తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా సంక్రాంతి సీజన్ కు భారీగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ ఏడాది కూడా అదే జోరు కనిపిస్తోంది. ఇప్పటికే సూర్య హీరోగా తెరకెక్కిన తాన సేరంద కూటం, విక్రమ్ స్కెచ్, త్రిష మోహిని సినిమాలు పొంగల్ బరిలో రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ఈ రేసులోకి మరో సినిమా వచ్చి చేరింది.
రీ ఎంట్రీలో విలన్ గా, హీరోగా దూసుకుపోతున్న సీనియర్ నటుడు అరవింద్ స్వామి కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా భాస్కర్ ఒరు రాస్కెల్. మలయాళంలో మమ్ముట్టి, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన భాస్కర్ ది రాస్కెల్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. అరవింద్ స్వామి సరసన అమలాపాల్ హీరోయిన్ గా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను పొంగల్ బరిలో జనవరి 12న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఈ పోటిలో తమిళ ప్రజలు ఎవరికి విజయాన్ని కట్టబెడతారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment