరు రాస్కెల్. నటి అమలాపాల్ నాయకిగా నటించిన ఈ చిత్రం మలయాళంలో మంచి విజయం సాధించిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రానికి రీమేక్. నాజర్, సూరి, రోబోశంకర్, రమేశ్‌ఖన్నా, సిద్ధిక్, మాస్టర్ రాఘవ్, బేబీ నైనిక ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు సిద్ధిక్‌నే దర్శకత్వం వహించారు. చిత్రం మే 11న విడుదలకు సిద్ధం అవుతోంది. గురువారం చెన్నైలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో అరవిందస్వామి మాట్లాడుతూ ఇది మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రానికి రీమేక్ అని చెప్పారు. అయితే తమిళం కోసం కొన్ని మార్పులు చేసి రూపొందించినట్లు తెలిపారు. భాస్కర్ ఒరు రాస్కెల్ పూర్తిగా కమర్షియల్ ఎంటర్టెయినర్ చిత్రంగా ఉంటుందన్నారు. తాను వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నానని, తనీ ఒరువన్ చిత్రంలో విలన్‌గా నటించడంతో అదే తరహా చిత్రంల్లో నటించే అవకాశాలు 15కు పైగా వచ్చినా అంగీకరించలేదని అన్నారు. హీరోగానైనా, విలన్‌గానైనా మంచి పాత్ర అయితే కచ్చితంగా నటిస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తారా? అని అడుగుతున్నారని, తనకు రాజకీయాలు తెలియవని, అందువల్ల అలాంటి అవకాశం లేదని పేర్కొన్నారు. హర్షిణి మూవీస్ పతాకంపై హర్షిణి నిర్మించిన ఈ చిత్రానికి అమ్రేశ్ గణేశ్ సంగీతాన్ని, విజయ్ ఉలగనా«థ్ ఛాయాగ్రహణం అందించారు. -
పొంగల్ బరిలో మరో సినిమా
తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా సంక్రాంతి సీజన్ కు భారీగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ ఏడాది కూడా అదే జోరు కనిపిస్తోంది. ఇప్పటికే సూర్య హీరోగా తెరకెక్కిన తాన సేరంద కూటం, విక్రమ్ స్కెచ్, త్రిష మోహిని సినిమాలు పొంగల్ బరిలో రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ఈ రేసులోకి మరో సినిమా వచ్చి చేరింది. రీ ఎంట్రీలో విలన్ గా, హీరోగా దూసుకుపోతున్న సీనియర్ నటుడు అరవింద్ స్వామి కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా భాస్కర్ ఒరు రాస్కెల్. మలయాళంలో మమ్ముట్టి, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన భాస్కర్ ది రాస్కెల్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. అరవింద్ స్వామి సరసన అమలాపాల్ హీరోయిన్ గా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను పొంగల్ బరిలో జనవరి 12న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఈ పోటిలో తమిళ ప్రజలు ఎవరికి విజయాన్ని కట్టబెడతారో చూడాలి. -
‘అలా చేసేందుకు ధైర్యం చేయడం లేదు’
తమిళ సినిమా: వివాదాలకు భయపడకుండా, విమర్శలను పట్టించుకోకుండా, తాను కోరుకున్న బాటలో ధైర్యంగా దూసుకుపోతున్న నటి అమలాపాల్. మొదట్లోనే ప్రియుడితో ప్రేమ కలాపాలు సాగిస్తూ, మేనమామతో అక్రమ సంబంధం సాగించే వివాదాస్పద పాత్రలో(సింధూ సమవెళి) నటించి అమలాపాల్ అంటే ఏమిటో సినీ పరిశ్రమకు చాటి చెప్పిన సంచలన నటి ఈమె. ఆ సమయంలో మహిళా సంఘాలతో పాటు పలువురి వ్యతిరేకతకు గురైనా భయపడలేదు. అలా ప్రేమ, అందాలారబోత, కుటుంబ కథా పాత్రలు అంటూ చాలా తక్కువ కాలంలోనే చేసేసిన అమలాపాల్ అంతే తక్కువ కాలంలో దర్శకుడు విజయ్ ప్రేమలో పడి పెళ్లి ముచ్చట కూడా తీర్చేకుంది. ఇంకా వేగంగా విడాకుల తతంగం పూర్తి చేసుకున్న ఈ కేరళ కుట్టి మళ్లీ నటనకు రెడీ అంటూ వచ్చేసింది. ఇటీవల నటించిన తిరుట్టుప్పయలే–2 చిత్రంలో అందాలమోత మోగించి మరోసారి తన రూటే సపరేట్ అని అందరికి అర్థమయ్యేలా చేసింది. తాజాగా అరవిందస్వామికి జంటగా ఒక పిల్లకు తల్లిగా నటించిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం జనవరిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అమలాపాల్ చాలా గ్యాప్ తరువాత తెలుగులోనూ రీఎంట్రీ అవుతోంది. ఇదో చర్చనీయాంశ కథా చిత్రం అట. ఈ సందర్భంగా ఈ జాన పరిశ్రమ మీదే నేరం మోపేలా మాట్లాడేసింది. అదేమిటో ఈ అమ్మడి మాటల్లోనే చూద్దాం. ‘ఇక్కడ ఛాలెంజింగ్ కథా చిత్రాలను తెరకెక్కించడానికి జంకుతున్నారు. వైవిధ్యభరిత కథలతో చిత్రాలు చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. అలాంటి చిత్రాలు చూడడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నా, దర్శక నిర్మాతలు సంకోచిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలంటే ఇష్టం అని కొందరు గొప్పగా చెప్పుకుంటున్నారు. అక్కడ వాస్తవ సంఘటనతో చిత్రాలు చేస్తున్నారు. మన సమాజంలోనూ ఎన్నో ఆశ్చర్యకరమైనవి, దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి వాటిని ఇతివృత్తంగా తీసుకుని చిత్రాలను వినూత్నంగా తెరకెక్కించవచ్చు. అలా చేయడానికి మన వాళ్లు సాహసించలేకపోతున్నారు. ఇటీవల స్త్రీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పలు చిత్రాలు విజయం సాధిస్తున్నాయి. అయినా ఇంకా హీరోయిన్లు హీరోల చుట్టూ తిరిగి ప్రేమించడం, పాటలు పాడడం లాంటి మూస పాత్రలకే హీరోయిన్లను పరిమితం చేస్తున్నారు. ఒక వేళ స్త్రీ ఇతివృత్తాలతో చిత్రాలు చేసిన వారిని నేరస్తులు గానో, గ్లామరస్‌గానో చూపిస్తున్నారు.ఈ విధానం మారాలి. హీరోయిన్ ఓరియెంటెండ్ చిత్రాలనూ విభిన్న కథలతో చేయవచ్చు’ అన్నారు. -
భాస్కర్ ఒరు రాస్కెల్ ఆడియో రిలీజ్
తమిళ సినిమా: భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం స్థానిక ట్రిప్లికేన్‌లోని కలైవానం ప్రాంగణంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. మలయాళంలో ప్రముఖ దర్శకుడిగా రాణిస్తున్న సిద్ధిక్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం భాస్కర్ ఒరు రాస్కెల్. మలయాళంలో మమ్ముట్టి, నయనతారలతో నిర్మించిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. చిత్ర తమిళం రీమేక్‌లో అజిత్‌ను, ఆ తరువాత రజనీకాంత్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. చిత్రం చూసిన రజనీకాంత్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. అయితే ఆయన కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో నటించలేకపోయారు. ఆ పాత్రలో ఇప్పుడు అరవిందస్వామి నటిస్తున్నారు. హీరోయిన్ పాత్రలో బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హా, నయనతారలో ఒకరిని నటింపజేయాలని ప్రయత్నించినా, చివరికి ఆ అవకాశం నటి అమలాపాల్‌ను వరించింది. నటి మీనా కూతురు నైనిక, మాస్టర్ రఘువరన్, నటి నికీషాపటేల్ ప్రముఖ పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి అమ్రేష్ సంగీతం అందిస్తున్నారు. ఈయన ప్రముఖ నటి జయచిత్ర వారసుడన్నది తెలిసిన విషయమే. అమ్రేష్ ఇంతకు ముందు లారెన్స్ నటించిన మొట్టశివ కట్టశివ చిత్రానికి సంగీతం అందించారు. ఆ చిత్రంలోని పాటలు కమర్షియల్ ఫార్ములాలో ఫాస్ట్ బీట్‌లో మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా అలరించాయి. కాగా ప్రస్తుతం త్రిష ప్రధాన పాత్రను పోషిస్తున్న గర్జణై, ప్రభుదేవా, లక్ష్మీమీనన్ జంటగా నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్, భరత్ హీరోగా పొటు అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా ఈయన సంగీతబాణీలు కడుతున్న ఆ భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రాన్ని హర్షిణి ఫిలింస్ పతాకంపై ఏ.హర్షిణి నిర్మిస్తున్నారు. -
అమ్రేశ్ సంగీతం ఆండ్రియా గీతం
తమిళసినిమా: యువ కెరటం అమ్రేశ్ తొలుత నటుడిగా రంగప్రవేశం చేసినా, ఇప్పుడు సంగీత దర్శకుడిగా దూసుకుపోతున్నారు. తాను హీరోగా నటించిన చిత్రంతోనే సంగీతదర్శకుడిగానూ పరిచయమైన ఈయన ప్రస్తుతం సంగీత దర్శకుడిగా చేతి నిండా చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారు. డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్, ఇటీవలే సెట్ పైకి వెళ్లిన చార్లిచాప్లిన్–2 చిత్రాలతో పాటు అరవిందస్వామి, అమలాపాల్ జంటగా నటిస్తున్న భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది సిద్ధిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన మలయాళంలో మమ్ముట్టి, నయనతార హీరోహీరోయిన్లుగా తెరకెక్కించిన సక్సెస్ఫుల్ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. కాగా భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ చిత్రంలో అమ్రేశ్ సంగీత బాణీలు కట్టిన ఒక పాటను సంచలన నటి ఆండ్రియా పాడడం విశేషం. నటి ఆండ్రియా చాలా అరుదుగానే పాడుతుంటారు. అదీ తన ఆ పాట హత్తుకుంటేనే పాడడానికి అంగీకరిస్తారు. అంటే అమ్రేశ్ కట్టిన బాణీలు నచ్చే తను భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రంలో పాటను పాడారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్ర ఆడియోను ట్రిపుల్ రికార్డ్స్ సంస్థ సొంతం చేసుకుని ఈ నెల 30వ తేదీన చిత్ర గీతాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. -
త్వరలో భాస్కర్ ఒరు రాస్కెల్ టీజర్
తమిళసినిమా: భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్ర టీజర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రోజుల్లో టీజర్ ప్రభావం ఆయా చిత్రాలపైనా చాలానే ఉంటోంది. టీజర్‌కు లభించే ఆదరణను బట్టి చిత్రాల విజయాలు ఉండేలా పరిస్థితి నెలకొంది. మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్ర దర్శకుడు సిద్ధిక్‌నే ఇప్పుడు భాస్కర్ ఒరు రాస్కెల్ పేరుతో తమిళంలో తెరకెక్కిస్తున్నారు. మమ్ముట్టి పాత్రలో అరవిందస్వామి, నయనతార పాత్రలో నటి అమలాపాల్ నటిస్తున్న ఇందులో నాజర్, సూరి, రోబోశంకర్, రమేశ్‌ఖన్నా, సిద్ధిక్, మాస్టర్ రాఘవ్, బేబీ నైనిక( నటి మీనాకూతురు) ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. కీలక పాత్రలో హిందీ నటుడు అఫ్దాబ్శివదశాని నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
మాల్దీవులకు భాస్కర్ ఒరు రాస్కెల్
భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్ర యూనిట్ మాల్దీవులకు పయనం అవుతోంది. మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రానికి రీమేక్ అవుతున్న చిత్రం భాస్కర్ ఒరు రాస్కెల్. ఇందులో అరవిందస్వామి, అమలాపాల్ జంటగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో నాజర్, సూరి, రోబోశంకర్, రమేశ్‌ఖన్నా, సిద్ధిక్ మాస్టర్ రాఘవ నటిస్తున్నారు. తెరి చిత్రం ద్వా రా బాలతారగా పరిచయమైన నటి మీనా కూతురు నైనిక, కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు అఫదవ్ వివద్‌శాని నటిస్తున్నారు. ఒక ప్రత్యేక పాత్రలో నటి నికీషాపటేల్ నటిస్తుం డడం విశేషం. మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధికే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ప్రస్తుతం చిత్ర చివరి షెడ్యూల్‌ను చెన్నైలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందులోని ఒక పాటను మాల్దీవుల్లో చిత్రీకరించనున్నామని, అందుకు ఈ నెల 27ను చిత్ర యూనిట్ మాల్దీవులకు పయనం కానందని తెలిపారు. ఈ పాటతో చిత్ర షూటింగ్ పూర్తి అవుతుందని చెప్పారు. అనంతరం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.