
అమలాపాల్, అరవింద్‌స్వామి
అరవింద్‌స్వామి, అమలాపాల్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘భాస్కర్ ఒరు రాస్కెల్’. ఈ చిత్రాన్ని ‘భాస్కర్ ఒక రాస్కెల్’ పేరుతో పఠాన్ చాన్‌బాషా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెలలోనే చిత్రం విడుదల కానుంది. చాన్ బాషా మాట్లాడుతూ– ‘‘మలయాళ చిత్రం ‘భాస్కర్ ది రాస్కెల్’ని తమిళంలో ‘భాస్కర్ ఒరు రాస్కెల్’గా రీమేక్ చేశారు. మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించగా సిద్ధిక్ దర్శకత్వం వహించారు. మలయాళంలో విజయం సాధించటంతో తమిళంలో అరవింద్‌స్వామి, అమలాపాల్ జంటగా సిద్ధిక్ రీమేక్ చేశారు. అక్కడ కూడా విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో నేను విడుదల చేయటం ఆనందంగా ఉంది. తోడు లేని ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా కలిశారు, ఆ ఇద్దరూ కలవటానికి ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేశారనేది ఈ సినిమా. నటి మీనా కూతురు నైనిక ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేసింది’’ అన్నారు.