
సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్న దక్షిణాది నటుడు అరవింద్ స్వామి. తనీ ఒరువన్ సినిమాలో ప్రతినాయక పాత్రలో ఆకట్టుకున్ అరవింద్ స్వామి తరువాత ఆ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ధృవలోనూ అదే పాత్రలో నటించి మెప్పించారు. భాస్కర్ ఒరు రాస్కెల్ సినిమాతో హీరోగానూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం శతురంగవేట్టై, నరకసూరన్, వనంగాముడి సినిమాలతో పాటు మణిరత్నం దర్శకత‍్వంలో సెక్క సివంద వానం సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. నటుడిగా ఫుల్ బిజీగా కొనసాగుతూనే దర్శకుడిగా మారే ప్రయత్నాల్లో ఉన్నారు అరవింద్ స్వామి. ఇప్పటికే కథ రెడీ చూసుకున్న ఈ విలక్షణ నటుడు ప్రస్తుతం స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment