
అరవింద్ స్వామి
లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్... అని డైరెక్టర్ అనగానే కెమెరా ముందు నటించే అరవింద్ స్వామి త్వరలో మెగా ఫోన్ పట్టుకోనున్నారట. మానిటర్ ముందు కూర్చుని లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్... అనబోతున్నారని చెన్నై టాక్. నటనకు బ్రేక్ ఇచ్చిన ఆయన ‘కడల్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి, వరుసగా సినిమాలు చేస్తున్నారు.
తెలుగు చిత్రం ‘ధృవ’లో విలన్‌గా నటించిన అరవింద్ స్వామి మరోవైపు తమిళంలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ ఈరోజు రిలీజ్ అవుతోంది. మరోవైపు ‘సదురంగవేట్టై 2’, ‘వనంగాముడి’, ‘నరకాసురన్’, ‘చెక్క చివంద వానమ్’ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. నటుడిగా బిజీగా ఉన్నా దర్శకుడిగా కూడా చేయాలను కుంటున్నారట. కథ కూడా రెడీ చేశారట.